pizza
Kishore Kumar Pardasani interview (Telugu) about Katamarayudu
ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌గారితో జ‌ర్నీని ఎప్ప‌టికీ మ‌ర‌చిపోలేను - కిషోర్‌కుమార్ పార్థ‌సాని
You are at idlebrain.com > news today >
Follow Us

27 March 2017
Hyderabad

కొంచెం ఇష్టం-కొంచెం క‌ష్టం స‌క్సెస్‌తో ద‌ర్శ‌కుడుగా త‌నెంటో ప్రూవ్ చేసుకున్న కిషోర్ కుమార్ పార్థ‌సాని(డాలీ) త‌ర్వాత త‌ఢాఖా చిత్రంతో మ‌రో హిట్ కొట్టి త‌న త‌ఢాఖా చూపించాడు. వెంక‌టేష్‌, ప‌వ‌న్‌క‌ళ్యాణ్ కాంబినేష‌ణ్‌లో రూపొందిన గోపాల గోపాల స‌క్సెస్‌తో హ్యాట్రిక్‌హిట్ డైరెక్ట‌ర్‌గా పేరు తెచ్చుకున్నాడు డాలీ. ఇప్పుడు ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ హీరోగా, డాలీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం `కాట‌మ‌రాయుడు`. రీసెంట్‌గా విడుద‌లైన ఈ చిత్రం స‌క్సెస్ గురించి ద‌ర్శ‌కుడు డాలీ మీడియాతో మాట్లాడారు...

స‌క్సెస్ రెస్పాన్స్ గురించి...
సినిమా విడుద‌లైన ఆట నుండి హిట్ టాక్‌తో స‌క్సెస్‌ఫుల్‌గా ర‌న్ అయ్యింది. శ‌నివారం కాస్తా క‌లెక్ష‌న్స్ త‌గ్గిన‌ట్టు అనిపించినా ఆదివారం క‌లెక్ష‌న్స్ మ‌ళ్ళీ పుంజుకున్నాయి.

ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌తో మ‌రోసారి ప‌నిచేసే అవ‌కాశం...
- గోపాల గోపాల సినిమా స‌క్సెస్ త‌ర్వాత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌గారు మంచి స్క్రిప్ట్ ఒక‌టి రెడీ చేసుకోమ‌ని అన్నారు. నేను వీర‌మ్ సినిమా చూసిన‌ప్పుడు అందులో మంచి ల‌వ్ ఎంగిల్‌, ఎమోష‌న‌ల్ పాయింట్ ఉంద‌నిపించి, ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌గారికి చెప్పాను. ఆయ‌న‌కు కూడా చేద్దామ‌ని అన్నారు. క‌థ‌లో చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసి సినిమా చేశాం. సినిమా మెయిన్ పాయింట్‌ను అలాగే తీస‌కున్నాం. అలాగే ట్ర‌యిన్ ఫైట్‌ను అలాగే చేశాం. ఫ‌స్టాఫ్ వీలైనంత‌గా మార్చాం. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌గారితో మాట్లాడుతుంటే కొత్త విష‌యాలు చెబుతుంటారు. ప‌వ‌న్‌గారితో చేసిన జ‌ర్నీని మ‌ర‌చిపోలేను. ఆయ‌న‌తో ఇంకా జ‌ర్నీ చేయాల‌నిపిస్తుంది.

నేను మ‌క్కికి మ‌క్కి రీమేక్ చేయ‌ను...
- నేను చేసిన రీమేక్ సినిమాల‌ను గ‌మ‌నిస్తే, దేన్ని కూడా మ‌క్కికి మ‌క్కిగా రీమేక్ చేయ‌ను. ఆ క‌థ‌లోని ఒక ఇన్‌స్పిరేష‌న్ పాయింట్‌ను తీసుకుని సినిమాను నా స్ట‌యిల్లో చేస్తాను.

క‌థ‌పై క్లారిటీ ఉండాలి...
- క‌థ‌పై క్లారిటీ ఉన్న‌ప్పుడు అమితాబ్ గారైనా, ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌గారైనా సుల‌భంగానే హ్యండిల్ చేయ‌వ‌చ్చు. ఏ సీనును ఎలా చేయాల‌నే క్లారిటీ ఉంది. కాబ‌ట్టే సినిమా సాఫీగా సాగిపోయింది.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ పాత్ర‌కు వ‌స్తున్న స్పంద‌న‌...
- ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌గారి న‌ట‌న బావుంద‌ని సినిమా చూసిన వారందరూ అంటున్నారు. ముఖ్యంగా ల‌వ్ సీన్స్‌లో ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌గారి న‌ట‌న ఆక‌ట్టుకుంటుంది. అలాగే ఇంత‌కుముందు సినిమాల్లో చూడ‌ని విధంగా ప‌వ‌న్‌ను చూపించాన‌ని అంటున్నారు.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved