pizza
KV Guhan interview (Telugu) about 118
జర్నలిస్ట్‌లకు ఉన్న పవర్‌ ఏంటో తెలుసు - కె.వి.గుహ‌న్‌
You are at idlebrain.com > news today >
Follow Us

6 March 2019
Hyderabad

ఎన్నో సూపర్‌డూపర్‌ హిట్‌ చిత్రాలకు ఫొటోగ్రఫీ బాధ్యతలు నిర్వహించిన కె.వి. గుహన్‌.. రీసెంట్‌గా డేరింగ్‌ హీరో నందమూరి కల్యాణ్‌రామ్‌ హీరోగా యంగ్‌ ప్రొడ్యూసర్‌ మహేశ్‌ ఎస్‌. కోనేరు నిర్మించిన '118' సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు దర్శకుడిగా పరిచయమై సూపర్‌హిట్‌ సాధించారు. మార్చి 1న వరల్డ్‌వైడ్‌గా విడుదలై సక్సెస్‌ సాధించిన నేపథ్యంలో దర్శకుడు కె.వి. గుహన్‌తో ఇంటర్వ్యూ...

ఎన్నో సూపర్‌హిట్‌ చిత్రాలకు సినిమాటోగ్రఫీ అందించిన మీరు దర్శకుడిగా తొలి చిత్రంతోనే సక్సెస్‌ అవడం ఎలా అన్పిస్తోంది?
- సినిమా రిలీజైన మొదటిరోజు మంచి పాజిటివ్‌ రివ్యూస్‌తో నా రోజు ప్రారంభమైంది. సంతోషంతో పాటు ఎమోషనల్‌గా ఫీలయ్యాను. నాకు తొలిసారి కూతురు పుట్టినప్పుడు ఎంతగా ఎగ్జయిట్‌ అయ్యానో అంతే ఎగ్జయిట్‌గా, హ్యాపీగా ఫీలయ్యాను. 18 సంవత్సరాల నా డ్రీమ్‌ '118' సక్సెస్‌తో తీరింది.

దర్శకుడు అవ్వాలన్న థాట్‌ ఎలా వచ్చింది?
- సినిమా పట్ల ఉన్న ప్యాషన్‌తో నేను ఇండస్ట్రీకి వచ్చాను. సినిమాలకి దగ్గరగా ఉండాలని నేను ఈ ప్రొఫెషనల్‌కి వచ్చి ఎంతోమంది స్టార్‌ డైరెక్టర్‌లతో పని చేయడం జరిగింది. వారందరి ఇన్‌స్పిరేషన్‌తో దర్శకుడు అవ్వాలని నిర్ణయించుకున్నాను.

మీరింతవరకు కల్యాణ్‌రామ్‌తో వర్క్‌ చేయలేదు కదా! ఆయన్ని హీరోగా తీసుకోవాలని ఎందుకన్పించింది?
- యాక్చ్యువల్‌గా కల్యాణ్‌రామ్‌ని ఈ సినిమా ముందు కలవలేదు. ఓ సందర్భంలో పి.సి.గారిని కలిసినప్పుడు కల్యాణ్‌రామ్‌గారిని చూడటం జరిగింది. కల్యాణ్‌రామ్‌ 'అతనొక్కడే'లో చేసిన పెర్‌ఫార్మెన్స్‌ నాకిప్పటికీ గుర్తుంది. తను లుక్స్‌పరంగా ఛేంజోవర్‌గా కన్పించారు. అప్పుడు ఈ సినిమా ఐడియా గురించి తనకి చెప్పడం జరిగింది. ఆయనకి ఐడియా బాగా నచ్చడంతో మరుసటి రోజు పూర్తి స్క్రిప్ట్‌ నేరేట్‌ చేయమని చెప్పారు. దాంతో 2 గంటలు నేరేషన్‌ ఇవ్వడం జరిగింది. అలా మేజికల్‌గా ఈ సినిమా సెట్స్‌కి వచ్చింది.

ఈ సినిమా మీ నిజ జీవితంలో జరిగిన ఇన్సిడెంట్స్‌ ఆధారంగా ఈ స్టోరి రాశారు అని చెప్పారు కదా?
- బేసిక్‌గానే నాకు విశాలమైన ప్రదేశాల్లో ఒంటరిగా ఉండాలంటే భయం. ఒకరోజు నా ప్రొఫెషన్‌ నిమిత్తం ఒక హోటల్‌ గదిలో బస చేయాల్సి వచ్చింది. ఆ రోజు నిద్రలో ఉండగా.. కలలో ఒక స్టోరి జరుగుతోంది. ఆ స్టోరిలో ఒక అమ్మాయికి జరిగిన క్రైమ్‌ సంఘటనలకు సంబంధించిన డ్రామా కన్పించింది. అప్పుడు కొద్దిగా భయం వేసింది. తర్వాత ఆ సంఘటనను మర్చిపోయాను. అదే హోటల్‌లో కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ బస చేశాను. అప్పుడు అదే అమ్మాయికి సంబంధించి ఒక సిబిఐ ఆఫీసర్‌ నన్ను ఇంటరాగేషన్‌ చేస్తున్నట్లు మళ్ళీ కల వచ్చింది. ఆ ఇన్సిడెంట్‌ని నేను నిజ జీవితంలో ఫేస్‌ చేయలేదు. కానీ ఫేస్‌ చేస్తే ఎలా ఉంటుంది? ఏం జరుగుతుంది? ఫిక్షనల్‌ పాయింట్‌ని బేస్‌ చేసుకొని ఈ కథను రాశాను.

హీరోని పోలీస్‌ ఆఫీసర్‌గా కాకుండా జర్నలిస్ట్‌గా ఎందుకు చూపించారు?
- నేను చెన్నైలో ఒక రీసెర్చ్‌ చేస్తుండగా జర్నలిస్ట్‌లకి, పోలీస్‌లకి ఉండే రిలేషన్‌ షిప్‌ గురించి తెలుసుకోవడం జరిగింది. నాకు నిజ జీవితంలో కూడా జర్నలిస్ట్‌లకు ఉన్న పవర్‌ ఏంటో తెలుసు కాబట్టి హీరోని ఇన్‌వెస్టిగేటివ్‌ జర్నలిస్ట్‌గా చూపించాం.

మీరు వర్క్‌ చేసిన దర్శకుల నుండి ఎలాంటి రెస్పాన్స్‌ వచ్చింది?
- చాలామంది దర్శకుల నుండి మంచి ప్రశంసలు వచ్చాయి. సినిమాకి వస్తున్న రెస్పాన్స్‌, రివ్యూస్‌ పట్ల వాళ్ళు చాలా పాజిటివ్‌గా రియాక్ట్‌ అయ్యి నన్ను అభినందించడం నేనెప్పటికీ మర్చిపోలేను.

కల్యాణ్‌రామ్‌తో వర్క్‌ చేయడం పట్ల?
- కల్యాణ్‌రామ్‌ చాలా డెడికేటెడ్‌ పర్సన్‌. సచ్‌ ఎ యాక్టివ్‌ అండ్‌ స్వీట్‌ పర్సన్‌. ప్రతి ఒక్కరి పట్ల చాలా మర్యాదగా ఉంటారు. సినిమా పట్ల ఏదైనా ఐడియాలు వస్తే దాన్ని రిక్వెస్ట్‌గానే తెలియజేస్తారు. అంత పొలైట్‌ పర్సన్‌తో సినిమా తీయడం చాలా ఆనందంగా ఫీలవుతున్నా. ఆయన ఇంకా మంచి స్థాయికి చేరుకోవాలని కోరుకుంటున్నాను.

నిర్మాత మహేశ్‌ కోనేరు గురించి?
- ఆయన చాలా మంచి రీడర్‌. నవలలు ఎక్కువగా చదువుతుంటారు. అందుకనే ఆయనకు స్టోరి చెప్పగానే వెంటనే అర్థం చేసుకొని నిర్మాతగా ముందుకొచ్చారు. సినిమాకి చాలా సపోర్ట్‌ చేశారు. నిర్మాతగా ఆయన మరెన్నో సూపర్‌హిట్‌ సినిమాలు నిర్మించాలి.

మ్యూజిక్‌ డైరెక్టర్‌ శేఖర్‌ చంద్ర గురించి?
- ఈ సినిమాకి శేఖర్‌ చంద్ర ఒక గిఫ్ట్‌. తన వర్క్‌ పరంగా ఎంతో ప్యాషనేట్‌గా ఉంటారు. డెడికేటెడ్‌ పర్సన్‌. ఎలాంటి సంగీతం కావాలన్నా ఇస్తాడు. ఎప్పుడూ బెటర్‌ సంగీతం ఇవ్వటానికి ప్రాధాన్యత ఇస్తారు.

నివేదా థామస్‌ గురించి?
- తన ప్రతి డైలాగ్‌ను క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాతనే చెప్తుంది. ఆమెకు తెలియని విషయాలు చెప్తూనే నేను ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నాను. వర్క్‌ పట్ల చాలా డెడికేటెడ్‌గా ఉంటుంది. ఈ సినిమాలో తన క్యారెక్టర్‌కి పూర్తి న్యాయం చేసింది.

చాలా రోజుల తర్వాత తమిళంలో చేస్తున్నారు? దాని గురించి చెప్పండి?
- నా సోదరుడు శరణ్‌ దర్శకత్వంలో ఒక హర్రర్‌ మూవీకి సినిమాటోగ్రాఫర్‌గా చేస్తున్నా. అది చాలా కొత్తదనంతో కూడుకున్న కాంపాక్ట్‌ మూవీ.

తెలుగులో దర్శకుడిగా కంటిన్యూ అవుతారా?
- తెలుగులో దర్శకుడిగా కంటిన్యూ చేయాలనుకుంటున్నా. రెండు, మూడు ఐడియాస్‌ ఉన్నాయి.. వాటి మీద వర్క్‌ చేయాలి.. అంటూ ఇంటర్వ్యూ ముగించారు దర్శకుడు కే.వి. గుహన్‌.Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved