pizza
Kartikeya interview (Telugu) about Hippi
ఎలాంటి సినిమాలు చేయాలో, ఎలాంటివి చేయ‌కూడ‌దో నాకు బాగా క్లారిటీ ఉంది - కార్తికేయ‌
You are at idlebrain.com > news today >
Follow Us

5 June 2019
Hyderabad

`RX 100` ఫేమ్ కార్తికేయ హీరోగా న‌టించిన చిత్రం `హిప్పీ`. స్టార్ ప్రొడ్యూసర్ కలైపులి థాను నిర్మాత‌గా, టీఎన్ కృష్ణ దర్శకత్వంలో తెర‌కెక్కుతోన్న చిత్ర‌మిది. వీ క్రియేషన్స్ పతాకం పై రూపొందుతోంది. జూన్ 6న సినిమా విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా హీరో కార్తికేయ ఇంట‌ర్వ్యూ....

*ఆర్‌.ఎక్స్.100 త‌ర్వాత వ‌చ్చిన సినిమా క‌దా. ప్రెజ‌ర్ ఉందా?
- చాలా ఉంది. ఎందుకంటే ఆ సినిమాకు ముందు నామీద ఎలాంటి ఎక్స్ పెక్టేష‌న్స్ లేవు. కానీ ఈ సినిమా విష‌యంలో అలా కాదు. చాలా ఎక్స్ పెక్టేష‌న్స్ ఉన్నాయి. అంత‌కు ముందు జీరోలో ఉన్న న‌న్ను ఆ సినిమా 100కి తీసుకెళ్లింది. దాని త‌ర్వాత చేసిన సినిమా కాబ‌ట్టి ప్రెజ‌ర్ క‌చ్చితంగా ఉంది. అయితే ఈ సినిమా ఇంకా బాగా వ‌చ్చింది. నేను బాగా చేశాన‌ని న‌మ్ముతున్నా. న‌న్ను డిప‌రెంట్ షేడ్‌లో ఆడియ‌న్స్ కి చూపించ‌బోతున్నా. సినిమా చూశాక నా గురించి ఏమంటారు? న‌న్ను ఎలా రిజీవ్ చేసుకుంటారు? వ‌ంటి విష‌యాల ప‌ట్ల ఆస‌క్తి ఎక్కువ‌గా ఉంది.

* ఆర్.ఎక్స్.100 త‌ర్వాత క‌థ‌ల ఎంపిక ప్ర‌క్రియ‌లో ఒత్తిడి ఫీల‌య్యారా?
- లేదండీ. అస‌లు ఫీల్ కాలేదు. ఎందుకంటే ఎలాంటి సినిమాలు చేయాలో, ఎలాంటివి చేయ‌కూడ‌దో నాకు బాగా క్లారిటీ ఉంది. అందులో క‌న్‌ఫ్యూజ‌న్ ఎప్పుడూ లేదు. నాకు న‌చ్చిందే నేను 100 శాతం న‌మ్మి చేశాను.

* రొమాంటిక్ సీన్లు ఇందులోనూ ఉన్నాయి. మీ నుంచి యువ‌త ఎక్స్ పెక్ట్ చేస్తార‌ని ఏమైనా చేస్తున్నారా?
- అలాగ‌ని కాదు. నిజానికి రొమాంటిక్ సీన్లు అంద‌రు చేసినా, కొంద‌రినే బాగా యాక్సెప్ట్ చేస్తారు. న‌న్ను అలా యాక్సెప్ట్ చేశారు. నాకు అలాంటి ప్లేస్ ఇచ్చి, న‌న్ను గౌర‌వించిన‌ప్పుడు ... నేను ఆ విష‌యాన్ని గొప్ప‌గానే ఫీల‌వుతున్నా. రొమాంటిక్ సీన్లు ఆర్‌.ఎక్స్100లో వేరుగా ఉంటాయి. ఇందులో వేరుగా ఉంటాయి. అయినా నా వ‌య‌సుకు నాకు ఎక్కువ‌గా ల‌వ్‌స్టోరీలే వ‌స్తాయి. వాటిలో రొమాంటిక్ మొమెంట్స్ ఉంటాయి. అలాంటి సంద‌ర్భాల్లో లిప్‌లాక్‌లు చేయాలి. అలా కాకుండా పాత కాలంలో లాగా గొడుగు అడ్డం పెట్టేసిన‌ట్టు చూపిస్తే బావుండ‌దు కూడా. అందుకే నేను రియ‌లిస్టిక్ సినిమా, నేచుర‌ల్ సినిమా చేయాల‌ని అనుకున్న‌ప్పుడు అది కూడా అంద‌రికీ క‌నెక్ట్ అయ్యేలాగే ఉండాలి.

* ప‌లు గెట‌ప్స్ ఉన్న‌ట్టున్నాయి..
- హిప్పీగా ఉండే టైమ్‌లో లాంగ్ హెయిర్ గెట‌ప్ ఉప‌యోగ‌ప‌డింది. కేర్ ఫ్రీ యాటిట్యూడ్‌, న‌చ్చింది చేస్తాడు.. వంటివ‌న్నీ ఆ గెట‌ప్‌తోనే ఎస్టాబ్లిష్ అయింది. కిక్ బాక్స‌ర్‌, గిటారిస్ట్ ని చూపించాల‌నుకున్న‌ప్పుడు ఇంకో గెట‌ప్ క‌నిపిస్తుంది. సాఫ్ట్ వేర్ గెట‌ప్ ఉంది.. బాల్డ్ హెడ్ లుక్ ఒక‌టి ఉంది. ఇంకో గెట‌ప్ కూడా ఉంది. అది స‌ర్‌ప్రైజ్ అన్న‌మాట‌. మెయిన్ గెట‌ప్‌లు రెండు. మిగిలిన‌వి స‌స్పెన్స్. నా రెండో సినిమాకే ఇన్ని గెట‌ప్పులు చేయ‌డం ఆనందంగా ఉంది. సినిమా ఒప్పుకోవ‌డానికి మెయిన్ రీజ‌న్ల‌లో గెట‌ప్పులు ఉండ‌టం కూడా ఒక‌టి.

* గెట‌ప్ కావాల‌ని చేసుకుంటారా? లేకుంటే లైఫ్ స్పాన్ ఉంటుందా?
- క‌థ‌లో భాగంగా కొన్ని వ‌స్తాయి. కొన్ని ఇమేజినేష‌న్‌లో వ‌స్తుంటాయి.

* శివాజీ సినిమా ఏమైనా ఇన్‌స్పిరేష‌నా?
- అలాంటిదేమీ లేదు. ఏదో స‌ర‌దాగా చేశాం. ఇప్పుడు చూడ్డానికి కూడా బావుంది.

* థాను నిర్మాత గురించి చెప్పండి?
- థానుగారు సినిమా చేస్తాన‌ని అన్న‌ప్పుడు నాకు నా మీద న‌మ్మ‌కం పెరిగింది. అంత‌కు ముందు ఆర్‌.ఎక్స్100 హిట్ అయింది. కానీ ఆ సినిమా త‌ర్వాత ఇంత పెద్ద లెజెండ‌రీ నిర్మాత నా కోసం వ‌చ్చిన‌ప్పుడు చాలా ఆనందంగా అనిపించింది. ఈ సినిమా అంటే ఆయ‌న‌కు చాలా ఇష్టం. ఆయ‌న జాగ్ర‌త్త‌గా ప్ర‌తి విష‌యాన్ని ప‌ట్టించుకుంటున్నారు. అది చాలా గ్రేట్ విష‌యం.

* జె.డి.గారి గురించి చెప్పండి?
- డైర‌క్ట‌ర్ క‌థ చెప్ప‌గానే ఆయ‌నైతే బావుంటుంద‌ని అనుకున్నాం. అంతా ఓకే అయ్యాక ఆయ‌న్ని తీసుకుంటున్నామ‌ని కొంద‌రితో చెబితే `అయ్యో.. అత‌న్నెందుకు తీసుకున్నారు. అత‌ను సెట్లో కొడ‌తాడు, తిడ‌తాడు.. ఎందుకు` అని అన్నారు. కానీ తీరా ప‌నిచేశాక ఆయ‌న చాలా స్వీట్‌గా ఉన్నారు. `అదేంటి సార్ మీ గురించి ఇలా అన్నారు` అని అంటే.. `వాళ్లు చెప్పింది నిజ‌మే. నాకు న‌చ్చని సినిమాల‌కు నేను అలాగే చేస్తాను. కానీ నాకు నువ్వు, ఈ సినిమా న‌చ్చింది. అందుకే కూల్‌గా ఉంది` అని అన్నారు. ఆయ‌న అంత అన్నార‌ని న‌చ్చింది. ఆయ‌న‌తో నాకు ఔట్‌సైడ్ చాలా మంచి అసోసియేష‌న్ వ‌చ్చింది. బెస్ట్ ఫ్రెండ్‌లాగా అనిపించింది. ఆయ‌న సీనియ‌ర్ యాక్ట‌ర్ అని కాకుండా, స‌ర‌దాగా పంచ్‌లు వేస్తూ చేసేశాను.

* ద‌ర్శ‌కుడికి ఈ మ‌ధ్య సినిమాలేమీ లేవు. మ‌రి ఎలా అంగీక‌రించారు?
- ఆయ‌న నువ్వు నేను ప్రేమ చేశార‌ని ఈ సినిమా ఒప్పుకోలేదు. క‌థ న‌చ్చాలి. క‌థ చెప్పే తీరు న‌చ్చాలి. వాళ్లు ఆ క‌థ‌ను హ్యాండిల్ చేస్తార‌నే న‌మ్మ‌కం రావాలి. అవి ఉంటే చాలు.. నేను సినిమాను అంగీక‌రించ‌డానికి. టోట‌ల్ కొత్త ద‌ర్శ‌కుల‌నే నేను అంత‌గా న‌మ్ముతున్న‌ప్పుడు ఓ సినిమాను తీసిన వ్య‌క్తిని ఇంకెంత న‌మ్ముతానో ఆలోచించండి. ఆయ‌న క‌థ చెబుతాను అని అన్న‌ప్పుడు `ఏమాయ‌చేసావె` త‌ర‌హా క‌థ చెబుతారేమోన‌ని అనుకున్నా. కానీ ఆయ‌న క‌థ చెబుతుంటే ఫుల్ ఎన‌ర్జీ, ఫుల్ కామెడీ ఉంది స్క్రిప్టులో. ఆర్‌.ఎక్స్.100కీ, దీనికీ సంబంధం లేదు. కానీ చాలా జోష్‌ఫుల్ సినిమా ఉంటుంది. విన‌గానే చాలా హ్యాపీగా అనిపించింది. అక్క‌డే నాకు ఆయ‌న మీద మంచి ఇంప్రెష‌న్ వ‌చ్చింది.

* ఆయ‌న‌కు మీలో ఏం న‌చ్చి వ‌చ్చార‌ని అడిగారా?
- అడిగాను. ఆయ‌న‌కు నా క‌ళ్లు న‌చ్చాయి. ఇంటెన్స్ న‌చ్చింద‌ని చెప్పారు. నాకు ఆయ‌న‌లో క్రియేటివ్ నెస్ క‌నిపించింది. `నువ్వు నేను ప్రేమ` ఇప్పుడు చూసినా నాకు ఫ్రెష్‌గా అనిపిస్తుంది.

* ఆర్‌.ఎక్స్.100 ఆరా కంటిన్యూ అవుతోందా?
- లేదండీ. పాతికేళ్లు నేను మామూలుగానే ఉన్నా. ఆర్.ఎక్స్.100 సినిమా విడుద‌లై 11 నెల‌లు కూడా కాలేదు. ఇప్పుడు ఎవ‌రైనా న‌న్ను గుర్తుప‌డితే నాకు అదో ఆనందం. ఎందుకంటే చిన్న చిన్న ఆర్టిస్టుల‌ను కూడా ఎగ్జ‌యిట్ అయ్యే ర‌కం నేను. నేను చిన్న‌ప్ప‌టినుంచీ సినిమాల్లో పెర‌గ‌లేదు. అందుకే సినిమా అంటే ఎగ్జ‌యిట్‌మెంట్ కొన‌సాగుతోంది. న‌న్ను ఎవ‌రైనా గుర్తుప‌ట్టినా చాలా ఆనందంగా అనిపిస్తుంటుంది.

* డిఫ‌రెంట్ కేర‌క్ట‌ర్లు చేయాల‌నే విల‌న్ రోల్స్ ఒప్పుకుంటున్నారా?
- నార్మ‌ల్‌గా ఎనీ విల‌న్ కేర‌క్ట‌ర్ అయితే చేయాల్సిన అవ‌స‌రం నాకు లేదు. ఎందుకంటే ఆల్రెడీ నేను హీరోగా బాగానే ఉన్నాను కాబ‌ట్టి. కానీ ఆ ప‌ర్టిక్యుల‌ర్ కేర‌క్ట‌ర్ `హిప్పీ`, `గుణ‌` హిట్ట‌యి.. ఎంత పెద్ద స్టార్ అయినా నేను చేస్తాను. నానిగారు పెద్ద మార్కెట్ ఉన్న హీరో... అలాంటివ‌న్నీ ఆలోచించ‌లేదు. ఎందుకంటే అంత గొప్ప కేర‌క్ట‌ర్ అది. `హిప్పీ`కి ఎంత ఎగ్జ‌యిట్‌మెంట్ గా ఉన్నానో, గ్యాంగ్‌లీడ‌ర్ కోసం అంత ఎగ్జ‌యిట్‌మెంట్ గా ఉన్నా. ఇంకా చెప్పాలంటే హిప్పీ లాంటి పాత్ర‌ను భ‌విష్య‌త్తులో మ‌ళ్లీ చేయొచ్చేమో. కానీ గ్యాంగ్‌లీడ‌ర్ లాంటి సినిమాను మ‌ళ్లీ చేస్తానో లేదో చెప్ప‌లేను.

* గ్యాంగ్‌లీడ‌ర్ షూటింగ్ ఎంత వ‌ర‌కు వ‌చ్చింది.
- ఆగ‌స్టు 30 విడుద‌ల క‌దా. చాలా వ‌ర‌కు షూటింగ్ పూర్త‌యింది.

* మీ ఇమేజ్ డ్యామేజ్ అవుతుంద‌ని ఫీల‌వుతున్నారా?
- అలాంటి డ్యామేజ్ ఏదీ జ‌ర‌గ‌దు. ఎందుకంటే అలాగే కావాల‌ని ఆడియ‌న్స్ కోరుకుంటున్నారు. అద‌ర్ లాంగ్వేజెస్లో ఆర్టిస్టులు ఇప్ప‌టికే ఇలా చేస్తున్నారు. చేయాలి కూడా. ఒక‌ప్పుడు చిరంజీవిగారు 20 ఏళ్లు హీరోగానే చేయాల‌ని కోరుకున్నారు జ‌నాలు. కానీ ఇప్పుడు ఆడియ‌న్స్ రెండు, మూడు సినిమాల త‌ర్వాత `అబ్బే బోర్ కొడుతోంది` అని అంటున్నారు. టేస్టులు మారిపోయాయి. త‌మిళ్‌లో విజ‌య్‌సేతుప‌తి చాలా పెద్ద మాస్ హీరో. ఆయ‌న‌తో పోలిస్తే న‌థింగ్ మ‌నం. ఆయ‌న విల‌నీ చేస్తున్నారు. కామెడీ చేస్తున్నారు. తెలుగులో వైష్ణ‌వ్ తేజ్ సినిమాలో హీరోయిన్ ఫాద‌ర్‌గా న‌టిస్తున్నారు.

* ష‌ర్ట్ విప్పుతున్నారు..
- ష‌ర్ట్ విప్పింది నాకు మంచి బాడీ ఉంది కాబ‌ట్టి. కాక‌పోతే నాకు టాటూ ఉంటుంది. సినిమాలో ష‌ర్ట్ లెస్‌గా ఉంటాను. అందుకే ఈ సినిమాకు అలా చేయ‌డం త‌ప్పు లేద‌నిపించింది. గుణ‌లాంటి స్క్రిప్ట్ కూ, గ్యాంగ్‌లీడ‌ర్‌లోనూ ష‌ర్ట్ విప్పితే పెద్ద త‌ప్పేమోగానీ, ఈ సినిమాకు చేసినా త‌ప్పులేదు.

* ఇందులో బాక్స‌ర్ క‌దా. మీరు నేర్చుకున్నారా?
- నేను జ‌న‌ర‌ల్‌గా హీరో అవుతున్నాన‌ని అనుకున్న‌ప్పుడు కొంచెం మార్ష‌ల్ ఆర్ట్స్ వంటివ‌న్నీ నేర్చుకున్నా. ఈ సినిమా చేసేట‌ప్పుడు మూడు నెల‌ల ముందు నేర్చుకున్నా.

* శాడ్ ఎండింగా?
- అలాంటిదేమీ లేదండీ. అయితే అది ప్రేక్ష‌కులు తీసుకునేదాన్నిబ‌ట్టి ఉంటుంది. శాడ్ అనుకుంటే శాడే. హ్యాపీ అనుకుంటే హ్యాపీయే. అలాగ‌ని కింద‌ప‌డి దొర్లేసే బాధ మాత్రం ఉండ‌దు. చిన్న చిన్న ఎమోష‌న్స్ ఉంటాయి.

- ద‌ర్శ‌కుడి లైఫ్‌లో జ‌రిగిన విష‌యాలే కాదు.. అంద‌రి జీవితాల్లో జ‌రిగిన‌వీ ఇందులో ఉంటాయి. 15 ఏళ్లు పూర్తయిన ఏ అబ్బాయికైనా ముగ్గురు న‌లుగురు అమ్మాయిలు అప్ప‌టికే న‌చ్చేసి ఉంటారు. అప్ప‌టిదాకా అబ్బాయిని వెంట తిప్పించుకుని ఊరించిన అమ్మాయి, నిజంగా అత‌నికి ప‌డితే ఆ త‌ర్వాత అత‌నికి పెద్ద కిక్కు ఉండ‌దు. అందుకే అమ్మాయి ప‌డ‌నంత వ‌ర‌కు ప్యార‌డైజే.. ప‌డితేనే లాస్ట్. ఆ విష‌యాన్ని డైర‌క్ట్ గా హీరో, హీరోయిన్ల చేత నేరుగా చెప్పించేశాం. కొత్త‌గా ఉంటుంది.

* ఆర్‌.ఎక్స్.100ని మ‌ళ్లీ మీతో చేయ‌మంటే చేస్తారా?
- అజ‌య్ చేస్తే చేస్తానేమో. అయినా అప్పుడున్న మేజిక్ ఇప్పుడు సెట్లో మ‌ళ్లీ వ‌స్తుందో రాదో.. బ‌హుశా చేయ‌నేమో.

* ఈ సినిమాను మ‌ల్టీస్టార‌ర్ సినిమా అని అనుకోవ‌చ్చా?
- ఇందులో హీరో, హీరోయిన్లు అని ప్ర‌త్యేకంగా ఏమీ ఉండ‌రు. ఇది క‌చ్చితంగా మ‌ల్టీస్టార‌రే. ఎక్క‌డా హీరో ఎలివేష‌న్‌, కేర‌క్ట‌ర్ ఎలివేష‌న్ అన్న‌ట్టు ఉండ‌దు. అంద‌రూ ఎలివేట్ అవుతారు. ఎక్కువ సేపు నేను క‌నిపిస్తాను కాబ‌ట్టి, న‌న్ను హీరో అంటారంతే. మిగిలిన వాళ్లంద‌రూ ఇంపార్టెంటే. నా సినిమాల్లో అన్ని కేర‌క్ట‌ర్లూ అలాగే ఉండాల‌ని కోరుకుంటా.

* వెబ్‌సీరీస్ చేస్తున్నారా?
- ప్ర‌స్తుతం అంత టైమ్ లేదు. పైగా తెలుగులో సినిమాలు పెద్ద‌వి. వెబ్ సీరీస్‌లు చిన్న‌వి. అందుకే ప్ర‌స్తుతం వాటి మీద దృష్టి పోలేదు.

* నెక్స్ట్ మూవీస్ ఏంటి?
- నాని సినిమా ఉంది. దాని త‌ర్వాత గుణ ఉంది. ఆ త‌ర్వాత శేఖ‌ర్‌రెడ్డి అనే కొత్త ద‌ర్శ‌కుడితో ఒక సినిమా, శ్రీ స‌రిప‌ల్లి అని ఒక ద‌ర్శ‌కుడితో సినిమా ఉంది.

* కొన్ని సంస్థ‌ల‌కు అడ్వాన్సులు తిరిగి ఇచ్చేశార‌ని..
- అలాగ‌ని కాదు. క‌థ విన్నాం. న‌చ్చి చేద్దామ‌నుకుంటే ఎందుకో వ‌ర్క‌వుట్లు కాలేదు. ద‌ర్శ‌కులు మారే ప్ర‌మాదం ఉంది. నాకు న‌చ్చిందే ఆ క‌థ‌, ద‌ర్శ‌కుడు అయిన‌ప్పుడు... అవి మార‌డం న‌చ్చ‌లేదు. అలాగ‌ని బ్యాన‌ర్ల‌ను త‌క్కువ చేస్తున్నాన‌ని కాదు. ఏ సినిమాకైనా మెయిన్ క‌థ‌, ద‌ర్శ‌కుడే క‌దా. అలా కొన్ని వ‌దులుకున్నానంతే.

* మీ సొంత సంస్థ‌లో..
- అప్పుడు అవ‌స‌రంతో చేసుకున్నాం. ఇప్పుడు అవ‌స‌రం లేదు. కానీ ఆశ మాత్రం ఉంది. కొన్ని అన్నీ డిసిష‌న్స్ తీసుకుని, ప్ర‌తి విష‌యంలో ఇన్వాల్వ్ కావ‌చ్చు క‌దా.. అనేది ఉంటుంది. ఆ ఫీలింగ్ కోసం ఒక‌టి చేయాల‌ని ఉంది.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved