pizza
Naga Chaitanya interview (Telugu) about Premam
న‌న్ను స్టార్ అన‌డం కంటే మంచి యాక్ట‌ర్ అంటే కంఫ‌ర్ట్‌గా ఫీల‌వుతాను - అక్కినేని నాగ‌చైత‌న్య‌
You are at idlebrain.com > news today >
Follow Us

5 October 2016
Hyderaba
d

చైతన్య అక్కినేని, శ్రుతిహాసన్,మడొన్నాసెబాస్టియన్,అనుపమ పరమేశ్వరన్ ల కాంబినేషన్ లో, దర్శకుడు 'చందు మొండేటి దర్శకత్వంలో యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ‘సితార ఎంటర్ టైన్మెంట్స్’ పతాకంపై పి.డి.వి ప్రసాద్ సమర్పణలో నిర్మించిన చిత్రం 'ప్రేమమ్` ఈ సినిమా అక్టోబ‌ర్ 7న విడుద‌ల‌వుతుంది. ఏ మాయ చేసావే సినిమా త‌ర్వాత మ‌రో పూర్తి స్థాయి ల‌వ్ స్టోరీతో చైత‌న్య మ‌రోసారి సంద‌డి చేయ‌నున్నాడు. ల‌వ్ స్టోరీస్ ఉన్న సినిమాలు చేయ‌డం నాకు బాగుంటుంది. యాక్షన్‌ సినిమాలు చేసేంత మెచ్యూరిటీ నాకు రాలేదని అనుకుంటున్నాను. అయితే రెండు, మూడు హిట్‌ తర్వాత రియలిస్టిక్‌ యాక్షన్‌ సినిమా చేస్తానంటున్న హీరో నాగచైతన్యతో ఇంటర్వ్యూ....

కాపీ కొట్టాల‌నుకో లేదు..
- మలయాళ వెర్షన్‌లోని ప్రేమమ్‌ పాయిజన్‌లా పెద్ద హిట్‌ సాధించింది. సో..ప్రేమమ్‌ను రీమేక్‌ చేయాలనుకోగానే ప్రెషర్‌ బిల్డప్‌ అయ్యింది. అయితే రీమేక్‌ చేయాలనుకోగానే ఎలా ఉందో అలాగే కాపీ కొట్టాలనుకోనేలేదు. ఇలాంటి క్లాసిక్‌ మూవీని మనం వాళ్ల కంటే బెటర్‌గా చేయాలి, వాళ్ళు చేసిన తప్పులను మనం కరెక్ట్‌ చేసి చేయాలనే అప్రోచ్‌తో సినిమా చేయలేదు. సినిమా సోల్‌ నచ్చడంతో, తెలుగు ఆడియెన్స్‌తో మన నెటివిటీకి తగిన మార్పులు చేసి చేశాం. సినిమా చూస్తే రేపు మీకే తెలుస్తుంది.

చందు ఆలోచ‌న‌లు న‌చ్చాయి....
- కార్తికేయలో చందు మొండేటి వర్కింగ్‌ స్టయిల్‌ నాకు నచ్చడంతో అతన్ని కలిశాను. ఒకే కమర్షియల్‌ స్టయిల్‌లో కాకుండా డిఫరెంట్‌గా సినిమా చేయాలని చందు ప్రయత్నిస్తుంటాడు. అంతే కాకుండా తనతో డిస్కస్‌ చేస్తున్నప్పుడు తన ఆలోచనలు నాకు నచ్చాయి. అలాగే అప్పటికీ ఇంకా తనతో ఎలాంటి సినిమా చేయాలో కూడా నిర్ణయించుకోలేదు. ఆ సమయంలో దోచెయ్‌ విడుదలైంది. అది పెద్దగా ఆడకపోవడంతో మళ్లీ లవ్‌స్టోరీ చేద్దామని నిర్ణయించుకున్నాను. అదే సమయంలో ప్రేమమ్‌ విడుదలకావడం ఇలా అన్ని కుదిరాయి.

రీమేక్ సినిమాలు చేయ‌డం మ‌న‌కు కొత్తేం కాదు....
- రీమేక్‌ సినిమాలు చేయడం అనేది కొత్త విషయమేమీ కాదు. చాలా మంది మన తెలుగు సినిమాలను తీసుకుని వేరే భాషల్లో రీమేక్‌ చేశారు. మన తెలుగు రైటర్స్‌ కథలతో వేరే భాషల్లో సినిమాలు చేస్తున్నారు. కానీ ఈ సినిమా విషయంలో ఇలాంటి బ్యాడ్‌ క్లాషెస్‌ ఎందుకు వస్తున్నాయో అర్థం కావడం లేదు. మలయాళ సినిమా కన్నా బాగా తీయాలనే ఉద్దేశ్యంతో చేయలేదని మలయాళీ అభిమానులకు కూడా చెప్పాను. అదే సోల్‌తో తెలుగు సినిమా తీశామంతే...
- మలయాళ ప్రేమమ్‌లో నటించిన నవీన్‌ పౌలీ నటనతో చాలా ఇన్‌స్పైర్‌ అయ్యాను. ముఖ్యంగా తన సెకండ్‌ లవ్‌స్టోరీలో తను చేసిన ఎక్స్‌ప్రెషన్స్‌ చూసి ఇన్‌స్ఫైర్‌ అయ్యాననాలి. దాన్ని అలాగే తీసుకుని ఈ సినిమాలో చూపించాను. మరో రెండు వేరియేషన్స్‌ ఉన్న లవ్‌స్టోరీస్‌ను నా స్టయిల్‌లో చేశాను.

అది చాలెంజింగ్‌గా అనిపించింది....
- ఒకే సినిమాలో మూడు వేరియేషన్స్‌లో నటించడం చాలా కొత్తగా, చాలెంజింగ్‌గా అనిపించింది. మెయిన్‌గా చిన్నప్పుడు నుండి ఇప్పటి వరకు నా రియల్‌ లైఫ్‌లో నేనెలా ఫీలయ్యాననే దానిని రెఫరెన్స్‌గా తీసుకున్నాను. కొంత హోం వర్క్‌ చేశాను. ఇలా చేయడం చాలా ఎజాయింగ్‌గా అనిపించింది. ప్రేక్షకుల దృష్టిలో చైతు ఇలాంటి డిఫరెంట్‌ క్యారెక్టర్స్‌ చేయగలడని నటుడుగా ఎస్టాబ్లిష్‌ అవుతాను.

Naga Chaitanya interview gallery

ఆ స్పేస్‌ను వాడుకున్నాం...
- మలయాళ ప్రేక్షకులు స్లో అండ్‌ పొయెటిక్‌ నేరేషన్‌ను ఇష్టపడతారు. కానీ తెలుగులో ప్రేక్షకులు ఫాస్ట్‌గా ఉండాలనుకుంటారు. కాబట్టి మన ఆడియెన్స్‌ కోసమే రన్‌ టైం చేంజ్‌ చేయించాను. స్టోరీని ఎక్కడా చేంజ్‌ చేయలేదు. నేరేషన్‌ పరంగానే ఉండే స్పేస్‌ను ఉపయోగించుకున్నాం. ముఖ్యంగా మూడో లవ్‌స్టోరీని మన నెటివిటీకి తగిన విధంగా మార్పులు చేశాం. మలయాళంలోని ఉండే ట్విస్ట్‌, తెలుగులో ఉండే ట్విస్ట్‌ వేరుగా ఉంటుంది.

నిర్మాత‌లెంతో స‌పోర్ట్ చేశారు...
- ముందుగానే సినిమాను రెడీ చేసుకుని, సినిమాకు ఎలాంటి మార్పులు చేర్పులు కావాలో వాటిని చేస్తూ వచ్చాం. ఈ విషయంలో నిర్మాతలు ఎంతగానో సపోర్ట్‌ చేశారు. సినిమాపై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం.

సమంతతో పెళ్ళి గురించి...
- సమంతతో నా ప్రేమ వ్యవహారం నా ఫ్రెండ్స్‌ అందరికీ తెలుసు. ఫ్యామిలీలో అయితే ముందు నాన్నకే చెప్పాను. 'నాకెప్పుడో తెలుసురా..కొత్తగా చెప్తావేంటి..' అన్నారు. నాన్న నేను చెప్పిన విషయాన్ని బాగా వెల్‌కమ్‌ చేశారు. ఎంగేజ్‌మెంట్‌, పెళ్లి వచ్చే ఏడాదినే ప్లాన్‌ చేస్తున్నాం. నా వ్యక్తిగత జీవితాన్ని అందరితో షేర్‌ చేసుకోవాలనుకోను. ఎంత సీక్రెట్‌గా ఉంచాలో అంత సీక్రెట్‌గానే ఉంచాలనుకుంటాను. పెళ్లి తర్వాత సమంతను సినిమాలు మానేయమని చెప్పను. తన ఇష్ట ప్రకారం సినిమాల్లో యాక్ట్‌ చేస్తుంది. నా నుండి తనకు ఎలాంటి సపోర్ట్‌ కావాలో దాన్ని అందిస్తాను.

అఖిల్‌ షాకిచ్చాడు...
- అఖిల్‌ పెళ్లి విషయమే నాకు, నాన్నకు ఓ రకంగా షాకింగ్‌గా అనిపించింది. అయితే ఉహించలేదు. అఖిల్‌ పెళ్ళి విషయంలో చాలా హ్యాపీగా ఉన్నాడు. చిన్న వయసులోనే పెళ్లి నిర్ణయం తీసుకునేంత ధైర్యం తనలో ఉండటం నిజంగా మంచిదే.

అందుకే ఆల‌స్యం...
- 'సాహసం శ్వాసగా సాగిపో' సినిమా చిత్రీకరణ పూర్తయిపోయింది. అయితే తమిళ వెర్షన్‌కు సంబంధించిన పార్ట్‌ పెండింగ్‌ ఉంది. రెండు వెర్షన్స్‌ను ఒకేసారి విడుదల చేయాలనుకుంటడంతో సినిమా విడుదలకు సమయం పడుతుంది.

స్క్రిప్ట్‌ ప్రధానం...
- నాకు పెద్ద, చిన్న దర్శకులనే తేడా ఉండదు. స్క్రిప్ట్‌ బావుండాలని భావిస్తాను. కొత్త ఆలోచనలతో ఉండే న్యూ టాలెంట్‌ను ఎంకరేజ్‌ చేయాలి. స్టార్‌ కంటే మంచి నటుడంటేనే కంఫర్ట్‌గా ఫీలవుతాను.

తదుపరి చిత్రాలు....
- నెక్ట్స్‌ సినిమా కల్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో ఉంటుంది. ఇదొక రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌. ఇందులో యాక్షన్‌ కూడా ఉంటుంది. సగం విలేజ్‌, సగం సిటీ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. అయితే నిన్నేపెళ్లాడతా అనే టైటిల్‌ వినపడింది కానీ దీనికి ఇంకా టైటిల్‌ అనుకోలేదు. నిన్నేపెళ్లాడతా స్టయిల్‌ ఆఫ్‌ క్యారెక్టరైజేషన్‌ ఉండటం ఉంటుంది. ఇక కృష్ణ దర్శకత్వంలో చేయబోయే సినిమా థ్రిల్లర్‌ జోనర్‌కు సంబంధించింది.

 

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved