pizza
Maruthi interview (Telugu)) about Brand Babu
నా దగ్గర పదేళ్లకు సరిపడే కథలున్నాయి - మారుతి
You are at idlebrain.com > news today >
Follow Us

29 July 2018
Hyderabad

మారుతి సమర్పణలో శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై ప్రభాకర్‌.పి దర్శకత్వంలో ఎస్‌.శైలేంద్రబాబు నిర్మించిన చిత్రం 'బ్రాండ్‌బాబు'. ఆగస్ట్‌ 3న సినిమా విడుదలవతుంది. ఈ సందర్భంగా ఈ చిత్ర సమర్పకుడు మారుతితో ఇంటర్వ్యూ...

'బ్రాండ్‌బాబు' కథ ఆలోచన అలా వచ్చింది?
- నాకు బ్రాండ్స్‌ అంటే పిచ్చి లేదు. ఎందుకంటే నేను మిడిల్‌ క్లాస్‌ జీవితానికి అలవాటు పడ్డాను. అయితే చాలా మందికి బ్రాండ్స్‌ అంటే పిచ్చి ఉంది. చాలా మంది బ్రాండ్స్‌ ఉన్న వస్తువులను చూపిస్తూ గొప్పలు పోతుంటారు. కొందరైతే బ్రాండ్స్‌ ఉంటేనే మనుషులతో కూడా మాట్లాడుతుంటారు. అలాంటి వారిని నేను చాలా మందినే గమనించాను. అలాంటి బ్రాండ్స్‌పై ఓ సినిమా చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది. కేవలం బ్రాండ్‌ గురించే ఆలోచించే ఓ టిపికల్‌ ఫ్యామిలీ ఉంటే ఎలా ఉంటుదనే కాన్సెప్ట్‌తో కథను తయారు చేసుకున్నాను. అలాంటి కుటుంబంలో బ్రాండ్‌ల గురించి ఆలోచించే ఓ కుర్రాడు.. ఎలాంటి బ్రాండ్స్‌ లేని సాధారణమైన అమ్మాయిని లవ్‌ చేస్తే..అంటే అతనికి ప్రేమ విలువ తెలిస్తే.. ఎలా ఉంటుందనేదే బ్రాండ్‌బాబు కథ.

మంచి మెసేజ్‌ కూడా...
- నేను తొలిసారి కథ, మాటలు, స్క్రిప్ట్‌ పూర్తిగా అందించిన సినిమా ఇది. ఏదో బ్రాండ్‌లపై ఎంటర్‌టైనింగ్‌గా నవ్విద్దామని చేసిన సినిమా కాదు. మంచి మెసేజ్‌ కూడా ఉంటుంది. ఈరోజుల్లో, బస్‌స్టాప్‌ చిత్రాలు జనాల్లోకి వెళ్లడానికి కారణం.. వాటిలో ఉన్న మెసేజ్‌ జనాలకు రీచ్‌ కావడమే. అలాగే మారుతి జనాల్ని ఎంటర్‌టైన్‌ చేసే సినిమాలను అందిస్తాడనే నమ్మకాన్ని మరోసారి ప్రూవ్‌ చేసుకుంటాను.

డైరెక్టర్‌ ప్రభాకర్‌ గురించి...
- ప్రభాకర్‌కి సీరియల్స్‌ డైరెక్ట్‌ చేసిన అనుభవం ఉంది. అందుకే సీన్‌ పేపర్‌ రాగానే అందులో ఎమోషన్‌ని పట్టేసేవాడు. అదే కొత్త దర్శకులతో ఇదే కథను చేసుంటే.. కాస్త టెన్షన్‌ ఉండుండేది. ప్రభాకర్‌కి ఉన్న అనుభవానికి నా స్క్రిప్ట్‌ తోడైంది.

హీరో సుమంత్‌ శైలేంద్ర గురించి...
- ఎవరైనా కొత్త హీరో సినిమా వస్తుందంటే.. అసలు ఆ సినిమా ఎందుకు చూడాలి? అని ప్రేక్షకులు ఆలోచిస్తాడు. అలాంటి సందర్భంలో సినిమా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటే.. ప్రేక్షకులు సినిమాను ఆదరిస్తారు. శైలేంద్రబాబుగారు నాకు చాలా కాలంగా మంచి స్నేహితుడు. ఆయన తన కొడుకుని హీరోయిజం ఉన్న సినిమాతో కాకుండా ఎంటైర్‌టైనింగ్‌గా ఉండే సినిమాతో తెలుగులో ఇంట్రడ్యూస్‌ చేయాలనుకున్నారు. ఆ సమయంలో నేను ఈ కథ చెప్పడం.. ఆయనకు నచ్చడంతో సుమంత్‌ శైలేంద్ర హీరోగా ఈ సినిమా చేశాం. బ్రాండ్స్‌ పిచ్చి ఉండేవాళ్లకు ఓ యారగెన్స్‌ ఉండాలి. అలాంటి యారగెంట్‌ అట్యిట్యూడ్‌ను సుమంత్‌ పర్‌ఫెక్ట్‌గా మ్యాచ్‌ చేశాడు.

interview gallery



'బ్రాండ్‌బాబు' కథ గురించి...
- హీరో హోం మినిస్టర్‌ అమ్మాయికి లైన్‌ వేస్తున్నాను. ఆ అమ్మాయే తనను ప్రేమిస్తుందని అనుకుంటాడు. కానీ ఆ అమ్మాయి పాత నెంబర్‌ని వాళ్లింట్లోని పని అమ్మాయి వాడుతుంటుంది. హీరో అలా హీరోయిన్‌కి రాంగ్‌ కనెక్ట్‌ అయిపోతాడు.

పదేళ్లకు సరిపోయే కథలు..
- నా దగ్గరున్న కథలను నేను సినిమాలుగా తీయాలంటే పదేళ్ల వరకు సరిపోతాయి. అదీగాక కొన్ని సంవత్సరాలు తర్వాత ట్రెండ్‌ మారిపోతుంటుంది. నేనే డైరెక్ట్‌ చేయాలనుకుంటే.. నేను అనుకున్న కథలు సినిమాలు గా తీయలేకపోవచ్చు. చిన్న చిన్న పాయింట్స్‌ బేస్‌ చేసుకుని ఎంటర్‌టైనింగ్‌గా సినిమాలు చేయడమే నా బలం. ముందు యు.వి.క్రియేషన్స్‌లో శర్వాతో ఈ కథను చేద్దామని అనుకున్నాను. అయితే శర్వా ఏదైనా క్యారెక్టరైజేషన్‌పై సినిమా చేద్దామనడంతో మహానుభావుడు సినిమా చేశాను.

స్టార్‌ హీరోలతో...
- సినిమా గురించి సినిమానే మాట్లాడాలి. 'బ్రాండ్‌బాబు' అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే సినిమా అవుతుందనడంలో సందేహం లేదు. నేను మొదటి నుండి కథలతోనే ట్రావెల్‌ అవుతున్నాను. నాకు స్టార్‌ హీరోలతో చేయకూడదని కాదు.. వారికి కథ సూట్‌ అయిపోతుందని నాకు అనిపిస్తే నేను వాళ్లని కలిసి కథ నెరేట్‌ చేస్తాను.

తదుపరి చిత్రాలు...
- ఇప్పుడు 'శైలజా రెడ్డి అల్లుడు' సినిమాను డైరెక్ట్‌ చేస్తున్నాను. అలాగే నేను కాన్సెప్ట్‌ ఇచ్చిన 'భలే మంచి చౌక బేరము' సినిమా సెప్టెంబర్‌లో విడుదలవుతుంది. దీన్ని కె.కె.రాధామోహన్‌గారు విడుదల చేయబోతున్నారు.


 

 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved