pizza
Nagarjuna interview about Oopiri
ఊపిరి చాలా మందికి స్ఫూర్తినిచ్చే చిత్రమవుతుంది - నాగార్జున
You are at idlebrain.com > news today >
Follow Us

17 March 2016
Hyderaba
d

నాగార్జున , కార్తీ, తమన్నా కాంబినేష‌న్లో రూపొందిన భారీ మ‌ల్టీస్టార‌ర్ మూవీ ‘ఊపిరి’. తెలుగు, త‌మిళ్ లో వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఊపిరి ఈనెల 25న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. ఈ సంద‌ర్భంగా హీరో నాగార్జున ఇంటర్వ్యూ...

లైఫ్ చేంజింగ్ మూవీ....
ఊపిరి కామెడి, ఎంటర్ టైన్మెంట్ ఎలా ఉంటుందంటే నవ్విస్తూనే ఉంటుంది. చివర్లో కంటతడి పెట్టిస్తుంది. అలాగే ఏడిపిస్తూ చివరల్లో నవ్విస్తుంది. డిఫరెంట్ మూవీ. 'శివ', 'అన్నమయ్య', 'గీతాంజలి', 'నిన్నే పెళ్లాడతా' చిత్రాలు నటుడిగా నా జీవితంలో మార్పు తీసుకొచ్చాయో.. ఈ చిత్రం కూడా అలాంటి లైఫ్ చేంజింగ్ మూవీ.

వెంటనే ఓకే చెప్పేశాను...
-నేను ఫ్రెంచ్ మూవీ ఇన్ టచ్ బుల్ష్ మూవీ చేశాను. ఆ సినిమాలో ఎమోషన్స్, కామెడి నాకు బాగా నచ్చింది. ఆరోజే సినిమాను నేను చేస్తే బావుంటుందనుకున్నాను. అలాంటప్పుడు ఓ రోజు వంశీ, పివిపి కలసి నా దగ్గరకు వచ్చారు. భయపడుతూ వంశీ ఓ డీవీడీ ఇచ్చారు. మీరు ఒప్పుకుంటేనే సినిమా చేస్తాం. లేదంటే లేదని అన్నారు. డీవీడీలో ఏముందని అడగ్గా ఫ్రెంచ్ చిత్రం 'ఇన్ టచబుల్స్' స్ఫూర్తితో ఓ కథ రాశామన్నారు. వెంటనే డీవీడీ చూడకుండా అంగీకరించాను.మన నేటివిటీకి అనుగుణంగా సరిపడా మార్పులు చేశారు. ఇది కళాత్మక చిత్రమో.. ప్రయోగాత్మక చిత్రమో.. కాదండి. చక్రాల కుర్చీలో నటించినప్పటికీ.. వికలాంగుడనే భావన ఎక్కడా కలగదు. మొదటి ఐదు నిమిషాల తర్వాత ఆడియెన్స్ సినిమాలోకి ఎంటరై పోతారు.

చాలెంజింగ్...అదృష్టంగా కూడా....
మనకు ఎమోషన్స్ అన్నీ ఓకేలా ఉండవు. విపరీతమైన కోపం.. పట్టరాని సంతోషం.. జీవితంలో ఏదో వెలితి.. చిన్ని చిన్ని కదలికలతో సహా ప్రతి భావాన్నీ కళ్లతోనే.. ముఖ కవళికలతో ప్రదర్శించాలి. కుర్చీకి పరిమితమైన వ్యక్తి కనుక చేతులూ.. కాళ్ళూ.. మిగతా శరీరం కదపకూడదు. విభిన్నమైన పాత్ర.. ప్రతీ సన్నివేశం విభిన్నంగా, కొత్తగా ఉంటుంది. గతంలో మీరు ఏ చిత్రంలోనూ చూసి ఉండరు. ఈ చిత్రంలో నటించడం నాకో సవాల్ వంటిది. అదే సమయంలో నా అదృష్టంగా భావిస్తాను

కొత్తగా అనిపిస్తాయి...
ఎన్టీఆర్ గారు, నాన్నగారు 70 దశాకాల్లో చాలా డిఫరెంట్ మూవీస్ చేశారు. కానీ 80 దశాకంలో అలాంటి సినిమాలు రాలేదు. 2015లో కొత్త కాన్సెప్ట్ మూవీస్ వస్తున్నాయి. రీసెంట్ టైంలో నాని భలే భలే మగాడివోయ్ సినిమా మనకు చూసినట్టే అనిపించినా మతిమరుపు అనే పాయింట్ యాడ్ చేయడం వల్ల సినిమా అంతా కొత్తగా అనిపిస్తుంది.

క్యారెక్టర్ గురించి....
ఊపిరి సినిమాలో నా పాత్ర పేరు విక్రమ్ ఆదిత్య.శారీరకంగా కదలలేని, వీల్ చెయిర్ లో కూర్చొనుండే పాత్ర. బిలియనీర్. ఏదైనా చేయించుకోగల పవర్ ఫుల్ పాత్ర. అయితే అతని చుట్టూ పక్కనుండేవారు బాస్ అని పిలుస్తుంటారు. అది అతనికి నచ్చదు. అలాంటి తరుణంలో స్లమ్ లో నుండి వచ్చిన వ్యక్తికి, ఇతనికి మధ్య రిలేషనేంటనేదే కథ.

నాకు యాక్షన్ రాదేమోనని భయపడ్డాను...
సినిమా స్టార్టింగ్ లోనే వంశీ పైడిపల్లితో నాకు ఇలాంటి క్యారెక్టర్ చేయడం ఫస్ట్ టైం కాబట్టి ఎంత టైం తీసుకున్నా పరావాలేదు. ఎమోషన్స్ క్యారీ అయ్యేలా చూసుకోమని చెప్పాను. వంశీ ఆ విషయంలో చాలా కేర్ తీసుకున్నాడు. అదీ కాకుండా తెలుగు, తమిళంలో ఓకే టైంలో షాట్స్ తీయడం వల్ల ఫస్ట్ షెడ్యూల్ కాస్తా ఆలస్యమైంది. కేవలం ఫేస్ తోనే ఎమోషన్స్ పలికించడమంటే మాటలు కాదు, ఒక్కోసారి ఇరవై టేక్స్ కూడా తీసుకున్నాను. ఓక్కోసారైతే నాకు యాక్షన్ రాదేమోనని డౌట్ గా ఉంది.

 

Nagarjuna interview gallery

కార్తీని చూసి సిగ్గుపడ్డాను....
కార్తీ మంచి హ్యుమన్ బీయింగ్. అతని అన్నయ్య సూర్య, తండ్రి శివకుమార్ గారు, ఫ్యామిలీ అంతా చాలా మంచి ఫ్యామిలీ. ఇక వర్క్ విషయానికి వస్తే కార్తీ చాలా డేడికేటివ్ పర్సన్. కొన్ని సీన్స్ అయితే తన నటనను అలా చూస్తుండేవాడిని. తెలుగులో పెద్ద పెద్ద డైలాగ్స్ నేర్చుకుని చెప్పేవాడు. అలాంటప్పుడు తనని చూసి నేను తమిళంలో అలా డైలాగ్స్ చెప్పలేకపోతున్నానని సిగ్గుపడేవాడిని. ఈ చిత్రంతో కార్తీ తెలుగు ఆడియెన్స్ మరింత దగ్గరవుతాడు.

కార్తీయే కారణం...
నేను తమిళంలో డబ్బింగ్ చెప్పడానికి రెండు కారణాలున్నాయి. ఒకటి ఫీల్ మిస్ కాకూడదని, రెండో కారణం తమిళంలో నా క్యారెక్టర్ కు ముందుగా వేరేవరో డబ్బింగ్ చెప్పేశారు. ఆ డబ్బింగ్ విన్న కార్తీ, మీరు చెప్తేనే బావుంటుందని, సమయం తీసుకున్నా పరావాలేదు. నేను పక్కనుంటానని అన్నాడు. తను ఇచ్చిన ఇన్ స్పిరేషన్ తో తమిళంలో డబ్బింగ్ చెప్పాను. అక్కడక్కడా కొన్ని పదాలు కష్టమనిపించినా నేర్చుకుని చెప్పాను.

కాళ్ళు చేతులు కట్టేశారు...
బాడీ అంతా కదలకుండా ఉండటమంటే సులభమైన విషయం కాదు. నన్ను అసిస్టెంట్ డైరెక్టర్ అబ్జర్వ్ చేసేవాడు. ముఖ్యంగా క్లయిమాక్స్ లో అయితే నా కాళ్ళు చేతులు, బాడీని చెయిర్ కు కట్టేశారు కూడా. వంశీ, కార్తీ, పిఎస్.వినోద్, తమన్నా ఎంతో సపోర్ట్ చేశారు.

వారికి స్ఫూర్తినిచ్చే చిత్రం....
ఇక మన జీవితం అయిపోయిందనుకుని బాధపడే చాలా మందిరకి ఈ చిత్రం స్ఫూర్తి నింపుతుంది. నిజానికి నేను ఇన్ టచ్ బుల్స్ మూవీ చూసినప్పుడు అలా ఇన్ స్ఫైర్ అయ్యాను.

అభిమానులు ఆ విషయంలో సంతోషపడతారు...
సినిమా అసాంతం నేను వీల్ చెయిర్ లో కూర్చొని ఉండే పాత్ర చేయడం చూసి అభిమానులు బాధపడతారనే సందేహం లేదు. ఎందుకంటే మన్మధుడు, సోగ్గాడు.. హీరోఇజం చూపించే చిత్రాలు వంద చేస్తున్నాను. అందులో ఇదొక్కటి. ఏం దాచలేదు సినిమా రీలజ్ కు ముందే అన్నీ చెప్పేశాం. అలాగే 'నిన్నే పెళ్లాడతా' విడుదలైన తర్వాత కాషాయ వస్త్రాలు ధరించి 'అన్నమయ్య' చిత్రీకరణకు బయలుదేరిన సమయంలో.. ప్రేక్షకులు మిమ్మల్ని ఈ తరహా పాత్రల్లో ఊహించుకుంటారా? అని ప్రశ్నించారు. సినిమా బాగుంటే, నచ్చేలా తీస్తే అందరూ ఆదరిస్తారు. ఈ సినిమాలో నా క్యారెక్టర్ చూసి ఇలాంటి క్యారెక్టర్స్ చేయడం మా హీరోకే సాధ్యం అని సంతోషపడతారు.

అఖిల్ ను తొందరపడవద్దని చెప్పాను....
అఖిల్ రెండవ చిత్రంపై ఇంకా ఓ నిర్ణయం తీసుకోలేదు. అఖిల్, దర్శకుడు వంశీ పైడిపల్లి మధ్య చర్చలు జరుగుతున్నాయి. 'ఊపిరి' విడుదల వరకు వంశీను డిస్టర్బ్ చేయవద్దంటూ అఖిల్ కు చెప్పాను. తెలుగులో రెండు స్క్రిప్ట్స్ ఓ హిందీ రీమేక్ పరిశీలనలో ఉన్నాయి. ఇంత వరకూ ఏదీ ఖరారు కాలేదు. 'మీరిద్దరూ ఓ నిర్ణయానికి వచ్చిన తర్వాత నా దగ్గరకు రమ్మ'ని చెప్పాను. ఈసారి మాత్రం నా నిర్ణయం ప్రకారమే అఖిల్ చిత్రం ఉంటుంది. తొందరపడవద్దని చెప్పాను.

అతిథి పాత్రలో...
ఈ చిత్రంలో అనుష్క అతిథి పాత్రలో నటించింది.

నెక్ట్స్ ప్రాజెక్ట్స్....
రాఘవేంద్రరావుగారి దర్శకత్వంలో వెంకటేశ్వర స్వామి భక్కుడు హథీరాం బాబా పాత్రలో సినిమా చేస్తున్నాను. లోకేషన్స్ సెర్చ్ జరుగుతుంది. మే నెలలో సినిమా చిత్రీకరణ ప్రారంభం కావచ్చు.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved