pizza
Megha Akash interview (Telugu) about LIE
అందుకే ఆ సినిమా చేయ‌లేక‌పోయాను - మేఘా ఆకాష్‌
You are at idlebrain.com > news today >
Follow Us

04 August 2017
Hyderabad

యూత్‌స్టార్‌ నితిన్‌ హీరోగా వెంకట్‌ బోయనపల్లి సమర్పణలో 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై హను రాఘవపూడి దర్శకత్వంలో రామ్‌ ఆచంట, గోపీ ఆచంట, అనీల్‌ సుంకర నిర్మిస్తున్న భారీ చిత్రం 'లై' (లవ్‌ ఇంటెలిజెన్స్‌ ఎన్‌మిటి). ఈ చిత్రం ఆగస్ట్‌ 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సంద‌ర్భంగా హీరోయిన్ మేఘా ఆకాష్ మాట్లాడుతూ ..

నేప‌థ్యం...
- మా నాన్న ఆకాష్ రాజా తెలుగువారు, అమ్మ బిందు రాజా మలయాళీ. చెన్నైలో పెరిగాను. అక్కడే విజువల్ కమ్యూనికేషన్స్ లో డిగ్రీ చేశాను. గౌతమ్ మీనన్ గారితో చేస్తున్న సినిమా షూటింగ్ జరుగుతుండగా ఈ స్క్రిప్ట్ నా దగ్గరకు వచ్చింది. వినగానే నచ్చి ఒప్పుకున్నాను.

క్యారెక్ట‌ర్ గురించి...
- ఇందులో నా క్యారెక్టర్ పేరు చైత్ర. చాలా ఎనర్జిటిక్ గా ఉంటుంది. ఎప్పుడూ హుషారుగా, మాట్లాడుతూ ఉంటుంది. నిజానికి రియల్ లైఫ్ లో నేనలా ఉండను. చాలా కామ్ గా ఉంటాను. క్యారెక్టర్ కేవలం పాటలు కోసం మాత్రమేకాదు నాకు కూడా కథలో ఇంపార్టెన్స్ ఉంటుంది. అంతేగాక ఆసక్తికరంగా కూడా ఉంటుంది.

Megha Akash interview gallery

నితిన్‌తో వ‌ర్కింగ్ ఎక్స్‌పీరియెన్స్‌...
- నితిన్ తో వర్క్ చాలా బాగుంది. అర్థం కాని విషయాల్ని ఓపిగ్గా వివరించేవాడు. ఇలా చేస్తే బాగుంటుంది అని సజషన్స్ కూడా ఇచ్చాడు. చాలా డౌన్ టు ఎర్త్. కష్టపడి పనిచేస్తాడు. ఎప్పుడూ సరదాగా మాట్లాడుతుంటారు .

డైరెక్ట‌ర్ గురించి...
- హను రాఘవపూడిగారు మంచి డైరెక్టర్. ఆయన వర్క్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఆయనే నాకు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చేవారు.

రామ్ సినిమా అందుకే చేయ‌లేక‌పోయాను...
- గౌతమ్ మీనన్ సినిమాతో బిజీగా ఉండటం వలన డేట్స్ క్లాష్ వచ్చి ఆ సినిమాని వదులుకోవాల్సి వచ్చింది.

అభిమాన తార‌లు..
- నాకు త్రిష అంటే చాలా ఇష్టం. బాలీవుడ్లో అలియా భట్ నచ్చుతుంది. ఎందుకంటే చిన్న వయసులోనే ఎన్నో విభిన్నమైన పాత్రలు చేస్తోంది కాబట్టి. ఇక హీరోల విషయానికొస్తే తెలుగులో పవన్ కళ్యాణ్ గారంటే ఇష్టం.

తదుప‌రి చిత్రాలు..
- తెలుగులో ప‌వ‌న్‌క‌ల్యాణ్‌గారు, త్రివిక్ర‌మ్ నిర్మాణంలో కృష్ణ‌చైత‌న్య ద‌ర్శ‌క‌త్వంలో, నితిన్ హీరోగా చేయ‌బోతున్న సినిమాలో న‌టిస్తున్నాను. అలాగే తమిళంలో రెండు సినిమాలు చేస్తున్నాను. వాటిలో గౌతమ్ మీనన్, ధనుష్ ‘ఎన్నై నోకి పాయుమ్ తూటా’ ఒకటి. `ఓరు పక్క కత్తి’ సినిమాలు చేస్తున్నాను. ప్ర‌స్తుతం ఈ రెండు సినిమాలు నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటున్నాయి.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved