pizza
Mehreen interview about Krishnagaadi Veera Premagaadha
ఆమెకు నేను పెద్ద ఫ్యాన్ - మెహరీన్
You are at idlebrain.com > news today >
Follow Us

6 February 2016
Hyderaba
d

నాని, మెహరీన్ హీరో హీరోయిన్లుగా హను రాఘవపూడి డైరెక్షన్ లో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ విడుదలవుతున్న చిత్రం ‘కృష్ణ గాడి వీర ప్రేమగాథ’. ఈ చిత్రం ఫిభ్రవరి 12న విడుదలవుతుంది. ఈ సందర్భంగా హీరోయిన్ మెహరీన్ తో ఇంటర్వ్యూ...

అవకాశం...
- సుమారు 35 కమర్షియల్ యాడ్స్ లో నటించాను. అలా నా ఫొటోస్ చూసిన డైరెక్టర్ హను రాఘవపూడిగారు ఈ సినిమా ఆడిషన్ కి పిలిపించారు. ఆడిషన్ లో సెలక్ట్ అయ్యాను.

క్యారెక్టర్ గురించి....
-15 ఏళ్ళ క్రితం జరిగే కథే ఈ సినిమా. నా క్యారెక్టర్ పేరు మహాలక్ష్మి. రాయలసీమలో ఉండే పాత్ర. ఆ బ్యాక్ డ్రాప్ ని చాలా ఆసక్తికరంగా చూపించారు.

పాత్ర పరంగా ఎలాంటి కేర్ తీసుకున్నారు...
పాత్ర పరంగా డైరెక్టర్ హనుగారి సలహాలు తీసుకున్నాను. లుక్, హావభావాల విషయంలో కేర్ తీసుకున్నాను. కాస్ట్యూమ్స్ ను కూడా నేనే సెలక్ట్ చేసుకున్నాను.

నానితో వర్కింగ్ ఎక్స్ పీరియెన్స్...
-నాని చాలా నేచురల్ గా నటిస్తాడు. అతనితో కలిసి చేయడం మొదలు పెట్టిన కొద్ది రోజుల్లోనే ఆ విషయాన్ని నేను గ్రహించాను. నాని క్లారిటీతో ఉంటాడు కాబట్టే బెస్ట్ ఇస్తాడు. ఈ సినిమాలో నాని భయస్థుడైన యువకుడు కృష్ణగా కనపడతాడు. అంత భయముండే కృష్ణ ప్రేమ కోసం ఏం చేశాడనేదే సినిమా.

అన్నీ రకాల పాత్రల్లు చేస్తాను..
- నేను గ్లామర్ రోల్స్ చేయడానికి సిద్దమే.. నాకు అన్ని రకాల పాత్రలు చేయాలని ఉంది. అలాగే ప్రతి సినిమాలోనూ నాలోని టాలెంట్ ని ప్రూవ్ చేసుకోవాలని ఉంది.

తెలుగులో ఇష్టమైన హీరోలు...
-అందరూ హీరోలు ఇష్టమే. తెలుగు సినిమాలు చూస్తుంటాను. నాని నటించిన ఈగ,భలే భలే మగాడివోయ్ చిత్రాలు చూశాను. అలాగే దూకుడు, బాహుబలి సినిమాలు చూశాను.

ఇష్టమైన హీరోయిన్...
-నాకు అనుష్క శెట్టి అంటే ఇష్టం. ఆమెను ఇంత వరకు కలవలేదు. ఆమెకు చాలా పెద్ద ఫ్యాన్ ని. ఆమె నటించిన బాహుబలి, రుద్రమదేవి, సైజ్ జీరో ఇలా ప్రతి సినిమాలో ఏదో ఒకటి డిఫరెంట్ గా చేయాలని ప్రయత్నిస్తుంటుంది.

నెక్ట్స్ ప్రాజెక్ట్స్...
-ప్రస్తుతానికి కొన్ని ఆఫర్స్ వస్తున్నాయి, అవి అన్నీ డిష్కషన్ స్టేజ్ లో ఉన్నాయి. ఇంకా దేనికీ సైన్ చేయలేదు.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved