pizza
Nawin Vijay Krishna interview (Telugu) about Nandini Nursing Home
నందిని న‌ర్సింగ్ హోం మంచి ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్ - న‌వీన్ విజ‌య్‌కృష్ణ‌
You are at idlebrain.com > news today >
Follow Us

18 October 2016
Hyderaba
d

నవీన్ విజ‌య్‌కృష్ణ‌ హీరోగా, నిత్య, శ్రావ్య హీరోయిన్లుగా న‌టించిన చిత్రం `నందిని న‌ర్సింగ్ హోమ్‌`. ఎస్‌.వి.సి.ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై పి.వి.గిరి దర్శకత్వంలో రూపొందింది. రాధాకిషోర్‌.జి, బిక్షమయ్య సంగం నిర్మాతలు. ఈ సినిమా అక్టోబ‌ర్ 21న విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా హీరో న‌వీన్ విజ‌య్‌కృష్ణ‌తో ఇంట‌ర్వ్యూ...

క్యారెక్ట‌ర్ గురించి...
- నందిని న‌ర్సింగ్ హోం చిత్రంలో నా క్యారెక్ట‌ర్ పేరు చంద్ర‌శేఖ‌ర్‌. అంద‌రూ చందు అని పిలుస్తుంటారు. సినిమాలో హీరోయిన్ తండ్రి ఓ హాస్పిట‌ల్ ఛైర్మ‌న్‌గా ఉంటారు. హీరో ప‌నికోసం ఆ హాస్పిట‌ల్‌కు వెళ్లి కొన్ని ఆర్ధిక ప‌రిస్థితుల కార‌ణంగా డాక్ట‌రుగా అవ‌తారం ఎత్తుతాడు. అలా దొంగ డాక్ట‌రు అవ‌తారం ఎత్తిన హీరో ఎలాంటి ప‌రిస్థితుల‌ను ఎదుర్కొన్నాడు. త‌నకెదురైన స‌మ‌స్య‌ల‌ను ఎలా అధిగ‌మించాడ‌నేదే క‌థ‌. సినిమా చాలా ఎంట‌ర్‌టైనింగ్‌గా ఉంటుంది. సినిమాలో నాతో పాటు ష‌క‌ల‌క శంక‌ర్‌, వెన్నెల‌కిషోర్‌, సప్త‌గిరి, జ‌య‌ప్ర‌కాష్ రెడ్డి త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో క‌నిపిస్తారు. సినిమాలో హీరో దొంగ డాక్ట‌రుగా అవ‌తారం ఎత్తినా..ప్ర‌ధాన‌మైన క‌థ మాత్రం ల‌వ్‌స్టోరీయే.

హీరోయిన్స్ గురించి....
- సినిమాలో నిత్యాన‌రేష్‌, శ్రావ్య ఇద్ద‌రు హీరోయిన్స్ ఉంటారు. డ‌బ్బుకంటే మ‌నిషి, మ‌న‌సులే గొప్ప‌వ‌ని న‌మ్మే క్యారెక్ట‌ర్ నిత్యాన‌రేష్ అయితే, ప్ర‌పంచంలో అన్ని అవ‌స‌రాల‌కు డ‌బ్బు కావాల‌నుకునే క్యారెక్ట‌ర్‌లో శ్రావ్య క‌న‌ప‌డుతుంది. హీరోయిన్స్ పాత్ర‌ల‌కు చాలా ప్రాముఖ్య‌త ఉంది.

Nawin Vijay Krishna interview gallery

టెక్నిషియ‌న్ నుండి హీరో కావ‌డానికి రీజ‌న్‌...
- నేను యాక్ట‌ర్ కావాల‌నుకుని ఎప్పుడో అనుకున్నాను. కానీ నాన్న‌మ్మ చ‌దువు పాడైపోతుంద‌న‌డంతో ఇంట‌ర్ త‌ర్వాత 3డి యానిమేష‌న్ కోర్సులో చేరాను. త‌ర్వాత ఎడిటింగ్ నేర్చుకుని ఎడిట‌ర్ అయ్యాను. కానీ వ‌ర్క్‌లో పూర్తిగా నిమ‌గ్న‌మైపోవ‌డంతో బాగా లావుగా అయిపోయాను. డాక్ట‌ర్స్ న‌న్ను చెక్ చేసి ఇలాగే ఉంటే క‌ష్ట‌మ‌ని కూడా అన‌డంతో..నాన్న‌కు విష‌యం చెప్పాను. నాన్న అప్పుడు యాక్టింగ్ చేయ‌వ‌చ్చు క‌దా..అన్నారు. అప్పుడు నేను స‌న్న‌గా అయిన త‌ర్వాత యాక్టింగ్ గురించి నిర్ణ‌యం తీసుకుంటాన‌ని అన్నాను.

మ‌హేష్ అన్న షాక‌య్యారు...
- నేను 130 కిలోలు ఉండేవాడిని..ఎప్పుడైతే లావు త‌గ్గాల‌నుకున్నానో అప్పుడు నా డైటింగ్ అంతా మార్చుకున్నాను. ఎక్కువ‌గా కూర‌గాయ‌లు తీసుకునేవాడిని. ఇంట్లో వారికి కూడా పెద్ద‌గా క‌నిపించేవాడిని కాను. చివ‌ర‌కు చాలా వ‌ర‌కు వెయిట్ త‌గ్గాను. ఇప్పుడు నా వెయిట్ 72 కిలోలు. మ‌హేష్ అన్న... ఇంట్లో జ‌రిగే ఓ బుక్ ఫంక్ష‌న్‌కు వ‌చ్చి న‌న్ను చూసి షాకయ్యారు. అయితే ఇంత‌లా క‌న‌ప‌డ‌టానికి నేను రెండేళ్లు పైగానే క‌ష్ట‌ప‌డ్డాను.

న‌ట‌న ప‌రంగా..
- నాన్న‌గారు, నాన్న‌మ్మ అప్పుడప్పుడు స‌ల‌హాలు చెబుతుంటారు. ఇలాగే చేయాల‌ని బ‌ల‌వంతం చేయ‌రు. స‌త్యానంద్‌గారి వ‌ద్ద ట్ర‌యినింగ్ తీసుకోవాల‌నుకోవ‌డం కూడా నా నిర్ణ‌య‌మే.

తదుప‌రి చిత్రాలు...
- నా తొలి చిత్రం ఐనా ఇష్టం నువ్వు కొన్ని కార‌ణాల‌తో విడుద‌ల వాయిదా ప‌డింది. ఇప్పుడు ఆ సినిమాకు సంబంధించి కొన్ని రీ షూట్స్ జ‌రుగుతున్నాయి. అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను ఫ్రిభ్ర‌వ‌రిలో విడుద‌ల చేయాల‌నుకుంటున్నాం. అలాగే కొత్త సినిమాకు సంబంధించిన వివ‌రాలు త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తాను.

 

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved