pizza
KS Ravindra interview (Telugu) about Jai Lava Kusa
ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చింది ఎన్టీఆర్‌గారే - కె.ఎస్‌.బాబీ
You are at idlebrain.com > news today >
Follow Us

23 September 2017
Hyderabad

ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చింది ఎన్టీఆర్‌గారే - కె.ఎస్‌.బాబీ

 


యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్‌, నివేదా థామ‌స్‌, రాశిఖ‌న్నా హీరో హీరోయిన్లుగా నంద‌మూరి తార‌క రామారావు ఆర్ట్స్ బేన‌ర్‌పై రూపొందిన చిత్రం `జై ల‌వ‌కుశ‌`. కె.ఎస్‌.ర‌వీంద్ర‌(బాబి) ద‌ర్శ‌కుడు. నంద‌మూరి క‌ల్యాణ్‌రామ్ నిర్మాత‌. సెప్టెంబ‌ర్ 21న సినిమా విడుద‌లైంది. ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు కె.ఎస్‌.బాబీతో ఇంట‌ర్వ్యూ...ఎప్ప‌టి నుండో క‌థ ఉంది...

- `జైల‌వకుశ‌` 30 నిమిషాల సినిమా క‌థ ఎప్ప‌టి నుండో నా ద‌గ్గ‌ర 5-6 ఏళ్ల‌గా ఉంది. ముగ్గురు అన్న‌ద‌మ్ముల క‌థ‌. అనుకుంటున్న స‌మయంలో ఎన్టీఆర్‌గారిని క‌లిసి క‌థ చెప్ప‌గానే, ఆయ‌న ఒక‌వారం టైం అడిగారు. అయితే నేను క‌థ చెప్పే స‌మ‌యంలో ఆయ‌న రియాక్ష‌న్స్ చూసి ఆయ‌న ఇంప్రెస్ అయ్యార‌ని నాకు అర్థ‌మైంది. ఒక వారం త‌ర్వాత న‌న్ను పిలిచి సినిమా చేస్తున్నాం బాబీ. వెంట‌నే స్టార్ట్ చేసేద్దాం అన్నారు. ఆ డిస్క‌ష‌న్ ఎప్పుడూ రాలేదు...

- సినిమాలో ఒక ఎన్టీఆర్ పాత్ర నెగ‌టివ్ ట‌చ్‌లో ఉంటుంది. మ‌రో రెండు పాత్ర‌ల్లో వేరే హీరోలుంటే ఆలోచించేవారం. కానీ మూడు పాత్ర‌లు ఎన్టీఆర్‌గారే చేయ‌డం వ‌ల్ల డిస్క‌ష‌న్ ఎప్పుడూ రాలేదు. అదే చేసుంటే సాధార‌ణ సినిమా అయ్యేది...

- క్లైమాక్స్ గురించి నేను, తార‌క్‌గారు, క‌ల్యాణ్‌రామ్‌గారు బాగానే డిస్క‌స్ చేసుకున్నాం. క్లైమాక్స్ విన్న ద‌గ్గ‌ర నుండి తార‌క్‌గారు చాలా పాజిటివ్‌గానే ఉండేవారు. అనుకున్న‌ట్లుగానే క్లైమాక్స్‌ను తీశాం. జై అనే క్యారెక్ట‌ర్‌ను చంప‌కుండా అలాగే తీసుంటే సాధార‌ణ‌మైన సినిమా అయిపోయేది. ఈరోజు సినిమా చూసిన ప్రేక్ష‌కుడికి జై పాత్ర గుర్తుకు వ‌స్తుందంటే కార‌ణం, పాత్ర తీరు తెన్నులు, క్లైమాక్స్‌. ఎన్టీఆర్ ఎగ్జ‌యిట్ అయ్యారు...

- ముగ్గురు అన్న‌ద‌మ్ముల మ‌ధ్య వ‌చ్చే నాట‌కం సీన్, ముందు క‌థ చెప్పినప్పుడు లేదు. అయితే కథ డిస్క‌ష‌న్ చేస్తున్న‌ప్పుడు నేను ఎన్టీఆర్‌గారిని క‌లిశాను. ఆ స‌మ‌యంలో క‌ల్యాణ్‌రామ్‌, హ‌రిగారు కూడా ఉన్నారు. నాట‌కాల కార‌ణంగా చిన్న‌ప్పుడు విడిపోయిన అన్న‌ద‌మ్ములు పెద్ద‌యిన త‌ర్వాత అవే నాట‌కాల ద్వారా క‌లుసుకుంటే బావుంటుంద‌ని క‌దా అన్నాను. వారికి న‌చ్చ‌డంతో ఎన్టీఆర్‌గారు ఎగ్జ‌యిట్ అయ్యి అలాగే చేద్దామ‌ని అన్నారు. ఆయ‌న లీన‌మైపోయారు....

- మూడు రోల్స్‌ను తార‌క్‌గారు ఓన్ చేసుకుని చేయ‌డంతో స్క్రిప్ట్ ద‌శ‌లో ఉన్న క‌ష్టం మేకింగ్ స‌మ‌యంలో లేదు. మేకింగ్‌లో హండ్రెడ్ ప‌ర్సెంట్ ఈజీగా చేసేశాను. స్పాట్‌లో నేను, ఛోటా అన్న కానీ, ఎన్టీఆర్‌గారు జై పాత్ర‌లో లీన‌మైన‌తీరుతో పాటు మిగ‌తా పాత్ర‌ల‌ను పండించిన తీరుతో మాకు వ‌ర్క్ సుల‌భ‌మైపోయింది. మూడు పాత్ర‌ల‌ను హ్యాండిల్ చేయ‌గ‌ల‌న‌నే కాన్పిడెన్స్ ఇచ్చింది మాత్రం ఎన్టీఆర్‌గారే. ఆయ‌న అప్రిసియేష‌న్ బెస్ట్‌...

- నేను సినిమా విడుద‌లైన రోజు రాత్రి, ఎన్టీఆర్‌గారింట్లో రాజ‌మౌళిగారిని క‌లిశాను. ఆయ‌న దాదాపు ఆర‌గంట పైగానే ఈ సినిమా గురించి మాట్లాడారు. నేను ముందుగా, సినిమాలో జై పాత్ర‌కే ఎక్కువ ప్రాముఖ్య‌త ఉంటుంద‌ని అనుకున్నాను. కానీ ల‌వ‌, కుశ పాత్ర‌ల‌కు కూడా మంచి ఇంపార్టెన్స్ క‌న‌ప‌డింది. ఓ రైట‌ర్‌గా, డైరెక్ట‌ర్‌గా ఈ విష‌యంలో స‌క్సెస్ అయ్యార‌ని అప్రిసియేట్ చేశారు. ఛైల్డ్ ఎపిసోడ్ బాగుంది అన్నారు. ఆయ‌న అప్రిసియేష‌న్ నాకు బెస్ట్. ఎన్టీఆర్ వ‌ల్లే...

-ఎన్టీఆర్‌గారిలాంటి బెస్ట్ యాక్ట‌ర్ దొరికాడు కాబ‌ట్టి `జై ల‌వ‌కుశ` వంటి బిగ్ స్పాన్ మూవీ చేయ‌డం సుల‌భ‌మైంది. లేకుంటే ఆరు నెల‌ల్లో ఇలాంటి సినిమా చేయ‌డం క‌ష్ట‌మ‌య్యేది. త‌దుప‌రి చిత్రం...- ఇంకా ఏ సినిమా చేయాలో నిర్ణ‌యించుకోలేదు. మ‌రో రెండు నెల‌ల వ‌ర‌కు గ్యాప్ తీసుకోవాల‌ని అనుకుంటున్నాను.

 

 

 

interview gallery

 

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved