pizza
Mohan krishna Indraganti interview (Telugu) about Ami Tumi
`అమీ తుమీ` చిత్రాన్ని 'అష్టా చెమ్మా-2'గా తీయాలని చాలా ఆలోచించాను - ఇంద్రగంటి మోహనకృష్ణ
You are at idlebrain.com > news today >
Follow Us

08 June 2017
Hyderabad

ఏ గ్రీన్‌ ట్రీ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై అవసరాల శ్రీనివాస్‌, అడివిశేష్‌ హీరోలుగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'అమీ తుమీ'. ఈ సినిమా జూన్‌ 9న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణతో ఇంటర్వ్యూ...

అలాంటి సినిమా ఫీలింగ్‌...
'అమీ తుమీ' సినిమాను డైరెక్ట్‌ చేయడంతో మళ్ళీ ఒక 'అష్టాచెమ్మా' సినిమాలాంటి సినిమా ఫీలింగ్‌ ఉంది. సినిమా ట్రైలర్‌, పాటలకు మంచి స్పందన వచ్చింది. అందరూ తెలుగు నటీనటులు, సాంకేతిక నిపుణులతో చిన్న బడ్జెట్‌లో ఆరోగ్యకరమైన హాస్య చిత్రాన్ని చేయాలనుకుని చేసిన సినిమా ఇది. నా కెరీర్‌లో జెంటిల్‌ మన్‌ బిగ్‌ బడ్జెట్‌ మూవీ. ఆ సినిమా తర్వాత హ్యాస ప్రియమైన సినిమా చేయాలనే ఆలోచనతో చేసిన సినిమా ఇది. 90 శాతం సినిమా హైదరాబాద్‌లో జరుగుతుంది. 10 శాతం వైజాగ్‌లో జరుగుతుంది.

కథ గురించి...
- అడవి శేష్‌-ఈషా, శ్రీనివాస్‌ అవసరాల-అదితినాథ్‌ అనే రెండు జంటలుంటాయి. ఈషా, శ్రీనివాస్‌ అవసరాల బ్రదర్‌ అండ్‌ సిస్టర్‌. ఈషా అడవిశేష్‌ని ప్రేమించడం, అవసరాల అదితినాథ్‌ను ప్రేమించడం కూడా ఆమె తండ్రి తనికెళ్ళ భరణికి ఇష్టం ఉండదు. అక్కడ నుండి శ్రీ చిలిపి అనే విచిత్రమైన వెన్నెలకిషోర్‌ పాత్ర వీరి మధ్యలోకి ఎంటర్‌అవుతుంది. శ్రీ చిలిపి పాత్ర ఈ జంటల మధ్యకు ఎందుకు వచ్చిందనేది ఆసక్తికరంగా ఉంటుంది. వీరంగం సినిమాలో నటించిన శ్యామలగారు కూడా ఈ సినిమాలో కీరోల్‌ చేశారు. ఈషా, అదితినాథ్‌, శ్యామల అనే మూడు లేడీ పాత్రలు సినిమాను కీలకంగా నడిపిస్తే, కథకు ఇరుసు వంటి పాత్రలో వెన్నెలకిషోర్‌ కనపడతాడు.

ఆ ఆలోచనైతే చేశాను..
అమీతుమీ చిత్రాన్ని అష్టాచెమ్మా చిత్రంగా చేయాలని చాలా కాలం ఆలోచించాను. అయితే అష్టాచెమ్మా చిత్రంలో నటించిన భార్గవి చనిపోవడంతో నాకు ఆసక్తి పోయింది. అష్టాచెమ్మా తరహా కామెడిని రాయడం అంత ఈజీ కాదు. సంభాషణల పరంగా, పాత్రల పరంగా సినిమా చక్కగా కుదిరింది.

ముందుగానే రిహార్సల్‌ చేశాం..
- ఈ సినిమా కోసం నెలరోజుల పాటు రిహార్సల్‌ చేశాం. నాటలకాలకు రిహార్సల్‌ చేసేలా కష్టపడ్డాం. అలాగే సినిమా సెట్స్‌లోకి వెళ్ళడానికి వారం రోజులు ఉందనగా అందరూ ఓ టేబుల్‌ దగ్గర రౌండ్‌గా కూర్చొని స్క్రిప్ట్‌ చదివాం. సెట్‌కు వచ్చే ముందు కెమెరా, యాక్షన్‌ అనే ప్లాన్‌లో వచ్చాం. లిమిటెడ్‌ బడ్జెట్‌, నటీనటులు బిజీగా ఉండటం ఇలాంటి కారణాలతో ముందుగానే ఓ ప్లానింగ్‌తో ముందుకెళ్ళాం.

ఎగ్జయిట్‌మెంట్‌తో చేశాను..
- జెంటిల్‌మన్‌ తర్వాత నాగచైతన్యతో సినిమా చేయాలి. కథను తయారు చేస్తున్నాను. అలాగే నాగచైతన్య రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు. తర్వాతే నా సినిమా కాబట్టి సమయం పట్టేలా ఉంది. ఈలోపు నరసింహారావుగారు నా దగ్గరకొచ్చి ఏదైనా చిన్న సినిమా చేయగలరా అని అడిగారు. అప్పటికే ఈ కథ నా మైండ్‌లో ఉంది. స్క్రీన్‌ప్లే రాయడం మొదలు పెడితే 25 రోజుల్లోనే రాసేశాను. డైలాగ్‌ వెర్షన్‌ చదవగానే ఎగ్జయిట్‌మెంట్‌గా అనిపించి చేశాను.

నిర్మాత గురించి..
- నరసింహరావుగారు దొరస్వామిరాజుగారి దగ్గర, మగధీరకు ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశారు. జెంటిల్‌మన్‌ సమయంలోనే ఆయన నన్ను కలిసి ఇలా బ్యానర్‌ స్టార్ట్‌ చేయాలనుకుంటున్నానని అప్పుడే చెప్పారు. కుదిరితే చిన్న సినిమా చేసి పెట్టమని అన్నారు. అప్పుడు డీ మానిటైజేషన్‌ స్టార్ట్‌ కావడంతో సినిమాలు చాలా వరకు ఆగాయి. నాకు, చైతన్యకు మధ్య చర్చలు జరుగుతున్నాయి. మీతోనే నా బ్యానర్‌ స్టార్ట్‌ చేయాలనుంది సార్‌. మీకు కుదిరినప్పుడే సినిమా చేసి పెట్టండి అన్నారు. ఆయన ప్లానింగ్‌, అప్రోచ్‌ నచ్చింది. లిమిటెడ్‌ పరంగా చిన్న సినిమానే అయినా క్వాలిటీ విషయంలో నరసింహరావు ఎక్కడా కాంప్రమైజ్‌ కాలేదు.

తదుపరి చిత్రం..
- నేను, చైతన్య రెగ్యులర్‌గానే టచ్‌ ఉంటున్నాం. తనెప్పుడైనా నాతో సినిమా చేయడానికి సిద్ధమే. మంచి కథ కుదిరితే తప్పకుండా కలిసి పనిచేస్తాం.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved