pizza
Nara Rohit interview (Telugu) about Shankara
`శంక‌ర‌` యూనివ‌ర్శ‌ల్ కాన్సెప్ట్ తో తెర‌కెక్కిన చిత్రం - నారా రోహిత్‌
You are at idlebrain.com > news today >
Follow Us

20 October 2016
Hyderaba
d

తాజాగా `శంక‌ర‌`తో సిద్ధ‌మ‌య్యారు నారా రోహిత్‌. తాతినేని స‌త్యప్ర‌కాశ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ నెల 21న విడుద‌ల కానుంది. రెజీనా నాయిక‌. శ్రీ లీలా మూవీస్ ప‌తాకంపై రూపొందింది. జె.ఆర్‌.మీడియా ప్రై.లిమిటెడ్‌తో క‌లిసి ఆర్.వి.చంద్ర‌మౌళి ప్ర‌సాద్ (కిన్ను) నిర్మించారు. ఎం.వి.రావు స‌మ‌ర్పించారు. ఈ చిత్రం విడుద‌ల కానున్న సంద‌ర్భంగా గురువారం హైద‌రాబాద్‌లో నారా రోహిత్ విలేక‌రుల‌తో మాట్లాడారు. ఆ విశేషాలు...

* `శంక‌ర` గురించి చెప్పండి?
- `శంక‌ర‌` హీరో సెంట్రిక్ మూవీ. యూనివర్శ‌ల్ కంటెంట్ ఉన్న చిత్రం. త‌ప్ప‌కుండా ప్రేక్ష‌కుల‌కు న‌చ్చుతుంది. ఇటీవ‌లే అదే కాన్సెప్ట్ తో బాలీవుడ్‌లో `అకీరా` కూడా వ‌చ్చింది.

* సినిమా లేట‌యిందిగా... మ‌రి కాన్సెప్ట్ ప‌రంగా ఇబ్బందులేమైనా ఉంటాయా?
- అలాంటివేమీ లేవండీ. త‌మిళంలో ఈ సినిమా 2011లో విడుద‌లైంది. బాలీవుడ్‌లో ఈ మ‌ధ్య విడుద‌ల చేశారు. ముందే చెప్పిన‌ట్టు యూనివ‌ర్శ‌ల్ కాన్సెప్ట్ కాబ‌ట్టి ఎక్క‌డా ఫేడ్ కాదు. కాక‌పోతే అప్పుడు కాస్త త‌గ్గి ఉన్నానేమో, ఇప్పుడు కొంచెం లావుగా ఉన్నానేమో.. అంతే.

* క‌థ ఏంటి?
- ఒక కాలేజీ అబ్బాయి త‌న‌కు సంబంధం లేని ఇష్యూలో ఇరుక్కుంటాడు. అప్పుడు ప‌రిస్థితి ఏంట‌నేది ఆస‌క్తిక‌రం.

* సోష‌ల్ యాంగిల్ ఉంటుందా?
- అలాంటిదేమీ ఉండ‌దండీ. స్టూడెంట్‌కి, పోలీసుకు మ‌ధ్య జ‌రిగే వార్ ని చూపించాం.

* యువ‌త ఈ చిత్రానికి ఎలా క‌నెక్ట్ అవుతారు?
- కాలేజీ ఎపిసోడ్స్ చాలా ఇంట్ర‌స్టింగ్‌గా ఉంటాయి.

* అంటే హీరో గొడ‌వ‌ప‌డుతుంటాడా?
- లేదండీ సిన్సియ‌ర్‌గా చ‌దువుకునే హీరో.

* మీ కాలేజీ రోజులు గుర్తొచ్చాయా? మీరు సిన్సియ‌రా?
- నేను మ‌రీ అంత సిన్సియ‌ర్ కాదు. ఈ సినిమాలో హీరో చ‌దివిన‌ట్టు చ‌దివిన‌ట్ట‌యితే ఏ సైంటిస్టో అయ్యేవాడిని.

Nara Rohit interview gallery

* బ్యాక్ బెంచ్‌లో కూర్చునేవారా?
- అక్క‌డ కూర్చుంటే ఎక్కువ ప్ర‌శ్న‌ల‌డుగుతార‌ని వెళ్లేవాడిని కాదు. ఫ‌స్ట్ రో లోనే ఉండేవాడిని.

* అల్ల‌రి చేసేవారా?
- మా కాలేజీ చాలా స్ట్రిక్ట్ గా ఉండేదండీ.

* పండ‌గ‌లా వ‌చ్చాడు ఎప్పుడు చేస్తున్నారు?
- ఇంకో రోజు షూటింగ్ ఉంది. కాగానే విడుద‌ల చేస్తాం.

* మీకు ఫండింగ్ ఇచ్చేవారు చాలా మంది ఉన్నార‌ట క‌దా? అందుకే ఇన్నిసినిమాలు చేయ‌గ‌లుగుతున్నార‌ని టాక్ ఉంది...
- వాళ్లెవ‌రో చెబితే నేను కూడా వెళ్లి క‌లుస్తానండీ. నాకు అలాంటిదే ఉంటే నా సినిమాలు కొన్ని ప్ర‌మోష‌న్ లేకుండా ఎందుకు స‌రిగా ఆడ‌క‌పోయి ఉంటాయి. ఇంకో అంశం ఏంటంటే నేను ఎవ‌రి ద‌గ్గ‌ర‌కూ వెళ్లి సినిమాలు తీయ‌మ‌ని అడ‌గ‌డం లేదు. నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చిన క‌థ‌ల్లో మంచి వాటిని ఎంపిక చేసుకుని వెళ్తున్నాను.

* వరుస‌గా సినిమాలు చేస్తుంటే ఏమ‌నిపిస్తోంది?
- ఇక కాస్త నిదానంగానే చేస్తా. ఒక సినిమా విడుద‌లైన త‌ర్వాత మ‌రో సినిమా విడుద‌ల‌య్యేలా ప్లాన్ చేసుకుంటా. సినిమాలు ఒక‌దానిపై ఒక‌టి ల్యాప్స్ కావ‌డాన్ని నేను కూడా గ‌మ‌నిస్తూనే ఉన్నాను.

* `శంక‌ర‌`ను తెలుగు కోసం ఏమైనా మార్చారా?
- చాలా మార్పులే చేశామండీ. అక్క‌డ ఓ 40 నిమిషాల ఎపిసోడ్ ఉంటుంది. దాన్ని మేం నాలుగు నిమిషాల పాట‌లో పెట్టేశాం. అలాగే చాలా మార్పులు నేటివిటీ ప‌రంగా చేశాం. త‌మిళంలో హీరోయిజం త‌క్కువ‌గా ఉంటుంది. మిగిలిన పాత్ర‌లు కూడా లీడ్ చేస్తుంటాయి. కానీ ఇక్క‌డ క‌మ‌ర్షియ‌ల్‌గా ఉండాలని హీరోయిజాన్ని పెంచారు.

*ఏ త‌ర‌హా సినిమాలు చేయ‌డానికి ఇష్ట‌ప‌డ‌తారు?
- అన్నీ జోన‌ర్లు చేస్తున్నానండీ. నాకు సినిమాలు చేయ‌డం ఇష్టం.

* ఇప్పుడు మీరు చేస్తున్న చిత్రాలేంటి?
- అప్ప‌ట్లో ఒక‌డుండే వాడు, క‌థ‌లో రాజ‌కుమారి, బెక్కం వేణుగోపాల్ సంస్థ‌లో ఓ సినిమా.. ఇవి కాక ఇంకో రెండు క‌మ‌ర్షియ‌ల్ చిత్రాలు చేస్తున్నా.

* త‌గ్గ‌తున్న‌ట్టున్నారు?
- ఇప్ప‌టిదాకా డిఫ‌రెంట్ సినిమాలు చేశాను. అవి నా క‌న్నా బ‌రువుగా ఉంటాయి కాబ‌ట్టి నా బ‌రువు గురించి ఎవ‌రూ ఆలోచించ‌లేదు. కానీ క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు చేసేట‌ప్పుడు ఇంత బ‌రువుంటే సాధ్యం కాదు. అందుకే త‌గ్గుతున్నా.

* పెళ్లెప్పుడు?
- ఇంకా టైమ్ ఉందండీ.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved