pizza
Nagarjuna interview (Telugu) about Manmadhudu 2
‘మన్మథుడు2’ నాకు బాగా కనెక్ట్‌ అయిన కథ! - నాగార్జున
You are at idlebrain.com > news today >
Follow Us

7 August 2019
Hyderabad

నాగార్జున హీరోగా రూపొందుతున్న చిత్రం ‘మన్మథుడు2’. రాహుల్‌ రవీంద్రన దర్శకుడు. అన్నపూర్ణ స్టూడియోస్‌తో కలిసి వయాకామ్‌18, ఆనంది ఆర్ట్స్‌ తెరకెక్కిస్తున్నాయి. రకుల్‌ నాయిక. ఈ సినిమాగురించి బుధవారం నాగార్జున విలేకరులకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ విశేషాలు..

*మన్మథుడు2’ విడుదలవుతున్నప్పుడు ఎలా ఉంది?
- బటర్‌ఫ్లైస్‌ ఇన ద స్టొమక్‌ అన్నట్టుంది నా ఫీలింగ్‌. చాలా బాగా హార్డ్‌ వర్క్‌ చేశాం. లక్షలాది మంది సినిమా చూసి జడ్జి చేస్తారు. అంతెందుకు జర్నలిస్టులు కూడా ప్రతిసారీ ఆర్టికల్‌ రాసినప్పుడు ఎవరైనా బావుందంటే బాగా అనిపిస్తుంది. ఎవరైనా బాగోలేదని అన్నప్పుడు ఏదోలా అనిపిస్తుంది కదా. సినిమా కూడా అంతే.

* ఫ్రెంచి సినిమా హక్కులను కొని ఈ సినిమా చేయాలని ఎందుకు అనిపించింది?
- నా కెరీర్‌లో ఈ దశలో రొమాంటిక్‌ కామెడీలు నాకు నప్పవు అని అనుకుంటున్న సమయంలో నేను ఆ సినిమా చూశా. చూసీచూడగానే చాలా బాగా నచ్చింది. టైలర్‌ మేడ్‌ అనిపించింది. ఫ్రెంచలో యాక్ట్‌ చేసిన అతను కూడా చాలా పాపులర్‌ అతను. ఆయన తన మిడిల్‌ ఏజ్‌లో ఉన్నాడు. దానికి తగ్గట్టు సినిమాలోనూ మిడిల్‌ ఏజ్డ్‌ బ్యాచలర్‌గా నటించాడు. సినిమా కూడా చాలా ఫన్నీగా అనిపించింది. నిజంగా చెప్పాలంటే ఇది రొమాన్స గురించి కానీ, ప్రేమ గురించి కానీ కాదు. అంతకు మించి తన కుటుంబం కోసం అతను చేశాడు? వారి ప్రభావం అతనిపై ఎలా ఉంది? తల్లితో అతనికున్న బంధం ఎలాంటిది? వంటివన్నీ ఆసక్తికరం. అతనికి తల్లి అంటే ఇష్టం. ఆమె ఏం చెప్పినా కాదనలేడు. అలాగని తన ఇష్టాలను దాచుకోలేడు. అలాంటి సమయంలో అతని జీవితంలోకి ఓ యువతి ప్రవేశిస్తే పరిస్థితి ఏంటనేది సినిమా.

* పెళ్లిని బరువుగా భావిస్తాడా?
- అలాంటిదేమీ కాదు. కానీ అతని జీవితంలో తల్లి, ముగ్గురు సిస్టర్స్‌ ఉన్నారు. వాళ్లు నలుగురూ అతన్ని నొక్కేసి, తొక్కేసి... (నవ్వుతూ) అలాంటి సమయంలో అతను మహిళలు తన జీవితంలో ఉండకుండా ఉంటే బావుంటుందని అనుకుంటాడు.

* పోర్చుగీస్‌ బ్యాక్‌డ్రాప్‌ తీసుకోవడం కథలో బ్యాక్‌డ్రాపా? లేకుంటే కొత్తగా ఉంటుందా?
- విజయనగరం నుంచి 1800 ఆఖరులో కొందరిని అటు మారిషస్‌, ఇటు పోర్చుగల్‌.. ఇలా కొన్ని చోట్లకు తీసుకెళ్లారు. అప్పుడు లేబర్‌గా తీసుకెళ్లారన్నమాట. అలా వెళ్లిన వాళ్లల్లో పోర్చుగీస్‌లో నాలుగో తరం వాళ్లుగా మేం నటించామన్నమాట. మామూలుగా అలా వెళ్లినప్పుడు బయటి నుంచి సపోర్టింగ్‌ సిస్టమ్‌ ఉండదు కాబట్టి, కుటంబంలో ఉన్న వ్యక్తుల మధ్య గట్టి బంధం ఉంటుంది. మామూలుగా ఇంకో చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే మారిషస్‌ వెళ్లినా, ఫిజి ఐల్యాండ్స్‌ వెళ్లినా, అమెరికా వెళ్లినా, అక్కడ తరాల తరబడి సెటిల్‌ అయిన తెలుగు కుటుంబాలుంటాయి. వాళ్లు చాలా స్వచ్ఛమైన తెలుగు మాట్లాడుతారు. ఇంగ్లిష్‌ పదాలు మధ్యలో రావు. ఈ సినిమాలో మేం మాట్లాడే మాటల్లోనూ ఆంగ్ల పదాలుండవు. అన్నీ పోర్చుగీసు పదాలు మిక్స్‌ అయి ఉంటాయి. ఇంకో విషయం ఏంటంటే పోర్చుగల్‌గా జనాభా తక్కువ. మేం షూటింగ్‌ చేసిన వీధుల్లో ఎలాంటి పర్మిషన్లు అక్కర్లేదు. చాలా సులువుగా చేశాం.

* వయసు మీద జోకులు వేయడం వంటివన్నీ ఇందులోనే కనిపించాయి?
- అవునండీ. ఇంతకు ముందు వచ్చినా యంగర్‌ జనరేషన వాళ్లు పెళ్లి చేసుకోనని అనడం విని ఉంటారేమోగానీ, ఎక్కడా మిడిల్‌ ఏజ్‌ మేన అనడం విని ఉండరు. కానీ ఈ సినిమా విషయంలో అది కుదిరింది.

‘ రాహుల్‌ని ఎంపిక చేసుకోవడానికి కారణం ఏంటి?
- చి.ల.సౌ చూశా. చిన్న సినిమా. సెన్సిటివ్‌గా తీశాడు. అతనికి పెర్ఫార్మెన్స రాబట్టుకోవడం వచ్చు. ఈ సినిమాకు పెర్ఫార్మెన్సలు రాబట్టుకోవడం అవసరం. అందుకే తీసుకున్నాం. ఇంకో విషయం ఏంటంటే ఈ సినిమా గురించి చెప్పగానే అతను హెసిటేట్‌ చేశాడు. కానీ సినిమా చూసిన తర్వాత వెంటనే ఓకే చేశాడు. కామెడీ చాలా బాగా చేశాడు. ఫ్యామిలీ ఎమోషన్సని కూడా చాలా బాగా డీల్‌ చేశాడు. ఆ సినిమా బేస్‌ లైన తీసుకుని చాలా చేంజ్‌ చేశాడు. ఏడాది పాటు ప్రీ ప్రొడక్షన చేశాం. రాహుల్‌, కెమెరామేన సుకుమార్‌ కలిసి చాలా బాగా చేశారు.

* వయాకామ్‌, ఆనంది ఆర్ట్స్‌తో సినిమా చేయడం గురించి?
- వయాకామ్‌ వాళ్లకి నాతో కలిసి పనిచేయాలని ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు కుదిరింది. ఆనంది ఆర్ట్స్‌ కిరణ్‌ , నేనూ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్‌. ఎప్పుడో చేయాల్సింది.

* ఈ పుట్టినరోజు ఎక్కడ జరుపుకోవాలనుకుంటున్నారు?
- నా కుటుంబంతో ఎక్కడికైనా వెళ్దామనుకుంటున్నా.

* ఈ సినిమాలో భాషకు బీప్‌లు ఇచ్చారని తెలిసింది?
- సినిమా చూశాక చెప్పండి. ఎందుకని.. ఎవరు మాట్లాడారు? వంటివన్నీ.

* యు/ఎ ఇచ్చారు?
- అయినా అందరూ చూడదగ్గ సినిమా. మన పిల్లలకు ముద్దులవీ తెలియదని అనుకోవడం మన అమాయకత్వం.

* ఇప్పుడు యువహీరోలు వైవిధ్యంగా సినిమాలు చేస్తున్నారు? దానివల్ల సీరియర్లకు కథలు కరవవుతాయా?
- అవును. ఉన్న కథల్లోనే మంచివి ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.

* ‘బ్రహ్మాస్త్ర’ గురించి చెప్పండి?
- చాలా మంచి సినిమా అవుతుంది. పాత్రలకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. సరైన టైమ్‌లో పాత్రల ఎంట్రీ ఉంటుంది. నాకు తెలుగులో మంచి స్ర్కిప్ట్‌లు చేయాలని ఉంది. ఒకవేళ బాలీవుడ్‌లో మంచి స్ర్కిప్ట్‌లు వస్తే, వాళ్లకి నేను అవసరమైతే చేస్తా.

* బైలింగ్వుల్‌ సినిమాల గురించి?
- అవి వర్కవుట్‌ కావండీ. నేను ఇప్పటిదాకా నాలుగు సినిమాలు చేశాను. అవేమీ వర్కవుట్‌ కాలేదు. ఎందుకంటే ఎవరి సంస్కృతి, ఎవరి కట్టుబాట్లు, ఆచారాలు వాళ్లకి ఉంటాయి కాబట్టి. ఏమో నాకైతే అవి వర్కవుట్‌ కాలేదు. ఒకవేళ ఎవరికైనా అయితే ఫర్వాలేదు.

* ‘బాహుబలి’కి ముందు మనం ఊహించని బడ్జెట్‌లను ఇప్పుడు నేరుగా చూస్తున్నాం. అంత పెద్ద బడ్జెట్‌ల గురించి వింటుంటే భయమనిపించడం లేదా?
- ఆ బడ్జెట్‌ భయపెడుతోంది. అయినా కొందరు పెట్టడానికి ముందుకొస్తున్నారు. అంతంత బడ్జెట్‌తో సినిమాలు చేయడం మంచిదే.

* ‘బిగ్‌బాస్‌’ గురించి చెప్పండి?
బిగ్‌బాస్‌ వేరు. ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’వేరు. గతంలో మీలో ... లో నేను మనుషులతో సరదాగా మాట్లాడేవాడిని. ఇప్పుడు మనుషులు వారానికి వారానికి మారిపోతున్నారు. అసలు అనూహ్యంగా మారిపోతున్నారు. వాళ్లను నెక్స్ట్‌ వీక్‌ నేను చూసినప్పుడు నాకు వేరే వ్యక్తిగా కనిపిస్తున్నారు. మనుషుల్ని ఎలా జడ్జి చేయాలో ఇంకా బెటర్‌గా తెలుస్తుంది. నిజానికి 2, 3రోజులు అలాంటి చోట నన్ను వేసినా, నేను ఉండలేను. నా బెడ్‌రూమ్‌నీ, నా బాతరూమ్‌నీ, నా భార్య తప్ప ఇంకొకరితో షేర్‌ చేసుకోలేను.

* రకుల్‌ గురించి చెప్పండి?
- రకుల్‌కీ, నాకూ గొడవలు ఉన్నాయని అప్పట్లో ఎవరో, ఏదో రాశారు. కానీ నేను ఆ అమ్మాయిని చూసి అలా ఉండమని చాలా మందికి చెబుతుంటా. అంత హెల్దీగా ఉంటుంది రకుల్‌. ఆమెలా వర్కవుట్లు చేయమని చెబుతుంటా. ఈ చిత్రంలో కీర్తిసురేష్‌, సమంత కూడా కేమియోలు చేశారు. వాళ్లవి కూడా కీలక పాత్రలు.

* సీరియస్‌ సినిమాలు చూస్తారా?
- నేను సీరియస్‌ సినిమాలు చూడను. సరదాగా నవ్వించే వాటినే చూస్తా. ఒకవేళ నేను కంటతడి పెట్టినా... ఆనందంతో తబ్బిబ్బై పెట్టే కంట తడి అయి ఉండాలి. లేకపోతే ‘భాగ్‌ మిల్కా భాగ్‌’ లాంటి ఇనస్పిరేషనల్‌ స్టోరీస్‌ చూడటానికి ఇష్టపడతాను.



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved