pizza
Lagadapati Sridhar interview (Telugu) about Naa Peru Surya
`నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా` ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ ప‌రంగా.. నెంబ‌ర్స్ ప‌రంగా సినిమా బెంచ్ మార్క్ మూవీ అవుతుంది - ల‌గ‌డ‌పాటి శ్రీధ‌ర్‌
You are at idlebrain.com > news today >
Follow Us

24 April 2018
Hyderabad

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అను ఇమ్మాన్యుయేల్ జంట‌గా వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న చిత్రం “నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా”. కె. నాగబాబు సమర్పణలో, రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ బ్యానర్లో శిరీష శ్రీధర్ నిర్మాతగా, బన్నీ వాసు సహ నిర్మాతగా ఈ చిత్రం నిర్మిస్తున్నారు. మే 4న సినిమా విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా నిర్మాత ల‌గ‌డ‌పాటి శ్రీధ‌ర్‌తో ఇంట‌ర్వ్యూ...

మ‌ర‌చిపోలేని ఏడాది...
- నేను చేసే సినిమాలు సెన్సిటివ్‌గా ఉంటాయి. నెక్స్‌ట్ లీగ్‌లోకి వెళ్లాల‌నుకుంటున్న త‌రుణంలో బ‌న్ని న‌న్ను పిలిచి నేనొక క‌థ విన్నాను. మీరు చేస్తే బావుంటుంద‌ని అన్నాడు. ఆక‌లి వేసిన‌ప్ప‌డు అమ్మ కూడా అడిగితేనే పెడుతుంద‌ని అంటుంటారు. అలాంటిది ఎంతో టాలెంట్ ఉండి.. నాకుంతో ఇష్ట‌మైన హీరో బ‌న్ని పిలిచి అవకాశం ఇవ్వ‌డ‌మ‌నేది చాలా ఆనంద‌మేసింది. ఈ ఏడాది ఓ నిర్మాత‌గా మ‌ర‌చిపోలేను.

కోరిక‌ల ఫ‌లిత‌మే...
- ఎన్టీఆర్‌గారు, చిరంజీవిగారు త‌ర్వాత నాకు టాలెంట్ ప‌రంగా ఇష్టమైన ఈ త‌రం హీరో బ‌న్నీయే. నాకు సినిమాల ప‌ట్ల ఉన్న క‌మిట్‌మెంట్‌కి, ఇంట్రెస్ట్‌కి.. బ‌న్నికి ఉన్న టాలెంట్‌, క‌మిట్‌మెంట్‌కి మీ కాంబినేష‌న్‌లో సినిమా వ‌స్తే బావుంటుంద‌ని చాలా మంది అన్నారు. నేను కూడా బ‌లంగా కోరుకున్నాను. అంద‌రి కోరిక‌ల ఫ‌లిత‌మే ఈ సినిమా అని భావిస్తున్నాను.

ఎప్పుడో ఇచ్చిన మాట‌...
- ఓ పార్టీలో నేను, బ‌న్ని క‌లిసిన‌ప్పుడు `నిర్మాత‌గా మీరంటే నాకు ఎంతో ఇష్ట‌మండి` అని బన్ని అన్నప్పుడు.. `ఏం లాభ‌మండి, మీ లాంటి స్టార్ హీరోలు మాతో సినిమాలు చేయ‌డం లేదు క‌దా!` అని నేను అన్నాను. అప్పుడు బ‌న్ని `నేను త‌ప్ప‌కుండా మీతో సినిమా చేస్తాను` అని బ‌న్ని ఆరోజు అన్నాడు. త‌ను ఏదో మాట వ‌రుస‌కి ఆ మాట అన్నాడ‌ని నేను అనుకున్నాను. కానీ ప‌దేళ్ల త‌ర్వాత బ‌న్ని న‌న్ను పిలిచి, క‌లిసి సినిమా చేద్దామ‌ని అన‌గానే ఎంతో ఆనంద‌మేసింది.

అప్పుడే న‌మ్మ‌కం వ‌చ్చేస్తుంది..
- సినిమాలో నాలుగో వంతు పూర్తి కాగానే.. ప్రేక్ష‌కుల‌కు సినిమా పెద్ద హిట్ మూవీ అని అర్థ‌మవుతుంది. అందులో సందేహం లేదు. క‌థ విన‌గానే .. క్యారెక్ట‌ర్‌లో చాలా క్లారిటీ ఉంది. బ‌న్ని మాత్ర‌మే చేయ‌గ‌ల పాత్ర అనిపించింది. రేపు సినిమా విడుద‌లైన త‌ర్వాత ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ ప‌రంగా.. నెంబ‌ర్స్ ప‌రంగా సినిమా బెంచ్ మార్క్ మూవీ అవుతుంది. సినిమా గురించి అంద‌రూ చెప్పుకునేంత మంచిగా ఉంటుంది

బ‌న్ని ప‌డ్డ క‌ష్టం...
- అల్లు అర్జున్ ఇందులో ఆర్మీ ఆఫీస‌ర్‌గా క‌న‌ప‌డ‌తారు. సాధార‌ణంగా ఫిట్‌నెస్ ఫ్రీక్‌గా ఉండే బ‌న్ని ఈ సినిమాలో స‌రికొత్త లుక్ కోసం ఇంకా బాగా క‌ష్ట‌ప‌డ్డారు. పోస్ట‌ర్‌లో ఆయ‌న లుక్ చూడ‌గానే అర్థ‌మ‌వుతుంది. అలాగే హెయిర్ స్టైల్ ప‌రంగా కూడా కొత్త‌గా ఉంటారు బ‌న్ని. ఇలాంటి లార్జ‌ర్ దేన్ లైఫ్ చిత్రాల‌ను సినిమా థియేట‌ర్స్‌లో చూసి ఎంజాయ్ చేయాల్సిందే.

interview galleryఅందుకే ఆ నిర్ణ‌యం..
- మిల‌టరీ మాధ‌వ‌రం ఊర్లో ప్ర‌తి గ‌డ‌ప నుండి దేశానికి సేవ చేసే సైనికుడు ఉన్నాడు. దేశం నీకేమిచ్చింద‌ని కాకుండా.. నువ్వు దేశానికి ఏమిచ్చావు అని ఓ అమెరిక‌న్ ప్రెసిడెంట్ అన్న స్ఫూర్తితో ఉన్న మాధ‌వరం గురించి తెలియ‌గానే.. మా సినిమా ఆడియో వేడుక‌ను అక్క‌డే నిర్వ‌హించాల‌ని అనుకుని.. అభిమానుల స‌మ‌క్షంలో ఆడియో విడుద‌ల చేశాం. సినిమా పూర్తి మిల‌ట‌రీ నేప‌థ్యంలో కాకుండా, ఇందులో హీరో క్యారెక్ట‌ర్ చాలా కోపంతో క‌న‌ప‌డుతుంటుంది. అలాంటి హీరో ఏదో చేయాల‌ని చేసే జ‌ర్నీలో అత‌నికి ఎలాంటి ఇబ్బందులు ఎదుర‌య్యాయ‌నేదే సినిమా.

మ్యూజిక్ గురించి...
- బ‌న్నితో సినిమా చేయాల‌నుకున్నాం. అది కూడా మిల‌ట‌రీ నేప‌థ్యం కాబ‌ట్టి తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో విడుద‌ల చేయాల‌ని అనుకున్నాం. అంతే కాకుండా బ‌న్ని యూ ట్యూబ్ సూప‌ర్‌స్టార్‌. ఆయ‌న న‌టించిన చిత్రాల‌న్నింటిని ఇప్ప‌టి వ‌ర‌కు కోట్ల మంది చూసి ఉన్నారు. ఇలాంటి ప్యాన్ ఇండియా మూవీకి బాలీవుడ్ రేంజ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అయితే బావుంటుంద‌నిపించింది. ప్రీత‌మ్‌, విశాల్ శేఖ‌ర్‌, అమిత్ త్రివేది పేర్లు ప‌రిశీలించాం. విశాల్‌శేఖ‌ర్ అయితే బావుంటుంద‌ని అనుకుని వారిని సంప్ర‌దించాం. వారికి కూడా కథ న‌చ్చ‌డంతో మ్యూజిక్ చేయ‌డానికి అంగీక‌రించారు.

క‌థ‌ కూడా విన‌లేదు...
- నేను ఇప్ప‌టి వ‌ర‌కు సెన్సిబుల్ మూవీస్ మాత్ర‌మే చేశాను. ఎంట‌ర్‌టైన్‌మెంట్‌కు ఎక్క‌డో దూర‌మ‌య్యాన‌నే భావ‌న ఉండేది. అలాంటి స‌మ‌యంలో బ‌న్ని సినిమా చేద్దాం. నేను క‌థ విన్నాను అన‌గానే త‌న‌పై న‌మ్మ‌కంతో (అప్ప‌టికే బ‌న్ని `స‌రైనోడు` సినిమా విడుద‌లై బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ కావ‌డంతో) నేను ముందు క‌థ కూడా విన‌లేదు. చివర్లో అంద‌రికీ చెక్కులు ఇచ్చేట‌ప్పుడు డైరెక్ట‌ర్‌గారిని క‌థ చెప్ప‌మ‌న్నాను. ఆయ‌న చెప్పిన త‌ర్వాత చాలా డిఫ‌రెంట్‌గా ఉంద‌ని అనిపించింది. క‌థ‌, క‌థ‌నం ప‌రంగా ఈ సినిమా అంద‌రూ గ‌ర్వించేలా ఉంటుంది.

హిందీలో ఆల‌స్యం...
- సినిమా హిందీ అనువాదం ఆల‌స్యం కావ‌డంతో హిందీలో సినిమాను రెండు వారాలు ఆల‌స్యంగా విడుద‌ల చేస్తున్నాం. తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళంలో మేనే సినిమాను విడుద‌ల చేస్తున్నాం.

ప్రీ రిలీజ్ వేడుక గురించి...
- ఈ నెల 29న గ‌చ్చిబౌలి స్టేడియంలో ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌ను నిర్వ‌హిస్తున్నాం. రామ‌చ‌ర‌ణ్ ఈ ఫంక్ష‌న్‌కి రామ్‌చ‌ర‌ణ్ చీఫ్ గెస్ట్‌గా వ‌స్తున్నారు. చ‌ర‌ణ్ న‌టించిన `రంగ‌స్థ‌లం` స‌క్సెస్‌ను అభినందించ‌డానికి ఆయ‌న్ను క‌ల‌వ‌డానికి వెళ్లిన‌ప్పుడు చిరంజీవిగారిని క‌లిశాను. ఆయ‌న సినిమా బాగా వ‌స్తుంద‌ని విన్నాన‌ని నాతో అన్నారు. ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌కి ఆయ‌న్ను చీఫ్ గెస్ట్‌గా రమ్మ‌ని పిలిచాను. కానీ ఆయ‌న అమెరికాకు వెళుతుండ‌టంతో చ‌ర‌ణ్‌గారు వ‌స్తాన‌ని అన్నారు.

వారే కార‌ణం...
- సినిమా ఇంత బాగా రావ‌డానికి కో ప్రొడ్యూస‌ర్ బ‌న్నీ వాసు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ బాబులే కార‌ణం. ఇంత పెద్ద సినిమా చేస్తున్న‌ప్పుడు ఎక్క‌డా ఏ స‌మ‌స్య లేకుండా చూసుకున్నారు.

త‌దుప‌రి చిత్రాలు...
- నెక్ట్స్ కూడా బ‌న్నీతో సినిమా చేయాల‌ని ఉంది. అలాగే చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌, మ‌హేశ్‌, చైత‌న్య స‌హా అంద‌రి హీరోల‌ను సినిమా చేయ‌డానికి సంప్ర‌దిస్తున్నాను. ఇవి కాకుండా.. `ఎవ‌డిగోల‌వాడిదే 2` క‌థ సిద్ధ‌మైంది. అలాగే లేడీ హీరోయిన్ ప్ర‌ధాన పాత్ర‌ధారిగా `స్టైల్ 2` చేయాల‌నుకుంటున్నాను. స్టైల్ 2 కోసం సాయిప‌ల్ల‌వి అయితే బావుంటుంద‌నిపించింది. ఆమెను సంప్ర‌దించే ప‌నిలో ఉన్నాం.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved