pizza
Nandita Swetha interview (Telugu) about Ekkadiki Pothavu Chinnavada
గుడికెళ్తూ దెయ్యాన్ని చూశా - నందితా శ్వేత‌
You are at idlebrain.com > news today >
Follow Us

20 November 2016
Hyderaba
d

నిఖిల్ న‌టించిన చిత్రం `ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా`లో నాయిక‌గా న‌టించింది నందితా శ్వేత‌. త‌మిళంలో `అట్టాక‌త్తి`, `ముండాసిప‌ట్టి`, `ఎదిర్ నీచ్చ‌ల్‌`లో న‌టించిన ఈ సుంద‌రికి తొలి తెలుగు చిత్రం ఇదే. వి.ఐ.ఆనంద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. మేఘ‌న ఆర్ట్స్ నిర్మించిన చిత్ర‌మిది. ఈ సినిమా గురించి నాయిక నందితా శ్వేత ఆదివారం హైద‌రాబాద్‌లో విలేక‌రుల‌తో మాట్లాడింది. ఆ విశేషాలు..

* తెలుగు బాగా నేర్చుకున్న‌ట్టున్నారు?
- నేర్చ‌కున్నాను. నా స్టాఫ్ ద‌గ్గ‌ర‌, అసిస్టెంట్ డైర‌క్ట‌ర్ల‌తో అంద‌రితో మాట్లాడుతూనే ఉన్నా. నా త‌ర్వాతి సినిమాలో మాట్లాడుతాను.

* డ‌బ్బింగ్ మీరే చెప్పారా?
- లేదండీ. డ‌బ్బింగ్ చెప్పేయాల‌న్న ఆశ‌తో కేర‌క్ట‌ర్‌ని కిల్ చేయ‌డం నాకు ఇష్టం లేదు. కాక‌పోతే నాకు డ‌బ్బింగ్ కూడా చెప్పుకోవాల‌ని ఉంది. త్వ‌ర‌లో ట్రై చేస్తా.

* హార‌ర్ సినిమాలు చూస్తారు?
- నా బెడ్‌రూమ్‌లో అర్థ‌రాత్రి 12 గంట‌ల‌కు లైట్ల‌న్నీ ఆర్పేసి, చీక‌టిలో చాలా హార‌ర్ సినిమాలు చూసేదాన్ని. చాలా ఎంజాయ్ చేస్తాను. త‌మిళంలోనూ నాకు చాలా ఆఫ‌ర్లు వ‌చ్చాయి. కాక‌పోతే హార‌ర్ చిత్రాల‌ని అన‌గానే హెవీ మేక‌ప్ వేసుకోమ‌ని అంటారు. అలాంటివి నాకు ఇష్టం లేదు. కానీ ఎక్క‌డికిపోతావు చిన్న‌వాడా అందుకు భిన్నంగా ఉంది. అందువ‌ల్ల వెంట‌నే ఒప్ప‌కుని చేశా.

* దెయ్యాలున్నాయ‌ని న‌మ్ముతారా?
- నేను దేవుడున్నాన‌ని న‌మ్ముతాను. అందువ‌ల్ల దెయ్యాలున్నాయ‌ని కూడా న‌మ్ముతాను. మంచి వెన‌కాలే చెడు కూడా ఉంటుందని న‌మ్ముతా.

* మీరు దెయ్యాన్ని చూశార‌ట క‌దా?
- నేను గోక‌ర్ణ‌, ధ‌ర్మ‌స్థ‌ల‌కి వెళ్తున్న‌ప్పుడు నేను ఓ దెయ్యాన్ని చూశా.

Nandita Swetha interview gallery

* సెల్వ‌రాఘ‌వ‌న్ సినిమాలోనూ దెయ్యంగానే చేస్తున్నారా?
- అది చాలా డిఫ‌రెంట్‌గా ఉంటుంది. నందిత ఓ సినిమాను ఒప్ప‌కుంటే ఎలా ఉంటుందో ఈ సినిమాను చూసి తెలుసుకోవ‌చ్చు.

* బ‌న్ని ఫోన్ చేశార‌ట క‌దా?
- ఆయ‌న నాకు ఫోన్ చేసి చెప్పిన‌ప్పుడు చాలా ఆనందంగా అనిపించింది. త‌న‌తో ప‌నిచేయాల‌ని ఉంద‌ని చెప్పాను. `వెల్క‌మ్ టు టాలీవుడ్‌` అని అన్నారు.

* ఇంత చాలెంజింగ్ రోల్ చేసిన‌ప్పుడు ఎలా అనిపించింది?
- మొద‌టి నుంచి నాకు చాలెంజ్ అంటే ఇష్టం. స్కూల్ డేస్‌లో కూడా ఇంట్లో కూర్చుని నాలుగు రోజులు చ‌దివి రాసి అన్నీ పేప‌ర్లు పాస్ అయ్యేదాన్ని. ఎదిర్ నీచ్చ‌ల్ అనే సినిమాలో కూడా నేను చాలెంజింగ్ పాత్ర చేశాను.

* జ్యోతిక త‌ర్వాత అలాంటి పాత్ర‌లో మీరు చేశార‌ని అంద‌రూ అంటున్నారు?
- నిజ‌మే. ఆ మాట‌ను నేను కూడా విన్నాను. ఎందుకంటే జ్యోతిక‌ను ఎవ‌రూ రీప్లేస్ చేయ‌లేరు. కానీ అంద‌రూ అలా చెప్తుంటే నాకు ఆనందంతో ఏడుపొస్తోంది.

* తెలుగు, త‌మిళ్ ప‌రిశ్ర‌మ‌ల్లో తేడాల‌ను గ‌మ‌నించారా?
- భాష త‌ప్ప ఇంక ఏమీ తేడా లేదు. తెలుగు లాంగ్వేజ్ క్యూట్‌గా ఉంది. ఇక్క‌డ న‌న్ను ఆహ్వానించిన తీరు చాలా గొప్ప‌గా ఉంది.

* ఇక్క‌డ కొన్ని ప్రాజెక్ట్ ల‌ను వ‌దులుకున్నార‌ని తెలిసింది?
- ఆర్టిస్ట్ గా ప్రాప‌ర్ స్క్రిప్ట్ త‌ప్ప‌కుండా చేస్తా. స్క్రిప్ట్ లో గ్లామ‌ర్ కావాల్సి ఉంటే చేయ‌డానికి నాకేం ఇబ్బంది లేదు. నా పాత్ర‌కు ప్రాముఖ్య‌త ఉంటే చాలు.

* దెయ్యం రోల్స్ చేయ‌డానికి ఏదైనా హోమ్ వ‌ర్క్ చేశారా?
- మామూలు విష‌యాల‌కు స్ఫూర్తి ఉంటుంది. కానీ దెయ్యాల విష‌యంలో ఎవ‌రిని స్ఫూర్తిగా తీసుకోవాలి? కెమెరా ముందు ఏం చేస్తామో అదే. అంతే త‌ప్ప ఇంకేమీ లేదు.

* మీకు స‌క్సెస్ రేట్ ఎక్కువ‌గా ఉంది. అయినా తెలుగుకు రావ‌డానికి ఇంత ఆల‌స్యం ఎందుకైంది?
- తెలుగుకు రావ‌డానికి నాలుగేళ్లు ప‌ట్టిందా? అని చాలా మంది అడిగారు. కానీ కొన్ని సినిమాల‌ను నేను వ‌ద్ద‌నుకున్నాను. కొంద‌రు న‌న్ను వ‌ద్ద‌న్నారు. ఎట్ట‌కేల‌కు ఈ క‌థ‌ను ఓకే చేసి చేశాను. హిట్ అయింది. ల‌క్కీ గ‌ర్ల్ అనే పేరు వ‌చ్చింది. తొలి సినిమాకే ల‌క్కీ గ‌ర్ల్ గా పేరు తెచ్చుకోవ‌డం మామూలు విష‌యం కాదు. అందుకు చాలా ఆనందంగా ఉంది.

* మిమ్మ‌ల్ని కొన్ని సినిమాల వాళ్లు రిజ‌క్ట్ చేశార‌ని అన్నారు క‌దా? ఎందుక‌ని?
- మీరు ఏమ‌డ‌గాల‌ని అడుగుతున్నారో నాకు తెలిసిపోయింది. కాక‌పోతే అది చాలా మంది హీరోయిన్ల విష‌యంలో జ‌రిగేదే. కొన్ని సార్లు వాళ్ల ప్రాజెక్ట్ లో పాత్ర‌లు ఒక ర‌కంగా ఉండేవి, నేను ఇంకో ర‌కంగా ఉండేవి... ఇలాంటివి చాలా జ‌రిగాయి. ఈ సినిమా చూసి ఓ ద‌ర్శ‌కుడు ఫోన్ చేసి `నువ్వు ఇంత పెర్ఫార్మ్ చేస్తావ‌ని అనుకోలేదు. కానీ నా ప్రాజెక్ట్ లో నేను నిన్ను మిస్ అయ్యాను` అని అన్నారు. అంటే నేను స‌క్సెస్ అయిన‌ట్టేగా.

* హైద‌రాబాద్ ను చూశారా?
- ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా సినిమా షూటింగ్‌ 99 శాతం రాత్రుళ్ల‌లోనే జ‌రిగింది. ఇప్పుడిప్పుడే నేను సిటీని చూడాల‌నుకుంటున్నా. ఇక్క‌డి ఫుడ్ చాలా బాగా న‌చ్చింది. మా క‌ర్ణాట‌క ఫుడ్‌కి ద‌గ్గ‌ర‌గా ఉన్నాయి రెసిపీల‌న్నీ.

* నెక్స్ట్ ఏం చేస్తున్నారు?
- నెంజం మ‌రుప్ప‌దిల్లై విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. మొత్తం త‌మిళంలో నాలుగు సినిమాలున్నాయి. తెలుగులో మంచి పెద్ద సినిమానే చేస్తా.

* ద‌ర్శకుడి గురించి ఏం చెప్తారు?
- నా ముందు కూర్చుని ఎంత బాగా నెరేట్ చేశాడో, అంత బాగా ఈ సినిమాను తెర‌కెక్కించాడు. నాకు చెప్పిన విష‌యాల‌నే తీశాడు. తెలుగు సినిమాల్లో హీరోయిన్ ఎలా ఉండాలి? ఎలా క‌నిపించాలి? వ‌ంటి అంశాల‌న్నిటినీ నేర్పించాడు. నేను ఇంత‌కు ముందు సినిమాలు చాలా చేసి ఉండ‌వ‌చ్చు. కానీ తెలుగులో నేను చేసిన ఈ సినిమా నాకు కొత్త‌ది. నాకు నేనే ఇందులో కొత్త‌గా క‌నిపించాను.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved