pizza
Lakshmi Manchu interview (Telugu) about Lakshmi Bomb
ఆడ‌వాళ్ల‌ను త‌క్కువ చేయొద్ద‌ని చెప్పే `ల‌క్ష్మీబాంబ్‌` - ల‌క్ష్మీ మంచు
You are at idlebrain.com > news today >
Follow Us

07 March 2017
Hyderabad

ల‌క్ష్మీ మంచు న‌టించిన తాజా చిత్రం `ల‌క్ష్మీబాంబు`. ఆమె పేరు మీద వ‌స్తున్న ఈ సినిమాలో జ‌డ్జిగా న‌టించింది. రెండు డైమ‌న్ష‌న్లు ఉన్న పాత్ర‌లో ఆమె న‌టించిన ఈ సినిమా ఈ నెల 10న ప్రేక్ష‌కుల‌ముందుకు రానుంది. కార్తికేయ గోపాల‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా గురించి ల‌క్ష్మీ మంచు హైద‌రాబాద్ లో మంగ‌ళ‌వారం మాట్లాడారు. ఆ విశేషాలు...

* ఈ సినిమా గురించి చెప్పండి?
- నాకు చాలా చాలా చాలా న‌చ్చిన స్క్రిప్ట్ ఇది. మామూలుగా హార‌ర్ థ్రిల్ల‌ర్ జోన‌ర్ స్క్రిప్ట్ లు మామూలుగా వెళ్తుంటాయి. కానీ ఇందులో బ్యూటీఫుల్ ఫ్యామిలీ సెంటిమెంట్‌తో పాటు ఈ రోజు జ‌రిగే విష‌యాల‌తో పాటు అన్నీ ఉన్నాయి. నేను ఎక్క‌డ క‌నిపించినా స్ట్రాంగ్ కాప్‌గా చేస్తే బావుంటుందండీ, లాయ‌ర్‌గా చేస్తే బావుంటుంది అని చాలా మంది అడుగుతుంటారు. డైర‌క్ట‌ర్‌గారు నాకు ఈ క‌థ నెరేట్ చేసిన‌ప్పుడు వెంట‌నే ఓకే చెప్పాను. చాలా ఆస‌క్తిక‌ర‌మైన అంశాలున్ఆన‌యి. సెంటిమెంట్ ప‌రంగా కానీ, పాట‌ల ప‌రంగా కానీ చాలా బ్యూటీఫుల్‌గా వ‌చ్చింది.

*రియ‌ల్ స్టోరీనా?
- అలాంటిదేమీ కాదండీ.
జడ్జిలు వ‌చ్చి ప్రెస్‌తో మాట్లాడ‌కూడ‌దంటా.. ఆ బ‌ట్ట‌లు వేసుకుంటే తెలియ‌ని రెస్పెక్ట్ వ‌చ్చేస్తుంది. నాలుగు సింహాలు అక్క‌డ ఉండ‌టం వంటివ‌న్నీ తెలియ‌ని బాధ్య‌త‌ను గుర్తుచేస్తాయి. కూర్చున్న చెయిర్‌కి న్యాయం చేయాల‌నిపిస్తుంది.

ల‌క్ష్మీ బాంబ్ అనే పేరు విన‌గానే ఏమ‌నిపించింది?
- ముందు మా ద‌ర్శ‌కుడిని ప‌ట్టుకుని తిట్టేశాను. వ‌ర్కింగ్ టైటిల్ అని పెట్టండి అని చెప్పా. అలా అన్నాను... సినిమా మొద‌ల‌వ‌గానే చాలా మంది వ‌చ్చి టైటిల్ బావుంద‌ని చెప్పారు. నాకు ఓ మార్కెట్ ఉంది... నా పేరు పెట్టి సినిమా చేయ‌గ‌లుగుతున్నారు అని అనిపించింది. అయినా నాకు సిగ్గువంటివ‌న్నీ వ‌చ్చేశాయండి.

ఫైట్ల గురించి చెప్పండి?
- క్లైమాక్స్ ఫైట్ మనోజ్ కొరియోగ్ర‌ఫీ చేశాడు. క్లైమాక్స్ కి వ‌చ్చేస‌రికి ఆ ఎమోష‌న్‌, ఆ టైమ్ ఫ్రేమ్‌కి, బ‌డ్జెట్‌కి వంటివాటికి ఎక్క‌డా లింకు కుద‌ర‌లేదు. అప్పుడు మ‌నోజ్‌ని బ‌తిమాలుకుని చేయించుకున్నాం.

ప‌సుపు కుంకంతో క‌నిపిస్తున్నారు?
- అది క్లైమాక్స్ సాంగ్‌. అది పూర్త‌య్యే స‌రికి నాకు మోకాలి చిప్పలు ఊడిపోయాయేమో అనుకున్నా. మా డ్యాన్స్ మాస్ట‌ర్ కిర‌ణ్‌గారు చాలా బాగా చేయించారు. ఈ పాట‌ను చాలా బాగా చేశాను. నా కూతురు పాడేస్తుంది ఆ పాట‌ను. నా కూతురు అన్నం తిన‌డానికి ఉప‌యోగ‌ప‌డింది. ఆ పాట‌ను చూపించి `అమ్మ దెయ్యం అయిపోతుంది తిను` అని భ‌య‌పెట్టి తినిపిస్తున్నాం. అది యూట్యూబ్‌లో కానీ ఈ పాట‌ను చూసుంటే ఇప్ప‌టికే ల‌క్ష వ్యూస్ దాటేసేది. కానీ అది డౌన్‌లోడ్ చేసుకుని ఐ ప్యాడ్‌లో చూస్తోంది కాబ‌ట్టి స‌రిపోతుంది.

Lakshmi Manchu interview gallery

* ఈ సినిమా కోసం ఎలాంటి హోమ్ వ‌ర్క్ చేశారు?
- నేను హాలీవుడ్‌కి వెళ్లి చేయాలంటే హోమ్ వ‌ర్క్ చేయాలేమో కానీ, ఇక్క‌డికి వ‌చ్చేసరికి ఆ డైలాగులు మ‌న‌లోకి వ‌చ్చేస‌రికి తెలియ‌ని న‌మ్మ‌కం వ‌చ్చేస్తుంది. అద్భుత‌మైన టీమ్ ఉన్న‌ప్పుడు ఏదీ ఫెయిల్ కాదు. ఆ పాట‌లో చీర క‌ల‌ర్ నుంచి ప్ర‌తిదీ చాలా జాగ్ర‌త్త‌గా చేశారు. ఆ ప‌సుపు, ఆ కుంకుమం వంటివ‌న్నీ నా క్రియేటివ్ థింకింగే.

* బాగా మారిపోయారు?
- న‌న్ను కింద ఎవ‌రూ గుర్తుపట్ట‌లేదు. న‌న్ను చూసి హాలీవుడ్ ఆర్టిస్ట్ ఎవ‌రో వ‌చ్చార‌ని అనుకున్నారంట‌.

* కాస్త లావయిన‌ట్టున్నారు?
- అవునండీ. మ‌ద‌ర్ హుడ్‌. నా కూతురుకి క‌లిపింది నేను తినేశాను.

* నాన్న ఏమ‌న్నారు?
- టైటిల్ అంద‌రికీ న‌చ్చింది. నాన్న ప‌ర్టిక్యుల‌ర్‌గా రెస్పాన్డ్ కాలేదు. కానీ కొన్నాళ్ల త‌ర్వాత మంచి టైటిల్ అమ్మ‌డు ఎవ‌రు చెప్పారో కానీ చాలా బావుంది అని అన్నారు. ఈ టైటిల్‌ని ముందు `దొంగాట‌` అప్పుడు అనుకున్నా. కానీ అప్పుడు ఫ‌స్ట్ నేను కొట్టేశా. ఇప్పుడు ఓకే అయింది.

* ల‌క్ష్మీ బాంబు అని అంటుంటే ఇప్పుడెలా అనిపిస్తోంది?
- ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది. నా ఫ్రెండ్ ఒక‌మ్మాయి నాతో ఈ టైటిల్ గురించి చాలా సేపు మాట్లాడింది. నేను లాస్ ఏంజెల్స్ కి వెళ్లిన ఫ‌స్ట్ ఇయ‌ర్ నుంచి నాకు మంచి ఫ్రెండ్‌. త‌ను తీసిన షార్ట్ ఫిల్మ్ తో నేను చేశా. మ‌హిళ‌ల‌కు మార్కెట్ ఓపెన్ అయింది. హిందీలో కంగ‌నా ర‌నౌత్‌, విద్యాబాల‌న్ వంటి వారంద‌రికీ మార్కెట్ క్రియేట్ అవుతోంది. త‌మిళంలో త్రిష‌, సుహాసిని ఇలా చాలా మంది ఉన్నారు. తెలుగులో శోభ‌న‌, ర‌మ్య‌కృష్ణ‌గారి త‌ర్వాత ఎవ‌రి పేరు చెబుతారు. ఇప్పుడు మ‌ర‌లా తెలుగువారికి ఓపెనింగ్ డోర్స్ అనిపిస్తుంది.

* మ‌హిళా దినోత్స‌వం గురించి చెప్పండి?
- అస‌లు మ‌హిళ‌లు మ‌గ‌వారిక‌న్నా దేనిలో త‌క్కువ‌. మ‌హిళ‌లు లేక‌పోతే ఇంకో జ‌న‌రేష‌న్ కూడా ఉండ‌దు క‌దా. అలాంట‌ప్పుడు సొసైటీ ఎందుకు సెప‌రేట్ చేస్తుంది ఆడ అని, మ‌గ అని... ఈ రోజు ఒక న‌టికి మ‌ల‌యాళంలో ఏదో అయిందంటే మేం డ్రైవ‌ర్లని న‌మ్మ‌లేనిప‌రిస్థితి ఉంది. కానీ ఇప్పుడు మా యాటిట్యూడ్‌లోనే మార్పు రావాలి. మ‌న జాగ్ర‌త్త‌ల్లో ఉనం ఉండాలి. అంతేగానీ భ‌య‌ప‌డ‌కూడ‌దు. నేను ఒక‌మ్మాయి అని అనుకోను. అబ్బాయ‌ని అనుకోను. మ‌నిషిగా నేను ఎవ‌రికైనా సాయం చేయ‌గ‌లుగుతున్నానా? నాకున్న పొజిష‌న్ నుంచి చేయ‌గ‌లుగుతున్నానా అనేది మెయిన్‌.

* భావ‌న‌కి అన్యాయం జ‌రిగింది క‌దా? మీ అభిప్రాయం ఏంటి?
- నాకు బ్ల‌డ్ బోయిల్ అవుతోంది. హ్యాట్సాఫ్ టు ద‌ట్ యాక్ట్రెస్‌. త‌న వ‌ల్ల వేల మంది ఆడ‌వాళ్ల‌కి ధైర్యం ఇచ్చింది. త‌న ప్ర‌వ‌ర్త‌న చాలా మందికి స్ఫూర్తి. ఇలాంటివ‌న్నీ చాలా చోట్ల జ‌రుగుతూనే ఉన్నాయి. ఇలాంటివి జ‌రిగిన‌ప్పుడు మీ ఇంట్లో ఆడ‌వాళ్ల‌ని భ‌య‌పెట్ట‌కండి. పెప్ప‌ర్ స్పే పెట్టుకోమ‌నండి. డిజిటైజ్ వ‌ర‌ల్డ్ లో ఉంటూ ఆడ‌వాళ్ల‌ని ఎంక‌రేజ్ చేయాలి. మ‌న మ‌గ‌వాళ్ల‌కి ఆడ‌వాళ్ల‌ని ఎలా ట్రీట్ చేయాలో అమ్మ‌లు నేర్పించాలి మిమ్మ‌ల్ని. అందుకే ఆడ‌వాళ్ల‌లో రావాలి.

* వుమెన్స్ డే క్రాప్ అంటారుగా?
- ఎందుకు మ‌నం మెన్స్ డేని సెల‌బ్రేట్ చేస్తారా? అలాంట‌ప్పుడు ఎందుకు ఉమెన్స్ డే ఎందుకు? ఎవ‌రికి త‌క్కువ మేం? నేను ఈ కాన్సెప్ట్ నే వ్య‌తిరేకిస్తున్నాం. మేం ప‌డే క‌ష్టాల‌నే మ‌గ‌వాళ్లు కూడా ప‌డుతున్నారు. అలాంట‌ప్పుడు మెన్స్ డే కూడా చేయాలి. పెళ్లిళ్లు, పేరంటాలు, ఫీజులు వంటివి మ‌గ‌వాళ్ల‌కు ఉన్నాయి. ఎవ‌రి బాధ‌లు వాళ్ల‌కు ఉన్నాయి.

* తెలంగాణ స్వ‌చ్ఛ‌భార‌త్‌కి బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ఉన్నారుగా?
- హాహాహా.... ఎక్క‌డ చెత్త ఉన్నా మా నాన్న న‌న్ను అడుగుతున్నారు. నేను జీహెచ్ఎంసీ వాళ్ల‌తో రెగ్యుల‌ర్‌గా ట‌చ్ లో ఉన్నాను. త‌డి చెత్త‌, పొడి చెత్త డిఫ‌రెన్సే తెలియ‌కుండా ఉన్నాం మ‌నం. సిగ‌రెట్ స్మోకింగ్ అనే 2 నిమిషాలు చెత్త గురించి చెబితే చాలా ఉప‌యోగం ఉంటుంది.

* ప్రొడ‌క్ష‌న్ ఎప్పుడండీ?
- ప్ర‌స్తుతం డ‌బ్బులు లేవు. వ‌స్తే చేస్తాను.

* డీ మాంటైజేష‌న్ ఎఫెక్టా?
- భలేవారండీ. దాని వ‌ల్ల బ‌ట్ట‌లు కొనుక్కోవ‌డం త‌క్కువైంది. పుసుక్కుమ‌ని ఫ్లైట్ టిక్కెట్ కొనుక్కోవడం త‌క్కువైంది. అంతే త‌ప్ప ఇంకేమీ లేదు. గిర‌గిర‌గిరా తిరుగుతూ ఉండేదాన్ని. ఇప్పుడు తిర‌గ‌డం లేదు. నేను అంద‌రికీ చెక్కులే ఇస్తాను. నేను చెక్కులే తీసుకుంటాను.Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved