pizza
Larissa Bonesi about Thikka
సాయిధ‌ర‌మ్‌తేజ్ చాలా హెల్ప్ చేశారు - ల‌రిస్సా బోనెస్‌
You are at idlebrain.com > news today >
Follow Us

06 August 2016
Hyderaba
d

సాయిధ‌ర‌మ్‌తేజ్ హీరోగా న‌టిస్తున్న సినిమా `తిక్క‌`. ల‌రిస్సా బోనెస్ ఇందులో నాయిక‌గా న‌టించింది. త్వ‌ర‌లో విడుద‌ల కానున్న ఈ సినిమా గురించి ల‌రిస్సాబోనెస్ హైద‌రాబాద్‌లో విలేక‌రుల‌తో మాట్లాడింది.

ల‌రిస్సా మాట్లాడుతూ ``మాది బ్రెజిల్‌. నా 13వ ఏట నేను బ్రెజిల్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేశాను. అక్క‌డి నుంచి ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప‌లు దేశాల‌కు చెందిన ప్ర‌క‌ట‌న‌ల్లో న‌టించాను. అలా ప‌దేళ్లు గ‌డిచాయి. ఆ మ‌ధ్య నేను న‌టించిన ఓ యాడ్‌ను ఐపీయ‌ల్‌లో ఈ చిత్ర నిర్మాత రోహిణ్ రెడ్డి చూశారు. ఈ సినిమాలో న‌టించ‌మ‌ని అడిగారు. ఇందులో నా పాత్ర పేరు అంజ‌లి. ల‌వ్లీగా, ఎమోష‌న‌ల్‌గా, సెన్సిటివ్‌గా ఉంటుంది. ఇందులో నాకు చిన్న ఫైట్ కూడా ఉంది. మ‌న్నార‌చోప్రాతోనూ కొన్ని సీన్లున్నాయి. ఈ సినిమా కోసం తెలుగు ట్యూష‌న్ల‌కు కూడా వెళ్లాను. తెలుగు అర్థం చేసుకుంటున్నా. డైలాగుల‌ను బ‌ట్టీప‌ట్టి చెప్పేసేదాన్ని. కొన్నిసార్లు చెప్ప‌లేక‌పోయిన‌ప్ప‌టికీ నాకు హీరో చాలా హెల్ప్ చేశారు. త‌ను పెద్దింటి నుంచి వ‌చ్చిన‌ప్ప‌టికీ నాతో మామూలుగానే వ్య‌వ‌హ‌రించారు. తెలుగులో నేటి ట్రెండ్ గురించి తెలుసుకోవ‌డం కోసం సినిమాలు చూస్తున్నాను. సాయిధ‌ర‌మ్‌తేజ్ నా ఫేవ‌రేట్ హీరో. తెలుగులో మ‌రిన్ని సినిమాలు చేయాల‌ని ఉంది. తెలుగు మాత్ర‌మే కాదు... మిగిలిన భాష‌ల్లోనూ సినిమాల్లో న‌టించాల‌ని ఉంది. ర‌ఘుబాబు నాకు ఫ్యామిలీలాగా అయిపోయారు. ఆయ‌న మాడ్యులేష‌న్‌లో `వామ్మో` అని బ్రెజిల్‌కు వెళ్లినా అంటున్నానంటే ఎంత బాగా ఆయ‌న క‌నెక్ట్ అయ్యారో తెలుసుకోవ‌చ్చు. స‌త్య‌, స‌ప్త‌గిరి కామెడీ చూసే ప్ర‌తి ఒక్క‌రికీ న‌చ్చుతుంది. ముమైత్‌ఖాన్ ఈ సినిమాతో నాకు చాలా మంచి ఫ్రెండ్ అయ్యారు. రాజేంద్ర‌ప్ర‌సాద్‌గారు, అలీగారితో ప‌నిచేయ‌డం చాలా ఆనంద‌గా అనిపించింది. ద‌ర్శ‌కుడు సునీల్ రెడ్డిని చూసి ముందు భ‌య‌ప‌డ్డాను. కానీ ఆయ‌న‌, మా నిర్మాత ఎంతో ఫ్రీగా ఉండేవారు. దాంతో కాస్త నెర్వ‌స్‌నెస్ త‌గ్గింది. ఈ సినిమా కోసం తెలుగు అమ్మాయిలు ఎలా బాధ‌ప‌డ‌తారు? ఎలా సిగ్గుప‌డ‌తారు? ఏ విష‌యానికి ఎలా స్పందిస్తారు వంటి బాడీ లాంగ్వేజ్‌ను కూడా నేర్చుకున్నాను`` అని వివ‌రించింది ల‌రిస్సా.

Larissa Bonesi interview gallery


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved