pizza
Madan interview about Garam
ఆ విషయంలో డిమాండ్ చేయలేం - మదన్
You are at idlebrain.com > news today >
Follow Us

6 February 2016
Hyderaba
d

ఆది హీరోగా, శ్రీమతి వసంత శ్రీనివాస్ సమర్పణలో శ్రీనివాసాయి స్ర్కీన్స్ పతాకంపై పి.సురేఖ నిర్మించిన చిత్రం 'గరం'. ఇందులో అదా శర్మ కథానాయికగా నటించింది. 'పెళ్ళైన కొత్తలో’, 'ప్రవరాఖ్యుడు' వంటి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చిత్రాలను అందించిన దర్శకుడు మదన్ దర్శకత్వంలో చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రం ఫిభ్రవరి 12న విడుదలవుతుంది. ఈ సందర్భంగా దర్శకుడు మదన్ తో ఇంటర్వ్యూ....

టైటిల్ జస్టిఫికేషన్.....
గరం అంటే కోపం అని అర్ధం. అలాగని ఇది యాక్షన్ తరహా మూవీ కాదు. ఇదొక మంచి రొమాంటిక్, ఫ్యామిలీ ఎంటర్టైనర్. కుటుంబానికి సంబంధించిన సంఘర్షణ కనపడుతుంది. దానివల్ల వచ్చే సీరియస్ నెస్ ఇలా అన్నీ రకాల ఎలిమెంట్స్ ఉండే చిత్రం. అందుకనే ఈ టైటిల్ పెట్టాం.

ఆదితో వర్కింగ్ ఎక్స్ పీరియెన్స్....
గరం సినిమా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న తర్వాత కూడా విడుదల కావడానికి కారణం హీరో ఆది. చాలా హార్డ్ వర్కర్. సినిమాల గురించే ఆలోచిస్తుంటాడు. తన నమ్మకమే గరం. అతను పడుతున్న కష్టం, సినిమాపై పెట్టుకన్న నమ్మకం చూసిన మాలో ఉన్న బద్దకాన్ని పోగొట్టింది. ఈ సినిమాలో తను ఓ ఎనర్జిటిక్ పాత్రను చేశాడు. మనిషి పుట్టిన దగ్గర నుండి చచ్చేదాకా మన చుట్టూ ఉండేవారిని ప్రేమించాల్సిందే.. అదే ఆది పాత్ర. సినిమా ఓ రిలేషన్ తో సాగుతుంది. సినిమాకు ఆడియెన్స్ ఏ నమ్మకంతో అయితే వస్తాడో ఆ విషయంలో డిసప్పాయింట్ కాడు.

ది బెస్ట్ ప్రొడ్యూసర్...
సాయికుమార్ లాంటి ప్రొడ్యూసర్ ను చూడనేమో. ది బెస్ట్ ప్రొడ్యూసర్. సినిమా రషెష్ చూసిన తర్వాత సినిమాకు సంబంధించి ఏమడిగినా అది లేదనకుండా ఇచ్చారు. దర్శకుడుగా కావాల్సినంత ఫ్రీడమ్ ఇచ్చారు. చాలా నమ్మకంగా సినిమాను ప్రొడ్యూస్ చేశారు.

స్క్రీన్ ప్లే చాలా బలంగా ఉంటుంది...
శ్రీనివాస్ గవిరెడ్డి నా దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసేవాడు. 2012 లో ఈ సినిమా లైన్ చెప్పాడు. అప్పటి నుండి కథను డెవలప్ చేసుకుంటూ వచ్చాం. సినిమాకు స్క్రీన్ ప్లే బలం. సచ్చేదాకా సవాలక్ష ప్రాబ్లమ్స్ ఉంటాయి.. అలా అని తినడం మానేస్తామా..? తొంగోడం మానేస్తామా..? అలానే ప్రేమించడం కూడా మానలేం..' అనే డైలాగ్ రాసుకున్నాను. దాంతో హీరో పాత్ర ఎలా ఉండాలో నాకొక ఐడియా వచ్చింది. అప్పుడు ప్రాజెక్ట్ మీద కాన్ఫిడెన్స్ పెరిగింది.

కీరవాణితో చేయకపోవడానికి కారణం....
నా సినిమాలకు కీరవాణి గారితో మ్యూజిక్ చేయిస్తుంటాను. ఈ సినిమా సమయం ఎక్కువ కావడంతో కీరవాణిగారితో చేయడం కుదరలేదు. అయితే పెళ్ళైన కొత్తలో చిత్రానికి సంగీతం అందించిన అగస్త్య ఈ సినిమాకు మ్యూజిక్ చేశాడు. ఎక్సలెంట్ మ్యూజిక్ ఇచ్చాడు.

గ్యాప్ రావడానికి కారణమదే...డిసప్పాయింట్ అయ్యాను.
2009 లో ప్రవరాఖ్యుడు సినిమా రిలీజ్ అయిన తరువాత తెలంగాణ ఉద్యమం మొదలైంది. రెండు రాష్ట్రాల్లో ఉద్యమాలు బాగా జరిగాయి. అలాంటి కండీషన్ లో కూడా సినిమా 50 డేస్ రన్ అయింది. ఆ సక్సెస్ ను రెండేళ్ళు ఎంజాయ్ చేశాను. అయితే సినిమా రిలీజ్ అయిన వెంటనే ఫలితం రాలేదు. తర్వాత సొంత వ్యాపారం మొదలుపెట్టాను. అది కలిసి రాలేదు. అప్పుడు బాగా డిసప్పాయింట్ అయ్యాను. 2011-12లో అయితే ఇండస్ట్రీ వదిలేద్దామని కూడా అనుకున్నాను. కానీ ఎందుకే ఇందుకే ఇక్కడే ఉండిపోవాలనిపించింది.

అందుకే లేట్ అయింది...
ఈ సినిమాను 2014 ఆగస్ట్ లో స్టార్ట్ చేశాం. తర్వాత ఆదికి పెళ్ళి కావడం, తర్వాత మిత్రుడిని కోల్పోవడం పెద్ద లాస్. తను నాకు ఈ సినిమా విషయంలో రైట్ హ్యండ్ లా సపోర్ట్ గా నిలిచాడు. ఇలా కొన్ని పర్సనల్ సమస్యలు వల్ల బాగా క్రుంగిపొయాను. ఆ కోమా నుండి బయటకు వచ్చి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళడానికి కాస్త సమయం పట్టింది.

ఆ బాధ అప్పుడుండేది...
కెరీర్ ప్రారంభంలో అనుకున్నంత గుర్తింపు రాలేదనే బాధ ఉండేది. అది అమ్యెచుర్ అని ఇప్పుడు అనిపిస్తుంది. ఇప్పుడలా లేదు. గుర్తించడం లేదంటే అనుకున్నంత ఎఫర్ట్ పెట్టలేదేమో అని కూడా అనుకుంటాను. ఇక్కడ నన్ను గుర్తించడం లేదు అని డిమాండ్ చేయలేం.

నెక్స్ట్ ప్రాజెక్ట్స్?
ఇప్పటివరకు ఏది ఫైనల్ చేయలేదు. ఈ సినిమా రిజల్ట్ మీద నా తదుపరి చిత్రం ఆధారపడి ఉంటుంది.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved