pizza
Manjula Ghattamaneni interview (Telugu) about Manasuku Nachindi
మంచి కథాబలం ఉన్న సినిమాలు చేయడం నా బాధ్యత - మంజుల
You are at idlebrain.com > news today >
Follow Us

12 February 2018
Hyderabad

సందీప్‌ కిషన్‌ హీరోగా అమైరా దస్తూర్‌, త్రిదా చౌదరి హీరోయిన్‌గా మంజుల ఘట్టమనేని దర్శకత్వంలో ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌, ఇందిరా ప్రొడక్షన్స్‌ బేనర్స్‌పై పి. కిరణ్‌, సంజయ్‌ స్వరూప్‌ నిర్మించిన చిత్రం 'మనసుకు నచ్చింది'. ఈ చిత్రం ఫిబ్రవరి 16న విడుదలవుతుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకురాలు మంజుల ఘట్టమనేనితో ఇంటర్వ్యూ...

నా హృదయంలో నుండి వచ్చిన ఆలోచనే..
- నా మనసుకు నచ్చిన కథతో చేసిన సినిమా 'మనసుకు నచ్చింది'. ఏదో ఒక సినిమా చేయాలనే స్టేజ్‌లో నేను లేను. నేను పనిచేయాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఈరోజు నేను సినిమా చేస్తున్నానంటే.. నా హృదయంలోని విషయాలను వ్యక్తపరచాలనే ఉద్దేశంతోనే. ఎక్కడో.. ఏదో ఒక సినిమా.. ఐడియా చూసి చేసిన సినిమా కాదు. నా హృదయంలో నుండి వచ్చిన ఆలోచనతో చేసిన సినిమా ఇది.

ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు చేంజ్‌ కూడా...
- సినిమా అనేది ఆర్ట్‌. ఎంటర్‌టైన్‌మెంట్‌ అవసరమే. మన జీవితంలో అవసరమే. దీంతో పాటు ఏదో ఒక చిన్న చేంజ్‌ కూడా ఉండాలి. అలా చేంజ్‌తో ఉండే సినిమా 'మనసుకు నచ్చింది'. రేపు సినిమా చూసిన తర్వాత సూర్యోదయాన్ని, సూర్యాస్తమయాన్ని చూడాలనుకుంటారు. మన జీవితంలో చిన్న చిన్న ఆనందాలను వదిలేసుకుంటున్నాం. వేగవంతమైన జీవితంలో ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నాం. నేను కూడా ఒకప్పుడు అలాగే ఉండేదాన్ని. కానీ ఎప్పుడైతే జీవితంలో చిన్న చిన్న ఆనందాలను ఆస్వాదించడం మొదలు పెట్టానో (.. పక్షుల కిల కిల రావాలు.. పువ్వుల సువాసన ఆస్వాదించడం) నాకు చాలా ప్రశాంతంగా అనిపించింది. నేను దాన్ని అందరికీ షేర్‌ చేయాలనిపించింది. మనం అందరం ఒకటే కదా! అనిపించింది. నేను ఫీల్‌ అయిన అనుభవాలను సినిమా రూపంలో చెబితే బావుంటుందనిపించింది. సినిమాకు కథ చాలా ముఖ్యం. మన చుట్టూ ఉన్న సమాజంలో ప్రోగ్రెస్‌ అనేది మంచి కథలను చెప్పడం ద్వారా ముందుకు సాగుతుంది. మంచి సినిమాలు ఇప్పుడు మనకు ఎంతో అవసరం. ఏదో కమర్షియల్‌ సినిమాలు చేయాలనుకుంటే చెసేయవచ్చు. నా అనుభూతులను సినిమా రూపంలో చెప్పాలనుకున్నాను. నిజంగా ప్రేక్షకులను మదిలో పెట్టుకుని మనం అందరం గర్వంగా ఫీలయ్యేలా ఈ సినిమా చేశాను.

చాలా లేయర్స్‌తో...
- 'మనసుకు నచ్చింది' ఓ సముద్రంలాంటి సినిమా. సినిమాలో చాలా లేయర్స్‌ ఉంటాయి. కంప్లీట్‌ ఫన్‌ లవ్‌స్టోరీ. కథ వెనుక మరో కథ ఉంటుంది. మన మనసుకు మనం కనెక్ట్‌ కావడానికి నేను ప్రకృతి (సూర్యోదయం, సూర్యాస్తమయం, గాలి) అనే అంశాన్ని ఈ సినిమాలో ఉపయోగించాను. ఈ సినిమాలో అసలు హీరో ప్రకృతే. ప్రకృతి రూపంలో మహేష్‌బాబు వాయిస్‌ ఓవర్‌ ఇచ్చాడు.

అందుకే సమయం పట్టింది..
- నేనే మొత్తం స్క్రిప్ట్‌ను రాసుకున్నాను. అలా స్క్రిప్ట్‌ అంతటినీ తయారు చేసుకోవడానికి ఏడాది సమయం పట్టింది. నేను ఇంగ్లీష్‌లో రాసిన దాన్ని సాయిమాధవ్‌ బుర్రాగారు అందమైన తెలుగులో రాశారు. ఈ ప్రాసెస్‌ పూర్తి కావడానికి ఏడాదిన్నర సమయం పట్టింది. క్యారెక్టర్‌కి ఓ ఫ్లో ఉంటుంది. నేను త్వరగా ఏదో చేసేయాలని ఆ ఫ్లోను దెబ్బతీయలేను. మంచి సినిమా చేయాలనే ఈ సినిమా చేశాను. ఎందుకంటే మంచి సినిమాలు మన జీవితంలో ఎంతో కీలక పాత్రను పోషిస్తాయి. మంచి కథాబలం ఉన్న సినిమాలు చేయడం నా బాధ్యత.

నా హృదయానికి దగ్గరైన కథ...
రియల్‌ కాదు... ఫిక్షనల్‌ స్టోరీ..
- ఇది నిజ జీవితానికి సంబంధించిన కథ కాదు. ఫిక్షనల్‌ స్టోరీ. నా జీవితంలో లవ్‌స్టోరీ ఉంది.. కానీ దానికి, సినిమాకు సంబంధం లేదు. సినిమాలో నేను చూపిన నిత్య క్యారెక్టర్‌, నా హృదయానికి దగ్గరగా ఉంటుంది. క్యారెక్టర్స్‌ ప్రవర్తించే కొన్ని లక్షణాలను నాన్న, మహేష్‌ ఇలా రియల్‌ లైఫ్‌ వ్యక్తుల నుండి తీసుకున్నవే కానీ. కథ మాత్రం ఫిక్షనల్‌. ఇద్దరు మధ్య సాగే ఫన్‌ లవ్‌స్టోరీ.

- నేను ఎవరినీ దృష్టిలో పెట్టుకుని కథను రాసుకోలేదు. అలా రాయడం నాకు నచ్చదు. కథ పూర్తయిన తర్వాతే నటీనటుల ఎవరైతే బావుంటుందని ఆలోచించాం. నాన్నగారు, మహేష్‌ సినిమాలే ఎక్కువగా చూస్తాను. ప్రస్తుతం ఉన్న యంగ్‌ హీరోస్‌ గురించి నాకు పెద్దగా తెలియదు. సినిమా చేసే క్రమంలో కొంత మందిని వెళ్లి కలిశాను కూడా... అయితే వర్కవుట్‌ కాలేదు. చివరకు సందీప్‌ పేరుని కిరణ్‌గారు సజెస్ట్‌ చేశారు. తను చేసిన వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ సినిమా సీడీని కూడా నాకు పంపారు. నేను ఆ సినిమాను చూడలేదు కూడా. కానీ తనని కలిసిన తర్వాత తను సూట్‌ అవుతాడనిపించింది. తను స్పాంటేనియస్‌. తనకు కరెక్ట్‌ ఇన్‌పుట్‌ ఇస్తే.. తను అవుట్‌పుట్‌ ఎక్స్‌ట్రార్డినరీగా ఉంటుంది. తన క్యారెక్టర్‌లో వేరియస్‌ ఎమోషన్స్‌ ఉంటాయి. చాలా డైమన్షన్స్‌ ఉంటాయి.

interview gallery



డైరెక్షన్‌ కష్టమనిపించలేదు..
- దర్శకత్వం చేయడం కష్టమనిపించలేదు. పూర్తి సెట్‌ను నా చేతిలోకి తీసుకున్నాను. మా సినిమాటోగ్రాఫర్‌ రవి యాదవ్‌గారు.. 'అదేంటి మేడమ్‌, పది సినిమాలు చేసిన అనుభవమున్న డైరెక్టర్‌గా అనిపిస్తున్నారు' అన్నారు. డైరెక్టర్‌గా పదికి పది మార్కులు ఇచ్చుకుంటాను. డైరెక్షన్‌ చేస్తానని చెప్పగా.. నా భర్త ఎంకరేజ్‌ చేశారు. అలాగే నాన్నగారు ఎంతో హ్యాపీగా, థ్రిల్‌గా ఫీలయ్యారు. 'మహేష్‌.. నీకు పిచ్చెక్కిందా? దర్శకత్వం చేయడం ఎంతో కష్టం' అన్నారు. ట్రైలర్‌ చూసి తను షాకయ్యాడు. చాలా బావుందని అప్రిసియేట్‌ చేశాడు. నాన్నగారు, మహేష్‌ ఇద్దరూ తొలిరోజు, తొలి ఆటను చూస్తామని చెప్పారు. దర్శకత్వంలో నాకు ఎవరూ ఇన్‌స్పిరేషన్‌ లేదు. ఒక్కొక్క దర్శకుడిలో ఒక్కొక్క శైలి నచ్చుతుంది.

తనే పిలిచి అవకాశం ఇస్తాడు..
- నేను మహేష్‌కి ఎలాంటి కథ రాయాలి అని ఆలోచించకూడదు. ఎందుకంటే తన యాక్టింగ్‌ గురించి అందరికీ తెలిసిందే. అయితే తన ఇమేజ్‌కు తగ్గ కథ అయితే తనే పిలిచి సినిమా చేయమంటాడు. అదీగాక తను సెట్‌లో నా మాట వినడు. ఇద్దరం కొట్టుకుంటాం. మహేష్‌తో సినిమా చేయడం నా డ్రీమ్‌.

పవన్‌ సినిమా గురించి..
- పవన్‌కు మాత్రమే సూట్‌ కథ ఉంది. తను ప్రజా సేవ చేయాలనే తపనతో సినిమాలనుండి రాజకీయాలకు వెళుతున్నాడు. దానికి సంబంధించిన కథ నా దగ్గరుంది.

కీలక పాత్రలో ...
- సినిమాలో హీరో, హీరోయిన్‌ తర్వాత కీలకమైన పాత్రలో మా అమ్మాయి నటించింది.

త‌దుప‌రి చిత్రం...
- ఒక స్టోరీ రెడీ చేసుకుని దానికి ఎవ‌రు స‌రిపోతారో వారితో సినిమా చేస్తాను.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved