pizza
Mahi V. Raghavinterview (Telugu) about Anando Brahma
కథ ప్రిపేర్‌ చేసుకోవడానికే ఎక్కువ సమయం తీసుకుంటాను - మహి వి.రాఘవ్‌
You are at idlebrain.com > news today >
Follow Us

12 August 2017
Hyderabad

70 ఎం.ఎం.ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై తాప్సీ పన్ను, శ్రీనివాస్‌ రెడ్డి, వెన్నెల కిషోర్‌, తాగుబోతు రమేష్‌, , షకలక శంకర్‌ ప్రధాన తారాగణంగా నటిస్తున్న చిత్రం 'ఆనందో బ్రహ్మ'. మహి వి.రాఘవ్‌ దర్శకుడు. విజయ్‌ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మాతలు. ఈ సినిమా ఆగస్టు 18న విడుదలవుతుంది. ఈ సందర్భంగా దర్శకుడు మహి వి.రాఘవ్‌ ఇంటర్వ్యూ...

గ్యాప్‌ ఎందుకు వచ్చిందంటే..
- కావాలనే గ్యాప్‌ తీసుకోలేదు. పాఠశాల సినిమా తర్వాత ఓ మంచి సినిమా చేయాలనే ఉద్దేశంతో సమయం తీసుకున్నాను. స్క్రిప్ట్‌ రాయడానికి, నటీనటుల డేట్స్‌ దొరకడంలో కాస్తా సమయం పట్టింది.

నేను వాటిని నమ్మను...
- నేను దెయ్యాన్ని కానీ, దేవుణ్ని కాను నమ్మను. ఈ రెండింటికీ కారణం భయమే. కామెడి జోనర్‌లో చేద్దామని అనుకున్నప్పుడు ఎలాంటి కామెడి చేద్దాం...క్రైమ్‌ కామెడి సినిమా చేద్దామా, హారర్‌ కామెడి మూవీ చేద్దామా అని ఆలోచించాను. చివరకు హారర్‌ కామెడి సినిమా చేయడానికి రెడీ అయ్యాను. మనకు థీమ్‌ ఉండాలి, దాన్ని కొత్తగా చెబితేనే ఆడియెన్స్‌కు నచ్చుతుంది కదా అని ఆలోచించినప్పుడు హారర్‌ థీమ్‌నే రివర్స్‌గా చెబితే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది. అలా అనుకున్నప్పుడే దెయ్యం మనిషికి భయపడితే ఎలా ఉంటుందని ఆలోచన వచ్చింది. నేను చెప్పే రివర్స్‌ థీమ్‌ లాజిక్‌తో ఉంటుంది. క్యారెక్టర్స్‌ డిఫరెంట్‌గా ఉంటాయి. ఒకడేమో తాగుబోతు. మరొకడికి చెవుడు, వాడికి రేచీకటి కూడా ఉంటుంది. భయం వచ్చినప్పుడు వాడు ఫ్లూట్‌ వాయిస్తూ ఉంటాడు. ఒకడు స్ప్లిట్‌ పర్సనాలిటీ ఉంటుంది. శ్రీనివాసరెడ్డికి గుండె సమస్య ఉంటుంది. ఇలా లోపాలు ఉండేవాళ్లకి ఆ లోపాలే బలంగా మారుతాయి. కథంతా ఓ ఇంట్లోనే జరుగుతుంది.

Director Mahi V. Raghav interview gallery

తాప్సీ క్యారెక్టర్‌ ఎలా ఉంటుంది?
-తాప్సీకి మరో సెపరేట్‌ ట్రాక్‌ ఉంది. తాప్సీ కథ విని చేయడానికి సిద్ధమైంది. కానీ నాకు నిర్మాత దొరకడానికి సమయం పట్టింది. తనేమో ముంబై వెళ్లిపోయింది. బిజీ హీరోయిన్‌గా ఉంది. నాకు నిర్మాత దొరకగానే తనకు ఫోన్‌ చేశాను. తను ఏమాత్రం ఆలోచించకుండా వచ్చి నటించింది. ఈ సినిమాలో హ్యుజ్‌ ట్విస్ట్‌ ఉంది. అదేంటనేది సినిమాలో చూడాల్సిందే. విలేజ్‌లో వినాయకుడు, కుదిరితే కప్పు కాఫీ, పాఠశాల సినిమాలను నేను నిర్మించాను. పాఠశాలను సినిమాను నిర్మిస్తూనే డైరెక్ట్‌ చేశాను. ఆనందో బ్రహ్మా సినిమాకు దర్శత్వం వహించాను. నేను కథ ప్రిపేర్‌ చేసుకోవడానికే ఎక్కువ సమయం తీసుకుంటాను. సుమారుగా ఆరు నుండి ఏడాది సమయం తీసుకుంటాను. అలాగే కథకు తగ్గట్టు ఆర్టిస్టులను ఎంపిక చేసుకోవడానికి కూడా సమయం పడుతుంది. ఈ సినిమాలో కూడా తాప్సీ డేట్స్‌ కోసం నాలుగు నెలలు వెయిట్‌ చేశాను.

నిర్మాత గురించి...
- నిర్మాతగా విజయ్‌ చాలా సక్సెస్‌ఫుల్‌ పర్సన్‌. విజయ్‌కు సినిమా అంటే మంచి అవగాహన ఉంది. సినిమా ఎలా ఉండాలనే దానిపై తను వెంటనే నిర్ణయాలు తీసుకుంటారు. సినిమా బాగా రావడానికి విజయ్‌గారు కూడా ఒక కారణమే.

హైలైట్స్‌..
- హారర్‌ సినిమాల్లో సౌండ్‌ చాలా కీలకపాత్రను పోషిస్తుంది. అందుకనే మేం సౌండ్‌ కొత్తగా ఉండాలని చాలా సమయం తీసుకున్నాం. సౌండ్‌ డిజైనింగ్‌ చేయడానికి రెండు మూడు నెలల సమయం తీసుకున్నాం. కామెడీ కూడా క్యారెక్టర్స్‌ నుండి పుట్టే సిచ్యువేషనల్‌ కామెడీ. ఎమోషనల్‌ డ్రామా అన్నింటి కలయికలో మంచి కథ కుదిరింది. సినిమాలో కనపడే దెయ్యాలు భయపెట్టేలా ఉండవు. వాటి మధ్య కూడా మంచి సన్నివేశాలుంటాయి.

తదుపరి చిత్రాలు....
- ఇప్పటికింకా ఏ సినిమా చేయడం లేదు. 'ఆనందో బ్రహ్మ' సినిమా రిజల్ట్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.

 

 

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved