'ఊహలు గుసగుసలాడే', 'లక్ష్మిరావే మా ఇంటికి', 'కళ్యాణ వైభోగమే' వంటి హిట్ చిత్రాల్లో నటించిన యంగ్ ప్రామిసింగ్ హీరో నాగశౌర్య లేటెస్ట్ గా 'నీ జతలేక'చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. శ్రీసత్యవిధుర మూవీస్ పతాకంపై లారెన్స్ దాసరి దర్శకత్వంలో అన్‌కాంప్రమైజ్డ్ ప్రొడ్యూసర్స్ జి.వి. చౌదరి, నాగరాజుగౌడ్ చిర్రా సంయుక్తంగా నిర్మించిన 'నీ జతలేక' చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఆగస్టు 13న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హీరో నాగశౌర్యతో ఇంటర్వ్యూ.
'నీ జతలేక' కాన్సెప్ట్ ఏంటి? - అమ్మాయి లేకుండా అబ్బాయి ఉండలేడు. అలాగే అబ్బాయి లేకుండా అమ్మాయి ఉండలేదు. అలాంటి అమ్మాయి అబ్బాయికి ఎలాంటి హెల్ప్ చేసింది? అతను ఎలాంటి ప్రయోజకుడు అయ్యాడు అనేది కాన్సెప్ట్. బేసిక్‌గా ఇది ఒక ప్రేమకథ. ఇప్పుడున్న యూత్ ట్రెండ్‌కి కనెక్ట్ అయ్యేవిధంగా ఈ చిత్రం ఉంటుంది. ఫ్రెష్ ఫీల్‌తో సీన్స్ అన్నీ చాలా కొత్తగా ఉంటాయి. తప్పకుండా ఈ చిత్రం అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది.
ఈ సినిమాలో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది? - సినిమా చూస్తే నా క్యారెక్టర్ ఏంటో తెలుస్తుంది. సింపుల్‌గా చెప్పాలంటే మోడల్‌గా ఈ చిత్రంలో యాక్ట్ చేశాను. ఇప్పటి వరకు ఇలాంటి క్యారెక్టర్ చేయలేదు. చాలా కొత్తగా డిజైన్ చేశారు లారెన్స్. సినిమా చేసేటప్పుడే నాకు కొత్తగా అనిపించింది.
డైరెక్టర్ లారెన్స్ టేకింగ్ ఎలా ఉంది? - ప్రజెంట్ ట్రెండ్‌కి తగ్గట్టుగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు లారెన్స్. మంచి స్క్రిప్ట్. చాలా ఫ్రెష్ సబ్జెక్ట్ తో ఈ సినిమాని రూపొందించారు. సినిమా అంతా చాలా క్లీన్‌గా ఉంటుంది. ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ ఫిలిం. ట్రీట్‌మెంట్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఒక లవ్‌స్టోరీ చిత్రాన్ని బ్యూటిఫుల్‌గా తెరకెక్కించారు లారెన్స్ దాసరి.
నిర్మాతల సహకారం ఎలా ఉంది? - శ్రీ సత్యవిదుర మూవీస్ ప్రొడక్షన్ వాల్యూస్ బ్రహ్మాండంగా ఉన్నాయి. చౌదరిగారు, నాగరాజుగౌడ్ ఎక్కడా కాంప్రమైజ్ అవకుండా ఈ చిత్రాన్ని అద్భుతంగా నిర్మించారు. ఫస్ట్ సినిమా అయినా కూడా ఎంతో ఎక్స్‌పీరియన్స్ ఉన్న నిర్మాతల్లా చేశారు. మంచి సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంటర్ అవుతున్నారు. నెక్ట్స్ పెద్ద హీరోలతో మరిన్ని మంచి సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను.
Naga Shouryainterview gallery
ఆడియోకి ఎలాంటి రెస్పాన్స్ వస్తోంది? - స్వరాజ్ మంచి ఆల్బమ్ ఇచ్చారు. సాంగ్స్ అన్నీ చాలా బాగున్నాయి అంటున్నారు. యు ట్యూబ్‌లో ట్రైలర్‌కి, పాటలకు మంచి వ్యూస్ వస్తున్నాయి. ఆడియో సక్సెస్ అయి ప్లాటినం డిస్క్ ఫంక్షన్ కూడా జరుపుకున్నాం. కరుణాకరన్ మంచి బ్యాగ్రౌండ్ స్కోర్ అందించారు. ఆర్‌ఆర్‌తో సినిమా ఇంకా ఎలివేట్ అయింది.
పాటల్ని ఎక్కడెక్కడ షూట్‌చేశారు? - బ్యాంకాక్‌లోని అందమైన ప్రదేశాల్లో రెండు పాటల్ని చిత్రీకరించాం. మిగిలిన పాటల్ని వైజాగ్, హైదరాబాద్‌లో షూట్ చేశాం. రఘు మాస్టర్ మంచి కొరియోగ్రఫి చేశారు. ఫస్ట్‌టైం ఈ చిత్రంలో డాన్స్‌లు నాతో బాగా చేయించారు. ఈ క్రెడిట్ అంతా రఘు మాస్టర్‌కే చెందుతుంది.
హీరోయిన్స్ పర్ఫామెన్స్ గురించి? - పారుల్, సరయు ఇద్దరూ టాలెంటెడ్ ఆర్టిస్టులు. ఇద్దరూ వాళ్ల పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. గ్లామర్‌గానే కాకుండా పర్ఫామెన్స్ పరంగా చక్కగా నటించారు.
ఈ సినిమాలో హైలైట్స్ ఏంటి? - కెమెరామెన్ బుజ్జి ప్రతి ఫ్రేమ్‌ని బ్యూటిఫుల్‌గా చిత్రీకరించారు. ఇంట్రడక్షన్ సీన్‌తో పాటు ఇంటర్వెల్ బ్యాంగ్ హైలైట్‌గా నిలుస్తుంది. అలాగే స్వరాజ్ మ్యూజిక్, లారెన్స్ దాసరి టేకింగ్ వండర్‌ఫుల్‌గా ఉంటుంది. చౌదరి, నాగరాజుగౌడ్ మేకింగ్ హైలైట్‌గా నిలుస్తాయి.
వరుసగా సినిమాలు చేస్తున్నారు? - అది నా అదృష్టం. అవకాశాలు వచ్చినపుడు వరుసగా చేయాలి. లేకపోతే ఎలాగూ ఖాళీగా వుంటాం కదా.
చాలా మంది హీరోలు ఉన్నారు కదా? ఈ టఫ్ కాంపిటీషన్‌లో మీరెలా నెగ్గుకు రాగలుగుతున్నారు? - ఇక్కడ ఎవరి టాలెంట్ వారిది. యాక్టింగ్ నేర్చుకున్నంత మాత్రాన యాక్టింగ్ రాదు. డాన్స్ నేర్చుకున్నంత మాత్రాన డాన్స్ రాదు. మెయిన్‌గా లక్ ఉండాలి. సినిమా పట్ల ప్యాషన్ ఉండాలి. నాకంటే టాలెంట్ ఉన్న వాళ్లు కృష్ణానగర్, ఇంద్రానగర్,చాలాచోట్ల ఎంతో మంది ఉన్నారు. అవకాశాలు రావాలి. వస్తే అందరూ అదృష్టవంతులే.
జి.వి. చౌదరిగారి బ్యానర్‌లో సినిమా ఎప్పుడు? - స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే తప్పకుండా చేస్తాను. చిన్న బ్యానర్, పెద్ద బ్యానర్ అనే తేడా ఉండదు. చౌదరిగారు మంచి నిర్మాత. ఆయన మహేష్, ఎన్టీఆర్‌లతో సినిమాలు ప్లాన్ చేస్తున్నారు.