pizza
Kishore Tirumala interview about Vunnadi Okate Zindagi
ప్రతి సినిమాకు భయమే - కిషోర్‌ తిరుమల

You are at idlebrain.com > news today >
Follow Us

20 October 2017
Hyderabad

 

ప్రతి సినిమాకు భయమే - కిషోర్‌ తిరుమల
రామ్‌ హీరోగా అనుపమ పరమేశ్వరన్‌, లావణ్య త్రిపాఠి హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం 'ఉన్నది ఒకటే జిందగీ'. స్రవంతి రవికిషోర్‌, పీఆర్‌ సినిమాస్‌ సమర్పణలో స్రవంతి సినిమాటిక్స్‌ పతాకంపై కృష్ణ చైతన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 27న సినిమా విడుదలవుతుంది. ఈ సందర్భంగా దర్శకుడు కిషోర్‌ తిరుమలతో ఇంటర్వ్యూ....
అంతా పాజిటివ్‌గానే....
- ప్రేమ, స్నేహం రెండు ఎలిమెంట్స్ కీల‌కంగా 'ఉన్నది ఒకటే జిందగీ' సినిమాలో కనపడతాయి. ప్రతి ఒక్కరూ ఎక్కడో ఒకచోట కనెక్ట్‌ అవుతారు. సినిమాలో ప్రతి క్యారెక్టర్‌ పాజిటివ్‌గా ఉంటుంది. ఇక్కడ సిచ్యువేషన్స్‌ మాత్రమే ప్ర‌ధాన భూమిక పోషిస్తాయి. నిజ జీవితంలో ఆనందాలు, సంతోషాలు, కోపతాపాలు ఎలా ఉంటాయో, అవన్నీ ఈ సినిమాలో కనపడతాయి.

రామ్‌ క్యారెక్టరైజేషన్‌..
- 'నేను శైలజ' రామ్‌ మన పక్కింటి కుర్రాడి పాత్రలో కనపడ్డారు. ఈ సినిమాలో మెచ్యూర్డ్‌ క్యారెక్టర్‌లో కనపడతారు. అంటే ఏ ఎమోషన్‌కు ఎంత రియాక్ట్‌ కావాలో తెలిసిన వ్యక్తిగా అన్నమాట. చక్కగా ఆలోచిస్తాడు. తను తీసుకునే నిర్ణయం వెనుక సరైన కారణం ఉంటుంది.


ఏడాదిన్నర క్రితమే..
- ఈ సినిమా సింపుల్‌ పాయింట్‌తో బలమైన ఎమోషన్స్‌తో తెరకెక్కింది. ఆ పాయింట్‌ ఎంటనేది సినిమాలో చూడాల్సిందే. ఈ పాయింట్‌ను ఏడాదిన్నర క్రితమే అనుకున్నాను. దానిపై కూర్చొని వర్క్‌ చేయడం వల్ల టైమ్‌ పట్టింది.


ప్రతి సినిమా కొత్తదే..
- 'నేనుశైలజ' సినిమా హిట్‌ ఇంపాక్ట్‌ ఈ సినిమాపై పడదు. ఎందుకంటే నేను చేసే ప్రతి సినిమాను కొత్తగానే ఫీలై చేస్తాను. 'నేనుశైలజ' సినిమాలో బలమైన క్యారెక్టరైజేషన్స్‌ ఉంటాయి. అలాంటి క్యారెక్టరైజేషన్స్‌ మరోసారి మనకు ఈ సినిమాలో కనపడతాయి. ఏ క్యారెక్టర్‌కు ఎంత ప్రాముఖ్యత ఉండాలో అంత ప్రాముఖ్యత ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నాను. సినిమా మొత్తంగా చూస్తే, క్యారెక్టర్స్‌ మాత్రమే కనపడతాయి.


స్నేహితులంటే ఇష్టం..
- నాకు స్నేహితులంటే చాలా ఇష్టం. అదీగాక ఫ్రెండ్‌షిప్‌ మీద సినిమాలు వచ్చి చాలా కాలమైంది కదా! అ జోనర్‌ను టచ్‌ చేస్తే బావుంటుందనిపించింది. రామ్‌ ఫ్రెండ్‌ వాసుగా శ్రీవిష్ణు నటించాడు. సాఫ్ట్‌గా, కూల్‌గా ఉండి చూడగానే కనెక్ట్‌ అయ్యేలా ఉండాలనుకున్నాను. ఆ క్వాలిటీస్‌ నాకు శ్రీవిష్ణులో కనపడింది. అందుకే త‌న‌ను వాసు క్యారెక్ట‌ర్ కోసం అప్రోచ్ అయ్యాం. త‌న‌కు న‌చ్చ‌డంతో చేస్తాన‌ని అన్నాడు.


స్క్రిప్ట్‌ ముఖ్యం..
- ప్రతి సినిమాకు భయమే..ఇంతకు ముందు చెప్పినట్లుప్ర‌తి సినిమాను తొలి సినిమాగానే భావిస్తుంటాను. స్క్రిప్ట్‌ విషయంలో కాంప్రమైజ్‌ కాకూడదు. స్క్రిప్ట్‌ బాగా కుదిరితే, సినిమా హిట్‌ అయినట్లే.


హీరోయిన్స్‌ గురించి..
- సినిమా చూసిన వారికి మహి పాత్ర చాలా బాగా కనెక్ట్‌ అవుతుంది. 'నేనుశైలజ' చిత్రంలో శైలజ క్యారెక్టర్‌ కంటే మహి క్యారెక్టర్‌ బాగా ఇంపాక్ట్‌గాఉంటుంది. అనుపమ పరమేవ్వరన్‌ చాలా చక్కగా నటించింది. లావణ్య పాత్ర ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది.


తదుపరి చిత్రం..
- ప్రస్తుతం 'అంతా ఒకటే జిందగీ సినిమాపైనే నా అటెన్షన్ ఉంది. దీని తర్వాత ఏ సినిమాలనే దానిపై నిర్ణయం తీసుకుంటాను.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved