pizza
Nani interview about Gentleman
మల్టీస్టారర్ చిత్రాల్లో నటించడానికి నేను సిద్ధమే - నాని
You are at idlebrain.com > news today >
Follow Us

16 June 2016
Hyderaba
d

అష్టాచ‌మ్మా వంటి హిట్ చిత్రం త‌ర్వా నానిఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన మ‌రో చిత్రం జెంటిల్‌మ‌న్‌.  'ఆదిత్య 369', 'వంశానికొక్కడు'  వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించిన శ్రీదేవి మూవీస్ సంస్థ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో సురభినివేదా థామస్ కథానాయికలుగా న‌టించారు. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకున్నఈ చిత్రం జూన్ 17న గ్రాండ్ లెవ‌ల్లో విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా హీరో నాని మాట్లాడుతూ ..

జెంటిల్‌మ‌న్ ఏంటిఈ టైటిల్ పెట్టాల‌నే ఆలోచ‌న ఎవ‌రిది?
సాధార‌ణంగా టైటిల్ గురించి అడిగిన‌ప్పుడు ఏదో ఒక‌టి చెప్ప‌వ‌చ్చు కానీ ఈ సినిమా టైటిల్ గురించి చెబితే ఆ క్యూరియాసిటీ త‌గ్గిపోతుంద‌ని చెప్ప‌డం లేదు. ఇక టైటిల్ గురించి అంద‌రూ ఆలోచిస్తున్న‌ప్పుడు నిర్మాత శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్‌గారు జెంటిల్ మ‌న్ లాంటి టైటిల్ కావాలి ఆలోచించండి అన్నారు. అంద‌రూ జెంటిల్‌మ‌న్ లాంటి టైటిలే కావాల‌ని ఆలోచిస్తున్న‌ప్పుడు అవ‌స‌రాల శ్రీనివాస్ అస‌లు జెంటిల్‌మ‌న్ అనే టైటిలే ఎందుకు పెట్ట‌కూడ‌దో ఆలోచించండి అన్నారు. అవును నిజ‌మే క‌దా పిల్ల జమీందార్ సినిమా సమయంలో కూడా అలానే పెట్టాం కదా, అని ఆలోచించి అందరికీ చెప్పాం. అందరికీ ఈ టైటిల్ నచ్చడంతో జెంటిల్‌మ‌న్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశాం. కథకు ఈ టైటిల్ ఎంత బాగా సూట్ అవుతుందో సినిమా చూస్తే రేపు మీకే అర్థమవుతుంది. అందుకే సినిమా టైటిల్ ను సినిమా చివర్లో వేస్తాం. అప్పుడు చూసేవారికి కూడా ఇది కరక్ట్ జస్టిఫికేషన్ అనిపిస్తుంది.

క్యారెక్ట‌ర్ గురించి...
ఈ సినిమా నా పాత్ర పేరు జై. నిర్మాణ రంగంలో ప‌నిచేస్తుంటాను. మ‌రి ఇందులో విల‌నా?  హీరోనా?  రెండు షేడ్స్ చేశానాఅనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. సినిమా స్టార్ట‌యిన ప‌ది నిమిషాల‌కే నా క్యారెక్ట‌ర్ గురించి రివీల్ అయిపోతుందిలే.

ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ అన‌గానే అబ్లిగేష‌న్‌తో ఈ సినిమా చేశారా?
అబ్లిగేష‌న్‌తో ఏ సినిమా చేయ‌నండీ..దీనికి మీకొక ఉదాహ‌ర‌ణ చెప్తాను. నాకొక క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడు. త‌ను డైరెక్ట‌ర్ కావాల‌నుకుంటున్నాడు. త‌ను నాకొక క‌థ చెప్పాడు. అది నాకు న‌చ్చ‌లేదు. పోనీ స్నేహితుడే క‌దా సినిమా చేద్దామంటే అది క‌చ్చితంగా స‌క్సెస్ కాద‌ని తెలుసు. కాబ‌ట్టి ఆ సినిమా నేను చేయ‌లేదు. త‌ను ముందు కొన్నిరోజులు నాతో మాట్లాడ‌లేదు. త‌ర్వాత త‌నే అర్థం చేసుకుని మాట్లాడాడు. మ‌న‌కెవ‌రైనా అబ్లిగేష‌న్ ఉంటే వారికి మంచి చేయ‌క‌పోయినా ప‌రావాలేదు కానీ చెడు చేయ‌కూడ‌దు. అలా సినిమా అంటే దాదాపు మూడు వంద‌ల మంది క‌ష్టం. ఈ సినిమా చేసేట‌ప్పుడు కూడా నేనెక్క‌డ అబ్లిగేష‌న్ పై సినిమా చేయ‌డానికి ఒప్పుకుంటానేమోన‌ని ఇంద్ర‌గంటిగారు నీకు న‌చ్చ‌క‌పోతే అస‌లు చేయ‌వ‌ద్దు ప‌దిసార్లు ఫోన్ చేసి చెప్పారు. ప‌ది మెసేజ్‌లు పెట్టారు. క‌థ విన‌గానే ఎగ్జ‌యిట్ అయ్యాను కాబ‌ట్టే చేశాను. ఈ సినిమాకు ముందు రెండుమూడు సార్లు క‌లిసిన‌ప్పుడు అష్టాచ‌మ్మాలాంటి సినిమాలా చేయకూడ‌దు. ఏదైనా కొత్త‌గా చేయాల‌ని అనుకునే చేశాం.

అదే నేను గ‌మ‌నించిన తేడా?
- నేనుఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ‌గారితో క‌లిసి అష్టాచ‌మ్మా చేసేట‌ప్పుడు ఆయ‌నొక మంచి రైట‌ర్‌. కానీ ఈ సినిమా విష‌యానికొస్తే ఆయ‌న మంచి రైట‌ర్ కంటే మంచి డైరెక్ట‌ర్ టెక్నిక‌ల్ విషయాల్లో కానీసిచ్చువేష‌న్స్ ను హ్యండిల్ చేయ‌డంలో కానీ బెట‌ర్‌గానే అనిపించారు. అందుకే జెంటిల్‌మ‌న్ కంప్లీట్ ప్రొడక్ట్‌లా నాకు అనిపిస్తుంది.

హీరోగా ఇప్పుడు మంచి పోజిష‌న్‌లో ఉన్నారు క‌దా.. క‌థ‌ల ఎంపిక‌లో ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు?
- నేను మ‌న‌సుకు న‌చ్చింది చేస్తేనే అష్టాచ‌మ్మా నుండి జెంటిల్‌మ‌న్ వ‌ర‌కు రాగ‌లిగాను. గ్రాఫ్ పెరిగిందే కానీ త‌గ్గ‌లేదు. ఇప్పుడు కొత్త‌గా జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం ఎందుకు,మ‌న‌సుకు న‌చ్చింది చేస్తే చాలు. అష్టాచ‌మ్మా చేసే స‌మయంలో ద‌ర్శ‌క నిర్మాత‌ల‌ను చూసి పిచ్చోళ్లు న‌న్ను హీరోగా పెట్టుకున్నారు. న‌న్నెవ‌రైనా చూస్తారా అని అనుకునేవాడిని. త‌ర్వాత సినిమా స‌క్సెస్ రావ‌డంతో అరే న‌న్ను కూడా ఆద‌రిస్తున్నార‌ని సినిమాలు చేస్తూ వ‌చ్చాను. ఇప్పుడు నేను కంఫ‌ర్ట్‌ బుల్ స్పేస్‌లోనే ఉన్నాను. ఏదో చేసేయాల‌ని అనుకోవ‌డం లేదు.

భ‌లే భ‌లే మ‌గాడివోయ్ చిత్రం త‌ర్వాత రెమ్యున‌రేషన్ పెంచేశార‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి?
రెమ్యున‌రేష‌న్ పెంచ‌డం అంటూ ఏమీ ఉండ‌దండీ. విడుద‌లైన సినిమా స‌క్సెస్ సాధించిన‌ప్పుడు దాని రీచింగ్ కూడా ఎక్కువగా ఉంటుంది. మా తాత‌గారు గ్రీన్‌లాండ్స్ నుండి బేగంపేట వ‌ర‌కు న‌డిచేవారు. ప‌ది రూపాయ‌లు నేను ఖ‌ర్చు పెడుతుంటూ ప‌ది రూపాయ‌లా అనేవారు. అంటే ఆయ‌న టైంలో ప‌దిరూపాయ‌లు వేరు. నా టైంకు ప‌ది రూపాయ‌లు వేరు. అలాగే అష్టాచ‌మ్మాకి తీసుకునే రెమ్యునరేష‌నే ఇప్పుడ కూడా తీసుకుంటే అందులో అర్థం లేదు. నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చే నిర్మాత‌లే నాని మార్కెట్ ఏంటిమ‌న బ‌డ్జెట్ ఏంటనే విష‌యాల‌ను ద‌ష్టిలో పెట్టుకుని వారే ఓ నెంబ‌ర్ చెబుతారు. స‌క్సెస్ ఉంటే రెమ్యున‌రేష‌న్ పెరుగుతుంది. స‌క్సెస్ లేకుంటే రెమ్యున‌రేష‌న్ త‌గ్గుతుంది.

Nani interview gallery

డైరెక్ష‌న్ ఎప్పుడు చేస్తారు?
- ఒక‌ప్పుడు ఏం చేయాలో క్లారిటీ ఉండేది కాదుకానీ ఇప్పుడ‌లా కాదుచాలా క్లారిటీతో ఉన్నాను. నేను యాక్ట‌ర్‌ని. అయితే డైరెక్ష‌న్ చేయాల‌నే కోరిక‌ను ఎప్పుడోఒక‌ప్పుడు తీర్చుకుంటాను. ఇప్పుడు డైరెక్ష‌న్ చేయాల‌నే ఆలోచ‌ననే లేదు.

ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్‌లా న‌టిస్తున్నార‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి..?
అదేం లేదండీ బాబూ..ఈ వార్త‌ను ఎవ‌రు పుట్టించారో తెలియ‌దు కానీ నేను నా నెక్ట్స్ చిత్రంలో అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌లా క‌న‌ప‌డ‌తాను.

జెంటిల్ మ‌న్ చిత్రంలో హైలెట్ ఏంటి?
జోన‌రే పెద్ద హైలెట్ అండి..ప్రేక్ష‌కుడికి నెక్ట్స్ ఏం జ‌రుగుతుంద‌నే క్యూరియాసిటీని క‌లిగించేలా ద‌ర్శ‌కుడు ఇంద్ర‌గంటిగారు సినిమాను తెర‌కెక్కించారు.

మ‌ల్టీస్టార‌ర్ చిత్రాల్లో న‌టించ‌డానికి సిద్ధంగా ఉన్నారా?
నేను మ‌ల్టీస్టార‌ర్ చిత్రాల్లో చేయ‌డానికి ఓపెన్‌గానే ఉన్నాను. మ‌న హీరోలు స్క్రీన్ స్పేస్ చూసుకుంటున్నార‌ని కానీ పాత్ర ఎంత బావుంద‌ని ఆలోచిస్తే మ‌న టాలీవుడ్‌లో కూడా మ‌ల్టీస్టార‌ర్ సినిమాలు ఎక్కువంగా వ‌స్తాయి. అలాంటి మంచి క్యారెక్ట‌ర్స్ వ‌చ్చిన‌ప్పుడు పాత్ర ఎంత చిన్న‌దైనా నేను చేయ‌డానికి సిద్ధ‌మే.

మంజుల ద‌ర్శ‌క‌త్వంలో మీరు న‌టిస్తార‌ని వార్త‌లు వ‌చ్చాయి?
నేను కూడా ఆ వార్త‌ల‌ను చ‌దివే తెలుసుకున్నానండి. నిజానికి నేను మంజులగారిని ఎప్పుడూ క‌ల‌వ‌నే లేదు.

తదుప‌రి చిత్రాలు...?
విరించివ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్న సినిమా ముప్పై శాతం పూర్త‌య్యింది. దిల్ రాజుగారి బ్యాన‌ర్‌లో ఓ క‌మ‌ర్షియ‌ల్ సినిమాలో న‌టించ‌బోతున్నాను. అలాగే భ‌వ్య‌క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌లో ఓ సినిమా చేయ‌బోతున్నాను. మంచి క‌థ సిద్ధ‌మైతే ఆ బ్యాన‌ర్‌లో సినిమా చేస్తాను.Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved