pizza
Mohana Krishna Indraganti interview about Gentleman
అన్నీ జోనర్స్ సినిమాలు చేయగలను  – ఇంద్రగంటి మోహనకృష్ణ
You are at idlebrain.com > news today >
Follow Us

16 June 2016
Hyderaba
d

 అష్టాచ‌మ్మా వంటి హిట్ చిత్రం త‌ర్వా నానిఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన మ‌రో చిత్రం జెంటిల్‌మ‌న్‌.  'ఆదిత్య 369', 'వంశానికొక్కడు'  వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించిన శ్రీదేవి మూవీస్ సంస్థ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సందర్భంగా దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ ఇంటర్వ్యూ...

చాలా వేగంగా డైరెక్ట్ చేశాను...
- నేను సాధార‌ణంగా ప్ర‌తి సినిమాకు రెండేళ్లు గ్యాప్ తీసుకుంటూ వ‌చ్చాను. కానీ అతి త్వ‌ర‌గా డైరెక్ట్ చేసిన చిత్రం జెంటిల్‌మ‌న్‌. సినిమాను 2015 మార్చి నుండి చేయాల‌నుకున్నాం. స్క్రిప్ట్ అంతా సిద్ధం చేసుకుని చేయ‌డానికి ఇంత స‌మ‌యం ప‌ట్టింది.

నానితో వ‌ర్క్ చేయ‌డం...
- నానితో అష్టాచ‌మ్మాకు వ‌ర్క్ చేశాను. అప్పుడు త‌ను కొత్త కుర్రాడు. అప్పుడు కొత్త‌గా చేయాల‌నే ఉత్సాహం త‌న‌లో బాగా ఉండేది. ఇప్పుడు అదే ఉత్సాహంతో పాటు త‌న‌కు స్టార్ డమ్ పెరిగింది. చేసే ప‌నిని ఇంకా క‌మిట్‌మెంట్‌తో చేస్తున్నాడు. ఫ్యాన్ పాలోయింగ్ పెరిగింది. అయితే ఇప్పుడు కూడా ప్ర‌తి సినిమాకు హార్డ్ వ‌ర్క్ చేస్తూనే ఉన్నాడు.

నేను అన్నీ జోన‌ర్స్ సినిమాలు చేయ‌గ‌ల‌ను..
- గ్ర‌హణం నా తొలి సినిమా. ఆ సినిమా ఓ డీప్ డార్క్ మూవీ. త‌ర్వాత అష్టాచ‌మ్మా ఓ కామెడిగోల్కొండ హైస్కూల్ ఒక యూత్ మూవీ ఇలా ప్ర‌తి సినిమాను డిఫ‌రెంట్ జోన‌ర్‌లో చేస్తూనే వ‌స్తున్నాను. అలాగే ఓ ర‌చ‌యిత‌గాద‌ర్శ‌కుడిగా రిపీట్ సినిమాలు చేయాల‌నుకోను. ఇప్పుడ జెంటిల్‌మ‌న్ కూడా చాలా డిఫ‌రెంట్ జోన‌ర్‌లో ఉంటుంది. అయితే అష్టాచ‌మ్మా త‌ర్వాత ఇత‌ను లైట్ హార్టెడ్ సినిమాలే చేయ‌గ‌ల‌డ‌ని అంద‌రూ అనుకున్నారు. అయితే నేను అన్నీ సినిమాలు చేయ‌గ‌ల‌ను.

క‌థ నాది కాదు..
- జెంటిల్ మ‌న్ క‌థ నాది కాదు. డేవిడ్ నాథ‌న్ అనే త‌మిళ ర‌చ‌యిత‌ది. నిర్మాత శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్‌గారికి డేవిడ్ ప‌రిచ‌యం కావ‌డం అత‌ను క‌థ చెప్ప‌డంనిర్మాత‌కు న‌చ్చ‌డంతో న‌న్ను విన‌మ‌న్నారు. ఆ క‌థ న‌చ్చ‌డంతో సినిమా చేయ‌డానికి రెడీ అయ్యాను. అయితే మ‌న నెటివిటీకి త‌గిన విధంగా మార్పులు చేసుకుంటూ వ‌చ్చాం. ఈ సినిమాలో రెండు ల‌వ్ స్టోరీస్ ఉంటాయి. వాటిలో ఒక‌దాన్ని నేను రాశాను. మ‌న ఆడియెన్స్ అభిరుచికి త‌గిన విధంగా స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకున్నాను.

Mohana Krishna Indraganti interview gallery

వెయిట్ చేయ‌మ‌న్నాడు...
- క‌థ వినగానే నానికి సినిమా చేద్దాం సార్‌..అయితే డిసెంబ‌ర్ వ‌ర‌కు నేను బిజీగా ఉన్నాను. వెయిట్ చేస్తారా అన్నాను. అమ్మో అంత వ‌ర‌కు అగాలా అనుకున్నాను. అయితే 2015మార్చిలో ఈ సినిమా క‌థ చేయాల‌నుకోగానే మన ఆడియెన్స్‌కు త‌గిన విధంగా మార్పులు చేర్పులు చేసుకుంటూ స్క్రిప్ట్ ప్రిపేర్ చేయ‌డానికి నాకు న‌వంబ‌ర్ వ‌ర‌కు స‌మ‌యం ప‌ట్టింది.

నాని త‌ప్ప వేరెవ‌రు చేయ‌లేరు...
- జెంటిల్‌మ‌న్ క‌థ‌ను పేపర్ మీద రాసుకోవ‌డానికే క‌ష్ట‌మైంది. కానీ ఆ పాత్ర‌ను నాని ఎలా చేస్తాడోన‌ని అనుకున్నాను. అయితే నాని త‌ప్ప మ‌రెవ‌రూ చేయ‌లేర‌నేలా నాని యాక్ట్ చేసి చూపించాడు. ఎందుకంటే నాని పాత్ర క‌త్తి మీద సాములా సాగే పాత్ర‌. ఏ మాత్రం అటు ఇటు అయినా క‌థ‌లో బ్యాలెన్స్ త‌ప్పుతుంది.

అబ్లిగేష‌న్ మీద చేయ‌మ‌న‌లేదు...
-అబ్లిగేష‌న్‌పై నాని ఈ సినిమా చేయ‌లేదు. ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యంలో నాని లుక్ చూసిన త‌ర్వాత చాలా కొత్త‌గా అనిపించింది. త‌ర్వాత ఈ క‌థ విన‌గానే నాని ఈ క‌థ‌కు న్యాయం చేయ‌గ‌ల‌డ‌నిపించింది. అయితే అష్టాచ‌మ్మా త‌ర్వాత నేనునాని రెండు పాయింట్స్‌పై సినిమాలు అనుకున్నాం కానీ కుద‌ర‌లేదు. అయితే ఏది చేసినా అష్టాచ‌మ్మాలా ఉండాల‌ని అనుకోలేదు. ఈ క‌థ విన‌గానే నాని ఎగ్జ‌యిట్ అయ్యాడు.

ర‌చ‌యిత‌కు స్వేచ్చ అవ‌స‌రం...
- తెలుగులో ర‌చ‌యిత‌లంద‌రూ ద‌ర్శ‌కులు  కావ‌డం మంచి ప‌రిణామ‌మే. అయితే కొత్త ర‌చ‌యిత‌లు రావాలంటే మాత్రం వారికి స్వేచ్చ ఇవ్వాల్సి ఉంటుంది. ప‌రిమితులుంచి ఇలాంటి క‌థ‌లే కావాల‌న్న‌ప్పుడు ర‌చ‌యిత‌ల ఆలోచ‌న‌లు ఆగిపోతాయి. అలా కాకుండా స్వేచ్చ ఇచ్చిన‌ప్పుడు కొత్త క‌థ‌లు పుడుతాయి. ఒక హీరోకు త‌గిన విధంగా క‌మ‌ర్షియ‌ల్ సినిమాల క‌థ‌ను ప్రిపేర్ చేయ‌డం కూడా ఒక క‌ళే. నేను అలా క‌మ‌ర్షియ‌ల్ క‌థ‌లు రాయ‌లేనేమో అనిపిస్తుంది. నేను క‌థ‌క‌థ‌నం ఇలా అన్నీ ఎలిమెంట్స్‌ను యాడ్ చేసుకుంటూ వెళ్లిన త‌ర్వాత ఎవ‌రు హీరోగా స‌రిపోతార‌ని ఆలోచిస్తాను.

నెక్ట్స్ ప్రాజెక్ట్స్‌...
- ప్ర‌స్తుతానికి క‌థ‌ను సిద్ధం చేస్తున్నాను. షేక్‌స్పియ‌ర్ నాట‌కంలో కామెడి ఆధారంగా క‌థ‌ను రాస్తున్నాను. అంతా రెడీ అయిన త‌ర్వాతే వివ‌రాలు తెలియ‌జేస్తాను.

 



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved