pizza
Malkapuram Sivakumar interview about Shourya
‘శౌర్య’ మా బ్యానర్‌ వాల్యూని పెంచే చిత్రమవుతుంది - మల్కాపురం శివకుమార్‌
You are at idlebrain.com > news today >
Follow Us

25 February 2016
Hyderaba
d

‘సూర్య వర్సెస్‌ సూర్య’తో సూపర్‌హిట్‌ సాధించిన సురక్ష ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇండియా ప్రై. లి. పతాకంపై ‘శౌర్య’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు అభిరుచి గ నిర్మాత మల్కాపురం శివకుమార్‌. రాక్‌స్టార్‌ మనోజ్‌ , రెజీనా కసాండ్ర కాంబినేషన్‌లో ‘మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌’ ఫేం దశరథ్‌ దర్శకత్వంలో థ్రిల్లర్ లవ్‌స్టోరీగా రూపొందించిన ‘శౌర్య’ చిత్రం సెన్సార్‌ కార్యక్రమాల్ని పూర్తి చేసుకుని మార్చి 4న ప్రపంచ వ్యాప్తంగా 1000 థియేటర్లలో రిలీజ్‌ కానుంది. డిఫరెంట్‌ జోనర్‌లో ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో దశరథ్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మార్చి 4న ఈ చిత్రం రిలీజ్‌ అవుతున్న సందర్భంగా నిర్మాత మల్కాపురం శివకుమార్‌తో చిత్ర విశేషాల గురించి జరిపిన ఇంటర్వ్యూ.

‘శౌర్య’ సినిమా మెయిన్‌ కథాంశం ఏమిటి?
- ఇట్స్‌ ఎ లవ్ థ్రిల్లర్ సినిమా అంతా క్రైం థీమ్‌తో ట్రావెల్‌ అవుతూ ఉంటుంది. ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు లవ్‌ ఫీల్‌ ఉన్న సినిమా ఇది.

మనోజ్‌ క్యారెక్టర్‌ ఎలా ఉంటుంది?
- గత సినిమాకి భిన్నంగా మనోజ్‌ ఈ చిత్రంలో సాఫ్ట్‌ వేర్‌ ఇంజనీర్‌గా ఒక కొత్త క్యారెక్టర్‌లో నటించాడు. ఈ పాత్రలో మనోజ్‌ ఎక్స్‌ లెంట్‌గా నటించాడు. ఈ సినిమాతో మనోజ్‌గారికి ఒక కొత్త ఇమేజ్‌ వస్తుంది. ఆయన కోసం రైటర్స్‌ అందరూ కొత్త కథలు రాస్తారు. అంతలా ఈ సినిమాలోని క్యారెక్టర్‌ ఇన్‌స్పైర్‌ చేసే విధంగా ఉంటుంది.

హీరోయిన్‌ రెజీనాపెర్ ఫార్మెన్స్ గురించి?
- రెజీనా బ్యూటిఫుల్‌ బబ్లీ క్యారెక్టర్‌లో నటించింది. నిర్మాతకి రెస్పెక్ట్‌ ఇచ్చి ఎంతో కోపరేట్‌ చేసి ఈ సినిమా చేసింది రెజీనా. క్యారెక్టర్‌ని ఓన్‌ చేసుకుని ఆ పాత్రలో ఇన్వాల్వ్‌ అయి నటించింది.

దశరథ్‌ టేకింగ్‌ ఎలా ఉంది?
- దశరథ్‌ ఎన్నో మంచి సినిమాలు తీసి ఆల్‌ రెడీ తనేంటో ప్రూవ్‌ చేసుకున్నాడు. ఈ సినిమాని ఒక కొత్త కాన్సెప్ట్‌ తో రూపొందించాడు. క్రైం థీమ్‌తో కథ రన్‌ అవుతుంది. స్పెషల్‌గా టేకింగ్‌ చాలా స్పీడ్‌గా ఉంటుంది. అప్పుడే సినిమా అయిపోయిందా అనే ఫీలింగ్‌ ప్రేక్షకులకు కలుగుతుంది. నాకు కథ ఎలా అయితే నెరేట్‌ చేశాడో అంతకంటే బెటర్‌గా సినిమాని తెరకెక్కించాడు దశరథ్‌. ‘మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌’ తర్వాత దశరథ్‌కి ఈ చిత్రం మరో సూపర్‌హిట్‌ ఫిలిం అవుతుంది.

ఆడియోకి ఎలాంటి ఫీడ్‌బ్యాక్‌ వస్తోంది?
- ఈ సినిమాతో కొత్త మ్యూజిక్‌ డైరెక్టర్‌ వేదని ఇంట్రడ్యూస్‌ చేస్తున్నాం. సీనియర్‌ మ్యూజిక్‌ డైరెక్టర్స్‌ కి ధీటుగా వండర్‌ఫుల్‌ ట్యూన్స్‌ని కంపోజ్‌ చేశాడు. ఆడియోకి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. సాంగ్స్‌ అన్నీ హిట్‌ అయ్యాయి. టాప్‌ టెన్‌లో ఆడియోకి మంచి రేటింగ్స్‌ ఇచ్చారు. ముఖ్యంగా ఇలాంటి థ్రిల్లర్ చిత్రానికి రీ రికార్డింగ్‌ చాలా ఇంపార్టెంట్‌. వేద ఈ సినిమాలో రీ రికార్డింగ్‌ చాలా అద్భుతంగా చేశాడు. వేదకి ఈ సినిమా మంచి బ్రేక్‌ ఇస్తుంది.

Malkapuram Sivakumar interview gallery

ప్రొడ్యూసర్‌గా ఈ సినిమాలో మీ ఇన్వాల్వ్‌మెంట్‌ ఎంతవరకు ఉంది?
- కథని నమ్మి దానికి ఏది అవసరమో అవన్నీ ప్రొవైడ్‌ చేశాను. బడ్జెట్‌కి వెనకాడకుండా చాలారిచ్‌గా చిత్రాన్ని నిర్మించాను. హైదరాబాద్‌, కర్ణాటక సహా ఫారిన్‌ లో షూటింగ్‌ జరిపాం. విజువల్‌గా సినిమా చాలా గ్రాండియర్‌గా ఉంటుంది. ఒక నిర్మాతగా నేను పూర్తిగా ఇన్‌వాల్వ్‌ అయి చేసిన సినిమా ఇది. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్‌ అందరూ తమ సొంత చిత్రంలా భావించి చేశారు. వారందరికీ మా బ్యానర్‌ తరఫున నా కృతజ్ఞతలు.

బిజినెస్‌ రెస్పాన్స్‌ ఎలా ఉంది?
- ఆల్‌మోస్ట్‌ అన్ని ఏరియాల బిజినెస్‌ కంప్లీట్‌ అయింది. బయ్యర్స్‌ అందరూ ఫ్యాన్సీ రేటుతో మా చిత్రాన్ని కొనుగోలు చేసి రిలీజ్‌ చేస్తున్నారు. మనోజ్‌ చిత్రాల అన్నింటికంటే వరల్డ్‌వైడ్‌గా 1000 థియేటర్లలో ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేస్తున్నాం. ఏపీ, తెంగాణ, కర్నాటక, తమిళనాడు, నార్త్‌ ఇండియాలో 700 థియేటర్లు, ఓవర్సీస్‌లో 300 థియేటర్లలో మార్చి 4న రిలీజ్‌ చేస్తున్నాం.

ఈ చిత్రంలో ముఖ్య పాత్ర గురించి?
- ప్రకాష్‌రాజ్‌గారు ఒక ముఖ్య క్యారెక్టర్‌లో నటించారు. అలాగే బ్రహ్మానందం రెగ్యులర్‌ పాత్రలో కాకుండా విభిన్నమైన పాత్ర పోషించారు. ప్రతి ఒక్కరూ వారి వారి పాత్రకు న్యాయం చేశారు. ప్రేక్షకులు ఎంజాయ్‌ చేసేవిధంగా వారు కొన్న టికెట్‌కి పదింతు హ్యాపీగా ఫీల్‌ అయ్యేలా ఈ సినిమా శాటిస్‌ఫాక్షన్‌ కలిగిస్తుంది. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికీ మంచి పేరు తెస్తుంది. అలాగే మా బ్యానర్‌ వాల్యూని పెంచే విధంగా ఈ చిత్రం ఉంటుంది. ఇదే టీమ్‌తో ఇంకా పది సినిమాు తీసేవిధంగా నాకు సపోర్ట్‌చేసిన మా టీమ్‌ అందరికీ నా థాంక్స్‌.

నెక్ట్స్‌ ప్రాజెక్ట్‌?
` ఒక ప్రముఖ హీరోతో ఉగాది పర్వదినాన మా సురక్ష ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌లో మూడవ చిత్రాన్ని స్టార్ట్‌ చేస్తాం. వివరాలు త్వరలో తెలియచేస్తాను .

 


 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved