pizza
Maruthi interview about Rojulu Marayi
You are at idlebrain.com > news today >
Follow Us

29 June 2016
Hyderaba
d

ఒక వైపు నిర్మాతగా భారీ చిత్రాలు నిర్మిస్తూడిస్ట్రిబ్యూషన్ రంగంలో మంచి తెలుగు చిత్రాల్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న తెలుగు ఫిల్మ్ ఇండ‌స్ట్రీ టాప్‌ ప్రొడ్యూసర్ దిల్ రాజు సమర్పకుడిగావ‌రుస బ్లాక్‌బ‌స్ట‌ర్స్ క‌థ‌ల‌తో సూప‌ర్‌డూప‌ర్ స‌క్సెస్ ల‌తో దూసుకుపోతున్న ద‌ర్శ‌కుడు మారుతి క‌థ‌స్క్రీన్‌ప్లే అందించ‌గామారుతి టాకీస్ బ్యాన‌ర్ లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్గుడ్ సినిమా గ్రూప్ బ్యానర్స్ పై  రూపొందిన చిత్రం రోజులు మారాయి’. ముర‌ళీక‌ష్ణ ముడిదాని ద‌ర్శ‌క‌త్వంలో జి.శ్రీనివాస‌రావు నిర్మాత‌గా ఈ చిత్రం రూపొందింది. సినిమా జూలై 1న విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాత‌ల్లో ఒక‌రైన మారుతితో ఇంట‌ర్వ్యూ....

ఆర్టిక‌ల్ నుండి వచ్చిన ఆలోచ‌న‌....
- పేప‌ర్‌లో ల‌వ్‌రిలేష‌న్ షిప్స్‌లో రీసెంట్ అమ్మాయిలు ఓ అబ్బాయిని చంపేశార‌ని చ‌దివాను. ఆ ఆర్టిక‌ల్ చ‌దువుతుంటే `రోజులుమారాయిక‌థ నా ఆలోచ‌న‌కు వ‌చ్చింది. ఆ ఆర్టిక‌ల్‌ను ఫ‌న్నీగా మ‌లుచుకుంటూ నేనుడైరెక్ట‌ర్ ముర‌ళిరైట‌ర్ ర‌వి క‌లిసి ఆ పాయింట్‌ను డెవ‌ల‌ప్ చేశాం.  దానికి ఓ థ్రిల్లింగ్ ఎలిమెంట్ యాడ్ చేశాం. న‌లుగురు మ‌ధ్య జ‌రిగే క‌థ‌.

చిన్న సినిమాల ప‌రిస్థితి అలా ఉంది....
- కొత్త న‌టీన‌టుల‌తో క‌లిసి చిన్న సినిమా చేస్తున్న‌ప్పుడు ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ థ్రెడ్ స్ట్రాంగ్‌గా ఉండాలి. అలా ఎవ‌రూ తీయ‌డం లేదు. చిన్న సినిమాకు ఆడియెన్స్ రావాలంటే ఆలోచిస్తారుఆసక్తిని చూపించ‌రు. చిన్న సినిమాపై చిన్న చూపు ఉంటుంది. అయితే క‌థ స్ట్రాంగ్‌గా ఉండిఎంట‌ర్ టైన్ చేయ‌గ‌లిగితే అప్పుడే చిన్న సినిమా ఆడుతుంది. ప్ర‌తివారం ఐదారు చిన్న సినిమాలు వ‌స్తున్నాయి. వెళ్ళి డ‌స్ట్‌ బిన్‌లో ప‌డిపోతున్నాయి. ప్ర‌స్తుతం ఎక్కువ‌ చిన్న సినిమాల ప‌రిస్థితి అలాగే ఉంది. అయితే మంచి  క‌థ‌తో రూపొందిన చిన్న సినిమాకు ప‌రిస్థితి వేరుగా ఉంటుంది. దానికి వ‌చ్చే పేరులాభాలు వేరే చిత్రాల‌కు కూడా రావు. నాకు కూడా పేరు రావ‌డానికి కార‌ణం చిన్న సినిమాయే.

నేను అనుకున్న దానికంటే...
- పాయింట్‌ను అనుకున్న త‌ర్వాత నేనుద‌ర్శ‌కుడురైట‌ర్ క‌లిసి క‌థ‌ను డెవ‌ల‌ప్ చేశాం. సినిమా తీశాం. సినిమా నేను అనుకున్న దానికంటే బాగా వ‌చ్చింది.

దిల్‌రాజుగారి కాంబినేష‌న్‌లో...
- నేను కేరింత సినిమాలో పార్వ‌తీశంతేజ‌స్విల‌ను ఈ సినిమాలో న‌టింప చేయడానికి దిల్‌రాజుగారి ద‌గ్గ‌ర‌కు వెళ్ళిన‌ప్పుడు ఆయ‌న క‌థ చెప్ప‌మ‌న్నారు. చెప్ప‌గానే ఆయ‌న‌కు న‌చ్చింది. నిర్మాత‌లెవ‌రు అని అడిగారు. ఎవ‌రు లేరు సార్..మేమే క‌లిసి చిన్న సినిమాగా చేసుకుంటున్నాం అన‌గానే...నేను కూడా క‌లిసి చేస్తాన‌ని అన్నారు.  ఆయ‌నకు డైలాగ్ వెర్ష‌న్స్ పంపాం. ఆయ‌న‌కు ఓకే అనుకున్న త‌ర్వాత షూటింగ్‌కు వెళ్ళాం.

పేర్లు అక్క‌డి వరకే ప‌రిమితం...
- బ్రాండ్, పేర్లు అనేవి ఏ సినిమాకైనా ఆడియెన్స్‌ ను థియేట‌ర్స్ వ‌ర‌కు అది కూడా నూన్ షో వ‌ర‌కు మాత్ర‌మే ఉప‌యోగ‌ప‌డుతుంది. క‌థ బావుంటేనే నెక్ట్స్ షోకు ఆడియెన్స్ వ‌స్తారు. అక్క‌డ పేర్లేం ప‌నిచేయ‌వు.

సెట్స్‌ కి ఓసారి మాత్ర‌మే వెళ్లాం.....
-స్క్రిప్ట్ అంతా సిద్ధ‌మైన త‌ర్వాత నేను కూడా వెంక‌టేష్ బాబు..బంగారం సినిమా షూటింగ్‌తో బిజీ అయిపోయాను. రైట‌ర్ ర‌వి సీన్స్ రాసుకుని నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చేవాడు. నేను చూసి ఎవైనా క‌రెక్ష‌న్స్ ఉంటే చెప్పేవాడిని లేకుంటే లేదు. సినిమా అయిపోయే లోపు ఓసారి మాత్ర‌మే నేనుదిల్‌రాజుగారు లోకేష‌న్‌కు వెళ్ళాం.అవుట్‌పుట్ చూడ‌గానే చాలా బాగా చేశార‌నిపించింది. నేను `ఈరోజుల్లోసినిమా చేసిన‌ప్పుడు చిన్న‌పాటి ఎగ్జ‌యిట్‌మెంట్ ఎలా ఫీల‌య్యానో అలాంటి ఎగ్జ‌యిట్‌మెంట్ ఈ చిత్రానికి క‌లిగింది.

అప్ష‌న్స్ ఎక్కువైపోతున్నాయి...
-బ‌ట్ట‌ల సెల‌క్ష‌న్స్ త‌ర‌హాలో ఈ మ‌ధ్య కాలంలో ప్రేమ‌లో అప్ష‌న్స్ ఎక్కువైపోయాయి. బెట‌ర్ మెంట్ దొరికితే మారిపోతున్నారు. కానీ ప్రేమంటే అలా కాద‌ని చెప్పే ప్ర‌య‌త్నమే ఈ చిత్రం.

`బాబు..బంగారం` కంప్లీట్‌....
- బాబు..బంగారం సినిమా చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది. చిన్న‌ప్ప‌టి నుండి నేను వెంకటేష్‌గారి సినిమాలు చూస్తూ పెరిగాను. నేను వెంక‌టేష్‌గారిని ఎలా చూడాల‌నుకుంటున్నానోఆడియెన్స్ ఎలా చూడాల‌నుకుంటున్నారో అలా చూపించాను. సినిమా కంప్లీట్ ఎంట‌ర్‌టైన‌ర్‌.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved