pizza
Meghamsh Srihari interview about Rajdoot
వాళ్ల స‌ల‌హాలు ఎప్పుడూ విలువైన‌వే - మేఘాంశ్ శ్రీహ‌రి
You are at idlebrain.com > news today >
Follow Us

9 July 2019
Hyderabad

స్వ‌ర్గీయ రియ‌ల్ స్టార్ శ్రీహ‌రి త‌న‌యుడు మేఘాంశ్ క‌థానాయ‌కుడిగా ప‌రిచ‌యం అవుతోన్న చిత్రం `రాజ్ ధూత్`. న‌క్ష‌త్ర‌, ప్రియాంక వ‌ర్మ హీరోయిన్లు. ల‌క్ష్య ప్రొడ‌క్ష‌న్స్ పతాకంపై అర్జున్ -కార్తీక్ ద‌ర్శ‌క‌త్వంలో ఎమ్.ఎల్.వి స‌త్య‌నారాయ‌ణ (స‌త్తిబాబు) నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి మంగ‌ళ‌వారం హైద‌రాబాద్‌లో మేఘాంశ్ విలేక‌రుల‌తో మాట్లాడారు. ఆ విశేషాలు...

*రాజ్‌దూత్ గురించి చెప్పండి?
- జూలై 12న వ‌స్తోంది మా సినిమా. చాలా క‌ష్ట‌ప‌డి చేశాం. మామూలు ఎండ‌ల్లో చేయ‌లేదు. 45,46 డిగ్రీల్లో చేశాం. అంద‌రం
చాలా క‌ష్ట‌ప‌డి చేశాం. నిర్మాత కూడా చాలా క‌ష్ట‌ప‌డ్డారు. అంద‌రి క‌ష్టం ఫ‌లిస్తుంద‌ని న‌మ్ముతున్నా. జూలై 12న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాం.

* ముందు నుంచీ మీ సినిమా వ‌స్తుంద‌ని మాకు తెలియ‌లేదు. ఎందుకు ప‌బ్లిసిటీని అవాయిడ్ చేశారు?
- జ‌స్ట్ ప్రెజ‌ర్ అవాయిడ్ చేయ‌డానికి అంతే. ఎందుకంటే, మ‌మ్మీ షూటింగ్‌కి వ‌చ్చిన‌ప్పుడే నేను ప్రెజ‌ర్ ఫీల‌య్యేవాడిని. ఆ టెన్ష‌న్ అవాయిడ్ చేయ‌డానికే నేను ఎవ‌రికీ చెప్ప‌లేదు.

*చిన్న‌ప్ప‌టి నుంచీ సినిమాల్లోకి రావాల‌ని ఉండేదా?
- అవునండీ. చిన్న‌ప్ప‌టి నుంచీ నాకు సినిమాల్లోకి రావాల‌నే ఉండేది. నాన్న కూడా పెద్దోడిని డైర‌క్ట‌ర్‌ని, చిన్నోడిని హీరోని చేయాల‌ని అనుకుంటున్న‌ట్టు తెలిపారు. సో ఆయ‌న చెప్పిన మాట కూడా ఫాలో కావాల‌ని చేశాం.

* రాజ్‌దూత్ అంటే ఏంటి? ఆ టైటిల్ ఎందుకు పెట్టారు?
- టైటిల్ గురించి చాలా మంది అడుగుతున్నారు. మొద‌టి నుంచీ రాజ్‌దూత్ అనే అనుకున్నాం. ఈ సినిమాకు ఆ టైటిల్ త‌ప్పితే ఇంకేమీ ప‌నికిరాదు. అంత బాగా సెట్ అయిన టైటిల్ అది.

* రోడ్ జ‌ర్నీ అవుతుందా?
- పార్ట్ లీ రోడ్ జ‌ర్నీ అన్న‌మాట‌.

*థ్రిల్ల‌రా?
- థ్రిల్ల‌ర్ అని కూడా చెప్ప‌లేం. నిజానికి దాన్ని ఒక ప‌ర్టిక్యుల‌ర్ జోన‌ర్‌లో చెప్ప‌లేం. రెండు, మూడు జోన‌ర్ల మిక్సింగ్‌గా ఈ సినిమా ఉంటుంది. ఇది క‌మ‌ర్షియ‌ల్ చిత్రం

* ఇప్పుడేం చ‌దువుతున్నారు?
- బీబీఏ మూడో ఏడాది చ‌దువుతున్నాను.

* ఈ క‌థ ఎందుకు న‌చ్చింది?
- నా ఏజ్‌కి, నా ఫేస్‌కి ఈ క‌థ క‌రెక్ట్ అనిపించింది. సినిమా ఎక్క‌డా ఎక్కువ ఉండ‌దు. ఎక్క‌డా త‌క్కువ ఉండ‌దు. మీడియ‌మ్‌గా అనిపిస్తుంది.

* మ‌మ్మీ సినిమా చూసి ఏమ‌న్నారు?
- సినిమా చూసి చాలా ప్రౌడ్‌గా ఫీల‌యింది. నెర్వ‌స్‌గానూ ఉండేది. కానీ సినిమా చూశాక కాస్త త‌గ్గింది. సినిమా చూసి నువ్వు ఇంత రంగున్నావేంట్రా అని చెప్పింది. బాగా చేశాన‌ని చెప్పింది.

* ఎన్ని క‌థ‌లు విన్నారు?
- నేను ఈ సినిమా విన్న‌ప్పుడు ఇది మాత్ర‌మే విన్నా. దానికి రెండేళ్ల ముందు మాత్రం ఇంకేవో విన్నాను.

* డ్యాన్సులు బాగా చేశారా?
- ఒక ర‌కంగా చేశానండీ. ఇంట్లో మేం డ్యాన్సు చేసేట‌ప్పుడు మా అమ్మ గైడ్ చేసేది. మా ఇంట్లో అంత పెద్ద డ్యాన్స‌ర్ ఉన్న‌ప్పుడు ఆమె ద‌గ్గ‌రే నేర్చుకున్నా.

* డాడీ ఉన్న‌ప్పుడు ఏం చెప్పేవారు?
- అంద‌రినీ మంచిగా ట్రీట్ చెయ్‌. ఎవ‌రూ ఎక్కువ కాదు, ఎవ‌రూ త‌క్కువ కాదు. అంద‌రితోనూ మంచిగా ఉండు. అంద‌రికీ సాయం చెయ్ అని చెప్పేవారు.

* మీరు చైల్డ్ ఆర్టిస్టుగా చేసిన‌ప్పుడు ఎలా అనిపించింది?
- అప్పుడు నాన్న‌గారు ప‌క్క‌నే ఉండే క‌దా సో అంతా స్మూత్‌గా అనిపించింది.

* మీనాన్న‌గారి నుంచి మీకు వ‌చ్చిన ల‌క్ష‌ణం ఏంటి?
- ఏమోనండీ నాకూ తెలియ‌దు. కాక‌పోతే ఈ న‌వ్వు మాత్రం మా నాన్న‌గారి నుంచే వ‌చ్చింద‌నిపిస్తోంది. నాన్న ఎమోష‌న్‌నీ, కోపాన్ని వంటివ‌న్నిటినీ ప‌ర్ఫెక్ట్ గా చేసేవారు.

* యాక్టింగ్‌లో శిక్ష‌ణ తీసుకున్నారా?

- ఈ సినిమా మొద‌లు కావ‌డానికి ముందు వారం రోజులు ట్రైనింగ్ తీసుకున్నా. కాక‌పోతే నా చిన్న‌త‌నం నుంచీ నేను థియేట‌ర్స్ లో బాగా చేసేవాడిని. అది ఉప‌యోగ‌ప‌డింది. తేజ‌గారు అని ఒకాయ‌న బాహుబ‌లిలో ట్రాన్స్ లేట‌ర్‌గా చేశారు. ఆయ‌న ద‌గ్గ‌ర నేర్చుకున్నా.

* మీరు ఎవ‌రు స‌ల‌హాలిస్తారు?
- అమ్మా, అన్న‌య్యా ఇద్ద‌రూ ఎప్పుడూ నా ప్ల‌స్ పాయింట్లు. వాళ్ల స‌ల‌హాలు ఎప్పుడూ విలువైన‌వే.

* కెమెరా ముందు నెర్వ‌స్ ఫీల‌య్యారా?
- మొద‌టి కొన్నాళ్లు అనిపించింది. కానీ పోను పోనూ అల‌వాటైంది.

* ఇండ‌స్ట్రీకి కొన్నేళ్లు దూర‌మైన ప‌రిస్థితి మీకూ అనిపిస్తోందా?
- అనిపిస్తోంది. ఎందుకంటే నాన్న దూర‌మ‌య్యాక అమ్మ‌కు మేమూ, మాకు అమ్మ అని ఉండిపోయాం. మూడేళ్లు ఇలా గ‌డిచిపోయాయి. మేం నిజానికి దూరంగా ఉన్న‌ట్టు అనిపించినా ఇండ‌స్ట్రీకి దూరం కాలేదు. ఎప్పుడూ అంద‌రూ ఫోన్లు చేసి మాట్లాడిస్తూనే ఉండేవారు. ఇప్పుడు మ‌నోజ్ అన్న కూడా మాట్లాడారు. ఇండ‌స్ట్రీ నుంచి మాకు మంచి ప్రేమ అందుతోంది.

* మీ నాన్న‌గారి సినిమాల్లో మీకు న‌చ్చిన‌వి?
- భ‌ద్రాచ‌లం, డీ, కింగ్‌, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, మ‌గ‌ధీర .. చాలా ఉన్నాయి.

* మిమ్మ‌ల్ని మీరు ఫ‌స్ట్ టైమ్ స్క్రీన్ మీద చూసిన‌ట్టు ఎలా అనిపించింది?
- డ‌బ్బింగ్ చెప్పిన‌ప్పుడే చూశా. క్రౌడ్ మ‌ధ్య‌లో కూర్చుని సినిమా చూడాల‌ని ఉంది.

* హైలైట్స్ ఏంటి?
- మేం స్క్రీన్ మీద చేసిన అల్ల‌రి, పాట‌లు, సిట్చువేష‌న్స్... అన్నీ హైలైట్స్.



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved