pizza

Lakshmi Bhupal interview (Telugu) about Oh Baby
‘ఓ బేబీ’ రచయితగా నా విజయాన్ని అమ్మ, అమ్మమ్మకు అంకితమిస్తున్నా! – మాటల రచయిత లక్ష్మీ భూపాల్‌

You are at idlebrain.com > news today >
Follow Us

15 July 2019
Hyderabad

As a writer, I am dedicating the success of 'Oh Baby' to my mother, grandma: Writer Lakshmi Bhoopal

Lakshmi Bhoopal has made a name for himself in the Telugu film industry as the dialogue writer of such films as 'Chandamama', 'Ala Modalaindi', 'Mahatma', 'Terror', 'Nene Raju Nene Mantri' and 'Kalyana Vaibhogame'. 'Oh Baby', starring Samantha Akkineni, is his most recent success. This is also the year when Lakshmi Bhoopal has completed 15 years of being in the industry. Marking the special occasion, the talented writer has given an interview to the media.

You usually stay away from the media. What is the reason behind this special interview?
After the release of 'Oh Baby', the audience, as well as critics, are talking not just about Samantha's performance and Nandini Reddy's direction but also about my dialogues. No less a person than 'Sirivennela' Sitharamasastry garu recently called me up and spoke with me for 30 minutes. Producer KS Rama Rao garu gave special appreciation. I am getting so many calls from the people in the industry as well as from the audience. I want to say thanks to everyone through this interview.

In what way is the success of 'Oh Baby' special to you?
It has been 15 years since I entered the film industry. I have worked on 50-60 movies. 'Oh Baby' has given me the utmost satisfaction. I am very happy that the dialogues have been talked about as praiseworthy. At a personal level, I have totally loved the movie. My father passed away when I was a child. I was brought up by my mother and grandmother. That's why the story of 'Oh Baby' was so very much relatable to me. I have put the words of my mother and grandmother into Baby's mouth in this film. I have heard the line 'Mogallandariki mogudila bathika' spoken by Lakshmi garu's character from my grandmother some 150 times. That's why I am dedicating this success to the two women in my life - my mother and grandmother.

What did your mother say after watching the movie?
I was by her side as she watched 'Oh Baby'. She kept on looking at me during some of the scenes. For example, she liked the scene where Lakshmi garu's character talks about the taste of the fish 'pulusu' just by smelling it. There are many such scenes that my mother totally loved.

The film has got a number of strong lines as well. How are the men receiving them?
I wrote this line keeping in view the increasing number of sexual abuses in our society: 'Molathaduki, mokaliki madhya kovvu perigipoyi kottukuntunnaru'. This is said about Naga Shaurya's character by Samantha's character. But it actually reflects the state of so many males in our society. We read about the unspeakable horrors against even infants. The original version of the dialogue was even more potent but I toned it down keeping in view the Censor Board-driven sensibilities.

You have been working at a stretch with the likes of Krishna Vamsi, Nandini Reddy and Satish Kasetty. Isn't it?
I have done three films with each of them. I have worked with so many others. Teja garu's 'Nene Raju Nene Mantri' earned praises for me.

Why haven't you done star movie's heroes despite being a senior writer?
I did get a few opportunities. But somehow they didn't go through. I wrote for Ravi Teja's 'Baladoor'. Maybe, I am not suited to write rhyming dialogues and punch lines. I too want to write for the movies of the likes of Prabhas, Mahesh Babu, NTR, Allu Arjun and Ram Charan. I can write dialogues that suit their superstardom. Writing for movies like Chiranjeevi garu's 'Donga Mogudu' will be special. I am waiting for such offers. I may not have worked on star heroes' movies but I have had the opportunity to do movies for star production houses like Suresh Productions, Vyjayanthi Movies, and Usha Kiran Movies. My first movie 'Soggadu' was bankrolled by Suresh Productions.

When a film flops, to what extent is the writer blamed?
Many films that I have worked on did flop but I never flopped as a writer. Had I failed, I wouldn't be getting so many offers. Every time a film of mine fails, I hike my remuneration by Rs 1 lakh and work with a vengeance.

How is the remuneration of writers these days?
It's good. Hats off to Trivikram Srinivas garu. He has set a parameter for writers. He proved that a writer is qualified to be paid this and this much.

Many writers have turned directors. What about you?
Some writers are turning directors out of frustration. They are angry that many directors fail to give proper shape to their writing. I don't want to become a director out of anger or exasperation. I will wield the megaphone only the day when I feel that only I can do justice to a story.

Do you have any such stories with you?
I have 24 stories with me at present. I have set aside 6 of them for myself. I have readied a story for Satish Kasetty. I am in talks for 2-3 films.

-----------------------------------

Lakshmi Bhoopala Few Movies List

1. Soggadu – 31st march 2005
2. Sambhavami Yuge Yuge – 10th march 2006
3. Seetharamudu – 1st sep 2006
4. Chakri – 20th Nov 2006
5. Amrutha Varsham – 2006
6. Bhookailas – 25th May 2007
7. Chandamama – 19th june 2007 from this film his name is changed as “Lakshmibhoopala” by the creative director “Krishnavamsi” Garu. He wrote a special song in this movie & it’s a first song of “Lakshmibhoopala”.
8. Baladoor – 24th august 2008
9. Sasirekha Parinayam – 1st january 2009
10. Boni – 2009
11. Kalavaramaye Madilo – 17th july 2009
12. Jallu – 29th july 2009
13. Mahatma – 2nd October 2009. He wrote a song in this movie.
14. Ninnu kalisaka – 2nd Oct 2009. He wrote 6 songs in this movie.
15. Marocharitra – 25th march 2010
16. Ala modalaindi – 6th Feb 2010
17. Mr.Nookayya – 8th march 2012
18. Uu kodathara ulikki padathara -27th july 2012
19. Andala Rakshasi – 10th August 2012
20. Back Bench Student – 15th march 2013. He wrote 3 songs in this movie.
21. Prathighatan – 18th April 2014
22. Terror – 26th Feb 2016
23. Kalyana Vaibhogame – 4th March 2016
24. Thuntari – 11th march 2016.
Back to back 3 hits in 3 weeks.
25. Dwaraka – 3rd march 2017
26. Nene Raju Nene Mantri – 11th August 2017. He wrote songs & dialogues for this movie.
27. Vinara Sodara Veerakumara – 15th March 2019. Dialogues & Songs.
28. Sita - 24th May 2019. Dialogues & Songs.
29. Oh Baby - 5th July 2019. Dialouges & Songs.

‘ఓ బేబీ’ రచయితగా నా విజయాన్ని అమ్మ, అమ్మమ్మకు అంకితమిస్తున్నా! – మాటల రచయిత లక్ష్మీ భూపాల్‌

‘చందమామ’, ‘అలా మొదలైంది’, ‘మహాత్మ’, ‘టెర్రర్‌’, ‘నేనే రాజు నేనే మంత్రి’, ‘కల్యాణ వైభోగమే’ చిత్రాలతో మాటల రచయితగా మంచి పేరు తెచ్చుకున్నారు లక్ష్మీ భూపాల్‌. ఇటీవల విడుదలైన ‘ఓ బేబీ’తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. అలాగే, లక్ష్మీ భూపాల్‌ తెలుగు చిత్ర పరిశ్రమలో రచయితగా ప్రవేశించి పదిహేనేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించారు.

- సాధారణంగా మీడియా ముందుకు రాని మీరు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇవ్వడానికి కారణం?
'ఓ బేబీ' విడుదల తర్వాత ప్రేక్షకులు, విమర్శకులు సమంత నటన, నందినీరెడ్డి దర్శకత్వంతో పాటు నేను రాసిన మాటల గురించి ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. 'సిరివెన్నెల' సీతారామశాస్త్రిగారు ఫోన్ చేసి అరగంటకు పైగా మాట్లాడారు. కెఎస్ రామారావుగారు ఫోన్ చేశారు. ఇండస్ట్రీ నుంచి, ప్రేక్షకుల నుంచి ఎన్నో ఫోనులు వచ్చాయి. అందరికీ కృతజ్ఞత తెలపడానికి వచ్చాను.

- 'ఓ బేబీ' విజయం మీకు అంత ప్రత్యేకమా?
నేను తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి పదిహేనేళ్లు పూర్తయ్యాయి. ఒక 50, 60 సినిమాలు చేశా. అందులో కొన్ని విజయాలు ఉన్నాయి. ఇన్నేళ్లలో ఇన్ని సినిమాలు చేసినా రాని శాటిశ్‌ఫ్యాక్ష‌న్‌ 'ఓ బేబీ'కి వచ్చింది. మాటల గురించి ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తుంటే సంతోషంగా ఉంది. వ్యక్తిగతంగానూ సినిమాకు నేను బాగా కనెక్ట్ అయ్యాను. మా నాన్నగారు నా చిన్నతనంలో మరణించారు. అప్పటి నుంచి అమ్మ, అమ్మమ్మ సంరక్షణలో పెరిగాను. అందుకని, సినిమా కథ నాకు మరింత కనెక్ట్ అయింది. ఇందులో బేబీ పాత్రకు రాసిన ప్రతి మాట మా అమ్మ లేదా అమ్మమ్మ అన్న మాటలే. నేను చిన్నతనంలో ఎన్నోసార్లు విన్న మాటలే. ఉదాహరణకు... 'మగాళ్లు అందరికీ మొగుడులా బతికా' అని లక్ష్మిగారు ఒక సన్నివేశంలో డైలాగ్ చెబుతారు. నేనది అమ్మమ్మ నోటి నుంచి 150 సార్లు విని ఉంటాను. అందుకని, 'ఓ బేబీ' మాటల రచయితగా నా విజయాన్ని మా అమ్మ, అమ్మమ్మకు అంకితం ఇస్తున్నాను.

- సినిమా చూశాక, మీ అమ్మగారు ఏమన్నారు?
అమ్మ సినిమా చూసేటప్పుడు నేను పక్కనే కూర్చున్నాను. కొన్ని సన్నివేశాలు వచ్చేటప్పుడు నావైపు చూసేది. ఉదాహరణకు... చేపల పులుసు వాసన చూసి ఉప్పు సరిపోలేదని నేను చెప్పేస్తా. లక్ష్మిగారి పాత్రకు దాన్ని అన్వయిస్తూ సన్నివేశం రాశా. ఇటువంటివి కొన్ని ఉన్నాయి. అమ్మకు సినిమా బాగా నచ్చింది.

- కొన్ని ఘాటైన డైలాగులు కూడా రాశారు. మగాళ్లపై విమర్శ చేసినట్టున్నారు?
'మొలతాడుకి, మోకాలి మధ్య కొవ్వు పెరిగిపోయి కొట్టుకుంటున్నారు' డైలాగ్ గురించేనా? సినిమాలో నాగశౌర్య పాత్రను ఉద్దేశించి సమంతగారు ఆ డైలాగ్ చెప్పారని అనుకుంటున్నారు. సరిగా వింటే అందరినీ ఉద్దేశించి రాసిన డైలాగ్ అని తెలుస్తుంది. ప్రతివారం ఎక్కడో చోట చూస్తున్నాం లేదా వింటున్నాం. తొమ్మిదేళ్ల పాపపై అని, మరొకటి అని. అందుకే, ఆ మాట రాశా. సెన్సార్ వాళ్లకు భయపడి నేను చెప్పాలనుకున్న భావాన్ని పూర్తిగా కాకుండా, కొంచెం సుతిమెత్తగా రాశా. లేదంటే ఇంకా ఘాటుగా రాసేవాణ్ణి.

- కృష్ణవంశీ, నందినిరెడ్డి, సతీష్ కాసెట్టి... వీళ్లతో ఎక్కువ సినిమాలు చేసినట్టున్నారు?
అవును. ఒక్కొక్కరితో మూడేసి సినిమాలు చేశా. ఇంకా చాలామందితో చేశా. తేజగారితో చేసిన 'నేనే రాజు నేనే మంత్రి' మంచి పేరు తెచ్చింది.

- స్టార్ హీరోల సినిమాలకు చేయకపోవడానికి కారణం?
కొన్ని అవకాశాలు వచ్చాయి. కానీ, కుదరలేదు. రవితేజ 'బలాదూర్'కి చేశాను కదా! బహుశా... నేను పంచ్ డైలాగులు, ప్రాసలకు దూరంగా ఉంటాను కనుక అవకాశాలు రాలేదేమో. స్టార్ హీరోలు, దర్శకులు అవకాశాలు ఇవ్వలేదేమో. నాకు ప్రభాస్, మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ సినిమాలు చేయాలని ఉంటుంది. అవకాశం వస్తే... వాళ్ల బాలాలు చూపించేలా డైలాగులు రాయాలని ఉంటుంది. చిరంజీవిగారు 'దొంగ మొగుడు' వంటి సినిమా చేస్తే ఎంత హుషారుగా ఉంటుందో ఆలోచించండి. అవకాశాల కోసం చూస్తున్నాను. స్టార్ హీరోలతో పనిచేయలేదేమో గానీ... స్టార్ ప్రొడక్షన్ హౌసులు సురేష్ ప్రొడక్షన్స్, వైజయంతి మూవీస్, ఉషాకిరణ్ మూవీస్ కి పని చేశా. నా ఫస్ట్ మూవీ 'సోగ్గాడు' సురేష్ ప్రొడక్షన్స్ సినిమా.

- సినిమాలు ప్లాప్ అయితే రైటర్ పై ఎలాంటి ప్రభావం ఉంటుంది?
నేను రైటర్ గా వర్క్ చేసిన సినిమాలు ఫెయిల్ అయ్యాయి. కానీ, రైటర్ గా నేను ఎప్పుడు ఫెయిల్ కాలేదు. ఫెయిల్ అయితే తర్వాత మరో అవకాశం వచ్చేది కాదు కదా. ఫెయిల్యూర్ వచ్చిన ప్రతిసారి నేను లక్ష రూపాయల రెమ్యునరేషన్ పెంచేవాణ్ణి. కసితో రాసేవాణ్ణి.

- ప్రజెంట్ రైటర్స్ రెమ్యునరేషన్ ఎలా ఉంది?
బావుంది. హ్యాట్సాఫ్ టు త్రివిక్రమ్ గారు. ఆయన ఒక ప్యారామీటర్ సెట్ చేశారు. రైటర్ ఇంత తీసుకోవచ్చు, రైటర్ కి ఇంత ఇవ్వొచ్చు అని చూపించారు.

- ఇటీవల రచయితలు దర్శకులుగా మారుతున్నారు. మీరు?
కొందరు రచయితలు ఫ్ర‌స్ట్రేష‌న్‌లో దర్శకులు అవుతున్నారు. తాము రాసినది దర్శకులు సరిగా ఆవిష్కరించడం లేదనే కోపంలో దర్శకులుగా మారుతున్నారు. నేను ఫ్ర‌స్ట్రేష‌న్‌లో, కోపంలో దర్శకుడు కావాలని అనుకోవడం లేదు. నేను మాత్రమే కథకు న్యాయం చేయగలని భావించిన రోజున మెగాఫోన్ పడతా.

- మీ దగ్గర ఎన్ని కథలున్నాయి? అందులో మీరు మాత్రమే న్యాయం చేయగలిగినవి ఎన్ని?
నా దగ్గర మొత్తం 24 కథలున్నాయి. అందులో ఆరు కథలను నా కోసం పక్కన పెట్టుకున్నా. సతీష్ కాసెట్టికి ఒక కథ ఇచ్చాను. అలాగే, రచయితగా రెండు మూడు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి.



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved