pizza
Kiara Advani interview about Vinaya Vidheya Rama
`వినయవిధేయరామ`లో నటించడం అమేజింగ్‌ ఎక్స్‌పీరియెన్స్‌ - కియరా అద్వాని
You are at idlebrain.com > news today >
Follow Us

4 January 2018
Hyderabad

మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌, మాస్‌ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కిన ఫ్యామిలీ కమర్షియల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'వినయవిధేయరామ'. కియరా అద్వాని హీరోయిన్‌గా నటించిననీ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా కియరా అద్వాని మీడియాతో మాట్లాడుతూ

- దర్శకుడు బోయపాటి శ్రీనుగారు ఈ సినిమా స్టోరీ చెప్పినప్పుడు పూర్తి సినిమా చూసేశాననే ఫీలింగ్‌ వచ్చింది. చాలా రోజుల తర్వాత ఒక మంచి ఫ్యామిలీ స్టోరీ విన్నాననిపించి ఇమీడియట్‌గా ఓకే చెప్పేశాను.

- ఇంత స్టార్‌కాస్ట్‌ ఉన్న సినిమాలో నటించలేదు. రామ్‌ చరణ్‌, వివేక్‌ ఒబెరాయ్‌, ప్రశాంత్‌, ఆర్యన్‌ రాజేష్‌, స్నేహ లాంటి 15 మంది టాప్‌ యాక్టర్స్‌తో నటించడం అనేది అమేజింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌. సెట్స్‌ దగ్గరి నుండి ప్రతీది లార్జర్‌ దేన్‌ లైఫ్‌ అనిపించేలా సినిమా చాలా గ్రాండ్‌గా వచ్చింది.

- బోయపాటిగారు ఇన్‌క్రెడిబుల్‌ డైరెక్టర్‌. నేచురల్‌ ఎలిమెంట్స్‌ని ప్రెజెంట్‌ చేయడం వేరు.. ఏదైతే నమ్మడానికి వీల్లేకుండా ఉంటాయో, వాటిని నమ్మేంతగా.. ఫీలయ్యేంతగా మెస్మరైజ్‌ చేస్తూ స్క్రీన్‌పై ఎలివేట్‌ చేయడం చాలా కష్టం. అది బోయపాటి లాంటి ఫిల్మ్‌ మేకర్స్‌కే సాధ్యమవుతుంది. ఇది కూడా ఆయన బ్రాండ్‌ ఫిలిం.

- నాకు డ్యాన్స్‌ అంటే చాలా ఇష్టం. అందుకే నటినయ్యా. కంప్లీట్‌గా అటు డ్యాన్స్‌, కామెడీ పెర్‌ఫామ్‌ చేయడానికి మంచి స్కోప్‌ ఉన్న సినిమాలో పని చేసే అవకాశం దొరికినప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది. 'వినయ విధేయ రామ' చేసినందుకు కూడా అదే ఫీలింగ్‌.

- సినిమాలో నాకు, చరణ్‌కి మధ్య కెమిస్ట్రీ ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. నా క్యారెక్టర్‌ పేరు 'సీత'. ఫ్యామిలీలో అందరి ముందు చాలా వినయంగా ఉంటూ, రామ్‌ ఏది చెప్తే అదీ అన్నట్టుగా ఉంటాను. బయట మాత్రం చాలా డామినేటింగ్‌గా ఉంటాను. మా కాంబినేషన్‌లో ఉండే సీన్స్‌ ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి.

interview gallery


- సినిమాలో నేను ఎంత టైమ్‌ స్క్రీన్‌పై కనిపిస్తాను అనేకన్నా, కనిపించినంత సేపు నేను ప్లే చేసిన క్యారెక్టర్‌ కి క్వాలిటీ ఉందా లేదా..? నా ప్రెజెన్స్‌ ని ఆడియెన్స్‌ ఫీల్‌ అయ్యారా లేదా అని ఆలోచిస్తా.

- బేసిగ్గా డ్యాన్స్‌ అంటే ఇష్టం కాబట్టి చరణ్‌ లాంటి డ్యాన్సర్‌తో స్టెప్స్‌ వేస్తూ, చాలా ఎంజాయ్‌ చేశా. నాకు 'రామా వెడ్స్‌ సీత' ఇప్పటి వరకు నేను చేసిన సాంగ్స్‌లో మోస్ట్‌ ఫేవరేట్‌. 800 మంది డ్యాన్సర్స్‌తో చాలా గ్రాండ్‌గా పిక్చరైజ్‌ చేశారు ఆ పాటని.

- నాకైతే పర్టికులర్‌గా ఒకే లాంగ్వేజ్‌ ఆడియెన్స్‌కి స్టిక్‌ అవ్వాలనే ఆలోచన లేదు. గ్లోబల్‌ ఆడియెన్స్‌ని ఎంటర్‌ టైన్‌ చేయాలి. లాంగ్వేజ్‌ ఏదైనా, స్క్రిప్ట్‌ బావుంటే అది డిజిటల్‌ ప్లాట్‌ ఫామ్‌ అయినా 'నో' అని చెప్పను.

- 'భరత్‌ అనే నేను' సినిమాకి ముందు నమ్రతా నన్ను వేరే సినిమాలకోసం అప్రోచ్‌ అయ్యారు. కానీ అప్పుడు డేట్స్‌ అర్జెస్ట్‌ అవ్వకపోవడం వల్ల కుదరలేదు. ఎప్పుడైతే 'భరత్‌ అనే నేను' ఆఫర్‌ వచ్చిందో ఎలాగైనా చేసేయాలనుకున్నా

- 'అర్జున్‌ రెడ్డి' రీమేక్‌ లో నటిస్తున్నందుకు చాలా ఎగ్జైటెడ్‌గా ఉన్నాను. సినిమాలో లాస్ట్‌ సీన్‌ నుండి షూటింగ్‌ స్టార్ట్‌ చేశారు. సినిమాలో నేటివిటీకి తగ్గట్టు చిన్న చిన్న చేంజెస్‌ చేశారు. సినిమా ఢిల్లీ బ్యాక్‌ డ్రాప్‌ లో ఉంటుంది.

- రామ్‌ చరణ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ అంటే చాలా ఇష్టం. ఆయనకీ సీక్రెట్‌ ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ కూడా ఉంది. కానీ చాలా మందికి ఆ విషయం తెలీదు.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved