pizza
Naga Shourya interview about Kalyana Vaibhogame
సింపుల్ గా నేను ఆమెను ఫాలోఅయ్యానంతే - నాగశౌర్య
You are at idlebrain.com > news today >
Follow Us

01 March 2016
Hyderaba
d

శ్రీరంజిత్ మూవీస్ బ్యానర్ పై నాగశౌర్య, మాళవిక నాయర్ జంటగా నందిని రెడ్డి దర్శకత్వంలో కె.ఎల్.దామోదర్ ప్రసాద్ నిర్మించిన చిత్రం ‘కళ్యాణ వైభోగమే’. ఈ సినిమా మార్చి 4న విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో నాగశౌర్యతో ఇంటర్వ్యూ....

సక్సెస్ పై నమ్మంగా ఉన్నాం....
- నా గత చిత్రాలు కూడా పెద్దగా సక్సెస్ కాలేదు. ఈ సినిమాపై చాలా నమ్మకంతో ఉన్నాం. తప్పకుండా మంచి సక్సెస్ అవుతుందని భావిస్తున్నాను.

క్యారెక్టర్ గురించి....
-ఈ సినిమాలో శౌర్య అనే అబ్బాయిగా కనపడతాను. పెళ్ళి వద్దనుకునే కుర్రాడు. కొన్ని పరిస్థితుల్లో పెళ్ళి చేసుకుంటాడు. తర్వాత అతనెలా మారతాడు, కథ. తన రిలేషన్స్, ఎమోషన్స్ ఎలా ఉన్నాయనేదే సినిమా. తొంబై తొమ్మిది శాతం ఇప్పటి యూత్ కు కనెక్ట్ అయ్యే పాత్ర.

నిర్మాత గురించి.....
-దాముగారు చాలా జెన్యూన్ నిర్మాత. డేరింగ్, డాషింగ్ నిర్మాత. స్క్రిప్ట్ ను నమ్మి ఈ సినిమా చేశారు.

కళ్యాణ్ కోడూరి మ్యూజిక్....
-‘ఊహలు గుసగుసలాడే’ సినిమా తర్వాత నేను కళ్యాణ్ కోడూరిగారి మ్యూజిక్ డైరెక్షన్ లో చేస్తున్న సినిమా. ఆ సినిమా తర్వాత ఈ సినిమాకు ఇంకా బెస్ట్ మ్యూజిక్ ఇచ్చారు. పెళ్ళి సాంగ్, పబ్ సాంగ్ కు ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ వస్తున్నాయి. చార్ట్ బస్టర్ లో టాప్ 5లో కళ్యాణ వైభోగమే సాంగ్స్ ఉండటం చాలా హ్యపీగా ఉంది. అలాగే సినిమాటోగ్రాఫర్ రాజుగారు తొలిసినిమా అయినా ఎక్సలెంట్ అవుట్ పుట్ ఇచ్చారు. అమేజింగ్ పర్సన్.

మ్యాజిక్ రిపీటవుతుందన్నాను....
-నందినీ రెడ్డిగారు ముందు 30-45 నిమిషాలు కథ చెప్పిన తర్వాత మరో ముప్పై నిమిషాలు కథ చెప్పమని ఆమెను అడిగాను. నాకు కథ అంతా బాగా నచ్చింది. తర్వాత ఆరు నెలలు పాటు ఆమెతో టచ్ లో నేను. తర్వాత ఓరోజు ఆవిడే ఫోన్ చేసి సినిమా చేద్దామని అన్నారు. దాముగారు నిర్మాత అనగానే నేను ‘అలామొదలైంది’ మ్యాజిక్ రిపీటవుతుందని ఆమెతో అన్నాను.

Naga Shourya interview gallery

తను ఎగ్జామ్స్ తో బిజీ.....
-మాళవిక నాయర్ చిన్నపిల్ల. సెట్ లో నేను గోల చేసేవాడిని కాను. మాళవిక మాత్రం చాలా సైలెంట్ గా ఉండేది. ప్రస్తుతం తను ఎగ్జామ్స్ తో బిజీగా ఉంది.

ఓ ఫ్యామిలీలా కలిసిపోయాం....
-ఈ సినిమాలో ఐశ్వర్యగారు, రాశిగారు, ఆనంద్ గారు ఇలా సీనియర్ యాక్టర్స్ అందరితో కలిసి వర్క్ చేయడం వల్ల చాలా విషయాలు నేర్చుకున్నాను. ఆరునెలలు పాటు కలిసి వర్క్ చేయడం వల్ల అంతా ఓ ఫ్యామిలీలా కలిసిపోయాం.

పెళ్ళి గొప్పతనాన్ని చెబుతుంది....హైలైట్ అదే...
-ఈ సినిమా చూస్తున్నంత సేపు మన ఫ్యామిలీ మెంబర్స్ ను గుర్తుకు తెచ్చుకుని సినిమాకు బాగా కనెక్ట్ అవుతాం. పెళ్ళే వద్దనుకునేవారు పెళ్ళి చేసుకున్న తర్వాత ఎలా ప్రేమలో పడ్డారు. వారి మధ్య రిలేషన్, గొడవలు, ఎమోషన్స్ ఇలా అన్నింటి గురించి ఈ సినిమా చెబుతుంది. పెళ్ళికి ఉన్న వాల్యూ గురించి తెలియజేసే చిత్రం. ఈ చిత్రంలో పెళ్ళి సాంగ్ చాలా హైలైట్ గా నిలుస్తుంది.

నేను ఆవిడను ఫాలో అయ్యానంతే....
- నందినీ రెడ్డిగారు చాలా కసితో ఈ సినిమా చేశారు. నందినీ రెడ్డిగారు ఈ సీన్ ఎక్స్ ప్లెయిన్ చేసేటప్పుడే యాక్ట్ చేసి చూపిస్తారు. ఆవిడను సింపుల్ గా ఫాలో అయ్యానంతే నటన పరంగా నేను ఈ చిత్రం కోసం పెద్దగా కష్టపడలేదు.

నెక్ట్స్ ప్రాజెక్ట్స్....
-ఒక్కమనసు సినిమా చేస్తున్నాను. ఒకట్రెండు రోజులు తప్ప షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకోవాల్సి ఉంది. అలాగే ఒక వారం రోజుల్లో అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో వారాహి చలన చిత్రం బ్యానర్ పై జో అచ్యుతానంద సినిమా స్టార్ట్ కాబోతుంది.


 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved