pizza
Nandini Reddy interview about Kalyana Vaibhogame
రిజల్ట్ తో సంబంధం లేదు...నచ్చితేనే చేస్తాను – నందిని రెడ్డి
You are at idlebrain.com > news today >
Follow Us

27 February 2016
Hyderaba
d

శ్రీరంజిత్ మూవీస్ బ్యానర్ పై నాగశౌర్య, మాళవిక నాయర్ జంటగా నందిని రెడ్డి దర్శకత్వంలో కె.ఎల్.దామోదర్ ప్రసాద్ నిర్మించిన చిత్రం ‘కళ్యాణ వైభోగమే’. ఈ సినిమా మార్చి 4న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకురాలు నందిని రెడ్డి సినిమా గురించిన విశేషాల తెలియజేస్తూ....

భయం లేకుండా తీశాను....
-నేను అలా మొదలైంది సినిమాను డైరెక్ట్ చేస్తున్నప్పుడు ఫస్ట్ టైం డైరెక్టర్ గా చేస్తుండబట్టి భయపడుతూ చేశాను. కానీ ఆ సినిమాను చూసిన చాలా మంది పెద్దగా బాలేదన్నట్టు చెప్పడంతో ఏం చేయాలో తెలియలేదు. కానీ నాకు సినిమాను వేరేలా తీయడం రాలేదు. కానీ సినిమ సూపర్ డూపర్ సక్సెస్ అయ్యింది. తర్వాత జబర్ దస్త్ సినిమా టైంలో సిద్ధార్థ్, సమంతలకు కళ్యాణ వైభోగమే కథనే చెప్పాను. కానీ కొన్ని పరిస్థితుల కారణమో, నా సక్సెస్ ను కాపాడుకోవడానికో వేరే కథను డైరెక్ట్ చేశాను. ఫెయిల్యూర్ చూశాను. అంటే నేను రెండు సినిమాలకే పెద్ద సక్సెస్ , ఫెయిల్యూర్ ను చూడటం వల్ల నాకు ఇక భయపడనవసరం లేదు. అందేకే కళ్యాణ్ వైభోగమే చిత్రాన్ని భయం లేకుండా తీశాను.

రిజల్ట్ తో సంబంధం లేదు...
-సినిమా చిత్రీకరణ సమయానికి ఎలాంటి భయం లేకుండా క్లారిటీతో ఉండటం వల్ల సినిమా చిత్రీకరణ సమయంలో ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేస్తూ చేశాను. నేను కాదు, ఈ సినిమా కోసం పనిచేసిన ప్రతి యూనిట్ మెంబర్ అలాగే పనిచేశారు. ప్రతి నిమిషం కష్టపడ్డాం, అడ్డంకులు పేస్ చేసి దాటాం. ఎంజాయ్ కూడా చేశాం. ప్రతి ఒక్కరూ ఫ్యామిలీ మెంబర్ లా కలిసిపోయారు. కళ్యాణ వైభోగమే సినిమా రిజల్ట్ తో మాకు సంబంధం లేదు. దర్శకురాలిగా పరిపూర్ణమైన ఆనందాన్ని పొందాను.

ఆయనకు ఈజీగా అర్థమవుతుంది...
-నేను సినిమాకు కథలు రాస్తానేమో ఒక స్టార్ హీరోను దృష్టిలో పెట్టుకుని కథ రాయమంటే రాయలేకపోవచ్చునేమోననిపించింది. ఎందుకంటే నేను చెప్పే కథలు చాలా మందికి అర్థం కావని అనుకుంటాను. కానీ దాము గారికి నేను చెప్పిన పాయింట్ బాగా అర్థమవుతుంది. అలాగే సినిమా కోసం ఆయన ఎప్పుడూ లెక్కలు వేసుకోరు. నేను చెప్పే ఎమోషన్స్, కామెడి అన్నీ ఆయనకు ఈజీగా అర్థమవుతుంది.

ఆయన మాటతో కాన్ఫిడెంట్ మరింత పెరిగింది.....
-సాధారణంగా షెడ్యూల్ గ్యాప్ లో ప్రతి దర్శకులు అంతకుముందు షెడ్యూల్ లో ఏం చిత్రీకరించారో చూసుకుని దానికి తగిన విధంగా రీ షూట్స్ పెట్టుకుంటారు. అయితే మాళవిక నాయర్ కు ఎగ్జామ్స్ ఉండటంతో సమ్మర్ మధ్యలో షూటింగ్ స్టార్ట్ చేసి కంటిన్యూగా 45 రోజుల పాటు షూటింగ్ చేశాం. దీనివల్ల నాకు ఎప్పుడూ షెడ్యూల్ లో ఎడింట్ చేసుకుని చూసుకునే అవకాశం లేకుండా పోయింది. కంటిన్యూ షెడ్యూల్ వల్ల 80 శాతం చిత్రీకరణ పూర్తయిపోయింది. ఆ షెడ్యూల్ చివర్లో జునైద్ గారు ఎడిటింగ్ లో సినిమా చూసి, నన్ను వచ్చి మెచ్చుకుని సినిమా చాలా బావుందని మెచ్చుకున్నారు. ఆయనలా చెప్పడంతో మాలో కాన్ఫిడెన్స్ మరింత పెరిగింది.

ఎక్స్ పెక్ట్ చేయని సక్సెస్...నచ్చితేనే చేస్తాను...
-నాకు ఇండస్ట్రీలో మిత్రులు చాలా తక్కువ మంది. నాకు చిన్నప్పటి మిత్రులే ఇంకా టచ్ లో ఉన్నారు. అలామొదలైంది సినిమా పూర్తయిన తర్వాత చాలా మంది పెద్దగా బాలేదని అన్నారు. కానీ నా మిత్రలతో పాటు కళ్యాణ్ కోడూరిగారు, మధుసూదన్ గారు సినిమా చూసి చాలా బావుందని అన్నారు. నానితో థియేటర్ లో సినిమా చూసినప్పుడు వస్తున్న రెస్పాన్స్ చూసి ఏడ్చేశాను. అలా మొదలైంది చిత్రానికి ఆ రేంజ్ సక్సెస్ ను ఎక్స్ పెక్ట్ చేయలేదు. ఆ సక్సెస్ తో సక్సెస్ పట్ల కోరిక, ప్రేమ అంతా తీరిపోయింది. ఇకపై డబ్బుకోసమో, సక్సెస్ కోసమో సినిమా చేయాల్సిన పనిలేదు. నచ్చితేనే సినిమా చేస్తాను.

Nandini Reddy interview gallery

సడెన్ గా వచ్చిన ఆలోచన...
-కళ్యాణ వైభోగమే నాకు బెస్ట్ ఫిలిం అవుతుంది. ఈ టైటిల్ విషయానికి వస్తే ఇన్ టెన్స్ తో పెట్టిన టైటిల్ అయితే కాదు. ఓ రోజు సినిమా గురించి ఆలోచనలో ఉండగా సడెన్ వచ్చిన ఆలోచన. వెంటనే ఈ టైటిల్ ను వివేక్ గారికి చెప్పాను. ఆయన చాలా బావుందని అన్నారు.

రియలిస్టిక్ మూవీ....
-ఈ జనరేషన్ లో పెళ్ళి చేసుకోమంటే బాబోయ్ పెళ్ళా అని చాలా మంది అంటుంటారు. అలాంటి ఇద్దరి వ్యక్తులకు సంబంధించిన కథ. ముందు తరం థర్డ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది. ఈ జనరేషన్ థర్డ్ ప్రాసెస్ ఎలా ఉందనేదిఈ సినిమాలో చూపించబోతున్నాం. హ్యుమన్ రిలేషన్స్ ను రియలిస్టిక్ గా చూపిస్తున్నాం.

తనకి క్లాస్ తీసుకున్నాను....
-మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణ్ కోడూరిలో చాలా విషయముంది. కానీ తను త్వరగా సంతృప్తి పడిపోయి ఇది చాలానుకుంటాడు. కానీ నేను అతనికి ఈ సినిమా విషయంలో చిన్న క్లాస్ తీసుకుని ఆరు సాంగ్స్, ఆరు సిచ్యువేషన్స్ చెప్పడం, అందుకు తగిన విధంగా ఆయన కూడా ఎక్సలెంట్ మ్యూజిక్ ఇచ్చారు.

పెళ్ళి సాంగ్ గురించి...
-సాధారణంగా మనకు పెళ్ళి సాంగ్ అనగానే బాపుగారి పెళ్ళిపుస్తకం, కృష్ణవంశీ మురారి సినిమాలే గుర్తుకువస్తాయి. ఈ సినిమాలో అలాంటి అవుట్ పుట్ కావాలని పెళ్ళి సాంగ్ కోసం చాలా కష్టపడ్డాను. ప్రతి చరణం, పల్లవిలను వివరించడం, దానికి తగిన విధంగా లక్ష్మీభూపాల్ సాహిత్యం అందించారు, కళ్యాణ్ మ్యూజిక్ ఇచ్చారు. ఇంత పెద్ద సాంగ్ చిన్ని ప్రకాష్ గారి కొరియోగ్రఫీ మూడున్నర రోజులోనే పూర్తి చేశాను. సినిమాలో ఈ సాంగ్ బెస్ట్ అవుతుంది.

నెక్ట్స్ ప్రాజెక్ట్స్..
-ఒక ఇన్ టెన్సివ్ లవ్ స్టోరీ కథ తయారు చేశాను. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమాకు సంబంధించిన ప్రాసెస్ మొదలు పెడతాను.


 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved