pizza
Kriti Sanon interview about Dohchay
You are at idlebrain.com > news today >
Follow Us

23 April 2015
Hyderabad

తొలి సినిమాలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన నటించి తన గ్లామర్ తో ఆడియెన్స్ ను ఆకట్టుకున్న ఢిల్లీ డాల్ కృతిసనన్. నెక్స్ ట్ మూవీ యువసామ్రాట్ నాగచైతన్యతో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. నాగచైతన్య, కృతిసనన్ జంటగా సుధీర్ వర్మ దర్శకత్వంలో బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మించిన చిత్రం దోచేయ్. సినిమా ఏప్రిల్ 24న విడుదలవుతుంది. ఈ సందర్భంగా హీరోయిన్ కృతిసనన్ తో ఇంటర్వ్యూ....

దోచెయ్ సినిమాలో మీ పాత్ర ఎలా ఉంటుంది?
- ఇందులో నా పాత్ర పేరు మీరా. మెడికల్ స్టూడెంట్ గా కనిపిస్తా. చాలా డిఫరెంట్ రోల్. మెడికో అనగానే బుద్ధిగా చదువుకునే పాత్ర అనుకునేరు. ఏమాత్రం బిడియం, సిగ్గు వంటి లక్షణాలు లేని టామ్ బాయ్ క్యారెక్టర్.

అంటే మీ రియల్ లైఫ్ కి దగ్గరగా ఉంటుందా?
- లేదండీ నేను నా రియల్ లైఫ్ లో నేను చాలా ఓబిడియెంట్ గా ఉంటాను. కాకపోతే మెంటల్లీ బాగా స్ట్రాంగ్. పంజాబీ అమ్మాయిలు బేసిగ్గా స్ట్రాంగ్ గానే ఉంటారు. నేనూ అంతే.

అంటే దేనికీ భయపడే తత్వం కాదన్నమాట?
- ప్రత్యేకించి భయపడటం అంటూ ఏమీ ఉండదు. కాకపోత నాకో బలహీనత ఉంది. చుట్టూ ఎంత మంది ఉన్నా ఏడుపును కంట్రోల్ చేసుకోలేను. గట్టిగా ఏడ్చేస్తాను. మనిషి స్ట్రెస్ రిలీఫ్ పొందడం కోసం దేవుడిచ్చిన గొప్ప వరం ఏడుపు అని నా ఫీలింగ్.

ఇంతకీ గాసిప్స్ ను చూసుకుని ఇలా బాధపడ్డ సందర్భాలున్నాయా?
- అబ్బే లేదండీ. ఈ ప్రొఫెషన్, గాసిఫ్పులు అక్కాచెల్లెళ్లు. పాపం వాటి గురించి ఆలోచించడం ఎందుకు? వాటి పని వాటిది. నా పని నాది. వంద గాసిప్పులు వినిపిస్తే అందులో ఏ పదో నా వరకు వస్తాయి.

ఈ మధ్య కాలంలో మీ గురించి అలా వచ్చిన గాసిప్ ఏదైనా ఉందా?
- రకరకాలుగా ఉంటాయి. నేను పట్టించుకోను. ఒకవేళ నిజంగా ఎవరైనా నా కెరీర్ కి ఉపయోగపడే విషయాల్ని సూచిస్తూ గాసిప్స్ రాస్తే... అందులో నేను మారాల్సినట్టు ఏమైనా అనిపిస్తే, నన్ను నేను మార్చుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను.

ఇంతకీ దోచెయ్ టైటిల్ జస్టిఫికేషన్...
- దోచేయ్ అంటే కొల్లగొట్టడం అని అందరికీ తెలుసు. అసలేం కొల్లగొడతాం అనేది సినిమా చూస్తే తెలుస్తుంది.

నాగచైతన్యతో కెమిస్ట్రీ ఎలా ఉంది?
- సూపర్బ్ కోస్టార్ ఛెయ్. ఇద్దరం దాదాపు ఒకే వయసు వాళ్లం కాబట్టి ఫ్రెండ్లీగా ఉండేవాడు. కానీ టెస్ట్ షూట్ సమయంలో తను నాతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. షూటింగ్ మొదలయ్యాక ఫ్రెండ్సయ్యాం. స్క్రీన్ మీద ఆ కెమిస్ట్రీ కనిపిస్తుంది. తన సీనియారిటీని ఎక్కడా చూపించడు. స్పాంటేనియస్ యాక్టర్.

దోచెయ్ హైలైట్స్ ఏంటి?
- ఫన్ ఎంటర్ టైనింగ్ సినిమా. డైరక్ట్ థ్రిల్లర్ కాదు కానీ అలాంటి సన్నివేశాలే ఉంటాయి. లవ్, కామెడీ, ఎమోషన్స్ హైలైట్. పాటలు బావున్నాయని ఇప్పటికే టాక్ వచ్చింది. రొటీన్ కి దూరంగా ఉంటుంది.

మీ దర్శకుడి గురించి చెప్పండి?
- సుధీర్ లో మంచి క్లారిటీ ఉంటుంది. డైరక్టర్ కి కావాల్సిన ప్రాథమిక లక్షణం అది. ఎక్కువ టేక్స్ తీసుకోడు. తనదైన వేలో వెళ్తుంటాడు. తనకేం కావాలో తెలిసిన పర్ఫెక్ట్ డైరక్టర్.

తెలుగులో ఇప్పటికి రెండు సినిమాలు చేశారు. ఏ కేరక్టర్ బెస్ట్ అనిపించింది?
- దేనికదే ప్రత్యేకమైనది. అందులో నేను చేసిన సమీర పాత్రకి, ఇందులో నేను చేసిన మీరా పాత్రకి చాలా వేరియేషన్ ఉంటుంది. సినిమా చూస్తే ఆ విషయం నిజమేనని అర్థమవుతుంది.

తెలుగులో ఇంకేమైనా సినిమాలు చేస్తున్నారా?
- లేదండీ. ఇంకా సంతకం చేయలేదు. హిందీలో మాత్రం రెండు సినిమాలున్నాయి.

నాజూగ్గా ఉన్నారు. మీ డైట్ మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది?
- అందరు పంజాబీల్లాగానే నేనూ ఫుడ్ లవర్ ని. బటర్ చికెన్ అంటే ప్రాణం . కాకపోతే నా అదృష్టం ఏమిటంటే నేను ఎంత తిన్నా ఇలాగే సన్నగా ఉంటాను. ఈ మధ్య వెయిట్ లిఫ్టింగ్ కూడా చేస్తున్నా. ఎవరికైనా ఫిట్ నెస్ మెయిన్ అనేది నా ఫీలింగ్.

 


Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved