pizza
Kranthi Madhav interview (Telugu) about Ungarala Rambabu
ప్రతి ఒక్కరికీ ఆ సామర్థ్యం ఉంటుంది - క్రాంతి మాధవ్‌
You are at idlebrain.com > news today >
Follow Us

07 September 2017
Hyderabad

'ఓనమాలు', 'మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు' వంటి సినిమాలతో ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న దర్శకుడు క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో సునీల్‌, మియాజార్జ్‌ జంటగా యునైటెడ్‌ కిరిటీ మూవీస్‌ లిమిటెడ్‌ బ్యానర్‌పై రూపొందిన చిత్రం 'ఉంగరాల రాంబాబు'. పరుచూరి కిరిటీ నిర్మాత. ఈ సినిమా సెప్టెంబర్‌ 15న విడుదలవుతుంది. ఈ సందర్భంగా దర్శకుడు క్రాంతిమాధవ్‌తో ఇంటర్వ్యూ...

హీరో పాత్ర ఏంటంటే...
సినిమాలో హీరో స్వార్ధపరుడు కాడు..ఓ పిసినారి. పిసినారి తనం నుండి హీరో ఎలా భయటపడ్డాడు. డబ్బే సర్వస్వం అనుకునే వ్యక్తి చివరకు మనిషికి డబ్బే ప్రధానం కాదనుకునే స్థితికి ఎలా వచ్చేడనే జర్నీయే మా 'ఉంగరాల రాంబాబు'. సాధారణంగా మనుషులం నేను అనే తత్వం నుండి మనం అనే తత్వానికి వస్తూ ఉంటాం. మనం అందరం అనుకునే స్వభావం మనలో తక్కువగా ఉంటుంది. నేను అనుకునే స్థితిలో చాలా మంది ఉన్నారు. నేను నుండి మనంగా మారడమే సినిమా.

ఇన్‌స్పిరేషన్‌ లేదు..
- ఈ కథకు ఇన్‌స్పిరేషన్‌ ఏమీ లేదు. మన నిజ జీవితంలో జరిగే పరిస్థితులను పరిశీలించి రాసుకున్నదే. ఇందులో వ్యక్తిగత అనుభవాలు లేదు.

డిఫరెంట్‌ మూవీస్‌ చేయాలనేదే...
- ఓనమాలు చేసిన తర్వాత, దర్శకుడుగా నేను వంద సినిమాలైతే చేయలేనని అర్థం అయ్యింది. పది సినిమాలైతే చేస్తాననే నమ్మకం ఉంది. ఆ పది సినిమాల్లో అన్నీ జోనర్‌ మూవీస్‌ చేయాలని నిర్ణయించుకున్నాను. ఓనమాలు సినిమా అనేది నేను చూసిన పల్లెటూరి గురించి నేను రాసుకున్న కథ. అలాగే మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు సినిమా లవ్‌స్టోరీ. ఇప్పుడేంటి అనే కాన్సెప్ట్‌ నుండి ఇలా కూడా జరుగుతుందా అని ఆలోచించి రాసుకున్న కథ. ఈ సినిమా విషయానికి వస్తే, నాకు ఇష్టమైన కామెడీ జోనర్‌లో చేసిన సినిమా. నవ్వు అనే ఎమోషన్‌ తెలియకపోతే, ఏ ఎమోషన్‌కు అర్థం తెలియదని నేను అనుకుంటాను. అన్ని ఎమోషన్స్‌ రిలేటెడ్‌గా ఉంటాయి. అందులో హాస్యం అనే ఎమోషన్‌కు కనెక్ట్‌ చేయడం డైరెక్టర్‌గా నాకు చాలా కష్టమైన పని. నేను విద్యార్థిగా ఏదో ఒకటి నేర్చుకోవడానికి ఇష్టపడతాను. నేను చేసిన సినిమాను మూడు గంటలు వెచ్చించి చూసి, దాని గురించి మంచిగానో, చెడుగానో రాశారంటే అందులో నుండి నేను కాస్తా నేర్చుకోవాలి.

Kranthi Madhav interview gallery

అదే నా ఆలోచన..
- డైరెక్టర్‌గా ఓ క్యారెక్టర్‌ని తీసుకుంటే, ఆ క్యారెక్టర్‌ ఏంటి? ఆ కారెక్టర్‌ ఎలా బిహేవ్‌ చేస్తుంది? క్యారెక్టర్‌లో ఎలాంటి మలుపులు జరుగుతాయి? అనే విషయాలతో కథను రాసుకుని సినిమా చేస్తాం. నేను కూడా ఓ డైరెక్టర్‌గా ఇలాంటి సినిమాలు చేయడానికి ఇష్టపడతాను. సాధారణ జీవితంలో మనలో ప్రతి ఒక్కరికీ క్రియేటివ్‌గా ఆలోచించి ఓ కథ రాయడానికో, సినిమా తీయడానికో కావాల్సినంత సామర్థ్యం ఉంటుంది. రెగ్యులర్‌ సినిమాను చూపించాలనుకున్నప్పుడు అది అందరికీ కనెక్ట్‌ అయ్యేలా ఉండాలనేదే నా ఆలోచన.

సునీల్‌ గురించి..
- సునీల్‌ పాత్రలో ఒదిగిపోయారు. ఈ పాత్రలో ఆయన్ను అందరూ రాంబాబు అనే పాత్రలోనే చూస్తారు. ఇప్పటి వరకు సునీల్‌గారు హీరోగా చేసిన సినిమాల్లో కనిపించిన వాటికి భిన్నంగా కనపడతారు. సునీల్‌గారు నాలుగువందల సినిమాల్లో నటించారు. వీటికి భిన్నంగా సునీల్‌ను చూపించాలనుకోవడం కంటే కథ డిఫరెంట్‌గా ఉంటే సునీల్‌ ఆ పాత్రలో సెట్‌ అవుతాడని మంచి స్క్రిప్ట్‌ కోసం చాలా రోజులు వర్క్‌ చేశాను.

సెటైర్స్‌ ఏం లేదు...
- నేను దేవుణ్ని నమ్ముతాను. దణ్ణం కూడా పెట్టుకుంటాను. అంతే తప్ప, బాబాల దగ్గరకు పోను. ఈ సినిమాలో నేనేం బాబాలపై సెటైర్స్‌ వేయలేదు.

తదుపరి చిత్రాలు..
- కె.ఎస్‌.రామారావు, విజయ్‌దేవర కొండ కాంబినేషన్‌లో ఓ ప్రేమకథా చిత్రాన్ని చేయబోతున్నాను.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved