pizza
Latha Hegde about Tuntari
నారా రోహిత్ హెల్ప్ చేశారు - ల‌తా హెగ్డే
You are at idlebrain.com > news today >
Follow Us

10 March 2016
Hyderaba
d

తుంటరి సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌యం కానుంది ల‌తా హెగ్డే. నారా రోహిత్ హీరోగా న‌టిస్తున్న సినిమా తుంట‌రి. కుమార్ నాగేంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. మాన్ క‌రాటే సినిమాకు రీమేక్ ఇది. శుక్ర‌వారం విడుద‌ల కానుంది. ఈ సినిమా గురించి ల‌తా హెగ్డే విలేక‌రుల‌తో మాట్లాడింది.

ఆమె మాట్లాడుతూ ``నేను పుట్టిందంతా బెంగుళూరులో. పెరిగింది న్యూజిల్యాండ్‌లో. అక్క‌డ మిస్ ఇండియా న్యూజిల్యాండ్‌గా ఎంపిక‌య్యాను. ఈ సినిమా గురించి నాకు ఫోన్ వ‌చ్చిన‌ప్పుడు అది ఫేక్ కాల్ అనుకున్నా. అయితే నా ఫ్రెండ్స్ కొంద‌రు హైద‌రాబాద్‌లో ఉన్నారు. వారి ద్వారా ఎంక్వ‌య‌రీ చేయిస్తే నిజ‌మ‌ని తెలిసింది. ఇందులో సిరి అనే పాత్ర‌లో న‌టించాను. గ‌ర్ల్ నెక్స్ట్ డోర్ కైండ్ ఆఫ్ కేర‌క్ట‌ర్ అది. స్పోర్ట్స్ అంటే ఇష్ట‌ప‌డే పాత్ర‌లో చేశాను. కుమార్ నాగేంద్ర చాలా కూల్ ప‌ర్స‌న్‌. పర్ఫెక్ట్ డైర‌క్ట‌ర్‌. నారా రోహిత్ డౌన్ టు ఎర్త్ ప‌ర్స‌న్‌. ఫుల్ స‌పోర్ట్ చేశారు. మొద‌ట్లో నాకు తెలుగు ఏలియ‌న్ లాంగ్వేజ్‌గా అనిపించేది. కానీ ఇప్పుడు కాస్త అర్థ‌మ‌వుతోంది. తెలుగులో నాకు ఏం డౌట్ వ‌చ్చినా రోహిత్ ఎక్స్ ప్ల‌యిన్ చేసేవారు. క‌చ్చితంగా ఫ్యూచ‌ర్‌లో తెలుగులో మాట్లాడ‌తాను. ఆగ‌డు సినిమా చూసిన‌ప్ప‌టి నుంచి మ‌హేష్ కి పెద్ద ఫ్యాన్ అయ్యాను`` అని తెలిపారు.

 

Latha Hegde interview gallery

 

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved