pizza
Niharika Konidela interview (Telugu) about Happy Wedding
న‌టిగా మంచి గుర్తింపు తెచ్చే పాత్ర‌ల్లో న‌టించాల‌నుకుంటున్నాను - నిహారిక కొణిదెల‌
You are at idlebrain.com > news today >
Follow Us

26 July 2018
Hyderabad

యువ కథానాయకుడు సుమంత్‌ అశ్విన్‌, నిహారిక కొణిదెల జంటగా లక్ష్మణ్‌ కార్య దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'హ్యాపి వెడ్డింగ్‌'. యువి క్రియేషన్స్‌, పాకెట్‌ సినిమా సంయుక్తంగా నిర్మించారు. ఈ నెల 28న సినిమా విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా నిహారిక కొణిదెల ఇంట‌ర్వ్యూ..

సినిమా విడుదలకు ముందే టూర్‌ వెళ్లడం ఎలా అనిపించింది?
- సినిమా రిలీజ్‌ తర్వాత టూర్‌ వెళితే.. సినిమా ఎలా ఉందో రెస్పాన్స్‌ బట్టి తెలిసేది. కానీ రిలీజ్‌ ముందు టూర్‌ వెళ్లడం వల్ల సినిమా ఎలా ఉండబోతుందోనని మేమే ఆడియెన్స్‌కు చెబుతున్నాం. నేను వెళ్లిన కాలేజెస్‌లో ఎక్కువ శాతం మహిళల కాలేజీలే.అమ్మాయిలకు కనెక్ట్‌ అయ్యే సబ్జెక్ట్‌ కావడంతో సులభంగా వాళ్లకు ఎక్స్‌ప్లెయిన్‌ చేయగలిగాను. ప్రేక్షకులు నన్ను రిసీవ్‌ చేసుకున్న తీరు చాలా బావుంది. హ్యాపీ వెడ్డింగ్‌ ఎలా ఉండబోతుంది?

మీకు డాన్స్‌ ఇష్టమా?
- చాలా ఇష్టం. అలాగని స్పెషల్‌గా డాన్స్‌ ఎక్కడా నేర్చుకోలేదు. చిరంజీవిగారు డాన్స్‌ చూస్తూ పెరిగాను కాబట్టి డాన్స్‌ నేర్చుకోవాల్సిన పనిలేదనిపించింది. డాన్స్‌ బాగా వచ్చినప్పటికీ నేను చేసిన మూడు సినిమాల్లో ఎక్కడా డాన్స్‌ వేసే అవకాశం రాలేదు. క్లాసికల్‌ డాన్స్‌ నేర్చుకోవాలనుకున్నాను. నేర్చుకునే క్రమంలో వాళ్లు కాళ్లపై కొట్టి నేర్పిస్తారు. అలా చేయడం వల్ల నాకు జ్వరం వచ్చేసింది. దాంతో డాన్స్‌ వద్దు నేను సినిమా పాటలకే డాన్స్‌ చేస్తాను. క్లాసికల్‌ డాన్స్‌ వద్దని మానేశాను.

హ్యాపీ వెడ్డింగ్‌ ఎలా ఉండబోతుంది?
- నేను చాలా రోజులుగా కాజువల్‌గా ఉండే ఓ సినిమా చేద్దామని అనుకుంటూ ఉండేదాన్ని. అలాంటి సినిమానే ఇది. ఇందులో ఎక్కువ క్యారెక్టర్స్‌ ఉన్నా కూడా.. ప్రతి పాత్రకు ఇంపార్టెన్స్‌ ఉంటుంది. మంచి క్యారెక్టర్‌ చేశాను. మంచి డైలాగ్స్‌ పడ్డాయి. సీనియర్‌ యాక్టర్స్‌ అందరూ కలిసి మెలిసి సినిమా చేశాం.

మీ క్యారెక్టర్‌ ఎలా ఉండబోతుంది?
- అక్షర అనే సింపుల్‌ అమ్మాయి పాత్రలో కనపడతాను. ఫ్యాషన్‌ డిజైనర్‌. జీవితంలో పెద్ద కోరికలేం ఉండవు. సినిమా. కథ విషయానికి ప్రేమించిన వ్యక్తితో పెళ్లి.. ఇంట్లోవాళ్ల సమ్మతంతో ఎంగేజ్‌మెంట్‌ నుండి జరుగుతుంది. అక్కడ నుండి సినిమా స్టార్ట్‌ అయి ఎంగేజ్‌మెంట్‌ వరకు సినిమా రన్‌ అవుతుంది. సినిమాలో విలన్‌ ఉండరు. నా పాత్ర వల్లనే సమస్యలు, సొల్యూషన్స్‌ ఉంటాయి.

స్టార్‌ హీరోలతో కాకుండా.. చిన్న హీరోలతో సినిమాలు చేయడానికి కారణమేంటి?
- నాకు 10-15 ఏళ్లు సినిమాల్లో నటించాలని లేదు. చాలా తక్కువ సమయం సినిమాలు చేయాలనుకుంటున్నాను. మూడు నాలుగేళ్ల తర్వాత పెళ్లి చేసుకుని సినిమాలు మానేస్తాను. సినిమా రంగంలో ఉంటాను కానీ .. ప్రొడక్షన్‌ సైడ్‌ ఉంటాను. వెబ్‌ సిరీస్‌ చేసుకుంటాను. కాబట్టి నేను సినిమాలో హీరో ఎవరు చేస్తున్నారని ఆలోచించడం లేదు. రేపు సినిమాలు మానేసిన తర్వాత నా సినిమాలు చూసుకుంటే నా ప్రతి క్యారెక్టర్‌ నాకు నచ్చాలి. స్టార్‌ హీరోలతో సినిమాలు చేయనని కాదు.. అయితే ఇప్పటి వరకు అవకాశం రాలేదు. వస్తే.. తప్పకుండా చేస్తాను. హీరోయిన్‌ పాత్రలకు మంచి ఆస్కారం ఉన్న సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతాను. నా పాత్ర కేవలం గ్లామర్‌కే పరిమితం కాకుండా.. నా పాత్ర వల్ల సినిమాకు ఏదైనా ప్లస్‌ ఉండాలని కోరుకుంటాను.

తమిళ సినిమా చేశారు కదా.. తమిళం మాట్లాడుతారా?
- నేను పుట్టిన సంవత్సరంలోనే తెలుగు ఇండస్ట్రీ హైదరాబాద్‌ వచ్చేసింది. మా ఇంట్లో నేను తప్ప..అందరూ తమిళం చక్కగా మాట్లాడుతారు. నేను చిన్న అమ్మాయిగా ఉన్నప్పుడు మా ఇంట్లోవాళ్లు నాకు అర్థం కాకూడదని అప్పుడప్పుడు తమిళంలో మాట్లాడుకునేవాళ్లు. నాకు కోపం వచ్చేది. ఆ కక్షతో తమిళ సినిమాలు చూసి చూసి తమిళం నేర్చేసుకున్నాను. అయితే విజయ్‌ సేతుపతి, గౌతమ్‌ కార్తీక్‌లతో కలిసి సినిమా చేసేటప్పుడు నాకు తమిళం అర్థం కావడం వేరు... మాట్లాడం వేరని తెలిసింది. అప్పుడు తమిళ ట్యూటర్‌ని పెట్టుకుని తమిళం నేర్చుకున్నాను. ఇప్పుడు తమిళం రాస్తాను కూడా.

మొన్న ఓ ప్రోగ్రామ్‌లో పవన్‌కల్యాణ్‌ని ఇమిటేట్‌ చేశారు కదా.. అలాగే ఇంట్లో కూడా ఇమిటేట్‌ చేస్తుంటారా?
- అదేం లేదండి.. నేను ఇంట్లో ఎవరినీ ఇమిటేట్‌ చేయను. సరదాగా ఉంటాను అంతే.

సుమంత్‌ అశ్విన్‌ గురించి?
- నేను సుమంత్‌ నటించిన సినిమాలన్నింటినీ చూశాను. చూసినప్పుడు ఈ అబ్బాయి చాలా చలాకీగా ఉంటాడు. ఎక్కువ మాట్లాడుతాడు అనిపించింది. కానీ.. సెట్స్‌లో తను వేరే. తన లోకంలో తను ఉంటాడు. తనతో చాలా తక్కువగానే మాట్లాడాను. వ్యక్తిగా తను చాలా నెమ్మది.. అయితే నటన పరంగా మంచి సపోర్టివ్‌.

పెళ్లి మీ అభిప్రాయం?
- పెళ్లంటే నాకు చాలా గౌరవం. మా ఇంట్లో కానీ.. నా స్నేహితుల్లో పెళ్లి చేసుకున్నవారు సక్సెస్‌ఫుల్‌గా లైఫ్‌ను లీడ్‌ చేస్తున్నారు. నేను పెళ్లి చేసుకుంటాను. అయితే ఇప్పుడిప్పుడే మంచి మంచి క్యారెక్టర్స్‌ పడుతున్నాయి. కాబట్టి కెరీర్‌పై ప్రస్తుతం దృష్టి పెడుతున్నాను.

భవిష్యత్‌లో ఎలాంటి వెబ్‌ సిరీస్‌ చేస్తున్నారు?
- జూలైలోనే ఓ వెబ్‌ సిరీస్‌ చేయాల్సింది. అయితే నా వెబ్‌ సిరీస్‌ డైరెక్టర్‌ ప్రణీత్‌తోనే ఓ ఫీచర్‌ ఫిలిమ్‌ చేస్తున్నాను. కాబట్టి వెబ్‌ సిరీస్‌ను పెండింగ్‌లో పెట్టాను.

సినిమాలకు నిర్మించే ఆలోచనలు ఉన్నాయా?
- ప్రస్తుతానికి అలాంటి ఆలోచనలు లేవు. పింక్‌ ఎలిఫెంట్‌ పిక్చర్స్‌ సంస్థ డిజిటల్‌ మీడియాలో బాగా సక్సెస్‌ అయిన తర్వాతే ఫీచర్‌ఫిలింస్‌ గురించి ఆలోచిస్తాను.

ఎలాంటి పాత్రలను ఎంచుకోవడానికి ఆసక్తి చూపుతారు?
నిహారికలా ప్రతిరోజూ ఉంటాను. నేను ఉంటానో నాకు తెలుసు కాబట్టి నాలాగా లేని క్యారెక్టర్‌ను చేయడానికి ఇష్టపడతాను. అక్ష అయినా.. సంధ్య పాత్రే.. తమిళంలో చేసిన పాత్ర అయినా డిఫరెంట్‌గా ఉందనిపించడంతోనే చేయడానికి ఆసక్తి చూపించాను.

మిమ్మల్ని మెగాప్రిన్సెస్‌ అంటుంటారు కదా.. మీకెలా అనిపిస్తుంటుంది?
- మెగా ప్రిన్సెస్‌ అన్నప్పుడల్లా ఎక్స్‌పెక్టేషన్స్‌ ఉంటాయి అనిపిస్తుంది. దాని వల్ల కొన్నిసార్లు మంచే జరిగినా నాకు భయంగా ఉంటుంది.

interview gallery



గాసిప్స్‌పై ఎలా రియాక్ట్‌ అవుతారు?
- సినిమాల్లోకి వచ్చే ముందు 'మంచి పాత్రలు చేస్తే మంచి యాక్టర్‌గా అందరికీ గుర్తుండిపోతావు.. అదే చిన్న తప్పు చేసినా.. భూతద్దంలో పెట్టి చూస్తారు. వాటిని ఫేస్‌ చేయడానికి రెడీగాఉండాలి' అని పెద్దనాన్న చెప్పారు. 'బయట అమ్మాయిలు హీరోలతో బాగా మాట్లాడితేనే ఏదేదో అంటుంటారు. నువ్వు మెగా ఫ్యామిలీ నుండి వెళుతున్నావు అంటే నీపై కాన్‌సన్‌ట్రేషన్‌ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నువ్వు నార్మల్‌గా కనపడినా రాసేస్తారు' అని నాన్న అన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ మాత్రమే నాకు ఉంది. రెండేళ్లుగా ఫోన్‌ కూడా వాడలేదు. సోషల్‌ మీడియా నా విలువైన సమయాన్ని వృథా చేస్తుందనిపించింది. దాంతో ఫోన్‌ వాడకం మానేశాను. ఓ రోజు నేను బయటకు వెళితే ఎలా కాంటాక్ట్‌ కావాలో తెలియక అమ్మ భయపడింది. ఆరోజు నుండి నేను మళ్లీ ఫోన్‌ వాడుతున్నాను.

కథలు వినే సమయంలో వరుణ్‌ అన్నయ్య సలహాలు తీసుకుంటారా?
- ఇప్పుడు ప్రణీత్‌తో చేస్తున్న సినిమా కథను మాత్రమే అన్నయ్య విన్నారు. తను కథను హీరో స్థానంలో ఉండి వింటారు. తన కథను చూసే కోణం వేరుగా ఉంటుంది. అలాంటిది నేను నా కథను వినమని చెప్పలేను కదా.. నేను ఇలాంటి కథను చేస్తున్నాను అని మాత్రమే చెబుతాను. నీకు నచ్చింది కదా.. చెయ్‌ అని అంటారంతే.. ఎవరూ నన్ను కెరీర్‌ విషయంలో ఇలా చేయాలి.. అలా చేయాలి గైడ్‌ చేయలేదు.

ప్రణీత్‌ దర్శకత్వంలో సినిమా ఎంత వరకు వచ్చింది?
- రీసెంట్‌గానే లాంగ్‌ షెడ్యూల్‌ను పూర్తి చేశాం. మరో షెడ్యూల్‌ కోసం రాజస్థాన్‌ వెళ్లాల్సి ఉంది.

సైరాలో ఎలాంటి పాత్ర చేస్తున్నారు?
- నేను నటి అవుదామనుకున్న క్షణం నుండి పెద్దనాన్న చిరంజీవిగారి సినిమాలో ఆయనతో కనీసం ఓ ఫ్రేమ్‌లోఅయినా కనిపిస్తే చాలు అనుకునేదాన్ని. ఎందుకంటే పెద్దనాన్నను చాలా దగ్గర నుండి చూసిన వ్యక్తిగా ఆయనలా ఎవరూ హార్డ్‌వర్క్‌ చేయలేదనిపిస్తుంటుంది. కాబట్టి అన్నయ్య చరణ్‌ను బ్రతిమలాడాను. 'నిర్మాతగా అది నేను చెప్పకూడదు. డైరెక్టర్‌గారు చెప్పాలి' అని చరణ్‌ అన్నయ్య అంటుండగానే సురేందర్‌రెడ్డిగారు వచ్చారు. ఆయనతో సైరాలో చేస్తానని చెప్పగానే నిజంగా చేస్తారా? అన్నాడు. చేస్తానని చెప్పగానే 'డైలాగ్స్‌ లేకపోయినా పరావాలేదా?' అన్నారు. చిరంజీవిగారితో ఫ్రేమ్‌లో కనపడితే చాలు అన్నాను. రెండు ఫ్రేమ్స్‌లో మాత్రమే కనపడే బోయ అమ్మాయిగా.. చిన్న రోల్‌లో కనపడతాను.

తదుపరి చిత్రం?
- రాహుల్‌ విజయ్‌తో ఓ సినిమా చేస్తున్నాను. 50 శాతం చిత్రీకరణ పూర్తయ్యింది.

 

 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved