pizza
Nani interview (Telugu) about Nenu Local
నా దృష్టిలో బ్యాక్ గ్రౌండ్ లేకపోవడాన్ని మించిన అదృష్టం మరొకటి లేదు - నాని
You are at idlebrain.com > news today >
Follow Us

30 January 2017
Hyderabad

నేచురల్ స్టార్ నాని హీరోగా, కీర్తిసురేష్ హీరోయిన్‌గా, హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు స‌మ‌ర్ప‌ణ‌లో త్రినాథ రావు నక్కిన ద‌ర్శ‌క‌త్వంలో శిరీష్ నిర్మాత‌గా రూపొందుతోన్న చిత్రం `నేను లోక‌ల్‌`.`యాటిట్యూడ్ ఈస్ ఎవ్రీథింగ్‌` అనేది క్యాప్ష‌న్‌. ఈ సినిమా ఫిబ్ర‌వ‌రి 3న విడుద‌ల కానుంది. ఈ సంద‌ర్భంగా హీరో నాని పాత్రికేయుల‌తో సినిమా గురించిన సంగ‌తుల‌ను తెలియ‌జేశారు....

ట్రైలర్ లో మార్చ్ పోతే సెప్టెంబర్ అన్నారు.. మీ లైఫ్ లో కూడా అంతేనా..?
(నవ్వుతూ) నేను మార్చి స్టూడెంట్ కాదు సెప్టెంబర్ కాదు.. అంతకు మించి.

సినిమా చేసేప్పుడు మీ కాలేజ్ డేస్ ఏమైనా.. గుర్తొచ్చాయా..?
కాలేజ్ లైఫ్ మొత్తాన్ని మళ్ళీ ఎక్స్ పీరియన్స్ చేసినట్లు అనిపించింది.

ఈ వ‌రుస‌గా ప్రేమ‌క‌థ‌లే చేస్తున్నారు...?
- తెలుగులో ప్రేమ‌క‌థ చుట్టూ ఉండ‌ని సినిమా ఉండ‌దు. నా సినిమాలు భ‌లేభ‌లే మ‌గాడివోయ్‌, మ‌జ్ను, ఇప్పుడు నేను లోక‌ల్ ఇలా ఏ సినిమా చూసుకున్నా ప్రేమ‌క‌థే మెయిన్‌గా ఉంటుంది. దాని చుట్టూనే మిగ‌తా క‌థంతా తిరుగుతుంది. నేను లోక‌ల్ సినిమా కూడా అంతే బాబు అనే అబ్బాయి కీర్తి అనే అమ్మాయిని ప్రేమించ‌డ‌మే సినిమా. ఈ సినిమాలో నేను లోక‌ల్ అనే చిన్న కాన్సెప్ట్ ఉంటుంది. అదేంటో సినిమాలో చూడాల్సిందే..

`నేను లోక‌ల్‌` ఎలాంటి క్యారెక్ట‌ర్ చేశారు..?
- సినిమాలో నా పేరు బాబు. తనకేం అనిపిస్తే అది మాట్లాడేస్తాడు. తన కుటుంబం కూడా అంతే.. వారి ఫ్యామిలీలో నుండి ఫన్ క్రియేట్ అవుతుంది. బాబు గాడి ప్రేమ కథ చాలా కొత్తగా ఉంటుంది. వాడి ప్రేమ కోసం ఏం చేశాడనేదే కథ. వాడికి లోకల్ అనే ఒక్క బలం తప్ప ఇంకేం ఉండదు. అందుకే 'నేను లోకల్' అనే టైటిల్ పెట్టారు. టైటిల్‌కు న్యాయం చేసేలా ప్రీ క్లైమాక్స్‌లో ఓ సీన్ ఉంటుంది.

లోకల్ అబ్బాయి క్యారెక్టర్ ఎలా చేయ‌గ‌లిగారు.?
నేను జూబ్లీ హిల్స్ లో పెరిగి పెద్దయిన వాడిని కాదు. అమీర్ పేట్, బలకం పేట్ ఇలా చాలా మాస్ ఏరియాల్లో తిరిగాను. లోకల్ లో ఉండే మాస్ అబ్బాయి ఎలా ఉంటాడని వీడియో చూసి తెలుసుకోక్కర్లేదు. నేనే లోకల్.. నా లైఫ్ లో వచ్చిన అనుభవాలతోనే సినిమా చేశాను.

ఈసారి సినిమా ఎక్కడ చూస్తున్నారు..?
- నా ప్రతి సినిమా ప్రసాద్ ఐమాక్స్ లో 8:45 షో ఫ్యామిలీ అందరం కలిసి చూస్తాం. కానీ ఈ సినిమా మాత్రం మాస్ థియేటర్ లో సంధ్య‌లోనే, మ‌ల్లిఖార్జున‌లోనో చూడాలనుకున్నాను. అయితే ఇప్పుడు వేరే సినిమా షూటింగ్ కోసం అమెరికా వెళ్తున్నాను. పోస్ట్ పోన్ చేసుకోవ‌డానికి కుద‌ర‌దు. ఈసారి సినిమా అక్కడే చూడాల్సి వస్తుంది. మ‌రి ఈసారి అక్క‌డి ఎక్స్‌పీరియెన్స్ ఎలా ఉంటుందో చూడాలి.

సినిమా లేట్ అవ్వడానికి కారణం ?
- నిజానికి ఈ సినిమా డిసంబర్ 25న రావాలని ఫిక్స్ చేసుకున్నాం. కానీ కీర్తి సురేష్ తమిళంలో విజ‌య్ వంటి హీరోల‌తో పెద్ద ప్రాజెక్ట్స్ తో బిజీ కావడంతో వారం రోజులు డిలే అయింది. పోస్ట్ ప్రొడక్షన్ కు టైమ్ దొరకలేదు. సినిమాకు ఆర్.ఆర్ చాలా ముఖ్యం. దేవిశ్రీ ప్ర‌సాద్ మీద మీద ప్రెషర్ పెడితే ఔట్ పుట్ పై ఎఫెక్ట్ పడుతుందని టైమ్ తీసుకొని చేశాం. ఎలాంటి రీషూట్స్ చేయలేదు.

సినిమా రిలీజ్ కు ముందు మీ మైండ్ సెట్ ఎలా ఉంటుంది..?
నటుడిగా నాకు డబ్బు, ఫేమ్ ముఖ్యం కాదు. మనం చేసిన ప్రొడక్ట్ ప్రేక్షకులు చూడబోతున్నారనే ఎగ్జైట్మెంట్ ఉంటుంది. అది వాళ్ళకు నచ్చిందో.. లేదో.. సెకండరీ కానీ నేను చేసిన ప్రాజెక్ట్ చూడబోతున్నారనే ఫీలింగ్ ను నేను ఎంజాయ్ చేస్తాను. నటుడిగా సినిమా రిలీజ్ అయ్యే ముందు నాలుగు రోజులు ఎగ్జైటెడ్ గా ఉంటాను.

Nani interview gallery

కొత్త దర్శకులతో పని చేయడం ఎలా అనిపిస్తుంటుంది..?
నన్ను చాలా మంది స్టార్ హీరోలతో ఎందుకు పని చేయడం లేదని అడుగుతుంటారు. అప్పుడు వాళ్ళకి నేను ఫ్యూచర్ స్టార్ డైరెక్టర్స్ తో పని చేస్తున్నాను అని చెప్తూ ఉంటాను. కొత్త టాలెంట్ ను ప్రోత్సహిస్తే ఔట్ పుట్ కూడా కొత్తగా వస్తుంది. వాళ్ళను నేనే పరిచయం చేశాననే ఫీలింగ్ కూడా ఉంటుందనుకోండి.

సేఫ్ జోన్ లో ఉన్న అతి తక్కువ మంది హీరోల్లో మీరొక‌రని అన్న‌ప్పుడు మీకెలా అనిపిస్తుంది..?
చాలా సంతోష పడతాను. ఎందుకంటే ఎంత పెద్ద స‌క్సెస్‌ఫుల్ మూవీ అయినా ఒక్క‌డో ఒక‌చోట ఎగ్జిబిట‌రో, థియేట‌ర్ ఓన‌రో లాస్ అయిపోయుంటాడు. కానీ నా సినిమాకు నిర్మాత నుండి థియేట‌ర్ ఓన‌ర్ వ‌ర‌కు అందరూ సేఫ్ గా ఉన్నారంటే ఆనందంగానే ఉంటుంది. మన సినిమాల‌ వల్ల నిర్మాతలు లాభ పడుతున్నారు అంటే అంతకు మించిన సక్సెస్ లేదు. ఆ నమ్మకాన్ని పోగొట్టుకోకుండా జాగ్రత్త పడాలి.

బ్యాక్ గ్రౌండ్ లేకుండా నాని ఈ పొజిషన్ లో ఉండడం గ్రేట్ అనేప్పుడు ఎలా అనిపిస్తుంటుంది..?
- నా దృష్టిలో బ్యాక్ గ్రౌండ్ లేకపోవడాన్ని మించిన అదృష్టం మరొకటి లేదు. ఎవరైనా వచ్చి నేను మీ అభిమానిని అని చెప్తే వాళ్ళు ఖచ్చితంగా నా అభిమానే అనే ఫీలింగ్ కలుగుతుంది.

రెమ్యూనరేషన్ పెంచారా..?
- నేను పెంచడం లేదండీ.. వాళ్ళే పెంచుతున్నారు.

సన్నబడినట్లు ఉన్నారు..?
- స్పెషల్ గా దానికోసం ఏం చేయలేదు. వరుసగా సినిమాలు చేస్తున్నాను కదా అందుకేనేమో..

డైరెక్షన్ ఎప్పుడు చేస్తారు...?
- ఇప్పుడు హీరోగా స‌క్సెస్‌ఫుల్‌గా ఉన్నాను. ఇలాంటి పరిస్థితుల్లో డైరెక్ష‌న్ చేయాల‌నుకోవ‌డం అంటే...అంతకు మించి రాంగ్ డెసిషన్ మరొకటి ఉండదు.

నెక్స్ట్ ప్రాజెక్ట్స్..?
దానయ్య గారు ప్రొడక్షన్ లో శివ అనే కొత్త డైరెక్టర్ తో సినిమా చేస్తున్నాను. అలాగే దిల్‌రాజుగారి బ్యాన‌ర్‌లో కూడా ఓ సినిమా చేస్తాను. ఆ వివ‌రాలు ఇప్పుడే చెప్ప‌లేను. ఈ ఏడాది మూడు సినిమాలు చేసే అవ‌కాశం ఉంటుంది.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved