pizza
Naga Chaitanya interview(Telugu) about Savyasaachi
ఇప్పుడు జీవితం ప‌రిపూర్ణంగా ఉన్న‌ట్ట‌నిపిస్తోంది - నాగ‌చైత‌న్య‌
You are at idlebrain.com > news today >
Follow Us

1 November 2018
Hyderabad

`ప్రేమ‌మ్` స‌క్సెస్ త‌ర్వాత మ‌రోసారి చందూమొండేటి ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేశారు నాగ‌చైత‌న్య‌. ఈ చిత్రం శుక్ర‌వారం విడుద‌ల కానుంది. ఈ సంద‌ర్భంగా నాగ‌చైత‌న్య హైద‌రాబాద్‌లో విలేక‌రుల‌తో మాట్లాడారు. ఆ విశేషాలు..

* ఈ ప్రాజెక్ట్ ఎలా సెట్ అయింది?
- నార్వేలో `ప్రేమ‌మ్` షూటింగ్ జ‌రుగుతున్న‌ప్పుడు చందు నాకు 5.-10 నిమిషాలు క‌థ చెప్పాడు. కానీ త‌ను చెప్పిన పాయింట్‌తో సినిమా చేస్తే ఎక్స్ పెరిమెంట‌ల్‌గా అనిపిస్తుందని అన్నా. `ప్రేమ‌మ్` విడుద‌లైన త‌ర్వాత త‌ను హైద‌రాబాద్‌లో ఫుల్ క‌మ‌ర్షియ‌ల్ వేల్యూస్‌తో క‌థ చెప్పాడు. చాలా బాగా అనిపించింది.

* `శైల‌జారెడ్డి అల్లుడు` సినిమా మిమ్మ‌ల్ని డిజ‌ప్పాయింట్ చేసిందా?
- డిస‌ప్పాయింట్ చేసింది. అదే స‌మ‌యం హ్యాపీగా కూడా అనిపించింది. ఎందుకంటే ఆ సినిమా తొలి రోజు క‌లెక్ష‌న్లు నాకు చాలా స్పెష‌ల్‌. అంత‌కు ముందుప్పుడూ రాన‌న్ని క‌లెక్ష‌న్లు వ‌చ్చాయి.

* మీరు స్క్రిప్ట్ లో ఇన్వాల్వ్ అవుతారా?
- అవుతాను. ప్ర‌తి స్క్రిప్ట్ వింటాను. ఏది మంచి, ఏది చెడు అని ఆలోచిస్తాను. కానీ ఒక లైన్ దాటి మ‌నం వెళ్ల‌కూడ‌ద‌ని మాత్రం అనుకుంటా. ద‌ర్శ‌కుడికి మ‌నం ఇచ్చే రెస్పెక్ట్ అక్క‌డే తెలుస్తుంది. మారుతిగారు క‌థ చెప్పిన‌ప్పుడు బాగానే అనిపించింది. కానీ ఎందుకో కొన్ని సార్లు వ‌ర్క‌వుట్ కావంతే.

* ఈ స్క్రిప్ట్ ని చందు ఎలా చెప్పారు?
- చాలా బాగా చెప్పాడు. త‌న ఆలోచ‌నా ధోర‌ణిని నేను బాగా ఇష్ట‌ప‌డ‌తాను. త‌న మీద న‌మ్మ‌కంతోనే ఈ సినిమా చేస్తున్నా. `ప్రేమ‌మ్` రీమేక్ చేయ‌వ‌ద్ద‌ని చాలా మంది చెప్పారు. కానీ పాయింట్‌ని తెలుగుకు త‌గ్గ‌ట్టు చాలా బాగా చెప్పారు చందు. నా దృష్టిలో త‌ను న్యూ ఏజ్ ఫిల్మ్ మేక‌ర్‌. ఈ సినిమా ఒక‌టీ, రెండు షెడ్యూళ్ల వ‌ర‌కు కాస్త ఎలా ఉంటుందోన‌ని అనిపించింది. కానీ ఆ త‌ర్వాత ఆలోచించాల్సిన అవ‌స‌రం లేద‌న‌పించింది.

* ఇందులో చూపించిన సిండ్రోమ్ గురించి మీకు ముందే తెలుసా?
- లేదండీ. కాక‌పోతే ఈ స్క్రిప్ట్ విన్న త‌ర్వాత నేను దాని గురించి ఆలోచించా. యూట్యూబ్‌లోనూ, న్యూస్ పేప‌ర్ల‌లోనూ చూసి తెలుసుకున్నా.

* `హ‌లో బ్ర‌ద‌ర్‌` త‌ర‌హాలో ఉంటుందా?
- లేదండీ. అక్క‌డ ట్విన్స్ లాగా ఉంటుంది. ఇక్క‌డ ఒకే శ‌రీరంలో ఇద్ద‌రు వ్య‌క్తులున్న ఫీలింగ్ క‌లుగుతుంది.

* ఈ మ‌ధ్య డ్యాన్సులు బాగా చేస్తున్న‌ట్టున్నారు?
- మామూలుగా డ్యాన్సులు చేయ‌డంలో ఎవ‌రి వ్యావ‌హారిక శైలి వారికే ఉంటుంది. శేఖ‌ర్ మాస్ట‌ర్ నాలో ఆ శైలిని గ‌మ‌నించారు. చాలా మంచి నృత్యాలను కంపోజ్ చేశారు.

interview gallery





*సినిమా మొత్తం యాక్ష‌న్‌తో సాగుతుందా?
- లేదండీ. తొలి స‌గంలో చాలా స‌ర‌దా ఉంటుంది. నాకూ, నా ఎడ‌మ చేతికి మ‌ధ్య చిన్న చిన్న గొడ‌వ‌లూ, రొమాన్స్.. ఇలాగ‌న్న‌మాట‌. సెకండాఫ్లో మాత్రం నాకు, మాధ‌వ‌న్‌గారికి చాలా గ‌ట్టి కాంపిటిష‌న్ ఉంటుంది.

* మీ తాత‌గారు పౌరాణికాలు చేశారు. మీరు కూడా చేస్తారా?
- చేయాల‌నే ఉంది. కాక‌పోతే రెండు, మూడు సూప‌ర్‌డూప‌ర్ హిట్లు కొట్టిన త‌ర్వాత‌.

* మీ కెరీర్‌ని మీ నాన్న‌గారు జాగ్ర‌త్త‌గా ప్లాన్ చేసేవారు. ఇప్పుడు ఫ్రీ హ్యాండ్ ఇచ్చిన‌ట్టేనా?
- ఆయ‌న స్టార్టింగ్‌లో కొన్ని సినిమాల స్క్రిప్ట్ లు విన్నారు. ఆ త‌ర్వాత అంతా ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. సినిమా రిలీజ్ కి ముందు ఎడిటింగ్ రూమ్‌లో చూసి స‌ల‌హాలు చెప్పేవారు. ఈ సినిమాకు కూడా చెప్పారు.

* ఎలాంటి మార్పులు చెప్పారు?
- చిన్న‌వే.భావోద్వేగాల‌కు సంబంధించిన‌వి.

* రిలీజ్‌కి ముందు రీ షూట్‌కి వెళ్ల‌డ‌మ‌నే కాన్సెప్ట్ ను మీ రు న‌మ్ముతారా?
- న‌మ్ముతానండీ. సినిమా విడుద‌లైన త‌ర్వాత మ‌నం గ‌మ‌నించిన అదే త‌ప్పును ఇంకెవ‌రో గ‌మ‌నించి చెప్పిన‌ప్పుడు.. వాటిని దిద్దుకోవ‌డం క‌న్నా, ముందే వాటిని దిద్దుకుంటే స‌రిపోతుంద‌ని నా ఫీలింగ్‌. అయినా రీ షూట్‌ల‌కు వెళ్ల‌డం అని ఎందుకు అనుకోవాలి? బెట‌ర్‌మెంట్ కోసం చేస్తున్నామ‌ని అనుకుంటే ఎలాంటి ఇబ్బందీ ఉండ‌దు క‌దా.

* మీ సినిమాలో నాన్న‌గారి పాట రీమిక్స్ చేశారు. ఐడియా ఎవ‌రిది? అందులో నాన్న‌గారు క‌నిపిస్తారా?
- ఐడియా చందు మొండేటిది. ఆయ‌న చాలా బాగా చేశారు. సెకండాఫ్‌లో చాలా బావుంటుంది. ఒరిజిన‌ల్ సాంగ్‌ని కంపోజ్ చేసిన కీర‌వాణిగారే చేయ‌డం వ‌ల్ల కూడా టెన్ష‌న్ ఫ్రీ అయింది. లేకుంటే ఎందుకు ఎక్స్ పెక్టేష‌న్స్... అని అనుకున్నా. ఇప్పుడు అంతా హ్యాపీ. నాన్న‌గారు ఆ పాట‌లో క‌నిపించ‌రు.

* శైల‌జారెడ్డి త‌ర్వాత పూర్తి స్థాయి క‌మ‌ర్షియ‌ల్ హీరో అయిన‌ట్టేనా?
- అది ప్రేక్ష‌కులు చెప్పాలి.

* మీరు స్వ‌త‌హాగా నిర్మాత‌. మైత్రీ మూవీస్ గురించి చెప్పండి?
- మైత్రీ మూవీస్ చేతిలో ఈ స్క్రిప్ట్ ప‌డ్డ త‌ర్వాత పెద్ద స్పాన్ వచ్చింది. క‌థ‌ను న‌మ్మి చాలా ఖ‌ర్చుపెట్టారు. ఇప్పుడున్న మార్కెట్ కి అంత పెట్టాల్సిన ప‌ని లేదు. అయినా వాళ్లు పెట్ట‌డం ఆనందంగా అనిపించింది. మాధ‌వ‌న్ గారిని, భూమిక‌గారిని స‌జెస్ట్ చేసింది కూడా వాళ్లే.

*మాధ‌వ‌న్‌గారితో ప‌నిచేయ‌డం ఎలా ఉంది?
- చాలా ఆనందంగా ఉంది. సెట్ కీ నా ఫ్రెండ్స్ చాలా మంది వ‌చ్చి, ఆయ‌న‌తో ఫొటోలు తీసుకున్నారు. ఇప్ప‌టికీ ఆయ‌న ట్రెండ్ సెట్ట‌రే.
ఆయ‌న్ని చూసి చాలా నేర్చుకున్నా.

* ప‌ర్స‌న‌ల్‌గా మీకు ఎడ‌మ‌చేతి వాటం ఉందా?
- లేదండీ. అలాంటిదేమీ లేదు.

* హీరోయిన్ గురించి చెప్పండి?
- నిధి చాలా టాలెంటెడ్‌. యాక్టివ్ గ‌ర్ల్. ఆల్ రౌండ‌ర్‌. డ్యాన్స‌లుఉ చేయ‌గ‌ల‌దు. ఇలాంటి సినిమాల్లో ఫ్రెష్ ఫేస్‌లు క్లిక్ అయ్యే ఛాన్స్ లు ఎక్కువ‌. అందుకే తీసుకున్నాం.

* చందు ద‌గ్గ‌ర మీకోసం చాణ‌క్య అని మ‌రో స్క్రిప్ట్ ఉంద‌ట క‌దా?
- ప్రేమ‌మ్ త‌ర్వాత మీతో మ‌ర‌లా సినిమా చేయాల‌ని ఉంది అని అన్న తొలి ద‌ర్శ‌కుడు చందు. అది న‌టుడిగా నా మీద నాకు న‌మ్మ‌కాన్ని పెంచింది. త‌ను ప్రేమ‌మ్ త‌ర్వాత చాణ‌క్యస్క్రిప్ట్ కూడా చెప్పాడు. భ‌విష్య‌త్తులో దాని గురించి ఆలోచిస్తాను.

* శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వం చేస్తున్న సినిమా గురించి?
- ఇంకా టైటిల్ పెట్ట‌లేదు. అందులోనూ పెళ్ల‌యిన జంట‌లాగానే న‌టిస్తున్నాం. అయితే పెళ్ల‌యి నిత్యం గొడ‌వ‌ప‌డే జంట అది. మా ఇద్ద‌రి మ‌ధ్య ఎప్పుడూ గొడ‌వ‌లు లాంటివిలేవు. సో సెట్లో న‌టిస్తున్నాం. క‌లిసి ఎక్కువ స‌మ‌యాన్ని గ‌డ‌పడానికి వీల‌వుతోంది. ఎవ‌రినీ ఎవ‌రూ డామినేట్ చేయ‌కుండా న‌టిస్తున్నాం. స‌మ్మ‌ర్‌కి విడుద‌ల‌వుతుంది. ఫిబ్ర‌వ‌రికి షూటింగ్ అంతా పూర్త‌వుతుంది. మ‌రో వైపు వెంకీమామ సినిమా డిసెంబ‌ర్ నుంచి మొద‌ల‌వుతుంది.

* పెళ్ల‌య్యాక మీ జీవితంలో వ‌చ్చిన మార్పులేంటి?
- ఇంత‌కు ముందుక‌న్నా చాలా హ్యాపీగా ఉన్నా. జీవితం సంపూర్ణంగా అనిపిస్తోంది. ఎలాంటి ప‌రిస్థితుల‌నైనా త‌ట్టుకుని నిల‌బ‌డ‌గ‌ల‌న‌ని అనిపిస్తోంది. జీవితంలో ఓ ర‌క‌మైన బ్యాల‌న్స్ వ‌చ్చింది.

* ఇద్ద‌రూ బిజీగా ఉంటున్నారు. అలాంట‌ప్పుడు ఎలా స‌మ‌యాన్ని కేటాయించుకోగ‌లుగుతున్నారు?
- ఆదివారాలు ఇద్ద‌రం ప‌నిచేయ‌డం లేదు. షిఫ్ట్ లు కూడా ఒకేలా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాం.

* మీ ఇద్ద‌రి సినిమాలు ఇటీవ‌ల ఒకే రోజు విడుద‌ల‌య్యాయి. ఎలా అనిపించింది.?
- ఇంట్లో ఉత్కంఠ వాతావ‌ర‌ణ‌మే. యు ట‌ర్న్ కి మంచి రివ్యూలు వ‌చ్చాయి.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved