pizza
Mannara Chopra interview about Jakkanna
తెలుగు డిక్ష‌న్ నేర్చుకుంటున్నా - మ‌న్నార చోప్రా
You are at idlebrain.com > news today >
Follow Us

23 July 2016
Hyderaba
d

సునీల్ క‌థానాయ‌కుడిగా రూపొందుతున్న చిత్రం `జ‌క్క‌న్న`. మ‌న్నార చోప్రా నాయిక‌. వంశీకృష్ణ ఆకెళ్ల ద‌ర్శ‌కుడు. ఆర్‌.సుద‌ర్శ‌న రెడ్డి నిర్మాత‌. ఈ సినిమా ఈ నెల 29న విడుద‌ల కానుంది. ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లో శ‌నివారం నాయిక మ‌న్నార చోప్రా విలేక‌రుల‌తో మాట్లాడింది. ఆ విశేషాలు...

* జ‌క్క‌న్న గురించి చెప్పండి?
- చాలా మంచి సినిమా. చూసిన ప్ర‌తి ఒక్క‌రికీ న‌చ్చుతుంది.

* మీ పాత్ర ఎలా ఉంటుంది?
- చాలా నేచుర‌ల్‌గా, బ‌బ్లీగా ఉంటుంది. నేను నిజ జీవితంలో ఎలా ఉంటానో ఈ సినిమాలోనూ అలాగే ఉంటాను.

* సునీల్‌తో యాక్ట్ చేయ‌డం ఎలా అనిపించింది?
- ఫ్రెండ్లీ కోస్టార్‌. డ్యాన్సులు బాగా చేస్తారు. ఆయ‌న కామెడీ టైమింగ్ బావుంటుంది. ఆయ‌న న‌టించిన సినిమాల హిందీ వెర్ష‌న్ల‌ను చూశాను. ఆయ‌న సినిమాల‌ను చూస్తే న‌వ్వొచ్చేస్తుంది.

Mannara Chopra interview gallery

* మ‌రి ఆయ‌న కామెడీ టైమింగ్‌ని ఎలా రీచ్ అయ్యారు?
- తెలుగు డైలాగుల‌ను బాగా మ‌క‌ప్ చేశాను. డైలాగుల్లో ఫ్లో ఉంటే న‌ట‌న దానంత‌ట అదే వ‌స్తుంది. తెలుగు డిక్ష‌న్ ఇంకా బాగా నేర్చుకునే ప్ర‌య‌త్నాలు చేస్తున్నాను.

* రోగ్, తిక్క‌, ఇప్పుడు జ‌క్క‌న్న‌... ఇద్దరు హీరోయిన్ల సినిమాల్లోనే చేస్తున్నారు. మీరు కంఫ‌ర్ట‌బుల్‌గా ఫీల‌వుతున్నారా?
- అవునండీ. నా పాత్ర‌కున్న ప్రాధాన్య‌త‌ను చూస్తాను. బాగా ఉంద‌నిపిస్తే చేస్తాను.

* పేరు మార్చుకున్న‌ట్టున్నారు?
- అవునండీ. మ‌న్నారా అంటే షైనింగ్ అని అర్థం. ఈ రంగంలో షైన్ కావాల‌ని పేరు మార్చుకున్నా.

* బాలీవుడ్‌లో సినిమా చేసిన‌ట్టున్నారు. ఈ సినిమా చేయ‌డం ఎలా అనిపించింది?
- ఇక్క‌డివారు మ‌రింత ఎక్కువ ప్రొఫెష‌న‌ల్‌గా ఉంటారు. సినిమా బావుంటే ప్రేక్ష‌కులు చాలా గొప్ప‌గా విజ‌యం చేసి తీరుతారు.

* ఇందులో స‌ప్త‌గిరితో మీకు సీన్లుంటాయా?
- స‌ప్త‌గిరితో నాకు కొన్ని స‌న్నివేశాలుంటాయి. చూసిన ప్ర‌తి ఒక్క‌రూ క‌డుపు చెక్క‌ల‌య్యేలా న‌వ్వుతారు.

* జ‌క్క‌న్న హైలైట్స్ ఏంటి?
- మంచి క‌థ‌, క‌థ‌నం, డ్యాన్సులు ఉంటాయి. ఆహ్లాద‌క‌రంగా న‌వ్వుకునేలా ఉంటుంది. ప్రొడ‌క్ష‌న్ వేల్యూస్‌, డైర‌క్ష‌న్ టాలెంట్ అన్నీ క‌లిపి ప్రేక్ష‌కుల్ని మెప్పిస్తాయి.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved