pizza
Manchu Manoj interview (Telugu) about Gunturodu
విలన్‌గా చేయ‌డానికి కూడా నేను రెడీ - మంచు మ‌నోజ్‌
You are at idlebrain.com > news today >
Follow Us

26 February 2017
Hyderabad

మంచు మనోజ్‌, ప్రగ్యా జైశ్వాల్‌ హీరో హీరోయిన్లుగా క్లాప్స్‌ అండ్‌ విజిల్స్‌ బ్యానర్‌లో ఎస్‌.కె.సత్య దర్శకత్వంలో వరుణ్‌ నిర్మించిన చిత్రం 'గుంటూరోడు'. ఈ సినిమా మార్చి 3న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా మంచు మ‌నోజ్‌తో ఇంట‌ర్వ్యూ...

* గుంటూరోడు గురించి చెప్పండి?
ఫిబ్ర‌వ‌రి 24న విడుద‌ల చేద్దామ‌ని అనుకున్నాం. కానీ మాకు అనుకున్న‌న్ని థియేట‌ర్లు దొర‌క‌లేదు. దేవుడు ద‌య‌వ‌ల్ల ప‌రిశ్ర‌మ‌లో విడుద‌లైన సినిమాల‌న్నీ హిట్ అవుతున్నాయి. అందువ‌ల్ల థియేట‌ర్లు దొర‌క‌లేదు. మూడో తారీఖు మా సినిమా చాలా మంచి థియుట‌ర్ల‌లో విడుద‌ల కానుంది.

ద‌ర్శ‌కుడు స‌త్య‌గారు చాలా బాగా చేశారు. నేనిప్ప‌టి వ‌ర‌కు కామెడీ మిక్స్ అయిన స‌బ్జెక్ట్ లే చేశాను. ఇది కంప్లీట్‌గా హీరోయిజ‌మ్ ఉన్న సినిమా. సింపుల్ థ్రెడ్‌. అయినా స‌త్య చాలా బాగా అల్లాడు. వెరీ గుడ్ యాక్ష‌న్ టెంపో ఉంటుంది.

* గుంటూరోడు ఎలా ఉంటాడు?
గుంటూరోడు ఎక్కువ ఆనందం వ‌చ్చినా త‌ట్టుకోలేడు. కోపం వ‌చ్చినా త‌ట్టుకోలేడు. క‌ళ్ల ముందు అన్యాయం జ‌రిగితే వాడి చేతికి దుర‌ద పుడుతుంది. దుర‌ద ఎలా తీరుతుందో సినిమా చూస్తే తెలుస్తుంది.

దుర‌ద తెచ్చిన ఇబ్బందుల‌తో ఈ సినిమా జ‌రుగుతుంది. ఆనందం వ‌చ్చినా స్పెష‌ల్ థీమ్ సాంగ్ వేసుకుని ఆ ఆనందాన్ని ఆస్వాదిస్తుంటాడు. సినిమా మొత్తం ఆ థీమ్ సాంగ్ ఉంటుంది.

* కార‌కారంగా ఉంటాడా?
గుంటూరోడు సినిమాలో కార‌కారంగా ఉంటాడు. గుంటూరులో జ‌రుగుతున్న సిట్చువేష‌న్‌కి త‌గ్గ‌ట్టు ప్లాన్ చేశాం. ప్ర‌తి ఊరులో ఇలాంటి కేర‌క్ట‌ర్ ఉంటుంది. హీరోకి, విల‌న్‌కి ఉన్న ఒక ఈగో ప్రాబ్ల‌మ్ వ‌ల్ల ఏం జ‌రిగింద‌న్న‌ది ఆస‌క్తిక‌రం. నాకూ, సంప‌త్‌గారికి ఎలాంటి ఈగోలు వ‌చ్చాయ‌న్న‌దే సినిమా. సంప‌త్‌గారికి క‌టౌట్‌కి, నాకూ చాలా బాగా కుదిరింది. చాలా ట‌గ్ ఆఫ్ వార్‌లాగా చేశాం. చాలా ఎంక‌రేజింగ్‌గా అనిపించింది.

* యాక్ష‌న్ సినిమా మ‌నోజ్‌కి లేట్‌గా ప‌డింద‌నే వారికి ఏం చెబుతారు?
- లేటుగా ప‌డింద‌నేది ఏమీ లేదు. మంచి స్క్రిప్ట్, మంచి టీమ్ దొర‌కాలంటే ప్ర‌కృతి, దేవుడు సాయం చేయాలి. నా గ‌త చిత్రాలు చాలా బాగా పే చేసిన సినిమాలున్నాయి. కానీ ఆ పేమెంట్‌కే నేను ఫిక్స్ అయిపోతే యాక్ట‌ర్‌గా కంప్లీట్ అయిన‌ట్టు కాదు. ఇంకా కొత్త‌కొత్త‌గా చేస్తూ ఉండాలి. నేనిప్పుడు చేస్తున్న‌ది అదే. నాకోసం నేనేమీ క‌థ‌లు రాసుకోవడం లేదు. నా వ‌ర‌కు వ‌చ్చిన క‌థ‌ల్లో సూట్ అయ్యేవాటిని ఎంపిక చేసుకుంటున్నాను. డిఫ‌రెంట్‌గా ఏదైనా ట్రైచేసినా ఓకే అంటున్నా. నాకు ప్ర‌తిదీ క‌మ‌ర్షియ‌ల్ కావాల‌నేం లేదు. ఎందుకంటే ఒక చిత్రం ఎంత వ‌సూలు చేస్తుంద‌నేది ప్రేక్ష‌కుల చేతిలో ఉంటుంది. నేను డిఫ‌ఱెంట్‌గా చేసినా, క‌మ‌ర్షియ‌ల్‌గా చేసినా అది వెంట‌నే నా సినిమా ట్రైల‌ర్‌లో తెలిసిపోతుంది.

* ఇండ‌స్ట్రీలో యాక్ట‌ర్ నెక్స్ట్ లెవ‌ల్‌కి వెళ్లాలంటే జ‌నాలు చూసేది హిట్ ఫ్లాపేగా?
- అవునండీ. నా సినిమా ఏదీ ఇప్ప‌టిదాకా బ్యాడ్‌గా ఫెయిల్ కాలేదు. డిఫ‌రెంట్ సినిమా చేసిన‌ప్పుడు దాన్లో క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ పెడితే మినిమ‌మ్ గ్యారంటీ అవుతుంది. అయితే కొన్ని రోజుల త‌ర్వాత ఏం చేయాలో అర్థం కాదు. బ‌ట్ నాకు డిఫ‌రెంట్‌గా చేసినా క‌నెక్ట్ అయిందనుకోండి అది క‌మ‌ర్షియ‌ల్‌గానూ క‌నెక్ట్ అవ్వ‌చ్చు. లేకుంటే తెలుగులో ఫ‌లానా సినిమాలు రావ‌డం లేదు అనే ఫీలింగ్ వ‌స్తుంది. దాన్ని దాటుకుని డిఫ‌రెంట్ సినిమా చేయ‌గ‌ల‌గాలి. అప్పుడే సినిమా ఇంకో స్థాయికి వెళ్తుంది.

*శౌర్య చేశారు క‌దా? దాన్ని కూడా ఎక్స్ పెరిమెంటే అంటారా?
- అంటే అప్పుడు నేను క‌మ‌ర్షియ‌ల్ ట్రాక్‌లోనే ఉన్నా. అలాంటి స‌మ‌యంలో ఆ సినిమా నాకు ఎక్స్ పెరిమెంటే. ఎందుకంటే ఆ సినిమాలో హీరో కామెడీ చేయ‌డు. న‌వ్వ‌డు, ఎక్క‌డా ఫైట్లు ఉండ‌వు. అలాంట‌ప్పుడు అది ప్ర‌యోగ‌మేగా. కాక‌పోతే ఏంటంటే నాకు ద‌శ‌ర‌థ‌గారు ఆ క‌థ చెప్పిన‌ప్పుడు న‌చ్చింది. క‌మ‌ర్షియ‌ల్‌గా పే చేసిందా లేదా అనేది ప‌క్క‌న పెడితే నాకు న‌చ్చి నేను చేసిన పాత్ర అది. ఆర్టిస్ట్ గా న‌న్ను ఒక అడుగు ముందుకు తీసుకెళ్లింది. అటాక్ కూడా అంతే. ఆర్టిస్ట్ గా ఒక అడుగు ముందుకు వెళ్లింది.

* శౌర్యలో కాస్త లావుగా క‌నిపించారు.. కార‌ణం ఒక్క‌డు మిగిలాడు అని చెప్పారు?
- నిజ‌మేనండీ. ఒక్క‌డు మిగిలాడు సినిమా కోస‌మే నేను వెయిట్ పెరిగా. ఆ వెయిట్‌తో శౌర్య చేయ‌డం వ‌ల్ల వ‌చ్చిన న‌ష్ట‌మేమీ లేదు. నిజానికి వెయిట్‌కి, హీరోయిజానికి ఎక్క‌డా పొంత‌న లేదు. ఆ మాట‌కొస్తే మోహ‌న్‌లాల్‌గారు ప‌రిశ్ర‌మ‌లో ఉండ‌లేరు. సినిమా బావుండాలి. హీరో చూడ్డానికి బావుండాలి అంతే. న‌న్ను గ‌మ‌నిస్తే దొంగ దొంగ నుంచి ఇప్ప‌టిదాకా చాలా బాగా మారాను. పోస్ట‌ర్ లో అది స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది. నా హెయిర్ స్టైల్ నుంచి ప్ర‌తిదీ మారుతూనే క‌నిపిస్తుంది. నా పోస్ట‌ర్స్ ఏమైనా ప‌క్క‌ప‌క్క‌న‌పెట్టి చూస్తే ఒకేలా ఎప్పుడూ అనిపించ‌దు. సాఫ్ట్ వేర్ వ్య‌క్తికి త‌గ్గ‌ట్టుగానే శౌర్య‌లో నా బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. అటాక్‌లోనూ ఆర్జీవీగారు న‌న్ను అలాగే చూడాల‌నుకున్నారు. దాని త‌ర్వాత ఒక్క‌డు మిగిలాడు షూటింగ్ జ‌రిగింది. దానికి, గుంటూరోడికి ఎనిమిది కిలోలు తేడా క‌నిపిస్తుంది. గుంటూరోడికి మ‌జిల్స్ పెంచా. ఒక్క‌డు మిగిలాడు ఆ పాత్ర‌కి, మ‌రో పాత్ర‌కి 14 కిలోల తేడా ఉంటుంది. దానిలోనే రెండు ఎపిసోడ్స్ ఉంటాయి. దానిలో రెండు ఎపిసోడ్స్ ఉంటాయి. నిన్న‌టిత‌రం హీరోలు ఎన్ని ర‌కాల పాత్ర‌లు చేసేవార‌నీ... కానీ ఇప్పుడు అన్ని రోల్స్ ఎక్క‌డున్నాయి. అప్ప‌ట్లో థియేట‌ర్లు అంద‌రివీ. కానీ ఇప్పుడు ముగ్గురివో, న‌లుగురివో. వాళ్ల ప్ర‌కార‌మే విడుద‌ల చేయాల్సి వ‌స్తోంది. కానీ నేను అందులోనుంచి బ‌య‌ట‌ప‌డ‌టానికి ప్ర‌య‌త్నిస్తున్నా. నేను నేను మీకు తెలుసా, ప్ర‌యాణం అప్పుడు చేశా. ఇప్పుడు అలాంటివే వ‌స్తున్నాయి. అలాంట‌ప్పుడు నేను ఎందుకు వ‌దులుకోవాలి? ఊకొడ‌తారా ఉలిక్కిప‌డ‌తారాను కూడా కాస్త మేం ముందుగా ట్రై చేశాం. క‌మ‌ర్షియ‌ల్ ఏముందండీ... ఇప్పుడు మొద‌లుపెట్టాను. ఇక నుంచి తొడ‌లు కొట్టుకుంటూ వెళ్లొచ్చు. ఇందులో ఎంట‌ర్ అయిన త‌ర్వాత డిఫ‌రెంట్‌గా చేయ‌డం చాలా క‌ష్ట‌మ‌వుతుంది.

* పెళ్లైన త‌ర్వాత మీలో ఏమైనా మార్పు వ‌చ్చిందా?
- వ‌చ్చిందండీ. ఇప్పుడు వాచ్ చూసుకుంటున్నాను. అప్ప‌టికీ, ఇప్ప‌టికీ అదొక్క‌టే తేడా.

* మీ వైవాహిక జీవితం ఎలా ఉంది?
- చాలా బావుందండీ. నేను నా బెస్ట్ ఫ్రెండ్‌నే పెళ్లి చేసుకున్నా. త‌న‌కి పెళ్లికి ముందే నా గురించి మొత్తం చెప్పా.

* ద‌ర్శ‌కుడు ఎస్‌.కె.స‌త్య తొలి సినిమా పెద్ద స‌క్సెస్ కాలేదు క‌దా..మ‌రి ఏ న‌మ్మ‌కంతో ఈ సినిమా చేయ‌డానికి ఒప్పుకున్నారు?
- హిట్ ప్లాప్ అనేవి అనేక కార‌ణాల‌పైన ఆధార‌ప‌డి ఉంటుంది. రిలీజ్ టైంలో రిలీజ్ క‌రెక్ట్‌గా ప‌డ‌క‌పోవ‌చ్చు. పండగ‌ల టైంలో పెద్ద సినిమాలను రిలీజ్ చేసి ప‌రీక్ష‌లు, డిమానిటైజేష‌న్ టైంలో చిన్న సినిమాల‌కు స‌మ‌యం ఇస్తారు. అలాంటప్పుడు అవి స‌క్సెస్ కాలేవు. అలా ఓ డైరెక్ట‌ర్ టాలెంట్‌ను ఓ సినిమాను బ‌ట్టి అంచ‌నా వేయ‌లేం. ఇక గుంటూరోడు సినిమా క‌థ చెప్ప‌డానికి ముందు స‌త్య ఏ సినిమా చేశాడ‌నే సంగ‌తి నాకు తెలియ‌దు. గుంటూరోడు క‌థ విన‌గానే నాకు బాగా న‌చ్చింది. అప్పుడు త‌ను చేసిన మొద‌టి సినిమా గురించి త‌ను చెప్పాడు. క‌థ నెరేట్ చేసేట‌ప్పుడే నాకు క‌థ‌లోని ఎమోష‌న్స్ బాగా న‌చ్చాయి. క్యారెక్ట‌ర్ ప‌రంగా డైరెక్ట‌ర్ స‌త్య‌ను ఫాలో అయిపోయానంతే. డైలాగ్స్‌ను కాన్‌వ‌ర్‌జేష‌న్‌లా రాసుకున్నాడు. సాంగ్స్‌ను క‌రెక్ట్ ప్లేస్ మెంట్‌లో వ‌చ్చేలా చూసుకున్నారు.

* చిరంజీవి చేత వాయిస్ ఓవ‌ర్ చెప్పించాల‌నుకోవ‌డం ఎవ‌రి ఆలోచ‌న‌?
- డైరెక్ట‌ర్ సినిమా ముందు నుండి ఈ సినిమాకు వాయిస్ ఓవ‌ర్‌ను ఎవ‌రైనా స్టార్ చేత చెప్పించాల‌ని అంటుండేవాడు. నేను మొద‌ట చ‌ర‌ణ్‌ను అడిగాను. చ‌ర‌ణ్ డెఫ‌నెట్‌గా చెబుతాను అన్నాడు కానీ..ప్ర‌స్తుతానికి వేరే ఊర్లో ఉన్నాను, రావ‌డానికి ప‌ది రోజుల‌వుతుంద‌ని చెప్పాడు. అలాంటి స‌మ‌యంలో నాన్న‌గారు చిరంజీవిగారి ఇంటికి బ్రేక్ ఫాస్ట్‌కు వెళుతున్నారు. నేను కూడా వ‌స్తాన‌ని చెప్పి చిరంజీవిగారి ఇంటికి వెళ్ళి ఇలా గుంటూరోడు సినిమాకు వాయిస్ ఓవ‌ర్ చెప్పాల‌ని ఆయ‌న్ను అడ‌గ్గానే..ఎప్పుడు చెప్పాలి.. అన్నారు. రెండు రోజుల్లో చెప్పాలంకుల్ అన‌గానే..ఈరోజు చెప్పేయ‌మంటావా అన్నారు..వాట్ ఎ గ్రేట్ ప‌ర్స‌న్‌..మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడులో ఎంత బిజీగా ఉన్నా..నేను అడ‌గ్గానే స‌రే చేద్దామ‌ని అన్నారు. అన‌డ‌మే కాకుండా పూర్తి చేసి ఇచ్చారు. చ‌ర‌ణ్‌కి ఈ విష‌యం తెలిసి..నువ్వు చిన్న పిట్ట కోసం వ‌చ్చావు..నీకు పెద్ద పులే దొరికింది అని అన్నాడు.

*`బిళ్ళా రంగా` సినిమా ఎప్పుడు చేస్తారు?
- నేను సాయిధ‌ర‌మ్ తేజ్ చిన్న‌ప్ప‌ట్నుంచి `బిళ్ళా రంగా` సినిమా చేయాల‌నే అనుకున్నాం. మంచి డైరెక్ట‌ర్‌, ఇప్ప‌టి ట్రెండ్‌కు త‌గ్గ‌ట్లు మంచి క‌థ దొరికితే చేయ‌డానికి ఎప్పుడైనా నేను రెడీ.

* విల‌న్‌గా అవ‌కాశం వ‌స్తే చేస్తారా?
- నేను రెడీ అండీ..క‌చ్చితంగా విల‌న్‌గా చేస్తాను.

* త‌మిళంలో ఎప్పుడు చేస్తున్నారు?
- ఈ ఏడాది మే నెల నుండి తెలుగు, త‌మిళంలో చేయ‌బోయే సినిమా స్టార్ట్ అవుతుంది. `గుంటూరోడు` కూడా త‌మిళంలో రీమేక్ చేయాల‌నే ప్లాన్‌లో ఉన్నాను. అలాగే ఎల్‌.టి.టి.ఇ ప్ర‌భాక‌ర‌న్‌గా న‌టించిన చిత్రం కూడా త‌మిళంలో విడుద‌ల‌వుతుంది. ఈ సినిమా చాలా డిఫ‌రెంట్‌గా ఉంటుంది.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved