pizza
Madhura Sreedhar Reddy interview (Telugu) about Fashion Designer s/o Ladies Tailor
నిర్మాత‌గా, అభిమానిగా నా ఆలోచ‌న‌ల నుండి పుట్టిన విలేజ్ బ్యాక్‌డ్రాప్ మూవీ `ప్యాష‌న్ డిజైన‌ర్ స‌న్నాఫ్ లేడీస్ టైల‌ర్‌` - మ‌ధుర శ్రీధ‌ర్ రెడ్డి
You are at idlebrain.com > news today >
Follow Us

30 May 2017
Hyderabad

సుమంత్‌ అశ్విన్‌, అనీషా అంబ్రోస్‌, మానస, మనాలి రాథోడ్‌ హీరో హీరోయిన్లుగా సీనియర్‌ వంశీ దర్శకత్వంలో మధుర శ్రీధర్‌రెడ్డి నిర్మించిన చిత్రం 'ఫ్యాషన్‌ డిజైనర్‌ సన్నాఫ్‌ లేడీస్‌ టైలర్‌'. సినిమా జూన్‌ 2న విడుదలవుతుంది. ఈ సందర్భంగా నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డితో ఇంట‌ర్వ్యూ..

అగ్ని పరీక్షకు సిద్ధం..
- నాకు ప్రతి ఏడాది అగ్ని పరీక్ష ఉంటుంది. అలాగే ఈ ఏడాది కూడా 'ఫ్యాషన్‌ డిజైనర్‌ సన్నాఫ్‌ లేడీస్‌ టైలర్‌ చిత్రంతో అగ్ని పరీక్షకు సిద్ధమయ్యాను. ప్రతి సినిమాకు పెట్టే ఎఫర్ట్ లో మాత్రం తేడా ఉండదు.

స్పెషల్‌ మూవీ..
- ఫ్యాషన్‌ డిజైనర్‌ సన్నాఫ్‌ లేడీస్‌ టైలర్‌ సినిమా నాకు స్పెషల్‌. ఎందుకంటే ఇంతకుముందు చేసిన సినిమాలన్నీ కాన్సెప్ట్‌ ఓరియెంటెడ్‌గానే ఉండేలా ప్లాన్‌ చేసుకున్నాను. కానీ ఈసారి మాత్రం సీక్వెల్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. తెలుగు సినిమాలో సీక్వెల్స్‌కు తక్కువ. మనీ మనీ ఒక సీక్వెల్‌ వచ్చింది. ఓ నిజమైన సీక్వెల్‌ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన నుండి వచ్చిందే ఈ 'ప్యాషన్‌ డిజైనర్‌'.

సీక్వెల్‌ పుట్టిందిలా...
- నాకు ఎప్పటి నుండో విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా చేయాలని ఉండేది. అలాగే వంశీగారి దర్శకత్వంలో ఓ సినిమా చేయాలనుండేది. సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో వంశీగారి గురించి చదువుతామని గూగల్‌లో వెతికినప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీకి కొత్తదనం ఆపాదించిన నాలుగు స్తంభాల్లాంటి దర్శకులున్నారు. కె.విశ్వనాథ్‌, బాపు, జంధ్యాల, వంశీగారు..ఈ నలుగురే ఆ నలుగురు అని చదివాను. ఎక్కడికెళ్ళినా సినిమా పిచ్చోళ్ళపై మధ్య డిస్కషన్‌ వచ్చినప్పుడు వంశీగారి టాపిక్‌ వచ్చేస్తుంటుంది. అలాంటి సందర్భంలో నుండి వచ్చిన ఆలోచన..అలాగే నాలుగైదేళ్ళుగా మనం ఈవీవీగారి టైప్‌ కామెడిని మిస్‌ అవుతున్నాం. అలాగే జంధ్యాలగారి కామెడిని మిస్‌ అయ్యాం. ఇలాంటివి కలిపి సినిమా చేస్తే ఎలా ఉంటుందోనని ఆలోచన వచ్చింది. ఓ ఎంటర్‌టైనింగ్‌ మూవీ చేయాలనుకున్నప్పుడు లేడీస్‌ టైలర్‌ కొడుకు ఇప్పుడేం చేస్తుంటాడనే ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనల నుండే ఈ సినిమా పుట్టింది. లేడీస్‌ టైలర్‌ను ఎక్కడైతే చిత్రీకరించారో అక్కడే ఈ ప్యాషన్‌ డిజైనర్‌ సన్నాఫ్‌ లేడీస్‌ టైలర్‌ సినిమాను చిత్రీకరించాం. కంప్లీట్‌ విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన చిత్రమిది. అలాగే వంశీగారి అభిమానిగా, నా స్టయిల్లో థర్డ్‌ ప్రాసెస్‌లో
వంశీగారితో సినిమా చేయిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన నుండి సినిమా పుట్టుకొచ్చింది. ఫ్యాన్‌ మేడ్‌ మూవీ అనుకోవచ్చు.

మణిశర్మ సంగీతం గురించి..
- వంశీగారు, మణిశర్మగారి కాంబినేషన్‌లో వచ్చిన సాంగ్స్‌కు అద్భుతమైన రెస్పాన్స్‌ వచ్చింది. వంశీ- ఇళయరాజగారు, వంశీ - చక్రిగారి కాంబినేషన్‌లో సాంగ్స్‌ విన్నాం. అలాగే వంశీ- మణిశర్మ కాంబినేషన్‌ కొత్తగా ఉందని అన్నారు. మణిగారు ఐదు అద్భుతమైన పాటలను ఇచ్చారు. అలాగే తన స్టయిల్‌ ఆఫ్‌ రీరికార్డింగ్‌తో సినిమాను నెక్స్‌ట్‌ లెవల్‌కు తీసుకెళ్ళారు. ఒక అనుభవజ్ఞుడైన మ్యూజిక్‌ డైరెక్టర్‌తో పనిచేస్తే ఆ అవుట్‌పుట్‌ ఎలా ఉంటుందని మణిశర్మగారితో పనిచేయడం వల్ల తెలుసుకున్నాను.

ముందుగా ఎవరూ ప్లాన్‌ చేసుకోరు..
- అందరి ఆలోచన ఎగ్జయిట్‌మెంట్‌ నుండి పుట్టిన సీక్వెలే ప్యాషన్‌ డిజైనర్‌ సన్నాఫ్‌ లేడీస్‌ టైలర్‌. సాధారణంగా కొన్ని సినిమాలు తప్ప మిగిలిన క్లాసిక్‌ మూవీస్‌ అన్ని అలా క్రియేట్‌ అయ్యాయే తప్ప, ఎవరూ ముందుగానే ప్లాన్‌ చేసుకోలేదు. లేడీస్‌ టైలర్‌ కూడా అలా క్లాసిక్‌ మూవీ అయ్యింది. లేడీస్‌ టైలర్‌కు, ప్యాషన్‌ డిజైనర్‌కు సంబంధం లేదు. పల్లెటూర్లో ఉండే ప్యాషన్‌ డిజైనర్‌ థాట్ ప్రాసెస్‌ ఎలా ఉంటుందనేదే సినిమా. ముప్పై ఏళ్ళ క్రితం మనుషుల్లో ఉండే నిజాయితీ ఇప్పుడు మనుషుల్లో కనపడదు. ఆ పాయింట్‌ కూడా మన సినిమాలో కనపడుతుంటుంది.

నిర్మాతగా చాలా హ్యాపీ..
- లేడీస్‌ టైలర్‌ సినిమా ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో అందరికీ తెలుసు. రాజేంద్రప్రసాద్‌గారి క్యారెక్టర్‌ చేయడం ఒకవైపు, వంశీగారి దర్శకత్వంలో సినిమా చేయడం మరోవైపు కాబట్టి సుమంత్‌ అశ్విన్‌ చాలా కష్టపడి సినిమాలో తన పాత్రకు న్యాయం చేశాడు. ఒక నిర్మాతగా సినిమా అవుట్‌పుట్‌తో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మరి ఇక ప్రేక్షకులకుదే తుది తీర్పు.

వంశీతో జర్నీ...
- వంశీగారు చాలా టిపికల్‌ పర్సన్‌. ఆయన్ను అర్థం చేసుకుంటే మాత్రం అద్భుతమైన వ్యక్తి. వంశీగారి గురించి చాలా విన్నాను. కానీ మనం కరెక్ట్‌గా ఉన్నప్పుడు ఎదుటివారు కూడా కరెక్ట్‌గా ఉంటారని నా నమ్మకం కాబట్టి ఆయనతో జర్నీని ఎంజాయ్‌ చేశాను. మోస్ట్‌ ఫెంటాస్టిక్‌ డైరెక్టర్‌. చాలా మంది నేటి దర్శకులతో పోల్చితే చాలా అప్‌డేట్‌గా ఉన్నారు. ఆయనపై వినిపిస్తున్న వార్తలకు కారణం కమ్యూనికేషన్‌ గ్యాప్‌ మాత్రమే.

హీరో క్యారెక్టర్‌ గురించి..
- హీరోకు మన్మథ రేఖ ఉంటుంది. అది కొటికొకరికి ఉంటుంది. అప్పుడెప్పుడో కేరళలో ఒకడికి ఉండేది. తర్వాత మన హీరోకు వస్తుందన్నమాట. ఆ రేఖ ఉండటం వల్ల హీరో అమ్మాయిలతో క్లోజ్‌గా మాట్లాడితే, అమ్మాయిల కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తే, హీరోతో ప్రేమలో పడిపోతారు. ఇదే సింపుల్‌గా చెప్పాలంటే హీరో క్యారెక్టరైజేషన్‌.

కథకు నాలుగేళ్ళ జర్నీ ఉంది..
- ప్యాషన్‌ డిజైనర్‌ మూల కథ నాదే. మన్మథరేఖ అనే కాన్సెప్ట్‌ను నేనే వంశీగారికి చెప్పి విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో కథను తయారు చేయమని అన్నాను. అయితే ఈ కథను నాలుగేళ్ళ జర్నీ ఉంది. ముందు ఈ కథను తనికెళ్ళ భరణిగారు రవితేజ కోసం రాశారు. కానీ అప్పుడు సినిమా చేయలేకపోయారు. తనికెళ్ళభరణిగారి దగ్గర నేను కథ కొన్న తర్వాత నాకు ఆ కథ పెద్దగా నచ్చలేదు. ప్యాషన్‌ డిజైనర్‌ సన్నాఫ్‌ లేడీస్‌ టైలర్‌ టైటిల్‌పై రాజ్‌తరుణ్‌తో సినిమా చేయాలనుకుని బివిఎస్‌ రవితో కథను తయారు చేయమని అన్నాం. ముంందు సినిమా చేయడానికి రాజ్‌తరుణ్‌ ఆసక్తి చూపినా బివిఎస్‌ రవి కథ నచ్చకపోవడంతో సినిమా పక్కన పడిపోయింది. పట్టుదలగా అసలు పూర్తి విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా ఎందుకు చేయకూడదని ఆలోచించినప్పుడు వచ్చిందే మన్మథరేఖ పాయింట్‌.

తదుపరి చిత్రం...
- తెలంగాణ ముఖ్యమంత్రి కె.సి.ఆర్‌. జీవిత కథపై సినిమా తీయబోతున్నాను. హిందీ నటుడు రాజ్‌కుమార్‌ రావ్‌ అయితే కె.సి.ఆర్‌. పాత్రకు సరిపోతాడనిపించింది. ఆయన్ను అప్రోచ్‌ కూడా అయ్యాం. ఆయన కూడా సినిమా చేయడానికి సిద్ధంగానే ఉన్నారు. తమిళంలో విజయ్‌ ఆంటోని అనుకుంటున్నాం కానీ చూడాలి. ముందు ప్యాషన్‌ డిజైనర్‌ మూవీ రిలీజ్‌ అయిన తర్వాత నెక్స్‌ట్‌ మూవీ గురించి నిర్ణయం తీసుకుంటాను.



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved