pizza
Karthi interview (Telugu) about Chinna Babu
నాకు.. రైతుల‌తో బంధుత్వం ఉంది! - కార్తీ
You are at idlebrain.com > news today >
Follow Us

10 July 2018
Hyderabad

కార్తీ హీరోగా న‌టిస్తున్న సినిమా ` చిన‌బాబు`. త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. ఈ సంద‌ర్భంగా కార్తీ మంగ‌ళ‌వారం హైద‌రాబాద్‌లో విలేక‌రుల‌తో మాట్లాడారు. ఆ విశేషాలు..

* `చిన‌బాబు` గురించి చెప్పండి?
- పాండిరాజ్‌గారు ప‌సంగ అని ఒక సినిమా చేశారు. ఆ సినిమాకు నేష‌న‌ల్ అవార్డు వ‌చ్చింది. అది కేవ‌లం చిన్న పిల్ల‌ల‌కు సంబంధించింది కాదు, త‌ల్లిదండ్రుల‌కు కూడా సంబంధించిన సినిమా. పేరెంటింగ్ గురించి చెప్పిన సినిమా. ఆయ‌న‌తో ప‌నిచేయాల‌ని ఎప్ప‌టి నుంచో అనుకుంటున్నాను. కుద‌ర్లేదు. ఈ సినిమాకు కుదిరింది.

* చిన‌బాబు అనే టైటిల్ ఎందుకు పెట్టారు?
- ఐదుగురు అక్క‌ల త‌ర్వాత పుట్టిన త‌మ్ముడి క‌థ ఇది. తండ్రి వ్య‌వ‌సాయం చేస్తుంటాడు. కొడుకు కూడా వ్య‌వ‌సాయ‌మే చేస్తాడు. బండి మీద ఎవ‌రి వృత్తిని వాళ్లు రాసుకున్న‌ట్టు ఈ సినిమాలో నేను ఫార్మ‌ర్ అని రాసుకుంటాను. రైతు అనే ఉద్యోగాన్ని నేను గ‌ర్వంగానే భావించాను. ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తూ నెల‌కు ల‌క్ష సంపాదిస్తూ, అక్క‌ల‌కు, అక్క కూతుళ్ల‌కు కావాల్సిన‌వ‌న్నీ స‌మ‌కూరుస్తూ ఉండే పాత్ర నాది. నా చిన్న‌ప్పుడు ఒక్కో ఇంట్లో ముగ్గురు పిల్ల‌లుండేవారు. అలాంటిది ఈ సినిమాలో ఇంత‌మందిని చూపించాం. మ‌న సంస్కృతిలో పిల్ల‌లు సంప‌ద‌. అలాంటి సంప‌ద‌ను మ‌నం ఇందులో చూపించాం. కుటుంబ బంధాల‌ను ఇందులో చూపించాం. ఇలాంటి సినిమాను నేను ఇప్ప‌టిదాకా చేయ‌లేదు. ఈ సినిమాలోనే నేను తొలిసారి పెద్ద కుటుంబంతో ప‌నిచేశాను. చాలా మంచి ఫీలింగ్ వ‌చ్చింది. ఈ సినిమాలో ఉన్న ఆర్టిస్టులు క్రౌడ్‌లాగా లేదు. సినిమాలో ప్ర‌తి ఆర్టిస్టునీ పాత్ర‌ల పేరుతో చూపిస్తారు.

* రైతుల క‌ష్ట‌న‌ష్టాల‌ను చూపిస్తారా?
- అదేం లేదండీ. పాజిటివ్ సైడ్‌లో చూపిస్తున్నాం. జ‌ర్మ‌నీలో ఆర్గానిక్ ఫార్మింగ్‌. కేర‌ళ‌లో ఒక ఏడాదికి రెండు , మూడు కోట్లు సంపాదిస్తున్నారు. అలాంటి మంచి విష‌యాల‌ను మ‌ళ్లీ చెప్పాల‌నే అంశంతో ఈ సినిమా చేశాం. మా ద‌ర్శ‌కుడు కూడా స్కూల్ చ‌దివేట‌ప్పుడు రైతు. ఆయ‌న చేసి చూపించిన‌వ‌న్నీ నేను చేసేవాడిని. ప్ర‌తిరోజూ ఉద‌యం ఆరు గంట‌ల‌కు పొలాల‌కు వెళ్లి ప‌నులు చేసేవాడిని.

* సినిమా కామెడీగా ఉంటుందా?
- మ‌న లైఫ్‌లాగా ఉంటుంది. మ‌న లైఫ్‌లో కొంచెం కామెడీ ఉంటుంది. కొంచెం బాధ ఉంటుంది. అన్నీ మ‌న జీవితాల్లాగానే ఉంటాయి.

* మామూలుగా త‌మిళ‌నాడులో విలేజ్ క‌ల్చ‌ర్ వేరు. ఇక్క‌డ వేరు. ఎలా బ్యాల‌న్స్ చేశారు?
- తెలుగు, త‌మిళ ప్ర‌జ‌ల‌కు సంస్కృతి ఒకే ర‌కంగా ఉండేలా ఉంది. వ్య‌వ‌సాయం ఎక్క‌డైనా కామ‌న్‌గా ఉంది. ఇందులో రంగ‌స్థ‌లం త‌ర్వాత నేను గోదావ‌రి యాస ట్రై చేశాను. ఈ సినిమాను చూసేవారికి అక్క‌లు, మావ‌య్య‌లు, బావ‌లు క‌నిపిస్తారు. అంద‌రూ క‌నెక్ట్ అవుతారు.

మ‌న క‌ల్చ‌ర్‌ని ఈ త‌రం పిల్ల‌ల‌కు చూపించే సినిమా అవుతుంది.

* సూర్య‌గారు తొలిసారి మీ సినిమాను నిర్మించారు?
- మంచి నిర్మాత‌. అన్నీ బాగా చూసుకున్నారు. ద‌ర్శ‌కుడిని న‌మ్మి వ‌దిలేశారు. షూటింగ్ స్పాట్‌కి ఒక్క రోజు కూడా రాలేదు. నాకు మాత్రం క‌రెక్ష‌న్ చెప్పారు. సినిమా ఎలా ఉంది అని అడిగితే `అది ఆడియ‌న్స్ చెప్తారు` అని అన్నారు.

* మీకు వ్య‌వ‌సాయం ట‌చ్ ఉంటుందా?
- ఉంది. ఎందుకంటే నా భార్య ఓ రైతు కూతురే. మాకు సెల‌వులు ఉంటే ఆ ప‌ల్లెటూరికి వెళ్తాం. నా కూతురు కూడా సెల‌వుల్లో ప‌ల్లెటూళ్లోనే ఉంటుంది. డైర‌క్ట్ గా నాకు క‌నెక్ష‌న్ ఉంది వ్య‌వ‌సాయంతో.

* ఇందులో విల‌న్లు ఉండ‌రా?
- ఉన్నారు. శ‌త్రు విల‌న్‌గా చేశాడు. త‌ను నా క్లాస్‌మేట్‌. నేను లీడ‌ర్‌గా ఉన్న‌ప్ప‌టి నుంచి శ‌త్రుకి నేనంటే ప‌డ‌దు. ఒక విలేజ్‌లో మ‌నుషులు ఉంటారో అలా ఉంటుంది ఈ సినిమా.

* ఇమాన్ మ్యూజిక్ గురించి చెప్పండి?
- ఏ సినిమా ఆయ‌న ద‌గ్గ‌ర‌కు వెళ్లినా ఆయ‌న త‌న బెస్ట్ ఇస్తారు. ఈ సినిమాకోసం చాలా మంచి సంగీతాన్నిచ్చారు. ఆయ‌న రీరికార్డింగ్ కోసం సినిమా చూసి `నా ఫ్యామిలీని చూసిన‌ట్టు ఉంది` అని అన్నారు.

* ఫార్మ‌ర్స్ అన‌గానే చాలా ఇబ్బందులున్నాయ‌ని.. వార్త‌లు చూస్తున్నాం క‌దా?
- మీడియాలో ఎప్పుడూ నెగ‌టివ్ విష‌యాలే వ‌స్తాయి. ఎందుకంటే అవ‌న్నీ ప్ర‌భుత్వానికి అడ్ర‌స్ చేయ‌డానికి స‌మ‌స్య‌ల‌ను ఎత్తి చూపిస్తుంటారు. కానీ నాణానికి మ‌రో వైపు కూడా ఉంటుందిగా.

* మీరు కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నార‌ట క‌దా?
- మా పెద‌నాన్న రైతు. ఆయ‌న‌కు మేం డ‌బ్బులిచ్చి చేయిస్తున్నాం. ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది మూడు, నాలుగు ఏళ్లు వెయిట్ చేసి చేయించాలి. స‌త్య‌రాజ్‌గారు 30, 40 ఏళ్లుగా కొబ్బ‌రిచెట్ల వ్యాపారం చేస్తారు. మా నాన్న ఎప్పుడూ `ఈ సిటీ బోర్ కొడుతోందిరా. నేను ఊరెళ్తున్నాను` అని అంటారు. ఆ ట‌చ్ మ‌న‌కు త‌ప్ప‌కుండా ఉండాలి. ఉంటుంది కూడా.

* ఇందులో జ‌ల్లిక‌ట్టు ఉందా?
- లేదండీ. జ‌ల్లిక‌ట్టు ఉంటే సినిమా విడుద‌ల చేయ‌డం చాలా క‌ష్టం. మాకు అంత ధైర్యం లేదు.

interview gallery* నెక్స్ట్ ఏం సినిమా చేస్తున్నారు?
- ఆవారాలాంటి సినిమా. ర‌కుల్ తో చేస్తున్నాను.

* ఖాకీకి సీక్వెల్ ఉంటుందా?
- వినోద్‌గారు క‌థ చెప్పిన‌ప్పుడు సీక్వెల్ చేద్దామ‌ని అన్నారు. త‌ప్ప‌కుండా ఆయ‌న స్క్రిప్ట్ తో వ‌స్తే త‌ప్ప‌కుండా చేస్తాను.

* మ‌ళ్లీ ఎప్పుడు డైర‌క్ట్ సినిమా చేస్తారు?
- ఊపిరి త‌ర్వాత మ‌ర‌లా మంచి స్క్రిప్ట్ లు రావాలి.

* స్క్రిప్ట్ లు వ‌చ్చిన‌ప్పుడు మీరు ఇంకో సినిమాల‌తో బిజీగా ఉంటే?
- వాటిని ప‌క్క‌కు జ‌రుపుకొని ఇక్క‌డ చేస్తాను.

* మ‌ల్టీస్టార‌ర్ సినిమాలంటే ఓకేనా?
- మామూలుగా నేను మ‌ల్టీస్టారర్లు చేయ‌ను. నేను వాటిప‌ట్ల పెద్దగా ఇష్టం వ్య‌క్తం చేయ‌ను. అయినా ఊపిరి సినిమా చాలా మంచి స్క్రిప్ట్. అందుకే చేశాం.

* యాక్టింగ్‌కి ఆవ‌ల ఇంకేమైనా చేయాల‌ని ఉందా?
- సూర్య సార్ ప‌ది ఏళ్ల క్రితం యాక్టింగ్ మొద‌లుపెట్టారు. ఆ త‌ర్వాతే నిర్మాత‌గా మారారు. నేను ప‌దేళ్లుగా నేను న‌టిస్తున్నా. నా న‌ట‌న న‌చ్చ‌క‌పోతే నేను వెళ్లిపోయి నిర్మాత‌గా మారుతాను. స్టార్టింగ్‌లో ద‌ర్శ‌కుడిగానే చేయాల‌నుకున్నా. కానీ ఇప్పుడు ద‌ర్శ‌కుల‌ను చూస్తే, వాళ్లు ప‌డే క‌ష్టాన్ని చూస్తే `అంత ఆశ ఎందుకురా నీకు` అని అనిపిస్తోంది. వ‌య‌సులో ఉన్న‌ప్పుడే న‌టించాలి. వ‌య‌సు మీద ప‌డే కొద్దీ మ‌నం సంపాదించుకున్న జ్ఞానంతో మ‌నం ద‌ర్శ‌క‌త్వం చేయొచ్చు.

* ఇప్పుడు సినిమాల్లో ఉండ‌టం ఎలా ఉంది?
- చాలా ఆనందంగా ఉంది. ఎవ‌రైనా స‌రే, వాళ్ల‌కు ఏం చేయ‌డానికి న‌చ్చుతుందో అది చేయాలి. న‌చ్చిన ప‌ని చేయ‌డానికి మ‌నం 110శాతం ఎఫ‌ర్ట్స్ పెడ‌తాం. నాకు సినిమాలంటే ఇష్టం. అందుకే ఇక్క‌డుండ‌టానికి నేను చాలా ఆనందిస్తాను.

 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved