pizza
Nani interview about Krishnagaadi Veera Premagaadha
ఇక‌పై ప్ర‌తి 5 నెల‌ల‌కూ ఓ సినిమా చేస్తా - నాని
You are at idlebrain.com > news today >
Follow Us

9 February 2016
Hyderaba
d

నాని హీరోగా న‌టిస్తున్న సినిమా `కృష్ణ‌గాడి వీర ప్రేమ గాథ`. ఈ సినిమా ఈ నెల 12న విడుద‌ల కానుంది. ఈ సంద‌ర్బంగా నాని హైద‌రాబాద్‌లో సోమ‌వారం విలేక‌రుల‌తో మాట్లాడారు. ఆ విశేషాలు..

* టైటిల్ గురించి చెప్పండి?
- సినిమా విష‌యంలో బాగా క‌ష్ట‌ప‌డింది టైటిల్ పెట్టడానికే. ఇప్ప‌టికైనా టైటిల్ పెట్ట‌క‌పోతే బావుండ‌ద‌నే ఉద్దేశంతో అంతా కూర్చుని టైటిల్‌ని ఫిక్స్ చేశాం. మేం చాలా టైటిల్స్ అనుకున్నాం కానీ ఏదీ సెట్ కాలేదు. అస‌లు సినిమా దేని గురించి? దాని క‌థేంటి? అని ఆలోచించ‌గానే ఈ టైటిల్ అనిపించింది. జాన‌ప‌దం ఫీల్ క‌లిగింది. రాయ‌ల‌సీమ ప్రాంతాలకు వెళ్లి షూట్ చేశాం. రియ‌ల్ లొకేష‌న్స్ ని, అక్క‌డి ప‌రిస్థితుల‌ను ఇందులో చూపించాం. అథెంటిక్ ఫీలింగ్ ఉండాల‌ని టైటిల్ కూడా పెద్ద‌గా ఉండేలా చూసుకున్నాం. డిజైన్ చేసిన తీరు కూడా పాత సినిమాల పేర్ల‌నే పోలి ఉంటుంది.

* సినిమా క‌థ గురించి చెప్పండి?
- మ‌హాల‌క్ష్మి అంటే కృష్ణ‌గాడికి ప్రాణం. కృష్ణ పిరికివాడు. కానీ త‌న పిరికిత‌నాన్ని బ‌య‌ట‌కు చెప్పుకోలేడు. ఆఖ‌రికి త‌న బెస్ట్ ఫ్రెండ్‌కి కూడా చెప్పుకోలేడు. అందుకే 15 ఏళ్ళుగా ప్రేమిస్తున్న మ‌హాల‌క్ష్మికి కూడా చెప్ప‌డు. బ‌తుకు మీద ఆశ ఉన్న‌వాడికే భ‌యం ఉంటుంది. భ‌యం అనేది చాలా విలువైంది. వాడి భ‌య‌మే వాడి ప్రేమ‌కు అడ్డ‌మైతే ఆ భ‌యాన్ని, ధైర్యంగా ఎలా మార్చుకుని త‌న ప్రేమ‌ను గెలుచుకున్నాడ‌నేది ఈ సినిమాలోని క‌థ‌. సినిమాలో ట్విస్టులు, ట‌ర్న్స్ చాలా ఉంటాయి. ఫైట్స్, యాక్ష‌న్ సీన్లు కొత్త‌గా ఉంటాయి.

* బాల‌కృష్ణ‌గారి అభిమానిగా న‌టించారా?
- అవునండీ. సినిమాలో నేను బాల‌య్య అభిమానిని. స్టోరీకి, దానికీ ప్రాప‌ర్ లింక్ ఉంటుంది. హిందూపూర్‌లో బాల‌య్య‌గారికి అంద‌రూ అభిమానులే. సినిమాలో నా ఇంట్ర‌డ‌క్ష‌న్ స‌న్నివేశంలోనూ ఈ విష‌యాన్ని ప్ర‌స్తావించాం. నేను ఓ స‌మ‌స్య‌లో ఇరుక్కుని, బ‌య‌ట ప‌డ‌టానికి బాల‌య్య పేరు వాడుకుంటాను. నేను బాల‌య్య అభిమానినైతే ఎలా ఉంటానో, ఈ సినిమాలో అచ్చు అలాగే ఉంటాను.

* ఈ సినిమా గురించి బాల‌య్య‌గారు ఏమ‌న్నారు?
- ఈ సినిమా గురించి తెలుసుకుని ఆయ‌న చాలా హ్యాపీగా ఫీల‌య్యారు. ఏంట‌య్యా నా అబిమానిగా న‌టిస్తున్నావ‌ట క‌దా అని అడిగారు.
నేను హిందూపూర్‌లో ఉన్న‌ప్పుడు చెప్పు. అక్క‌డే ఉంటే షూటింగ్‌కి త‌ప్ప‌కుండా వ‌స్తా అని అన్నారు. ఈ సినిమాను ఆయ‌న తొలిరోజు చూస్తారు. బాల‌య్య ఫ్యాన్స్ కి ఈ సినిమా బోనస్‌లాగా ఉంటుంది.

* మీకు ప‌ర్స‌న‌ల్‌గా ఎవ‌రంటే ఇష్టం?
- నాకు రియ‌ల్ లైఫ్‌లో క‌మ‌ల్‌హాస‌న్ అంటే ఇష్టం. ఇక ఏ సినిమాలోనైనా ఎవ‌రు బాగా చేస్తే వాళ్ళే న‌చ్చుతారు.

* హ‌ను గురించి చెప్పండి?
- అందాల రాక్ష‌సి క‌థ‌ను హ‌ను నాకే ముందు చెప్పాడు. కానీ అది నా త‌ర‌హా సినిమా కాద‌నిపించి చేయ‌లేదు. మ‌ర‌లా కూడా రెండు, మూడు క‌థ‌లు చెప్పాడు కానీ ఎందుకో క‌నెక్ట్ కాలేదు. అప్పుడు నాతో కూర్చుని `నీకు ఎలాంటి క‌థ కావాలి` అని అడిగి చేసిన క‌థ ఈ కృష్ణ‌గాడివీర‌ప్రేమ‌గాథ‌.

* ఈ సినిమా విష‌యంలో ప్రెజ‌ర్ ఏమైనా ఫీల‌వుతున్నారా?
- ప్రెజర్ ఎందుకు? అలాంటిదేమీ లేదు. నా గ‌త రెండు సినిమాలు కూడా ఆడ‌క‌పోయుంటే కాస్త టెన్ష‌న్ ప‌డేవాడినేమో.అయినా స‌క్సెస్‌, ఫెయిల్యూర్‌లు మ‌న చేతిలో ఉండ‌వు. ప్ర‌తి సినిమాకు ఒకేలా క‌ష్ట‌డాలి. ఆడియ‌న్స్ అభిరుచిలో మార్పు వ‌చ్చింది. అదే రెండు ద‌శాబ్దాల క్రితం అయితే ఆడియ‌న్స్ ఓ హీరోకి ఫ్యాన్స్ అయ్యేవారు. ఆ హీరో ఎలాంటి సినిమాలు చేసినా మ‌న‌వాడే అనే ఫీలింగ్‌తో చూసేవారు. ఇప్పుడు ఆ ప‌రిస్థితి లేదు. ప్ర‌తి శుక్ర‌వారం ఆర్టిస్టు త‌న‌ను తాను ప్రూవ్ చేసుకోవాల్సి ఉంది. అందుకోసం ఒళ్ళు ద‌గ్గ‌ర‌పెట్టుకుని ప‌నిచేయాల్సి ఉంది.

Nani interview gallery 

* వ‌రుస విజ‌యాల త‌ర్వాత మీకు బాధ్య‌త పెరిగిందా?
- క‌చ్చితంగా పెరిగింది. ఎందుకంటే ప్రేక్ష‌కులు సినిమా చూసే విధానంలో మార్పు వ‌చ్చింది. కంటెంట్ బావుంటే సినిమాను ఆద‌రిస్తున్నారు. భలే భ‌లే మ‌గాడివోయ్ సినిమాకు వ‌చ్చిన రెస్పాన్స్ చూసి మేమే షాక్ అయ్యాం. ఓవ‌ర్సీస్‌లో టాప్ సినిమాల లిస్టులోకి చేరింది. దాంతో నాపై ఇంకా బాధ్య‌త పెరిగింది.

* రెమ్యునరేష‌న్‌ని పెంచార‌టగా?
- ఏవండీ.. నేను అసిస్టెంట్ డైర‌క్ట‌ర్‌గా ఉన్న‌ప్పుడు మొద‌టిసారి 2500 తీసుకున్నారు. ఆ త‌ర్వాత 3500 తీసుకున్నా. అసిస్టెంట్ డైర‌క్ట‌ర్‌గా ఉన్న‌ప్పుడే రెమ్యున‌రేష‌న్‌ని పెంచిన నేను ఇప్పుడు పెంచ‌నా?

* మ‌ణిర‌త్నంతో సినిమా ఉంటుంద‌ని?
- లేదండీ. ఆ సినిమా ఇప్పుడు లేదు. ఓ సినిమా చేయాల‌నుకున్న‌మాట నిజ‌మే. కానీ ఆ క‌థ ఓ హిందీ సినిమాకు ద‌గ్గ‌ర‌గా ఉంద‌ని, క‌థ‌ను ప‌క్క‌న పెట్టేశారు. ప్ర‌స్తుతం ఆయ‌న వేరే స్క్రిప్ట్ ప‌నిలో ఉన్నారు.

* మీ త‌దుప‌రి చిత్రాలేంటి?
- మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటితో ఓ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌లో న‌టిస్తున్నా. విరించి ద‌ర్శ‌క‌త్వంలో ఇంకో సినిమా ఉంది. ఇక‌పై ప్ర‌తి 5 నెల‌ల‌కూ ఓ సినిమాను విడుద‌ల చేస్తాం.

  
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved