pizza
J.B.Murali Krishna (Manu) interview (Telugu) about Jamba Lakidi Pamba
అలా చెబితే అహంకారం అవుతుంది - జె.బి.ముర‌ళీకృష్ణ‌(మ‌ను)
You are at idlebrain.com > news today >
Follow Us

18 June 2018
Hyderabad

అలా చెబితే అహంకారం అవుతుంది - జె.బి.ముర‌ళీకృష్ణ‌(మ‌ను)
శ్రీనివాస్‌రెడ్డి, సిద్ధి ఇద్నాని హీరో హీరోయిన్లుగా శివం సెల్యూలాయిడ్స్‌, మెయిన్ లైన్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్స్‌పై జె.బి.ముర‌ళీ కృష్ణ(మ‌ను) ద‌ర్శ‌క‌త్వంలో ర‌వి, జో జో జోస్‌, శ్రీనివాస్ రెడ్డి.ఎన్ నిర్మిస్తున్న చిత్రం `జంబ ల‌కిడి పంబ‌`. జూన్ 22న ఈ చిత్రం విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా చిత్ర ద‌ర్శ‌కుడు జె.బి.ముర‌ళీకృష్ణ ఇంట‌ర్వ్యూ...

*మ‌ల‌యాళీ అంటున్నారు? తెలుగు బాగా మాట్లాడుతున్నారే?
- నేను పుట్టింది.. పెరిగిందంతా విజ‌య‌న‌గరం. మా నాన్న‌గారు మ‌ల‌యాళీ.. అమ్మ తెలుగు కుటుంబానికి చెందిన వారు. అందుకే తెలుగు బాగా మాట్లాడుతున్నాను.

*`జంబ ల‌కిడి పంబ‌` ఎలా స్టార్ట‌య్యింది?
- ఈ సినిమాను నేను 116 మందికి నెరేష‌న్ ఇచ్చాను. అంద‌రికీ న‌చ్చింది కానీ రెండో స‌గంలో ఆత్మ‌లు మార‌డం అనేది చాలెంజింగ్ పార్ట్ కావ‌డంతో సినిమా ప్రారంభం కావ‌డానికి ఆల‌స్య‌మైంది. ఈ క‌థ‌ను ముందు ఈ సినిమా స‌హ నిర్మాత సురేశ్ విన్నారు. అయితే పూర్తి బ‌డ్జెట్ పెట్ట‌లేన‌ని ఆయ‌న అన్నారు. త‌ర్వాత క‌థ‌ను చాలా మందికి వినిపిస్తూ వ‌చ్చాను. 115 వ్య‌క్తి నిర్మాత ర‌విగారు.. 116 వ్య‌క్తిగా మ‌రో నిర్మాత జో జో విన్నారు.

*ఎవ‌రి ద‌గ్గ‌ర ప‌నిచేశారు?
- నేను విక్ర‌మ్ కుమార్‌గారి వ‌ద్ద `మ‌నం`కు స‌పోర్టింగ్ రైట‌ర్‌గా ప‌నిచేశాను. `దృశ్యం` సినిమాను మ‌ల‌యాళం, తెలుగు, త‌మిళ వెర్ష‌న్స్‌కు ప‌నిచేశాను. ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో ప‌నిచేస్తూనే ఓ చిన్న పాత్ర‌లో కూడా న‌టించాను.

*క‌థేంటి?
- ముందు ఈ క‌థ‌కు `కుడి ఎడ‌మైతే` అనే టైటిల్ అనుకున్నాను. అయితే శ్రేయోభిలాషులు క‌థ విని ఆత్మ‌లు మారే క‌థ కాబ‌ట్టి `జంబ‌ల‌కిడి పంబ‌` అనే టైటిల్ పెట్టు. కాస్త మైలేజ్ వ‌స్తుందన్నారు. స‌రేన‌ని అన్నాను.. అయితే ఆ టైటిల్ పెట్టేట‌ప్పుడు.. ఇప్పుడు భ‌యంగానే ఉంది. పాత `జంబ ల‌కిడి పంబ‌` రేంజ్‌ను ఊహించుకుని ప్రేక్ష‌కులు వ‌స్తారేమోన‌ని భ‌యంగా ఉంది. ఆ రేంజ్ చేస్తామ‌ని చెప్ప‌డం అహంకారం అవుతుంది ఎందుకంటే అది బెంచ్ మార్క్ మూవీ. ఆ పేరు మా సినిమాకు పెట్టినందుకు ఆ స్థాయిలో ఉంటుంద‌ని చెప్ప‌ను కానీ.. పేరు మాత్రం పొగొట్ట‌ను అని చెప్ప‌గ‌ల‌ను. ఇదొక ఫ్యామిలీ డ్రామా

* ఈ సినిమాను శ్రీనివాస‌రెడ్డితోనే చేయాల‌నుకున్నారా?
- క‌థ రాసుకునేట‌ప్పుడు నేటి యూత్‌ను బేస్ చేసుకుని కుటుంబాలు ఎలా ఉంటున్నాయని రాసుకున్నాను. బౌండెడ్ స్క్రిప్ట్ సిద్ధం చేసేశాను. శ్రీనివాస‌రెడ్డిగారితో సినిమా అనుకోగానే కాస్త కామెడీ యాంగిల్‌లో చిన్న చిన్న మార్పులు చేశాను. సినిమా చేసేటప్పుడు ఆయనైతేనే న్యాయం చేయ‌గ‌ల‌రు అనిపించింది. ఎందుకంటే స్త్రీలాగా న‌టించేట‌ప్పుడు వారి హావ‌భావాలు ప‌లికించ‌డం సాధార‌ణ విష‌యం కాదు.

* పెళ్లి అనేది అవ‌స‌ర‌మంటారా?
- అవ‌స‌ర‌మే అండీ. నాకు తెలిసి పెళ్లి అనేది అవ‌స‌ర‌మే.

*నెక్స్ట్ మూవీ ఏం చేస్తున్నారు?
- ఈ సినిమా త‌ర్వాత నేను ఇంకా ఏమీ ఆలోచించ‌లేదు. నా ప్రెజెంట్‌, ఫ్యూచ‌ర్ ఇదే. రెండు, మూడు అవ‌కాశాలు వ‌చ్చాయి. బౌండెడ్ స్క్రిప్ట్ లు 5 ఉన్నాయి. చూడాలి.

* `జంబ‌ల‌క‌డి పంబ` అనే పేరు పెట్ట‌డం గురించి చెప్పండి?
- మా సినిమాకు జంబ‌ల‌కిడి పంబ అనే పేరే చాలా కీల‌కం. న‌రేశ్‌గారి ప‌ర్మిష‌న్ కూడా తీసుకునే పెట్టుకున్నాం. తెలుగులో వాడ‌కంలో లేని ఒక ప‌దం అది. న‌రేశ్‌గారు చెప్ప‌డం ఏంటంటే... రేలంగిగారు అప్ప‌ట్లో వాళ్ల గ్రూప్‌కి పెట్టుకున్న పేరంట‌. అక్క‌డి నుంచి ఈవీవీగారు తీసుకున్నార‌ట‌. న‌రేశ్‌గారు కూడా చాలా సార్లు ఈ పేరుతో సినిమా ప్లాన్ చేశార‌ట‌. కానీ భ‌య‌మేసి ట‌చ్ చేయ‌లేదట‌ని చెప్పారు.

* న‌రేశ్‌గారితో అసోసియేష‌న్ ఎలా కుదిరింది?
- మేడ‌మీద అబ్బాయి టైమ్‌లో ఆయ‌న‌తో అసోసియేష‌న్ అయ్యాను. అప్పుడు స్క్రిప్ట్ చెప్పి ఈ పేరును వాడుకుందామని అనుకుంటున్నాం అని చెప్పాం. హండ్ర‌డ్ ప‌ర్సెంట్ యాప్ట్ అని చెప్పారు. ఆ సినిమాకు , ఈ సినిమాకు ఒక్క సీన్‌లోనూ పొంత ఉండ‌దు. అక్క‌డ గ్రూప్ ఆఫ్ పీపుల్ మ‌ధ్య ఈ సినిమా జ‌రుగుతుంటుంది. ఇక్క‌డ ఫ్యామిలీ మ‌ధ్య ఉంటుంది. మా సినిమా పూర్తిగా న‌వ్వులు పండిస్తుంది. టుంది. ఎక్క‌డా పాఠాలు చెప్పిన‌ట్టు ఉండ‌దు.

* హీరోయిన్ గురించి చెప్పండి?
- సిద్ధిని మేం ఆడిష‌న్స్ ద్వారా తీసుకున్నాం. మేం మొత్తం 36 మందిని ఆడిష‌న్స్ చేస్తే త‌ను రెండో అమ్మాయి. ఈ అమ్మాయిని ఆడిష‌న్ చేయ‌గానే ఫిక్స‌యి పొమ్మ‌ని నా అసిస్టెంట్స్ తో చెప్పాను. త‌ను థియేట‌ర్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వ‌చ్చింది. తెలుగు నేర్చుకుని డైలాగులు చెప్పాల‌ని, ప్రాంప్టింగ్ చెప్ప‌మ‌ని ముందే చెప్పాం. త‌ను కూడా అంతే క‌ష్ట‌ప‌డి చెప్పింది. అలాగే ఎమోష‌న్స్ ని ప‌లికించింది.

* మీ తొలి చిత్రం రైట్ రైట్ స‌రిగా ఆడ‌లేదు క‌దా?
- నాకు ఎమ్మెస్ రాజుగారితో చాలా మంచి అసోసియేష‌న్ ఉంది. ఆయ‌న చాలా బాగా చూసుకునేవారు. ఆయ‌న చెప్ప‌డంతో ఈ రీమేక్ చేశాను. తొలి సినిమా రీమేక్ చేద్దామా వ‌ద్దా అని అనుకున్నా. కానీ అవ‌కాశం పిలిచి ఇవ్వ‌డ‌మంటే మామూలు విష‌యం కాదు అని నాకు తెలుసు. అందుకే అంగీక‌రించా. మ‌ల‌యాళంలో హిట్ అయిన సినిమా అది. ఎందుకో మ‌న ప్రేక్ష‌కుల‌కు క‌నెక్ట్ కాలేదు.

* మ‌రి ఆ సినిమా ఫ్లాప్ ప్ర‌భావం ఈ సినిమా మీద ప‌డ‌లేదా?
- ఆ సినిమా ఫ్లాప్‌. ఎవ‌రైనా నాకు ఎందుకు అవ‌కాశం ఇవ్వాలి? అయినా మా నిర్మాత‌లు ఇచ్చారు. ఈ సినిమా బోర్డ్ లోకి గోపీసుంద‌ర్‌గారు రావ‌డంతో అంద‌రూ న‌మ్మారు. దానంత‌టికీ కార‌ణం మా నిర్మాత‌లు నాకిచ్చిన న‌మ్మ‌క‌మే.

 

 


 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved