pizza
Malavika Nair interview (Telugu) about Taxiwaala
ఇంటెన్సిటీ ఉన్న క్యారెక్ట‌ర్ చేయ‌డం కాస్త రిస్కే - మాళ‌వికా నాయ‌ర్‌
You are at idlebrain.com > news today >
Follow Us

20 November 2018
Hyderabad

విజయ్ దేవ‌ర‌కొండ‌, ప్రియాంక జ‌వాల్క‌ర్ జంట‌గా న‌టించిన చిత్రం `టాక్సీవాలా`. రాహుల్ సంక్రిత్యాన్ ద‌ర్శ‌కుడు. జి.ఎ 2 పిక్చ‌ర్స్‌, యు.వి.క్రియేషన్స్ బ్యాన‌ర్స్‌పై ఎస్‌.కె.ఎన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. నవంబ‌ర్ 17న సినిమా విడుద‌లై మంచి విజ‌యాన్ని సాధించింది. ఈ నేప‌థ్యంలో సినిమాలో కీల‌క పాత్ర‌లో న‌టించిన మాళవికా నాయ‌ర్ ఇంట‌ర్వ్యూ...

`టాక్సీవాలా` సక్సెస్‌ను ఎలా ఎంజాయ్‌ చేస్తున్నారు?
- ఎవ‌రికైనా సక్సెస్ వారిలో న‌మ్మ‌కాన్ని పెంచుతుంది. అలాంటి న‌మ్మ‌కాన్ని క‌లిగించిన చిత్ర‌మిది. `టాక్సీవాలా` విజయంతో నా రాబోయే సినిమాల స్క్రిప్ట్స్‌ విషయంలో నేను కొంత ఉన్నతంగా ఆలోచించగలను అనుకొంటున్నాను.

ఈ సినిమాలో మీపాత్ర నిడివి తక్కువగా ఉంది కదా?
- సినిమాలో నా పాత్ర‌కు ఉన్న ప్రాధాన్య‌త ఏంటి? నా న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను ఎలా మెప్పిస్తాను? అనే విష‌యాల‌నే ఆలోచిస్తాను. అంతే త‌ప్ప పాత్ర నిడివి గురించి ఆలోచించ‌ను.

`టాక్సీవాలా` కంటే ముందు `విజే`త రిలీజ్‌ అయ్యింది కదా?
- `టాక్సీవాలా` ఒప్పుకుని దాదాపు రెండు సంవత్సరాలు దాటింది. సినిమా విడుద‌ల‌కు కొన్ని కార‌ణాలు ఆటంకం ఏర్ప‌రిచాయి. అందుకే ఇది ఆల‌స్యమైంది. అందుకే విజేత సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకొని ముందుగా రిలీజ్‌ అయ్యింది

పాత్ర విన‌గానే ఎలా అనిపించింది
- సినిమాలో నాక్యారెక్టర్‌ లేకుండా కథను మనం ఊహించలేం. అలాంటి ఇంపార్టెన్స్‌ ఉన్న క్యారెక్టర్‌. `టాక్సీవాలా` సినిమాకు సిసిర క్యారెక్టర్‌ సోల్‌ ఆఫ్‌ ది ఫిలిమ్‌. అలాంటి క్యారెక్టర్‌ చేసినందుకు చాలా హ్యాపీ గా ఫీల్‌ అవుతున్నాను.

ఈ క్యారెక్టర్‌ మీ కెరీర్‌ కు ఖచ్చితంగా హెల్ప్‌ అవుతుంది అనుకుంటున్నారా?
- ఇలాంటి క్యారెక్టర్‌ చేయడం ద్వారా నేను టాప్‌ హీరోయిన్‌ అవుతానని అనుకోవడం లేదు. కానీ ఒక నటిగా నన్ను నేను ప్రూవ్‌ చేసుకునే అవకాశం మాత్రం దక్కింది అనుకుంటున్నాను.

interview gallery



'మహానటి' తరువాత ఇలాంటి ఒక ఇంటెన్స్‌ ఉన్న క్యారెక్టర్‌ చేయడం ఎలా అనిపించింది?
- నా కెరీర్‌ స్టార్టింగ్‌ లోనే సిసిరా లాంటి ఒక ఇంటెన్స్‌ క్యారెక్టర్‌ చేయడం కొంత రిస్క్‌ అనే చెప్పాలి. కానీ ప్రేక్ష‌కులు నేను చేసే ప్రతీ క్యారెక్టర్‌ను యాక్సప్ట్‌ చేయగలిగిన‌ప్పుడు నటిగా నేను ప్రశాంతంగా నిద్రపోగలను.

ఫ్యూచర్‌ లో ఎలాంటి క్యారెక్టర్స్‌ చేయాలనుకుంటున్నారు?
- నటనతో మంచి స్కోప్‌ ఉండి నాకు ఛాలెంజింగ్‌గా అనిపించే ప్రతీ క్యారెక్టర్‌ చేయడానికి నేను సిద్ధంగా ఉంటాను. అలా అని అన్నీ ఛాలెంజింగ్‌ క్యారెక్టర్స్‌ చేస్తానని కాదు..నా కెరీర్‌ కు ఇంపార్టెన్స్‌ ఇస్తూనే నన్ను నేను ప్రూవ్‌ చేసుకోగలిగే క్యారెక్టర్స్‌ చేస్తాను.

ఇంత వరకు కమర్షియల్‌ సినిమాలు ఎందుకు చేయలేదు?
- ఈ మధ్యనే ఒక కమర్షియల్‌ మూవీను రిజెక్ట్‌ చేయడం జరిగింది. కారణం ఉదాహరణకు 'అర్జున్ రెడ్డిలాంటి కమర్షియల్‌ మూవీలో విజయ్‌ క్యారెక్టర్‌ కి మంచిస్కోప్‌ ఉంటుంది కానీ హీరోయిన్‌ పాత్ర కు అంత ఇంపార్టెన్స్‌ ఉండదు. అలాంటి క్యారెక్టర్స్‌ నేను చేయలేను. కానీ మంచి స్కోప్‌ ఉన్న క్యారెక్టర్‌ వస్తే నటించడానికి నేను ఎప్పుడూ సిద్దమే.

మీ టూ గురించి?
- ఫిమేల్‌ జెండర్‌ని హారాష్‌ చేయడం అనేది టాలీవుడ్‌లోనే ఉందని నేను అనుకోవడం లేదు. ఇదిప్రతీ ఇండస్ట్రీలో ఉంది. కొంత ఆలస్యం అయినా టాలీవుడ్‌లో ఇది స్టార్ట్‌ అయినందుకు హ్యాపీ గా ఉంది. పర్సనల్‌గా నాకు అలాంటి సంఘటనలు ఏమిఎదురు కాలేదు. బహుశా కారణం చిన్న వయసు నుండి మా పేరెంట్స్‌ నాకు తోడుగా షూటింగ్‌ కు రావడం అనుకుంటా.

ప్రజెంట్‌ కాలేజీ కి వెళ్తునట్టున్నారు?
- అవునండి! బేగంపేట‌లోని ఫ్రాన్సిస్‌ కాలేజ లో హిస్టరీ లిటరేచర్‌ లో పొలిటికల్‌ సైన్స్‌ సెకండ్‌ ఇయర్‌ చదువుతున్నాను. కాలేజీలో అందరూ విజయ్‌ గురించి అడగడం చాలాసంతోషం గా అనిపిస్తుంది. నా సినిమా లైఫ్‌,పర్సనల్‌ లైఫ్‌ హ్యాపీగా ఉండాలి అనుకొంటున్నాను.

నెక్స్ట్‌ ప్రాజెక్ట్స్‌ ఏంటి?
- తెలుగు లో ఇంత వరకు ఏ సినిమా ఒప్పుకోలేదు. తమిల్‌ లో ఒక సినిమా చేస్తున్నాను. షూటింగ్‌ త్వరలోనే స్టార్ట్‌ అవుతుంది.

 

 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved