pizza
Mohana Krishna Indraganti interview about Gentleman success
You are at idlebrain.com > news today >
Follow Us

21 June 2016
Hyderaba
d

‘అష్టాచ‌మ్మా’ వంటి హిట్ చిత్రం త‌ర్వా నాని, ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన మ‌రో చిత్రం ‘జెంటిల్‌మ‌న్‌’. 'ఆదిత్య 369', 'వంశానికొక్కడు' వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించిన శ్రీదేవి మూవీస్ సంస్థ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. జూన్ 17న సినిమా విడుద‌లైంది. ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ‌తో ఇంట‌ర్వ్యూ....

చాలా మంది హీరోల‌కు క‌థ చెప్పాను...
- ఈ క‌థ విన‌మ‌ని డేవిడ్‌నాథ‌న్‌గారిని నిర్మాత‌గారు నా వ‌ద్ద‌కు పంపారు. క‌థ నాకు న‌చ్చింది. నానితో చేయాల‌నుకుంటే త‌ను అప్పుడు ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం సినిమాతో బిజీగా ఉన్నాడు. త‌ర్వాత మ‌రో సినిమాలు చేయాల్సి ఉంది. డిసెంబ‌ర్ త‌ర్వాత చేద్దాం సార్ అన్నాడు. స్క్రిప్ట్ వ‌ర్క్ అయితే మొద‌లుపెట్టాను. ఓ స‌మ‌యంలో మ‌రో హీరోతో సినిమా చేద్దామ‌నిపించి శ‌ర్వానంద్‌కు క‌థ‌ను చెప్పాను. త‌ను ఎక్స్‌ప్రెస్‌రాజా సినిమాతో బిజీగా ఉన్నాడు. చాలా మంది హీరోల‌కు ఈ క‌థ‌ను చెప్పాను. అయితే నాని ఈ సినిమాకు న్యాయం చేయ‌గ‌ల‌డ‌నిపించింది. త‌న కోసం వెయిట్ చేశాను.

టైటిల్ విష‌యంలో చాలా ఆలోచించాం....
- సాధార‌ణంగా నా సినిమాల‌కు తెలుగు టైటిల్స్ పెట్టాల‌నుకుంటాను. ఈ సినిమాలో నాని క్యారెక్ట‌ర్ హీరోనా, విల‌నా అనే విధంగా ఉంటుంది కానీ త‌ను ఒక జెంటిల్‌మ‌న్‌. ముందు ఈ సినిమాకు ఉత్త‌ముడు అనే టైటిల్ పెట్టాల‌నుకున్నాం, అలాగే ఉత్త‌మ‌విల‌న్ అనే టైటిల్ కూడా అనుకున్నాం. అయితే ఈ టైటిల్స్ వ‌ల్ల హీరో క్యారెక్ట‌ర్ రివీల్ అయిపోతుంద‌నిపించింది. చివ‌ర‌కు అంద‌రూ జెంటిల్‌మ‌న్ అనే టైటిల్‌వైపు మొగ్గు చూపాం.

స్క్రీన్‌ప్లే చాలెంజ్‌గా మారింది...
- సినిమా క్లైమాక్స్‌లో ఆడియెన్స్ ఊహించ‌ని విష‌యాలు ఉండాలి. అందుకోసం ఏం చేయాల‌ని ఆలోచించాం. ముందు క్లైమాక్స్ సీన్ 18నిమిషాల వ్య‌వ‌ధితో ఉంటుంది. దీన్ని 12 నిమిషాల‌కు కుదించాం. స్క్రీన్‌ప్లే పెద్ద చాలెంజ్‌గా మారింది. క్లైమాక్స్‌లోనాని యాక్టింగ్‌కు ఆడియెన్స్ క్లాప్స్ కొట్టారు.

రిపీట్ జోన‌ర్ మూవీస్ చేయ‌లేదు...
- ఇప్ప‌టి వ‌ర‌కు నేను చేసిన సినిమాల‌ను చూసుకుంటే దేనిక‌దే డిఫ‌రెంట్‌గా ఉంటుంది. జెంటిల్‌మ‌న్ విష‌యంలో కూడా నా సెన్సిబిలిటీస్ వ‌దులుకోకుండా సినిమాచేశాను. మ‌రొక‌రు రాసిన క‌థ‌ను సినిమాగా తీయాలంటే అడాప్ట్ చేసుకోవాలి. అప్పుడే స‌దురు రైట‌ర్ హ్యాపీగా పీల‌వుతాడు. డేవిడ్‌నాథ‌న్ గారు ఈ విష‌యంలో సంతోషంగా ఉన్నారు.

నివేద థామ‌స్ గురించి....
- ఈ సినిమాలో నివేద స్థానంలోనిత్యామీన‌న్‌, కీర్తిసురేష్ ఇలా చాలా మంది హీరోయిన్స్‌ను అనుకున్నాం. అయితే మా కోడైరెక్ట‌ర్ సురేష్‌గారు మ‌రిర‌త్నం సినిమాలో నివేద యాక్టింగ్ చూశారు. ఆయ‌న‌కు న‌చ్చింది. ఆ సినిమాను నాకు చూపించారు. అలాగే నివేద పాప‌నాశం చిత్రంలో క‌మ‌ల్‌హాస‌న్ కూతురుగా న‌టించింది. అలాగే ఆ సినిమా స‌మ‌యంలో త‌నిచ్చిన ఇంట‌ర్వ్యూలో త‌ను మాట్లాడిన విధానం నాకు న‌చ్చింది. అందుక‌నే త‌నను ఈ సినిమాలో హీరోయిన్‌గా తీసుకున్నాం. త‌ను పెర్‌ఫార్మెన్స్‌కు మంచి అప్రిసియేష‌న్ వ‌స్తుంది.

కెరీర్‌లోనే...
నానితో అష్టాచ‌మ్మా సినిమా చేశాను. చాలా గ్యాప్ త‌ర్వాత మ‌ళ్ళీ మా కాంబినేష‌న్‌లో వ‌చ్చిన ఈ సినిమా క‌మ‌ర్షియ‌ల్‌గా చాలా పెద్ద స‌క్సెస్ సాధించింది. ఓవ‌ర్‌సీస్‌లో కూడా క‌లెక్ష‌న్స్ బావున్నాయి. నాని నా ల‌క్కీ చాంప్‌. ఈ సినిమా నా కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్.

నేను క‌థ‌లు అలా రాయ‌ను..
- నేను క‌థ‌లు రాసేట‌ప్పుడు క‌థ‌, క‌థ‌నం, సంద‌ర్భానికి త‌గిన విధంగా పాటలు ఇలా ఓ ఫార్మేట్‌లో రాసుకుంటూ వెళ‌తాను. క‌థ అంతా సిద్ధం అయిన త‌ర్వాత దీనికి ఎవ‌రు సూట్ అవుతారోన‌ని ఆలోచిస్తాను.

నెక్ట్స్ ప్రాజెక్ట్స్‌....
- షేక్స్‌స్పియ‌ర్ నాట‌కాల్లోని కామెడి, రొమాన్స్ తీసుకుని ఓ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ క‌థ‌ను సిద్ధం చేసుకుంటున్నాను. అలాగే కుటుంబ‌రావుగారి న‌వ‌ల‌ల రైట్స్‌తో పాటు బుచ్చిబాబుగారి చివ‌ర‌కు మిగిలేది అనే న‌వ‌ల హ‌క్కుల‌ను కూడా పొందాను. వీటి ఆధారంగా సినిమాలు రూపొందించాల‌నుకుంటున్నాను.

 Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved