pizza
Nara Rohit interview about Shamanthakamani
'శమంతకమణి' ...ఓ మంచి ప్రయాణం - నారా రోహిత్‌
You are at idlebrain.com > news today >
Follow Us

11 July 2017
Hyderabad

నారారోహిత్‌, సందీప్‌కిషన్‌, సుధీర్‌బాబు, ఆది హీరోలుగా భవ్య క్రియేషన్స్‌ బ్యానర్‌పై శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో వి.ఆనంద్‌ ప్రసాద్‌ నిర్మించిన చిత్రం 'శమంతకమణి'. ఈ చిత్రం జూలై 14న విడుదలవుతుంది. ఈ సందర్భంగా చిత్ర కథానాయకుల్లో ఒకరైన నారారోహిత్‌తో ఇంటర్వ్యూ...

ఓ మంచి ప్రయాణం..
'శమంతకమణి' ఓ మంచి ప్రయాణంలా అనిపించిన సినిమా. సాధారణంగా నలుగురు హీరోలు కలిసి ఓ సినిమా చేయడం అంటే చిన్న విషయం కాదు. కానీ ఓ మంచి స్క్రిప్ట్‌ కారణంగా 'శమంతకమణి' చిత్రంలో కుదిరింది. ఏ పాత్రకు ఉండాల్సిన ప్రాముఖ్యత ఆ పాత్రకు ఉంది.

పాత్ర గురించి...
- ఈ సినిమాలో నా పాత్ర పేరు రంజిత్‌కుమార్‌. పోలీస్‌ ఆఫీసర్‌ పాత్ర. మళ్ళీ పోలీస్‌ పాత్ర కదా..చేయకూడదనే అనుకున్నాను. కానీ కథ విన్న తర్వాత చేయాలని నిర్ణయం తీసుకున్నాను. అయితే గతంలో నేను చేసిన పోలీస్‌ పాత్రలకు, 'శమంతకమణి' చిత్రంలో పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రకు చాలా తేడా ఉంది. ఇందులో క్రాంకీ తరహా పోలీస్‌ ఆఫీసర్‌ అంటే ఎప్పుడు సీరియస్‌గా ఉంటాడు, ఎప్పుడు నవ్విస్తాడనే విషయం ఎవరికీ తెలియదు. క్యారెక్టరైజేషన్‌లోనే కామెడి కనపడుతుంది.

దర్శకుడు శ్రీరామ్‌ ఆదిత్య గురించి..
- నలుగురు హీరోలతో ఇంత పెద్ద సినిమాను దర్శకుడు శ్రీరామ్‌ ఆదిత్య 37 రోజుల్లో పూర్తి చేశాడంటే తనకెంత క్లారిటీ ఉందో అర్థం చేసుకోవచ్చు. అద్భుతమైన స్క్రిప్ట్‌ను రాబట్టుకున్నాడు. ఏ క్యారెక్టర్‌ నుండి ఏం కావాలి, ఎలా రాబట్టుకోవాలనే విషయం బాగా తెలుసు.

interview gallery

బరువు తగ్గాను..
- పవన్‌ మల్లెల దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా కోసం బరువు తగ్గాను. ఇప్పటికి 21 కిలోల బరువు తగ్గాను. ఈ సినిమాలో నాలుక్‌ను నా పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్‌ చేస్తున్నాం.

తదుపరి చిత్రాలు..
- కథలో రాజకుమారి సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. నేను, సుధీర్‌బాబు కలిసి 'వీరభోగ వసంతరాయులు' సినిమా చేస్తున్నాను. ఇప్పటి వరకు నేను చేయని కాన్సెప్ట్‌లో ఉండే మూవీ ఇది. తెలుగులో కమల్‌హాసన్‌ 'ఈనాడు' తరహాలో సాగే చిత్రమిది.ఈ చిత్రంలో సుధీర్‌గారు పోలీస్‌ ఆఫీసర్‌గా నటిస్తుంటే, నేను ఇంటెలిజెంట్‌ ఆఫీసర్‌గా నటిస్తున్నాను. పవన్‌ మల్లెల సినిమా సిద్ధమవుతుంది

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved