pizza
Kashmira Paradesi interview (Telugu) about @Nartanasala
ఐరా క్రియేషన్స్‌... నా కుటుంబం అయిపోయింది - కశ్మీరా
You are at idlebrain.com > news today >
Follow Us

26 August 2018
Hyderabad

ఐరా క్రియేషన్స్‌... నా కుటుంబం అయిపోయింది - కశ్మీరా

నాగశౌర్య, కశ్మీరా జంటగా రూపొందుతోన్న సినిమా @నర్తనశాల. ఈ సినిమాను ఐరా క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. శ్రీనివాస చక్రవర్తి దర్శకుడు. శంకర ప్రసాద్‌ ముల్పూరి సమర్పిస్తున్నారు. ఉషా ముల్పూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమా హీరోయిన్‌ కశ్మీరా హైదరాబాద్‌లో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ఆ విశేషాలు..

* తెలుగు బాగా మాట్లాడుతున్నట్టున్నారుగా?
- కొంచెం కొంచెం వస్తోంది. నా చుట్టూ ఉన్న వారితో మాట్లాడి తెలుగు నేర్చుకుంటున్నా. చాలా సందర్భాల్లో మనసులో ఒకటికి రెండు సార్లు పదాలను కూడపలుక్కుని ఆ తర్వాత మాట్లాడుతున్నా. మొన్న ప్రీ రిలీజ్‌ వేడుకలోనూ మాట్లాడా. అయితే నేను అనుకున్న విషయాలను పేపర్‌ మీద పెట్టి నా ఫ్రెండ్‌కిచ్చి, తెలుగులోకి మార్పించుకుని, వాటిని మరాఠీలో రాసుకుని అర్థం చేసుకుని, మాట్లాడా. నాకు బట్టీ పట్టడంలో ఇంట్రస్ట్‌ ఉండదు.

* మీ గురించి చెప్పండి?
- నా మాతృభాష మరాఠి. పూణెలో పుట్టి పెరిగాను. ముంబైలో నిఫ్ట్‌లో ఫ్యాషన్‌ డిజైనింగ్‌ చదివాను. చదువుతున్నప్పుడే మోడలింగ్‌ కూడా చేశా. అక్కడి నుంచి ప్రభ థియేటర్స్‌లో కోర్సు చేశా. ఆడిషన్స్‌ ఇచ్చే క్రమంలో @నర్తనశాల కోసం హీరోయిన్‌ వెతుకుతున్నారని తెలిసింది. వచ్చాను. ఇక్కడికి వస్తే నవరసాలను అభినయించమన్నారు. చేయగానే వీళ్లకు నచ్చింది. నన్ను ఇంట్లో వ్యక్తిలా చూసుకున్నారు. మా దర్శకుడు నాకు గురువులాంటివారు.

* హీరో గురించి చెప్పండి?
- నేను ఇంతకు ముందు సినిమాలు చేయలేదు. కాబట్టి నాకు కెమెరా సెన్స్‌ లేదు. అయినా నాకు శౌర్య నేర్పించారు. డైలాగుల పరంగానూ హెల్ప్‌ చేశారు. కాస్ట్యూమ్స్‌ విషయంలో ఆంటీ, శౌర్య చాలా సాయం చేశారు.

* ఇంతకు ముందు తెలుగు సినిమాలను చూశేవారా?
- అల్లు అర్జున్‌, మహేష్‌, చిరంజీవిగారి సినిమాలను చాలా చూశా. శౌర్య నటించిన చలో కూడా చూశా. నాకు సినిమాలు చూడటమంటే చాలా ఇష్టం.

*ఇందులో మీ పాత్ర ఎలా ఉంటుంది?
- చాలా లవబుల్‌గా ఉంటుంది. ఇన్నొసెంట్‌గా, కామ్‌గా ఉంటుంది. నా ప్రేమికుడే నా బలం అన్నట్టు ఉంటుంది.

* మీరు డ్యాన్స్‌ నేర్చుకున్నారా?
- కథక్‌, హిప్‌హాప్‌ తెలుసు. ఇందులోనూ సంగీత పాటలో స్టెప్పులేశా.

* ఇంకేమైనా సినిమాలు చేస్తున్నారా?
- తమిళంలో జీవీ ప్రకాష్‌, సిద్ధార్థ్‌తో ఓ సినిమా చేస్తున్నా.

 

 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved