pizza
Niharika Konidela interview (Telugu) about Suryakantham
నాన్న తొలిసారి అప్పుడు `సూర్యకాంతం` అని అన్నారు - నీహారిక కొణిదెల‌
You are at idlebrain.com > news today >
Follow Us

28 March 2019
Hyderabad

నిహారిక కొణిదెల, రాహుల్ విజయ్ ప్రధాన పాత్రల్లో న‌టించిన సినిమా ' సూర్యకాంతం' మార్చి 29 న విడుదల కానుంది.. రొమాంటిక్ కామెడీ గా తెరకెక్కిన‌ ఈ సినిమా కి ప్రణీత్ బ్రమండపల్లి దర్శకుడు. శివాజీ రాజా, సుహాసిని ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. మార్క్ కె రాబిన్ సంగీతం సమకూర్చారు. అమెరికాలో ఫిలిం డిస్ట్రిబ్యూషన్ లో అగ్రగామి సంస్థ అయిన నిర్వాణ సినిమాస్ ఈ చిత్రాన్ని నిర్మించింది. వరుణ్ తేజ్ ఈ చిత్రాన్ని సమర్పించారు. ఈ సినిమా గురించి నీహారిక గురువారం విలేక‌రుల‌తో మాట్లాడారు . ఆ విశేషాలు..

* మీ నాన్న మిమ్మ‌ల్ని సూర్య‌కాంతం అని పిలిచేవారా?
- నేను మా నాన్న క‌లిసి నాన్న‌కూచి అని ఓ వెబ్ సీరీస్ చేశాం. అందులో మా నాన్న నా గురించి ఆయ‌న గ‌ర్ల్ ఫ్రెండ్‌కి వివ‌రించే సీన్ ఉంటుంది. `మా అమ్మాయి సావిత్రి టైపు` అని ఆయ‌న‌కు డైలాగ్ రాశారు. కానీ మా నాన్న `మా అమ్మాయి సూర్యకాంతం` అనిఅన్నారు. ఆ స‌మ‌యంలో నేను, మా ద‌ర్శ‌కుడు ప్ర‌ణీత్ కూడా అక్క‌డే ఉన్నాం. ఒక‌వేళ ప్ర‌ణీత్ ఆ విష‌యాన్ని గుర్తుపెట్టుకుని సూర్యకాంతం అని ఈ సినిమాకు పేరు పెట్టాడేమో నాకు తెలియ‌దు.

* ఈ సినిమాలో ప్రాబ్ల‌మ్ సూర్యకాంతం పాత్ర అట క‌దా?
- ఇందులో సూర్య‌కాంతం మా అమ్మ‌మ్మగా క‌నిపిస్తారు. నా పేరు కూడా సూర్య‌కాంత‌మే. న‌చ్చిన వాళ్ల‌తో ప‌క్ష‌పాతంగా ఉంటూ, మిగిలిన వాళ్ల‌ను సాధించే పాత్ర‌. చాలా స్ట్రెయిట్ ఫార్వ‌ర్డ్ గా ఉంటుంది. సూర్య‌కాంతంలాగా చెయ్యి తిప్పాల‌ని కూడా అక్క‌డ‌క్క‌డా ప్ర‌య‌త్నించాను.

* సుహాసినిగారితో ప‌నిచేయ‌డం ఎలా అనిపించింది?

- ఆమె మాతో చాలా బాగా క‌లిసిపోయారు. మామూలుగా కాస్త సీనియ‌ర్ల‌తో కాసేపు మాట్లాడిన త‌ర్వాత అక్క‌డి నుంచి వెళ్లిపోవాల‌నిపిస్తుంది నాకు. కానీ ఆవిడ‌కు సినిమా మీద ప‌ట్టు, మ‌ణిరత్నంగారి గురించి చెప్పిన విష‌యాలు న‌న్ను క‌ట్టిప‌డేశాయి. మా నాన్న తో ఆవిడ సినిమాలు చేశార‌ట‌. ఆ విష‌యాలు చాలా బాగా చెప్పారు. మా అమ్మ కూడా సెట్‌కు వ‌చ్చి ఆవిడ‌ను క‌లిశారు. నేను పుట్ట‌క‌ముందు విష‌యాల‌ను వాళ్లు చాలానే మాట్లాడుకున్నారు.

* మీ తొలి రెండు సినిమాలు స‌రిగా ఆడ‌లేద‌నే బాధ ఉందా?
- లేదు. ఒక సినిమా ఆడితే ఎగిరిగంతేసి, ఆడ‌క‌పోతే విసుక్కునే ర‌కం కాదు నేను. నా ప‌నిని నేను సంపూర్ణంగా చేశానా లేదా అనేది నాకు కీల‌కం. ఎందుకంటే నేను ఏ ప‌నినీ అర‌కొర‌గా చేయ‌ను. పూర్తి మ‌న‌సుతోనే చేస్తాను. రెండు సినిమాల్లోనూ `నీహారిక బాగా చేయ‌లేదు` అని ఎవ‌రూ చెప్ప‌లేదు. క‌నీసం నా వ‌ర‌కు రాలేదు. నా మ‌న‌సులో ఎప్పుడూ చిరంజీవిడాడీ ఉంటారు. డూపులు కూడా లేకుండా ఆయ‌న ఫైట్లు చేసిఇంటికి వ‌చ్చిన‌ప్పుడు సురేఖా మ‌మ్మీ ప‌డ్డ బాధ ఎలా ఉండేదో నాకు తెలుసు. అయినా కొన్ని సినిమాలుఆడ‌లేదు. సినిమా ఫ్లాప్ కావ‌డానికి స‌రైన రిలీజ్ టైమ్ నుంచి ఎన్నెన్నో కార‌ణాలు ఉంటాయి.

interview gallery* ఈ సినిమా రిలీజ్ టైమ్ స‌రైన‌దేన‌ని అనుకుంటున్నారా?
- బ‌య‌ట ఎలాగూ ఎన్నిక‌ల వేడి ఉంది. దానిలో నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి ఈ సినిమా చూసి ఆస్వాదిస్తార‌ని అనుకుంటున్నాం. చాలా వ‌ర‌కు ఎగ్జామ్స్ కూడా అయిపోయాయిగా.

* మీ అన్న ఈ ప్రాజెక్ట్ లోకి ఎలా వ‌చ్చారు?
- మామూలుగా ఒక‌రోజు క‌థ విన‌మ‌ని అడిగా. ప్ర‌ణీత్ నాకు ఒక బ్ర‌ద‌ర్‌లాగా . త‌ను మా అన్న‌కు కూడా బాగా తెలుసు. క‌థ చెప్ప‌గానే వ‌రుణ్ అన్న‌కి న‌చ్చి నిర్వాణ సినిమాస్ వారితో మాట్లాడి సెట్ చేశారు. ఆయ‌న కూడా స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రించారు.

* మీక్కూడా నిర్మాణం మీద ఆస‌క్తి బాగా ఉంది క‌దా?
- అవును. మా నాన్న‌గారు, మా అర‌వింద్ మామ నిర్మాణం చేస్తుంటే చూస్తూ పెరిగా. నేను ఏ విష‌యాల‌ను గాలికి వ‌దిలేయ‌ను. అంత తేలిగ్గా అవ‌త‌లివారిని న‌మ్మి వ‌దిలేయ‌ను. అన్నిటినీ ద‌గ్గ‌రుండి చూసుకుంటాను. చ‌క్క‌టి ప్ర‌ణాళిక ఉంటుంది. అవ‌న్నీ నాకు నిర్మాణానికి ఉప‌యోగ‌ప‌డుతున్నాయి. డిజిట‌ల్‌లో పింక్ ఎలిఫెంట్ పిక్చ‌ర్స్ పేరుతో మేకింగ్ జ‌రుగుతోంది. భ‌విష్య‌త్తులోనూ బాగా నిర్మిస్తాను.

* సినిమాలు తీస్తారా?
- తీయాల‌నీ లేదు. తీయ‌కూడ‌ద‌నీ ఏం లేదు. చూద్దాం.

* సైరాలో మీ పార్ట్ పూర్త‌యిందా?
- నాకు డైలాగులు ఉండ‌వు. ఒక‌ట్రెండు సీన్ల‌లో క‌నిపిస్తా. కానీ త‌ప్ప‌కుండా నోటీస్ చేసే సినిమా అవుతుంది.

* పెళ్లెప్పుడు?
- 30ఏళ్ల‌లోపు పెళ్లి చేసుకుంటాన‌ని అన‌గానే మా అమ్మ ఫోన్ చేసి `30 వ‌ర‌కు చేసుకోవా` అని చీవాట్లు పెట్టింది. ప్ర‌స్తుతం నా దృష్టి యాక్టింగ్ మీద ఉంది. కానీ 30లోపు చేసుకుంటా.

* యాక్టింగ్ ని మీరు సీరియ‌స్‌గానే తీసుకున్నారా?
- ముందు నేను న‌టించ‌డానికి రావాల‌నుకున్న‌ప్పుడు మా కుటుంబాన్ని ఇష్ట‌ప‌డే అభిమానులు అభ్యంత‌రం చెప్పారు. కానీ నా మ‌న‌సులో ఉన్న విష‌యాన్ని క్లియ‌ర్‌గా చెప్పే స‌రికి అర్థం చేసుకున్నారు. మొద‌ట సినిమాలు చేద్దామ‌నే అనుకున్నా. కానీ ఇప్పుడు సినిమాలు చేస్తూ పోతుంటే నాకు ఇంకా చాలా చేయాల‌ని ఉంది. త‌ప్ప‌కుండా యాక్టింగ్‌ను నేను సీరియ‌స్‌గానే తీసుకుంటున్నా.

* ఈ సారి రాఖీకి ఇంకో రాఖీ ఎక్కువ కొనాలేమో
- విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో నా గురించి వ‌చ్చిన రూమ‌ర్స్ కి చెక్ పెట్ట‌డానికి ఆయ‌న స్టేజ్ మీద అలా ప్ర‌క‌టించారు.

* మీరెందుకు `క‌ర్త‌వ్యం` త‌ర‌హా సినిమాలు చేయ‌కూడ‌దు?
- కోడి రామ‌కృష్ణ‌గారు బ‌తికున్న‌ప్పుడు నాతో అన్న మాట‌లు అవి. ఆయ‌న గుర్తుకొచ్చిన‌ప్పుడ‌ల్లా అవే గుర్తుకొస్తాయి. `సూర్య‌కాంతం` విడుద‌లైన త‌ర్వాత న‌న్ను దృష్టి లో పెట్టుకుని మ‌రికొన్ని ర‌కాల పాత్ర‌లు రాసేవాళ్ల సంఖ్య పెరుగుతుంద‌ని న‌మ్ముతున్నా.

* మీ నాన్న కోసం ప్ర‌చారం చేస్తారా?
- ఈ సినిమా విడుద‌ల‌య్యాక త‌ప్ప‌కుండా వెళ్లి ప్ర‌చారం చేస్తా. కాక‌పోతే నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి.

* మీ వాళ్ల‌ని బ‌య‌టివాళ్లు తిడుతుంటే ఎలా అనిపిస్తుంటుంది?
- చాలా వ‌ర‌కు ఆ వీడియోలు చూడ‌ను. అయినా మ‌న‌ల్ని మ‌నం ఆ స్థాయిలో పెట్టిన‌ప్పుడు ఎవ‌రు ఏమ‌న్నా విన‌డానికి సిద్ధంగా ఉండాలి. కాక‌పోతే నేను న‌న్ను ఎవ‌రైనా ఏమైనా అన్నా వింటేనేమో కానీ, వాళ్ల‌ని ఎవ‌రైనా ఏమైనా అంటే త‌ట్టుకోలేను.Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved