pizza
Nikhil interview (Telugu) about Ekkadiki Pothavu Chinnavada
నిర్మాత స‌క్సెస్ అయితే..నేను స‌క్సెస్ అయిన‌ట్టు భావిస్తాను - నిఖిల్
You are at idlebrain.com > news today >
Follow Us

16 November 2016
Hyderaba
d

'స్వామిరారా', 'కార్తికేయ‌', 'సూర్య vs సూర్య' లాంటి వైవిధ్య‌మైన క‌థాంశాల‌తో స‌రికొత్త క‌థ‌నాల‌తో సూప‌ర్‌హిట్ చిత్రాల‌తోమంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో నిఖిల్ మ‌రో వినూత్న‌మైన క‌థాంశంతో వ‌స్తున్న చిత్రం 'ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా'. ఈచిత్రంలో నిఖిల్ కి జంట‌గా హెబ్బా ప‌టేల్ నందిత‌ స్వేతలు హీరోయిన్స్‌గా న‌టించారు. మేఘ‌న ఆర్ట్స్ నిర్మాణంలో మేఘ‌న ఆర్ట్స్ బ్యాన‌ర్ లో'టైగ‌ర్' ఫేం వి.ఐ.ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా రూపొందింది. న‌వంబ‌ర్ 18న సినిమా రిలీజ్ కానున్న సంద‌ర్భంగా హీరో నిఖిల్‌తో ఇంట‌ర్వ్యూ......

ధైర్యంగానే ఉన్నాం...
- నరేంద్ర‌మోడిగారు 500, 1000 నోట్ల క్యాన్సిల్ చేశారు. అయితే సినిమా అనేది అంద‌రినీ ఎంట‌ర్‌టైన్ చేస్తుంది. కాబ‌ట్టి టికెట్ ధ‌ర 50 నుండి ఉంటుంది. ఇప్పుడు యాభై రూపాయ‌లు ఖ‌ర్చు పెట్టి సినిమా చూడ‌టం పెద్ద విష‌యం కాద‌నుకుంటాను. కాబ‌ట్టి ధైర్యంగానే ముందుకు వెళుతున్నాం.

సినిమా చూడాల్సిందే....
- ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా అనేది అమ్మాయిల చెప్పే డైలాగ్‌.. ఈ సినిమాలో హీరోయిన్స్‌గా హెబ్బా ప‌టేల్‌, నందిత శ్వేత క‌న‌ప‌డుతున్నారు. కానీ ఇంకా చాలా మంది హీరోయిన్స్ క‌నిపిస్తారు. సినిమా విష‌యానికి వ‌స్తే ఇదొక ల‌వ్‌స్టోరీ, చాలా ఫాంట‌సీ ఎలిమెంట్స్ ఉంటాయి. హర్ర‌ర్ కామెడి స‌బ్జెక్ట్స్, ట్విస్ట్‌లుంటాయి. `కార్తికేయ` సినిమా స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ అయితే `ఎక్క‌డికి పోతావు` చిన్న‌వాడా ఫాంట‌సీ మూవీ. వెన్నెల‌కిషోర్‌కు దెయ్యం ప‌డుతుంది. త‌న ట్రీట్‌మెంట్ కోసం బుర్రా గుహ‌ల్లోని మ‌హిసాసుర మ‌ర్ధిని అమ్మ‌వారి గుడికి వెళ‌తాం. అక్క‌డ ఏం జ‌రిగింద‌నేది స‌హా సినిమాలో చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అవేంటో సినిమా చూసే తెలుసుకోవాలి.

Nikhil interview gallery

నేను న‌మ్మ‌ను....
- ఆత్మ‌లుంటాయా? లేదా అనేవి కొంత మంది న‌మ్ముతారు..మ‌రికొంద‌రు న‌మ్మ‌క‌పోవ‌చ్చు. కానీ సైంటిఫిక్‌గా కొంత మంది శాస్త్ర‌వేత్త‌లు ఆత్మ‌లున్నాయని ప్రూవ్ చేశారు. సాధార‌ణంగా దెయ్యాలున్నాయా అనే దానికి సినిమా త‌ర‌హాలో వివ‌ర‌ణ ఇస్తుంటాం. కానీ `ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా`లో అలా కాకుండా సైంటిఫిక్ త‌ర‌హాలో వివ‌ర‌ణ ఉంటుంది.సాధార‌ణంగా దెయ్యాలున్నాయ‌ని నేను న‌మ్మ‌ను. కానీ కొంత మంది న‌మ్ముతారు. హీరోయిన్ నందిత శ్వేత కూడా ఓసారి దెయ్యాన్ని చూశాన‌ని చెప్పింది.

క్యారెక్ట‌ర్ గురించి...
- `ఎక్క‌డికిపోతావు చిన్న‌వాడా` సినిమాలో నేను `బాహుబ‌లి` సినిమా గ్రాఫిక్స్ డిజైన‌ర్ పాత్ర‌లో క‌న‌ప‌డ‌తాను. అలాగ‌ని రాజ‌మౌళిగారు సినిమాలో న‌టించ‌లేదు. ఆయ‌నతో మాట్లాడేలా సీన్స్ ఉంటాయి.

ద‌ర్శ‌కుడు వి.ఐ.ఆనంద్ గురించి....
-వి.ఐ.ఆనంద్‌గారు ఈ క‌థ నాకు స‌రిపోతుంద‌నిపించి, న‌న్ను వెతుక్కుంటూ రావ‌డం నా అదృష్టంగా భావిస్తున్నాను. నా సినిమాల ఫ‌స్ట్ కాపీని చూడ‌ను. డ‌బ్బింగ్‌లో నా పాత్ర ఎలా వ‌చ్చింద‌నే దాన్ని చూస్తాను.

అందుకు నేను సిద్ధ‌మే....
- మేకింగ్‌లో నేను బ‌డ్జెట్‌ల‌ను న‌మ్మ‌ను. బ‌డ్జెట్ ఎక్కువ‌గా పెడితే సినిమా బాగుంటుంది. సినిమా ఆడుతుంద‌ని అనుకోను. మంచి క‌థ‌, మంచి ద‌ర్శ‌కుడు అవ‌స‌ర‌మ‌ని భావిస్తాను. కాబ‌ట్టి నా బ‌డ్జెట్ విష‌యంలో నేను కేర్ తీసుకుంటాను. నిర్మాత‌ల బాగు కోసం నేను ల‌గ్జ‌రీస్‌ను క‌ట్ చేసుకోవ‌డానికి సిద్ధ‌ప‌డ‌తాను. నిర్మాత స‌క్సెస్ అయితేనే నేను స‌క్సెస్ అయిన‌ట్టు భావిస్తాను.

అవ‌న్నీ రూమ‌ర్స్‌...
- సినిమా ఫైనాన్సియ‌ల్ ప్రాబ్ల‌మ్స్ ఫేస్ చేసింద‌ని వ‌చ్చిన వార్త‌లన్నీ రూమార్స్‌. షూటింగ్ స‌మ‌యంలో మంచి సినిమాటోగ్రాఫ‌ర్ కావాల‌ని కొంత స‌మ‌యం తీసుకున్నాం. అలాగే ఓ హీరోయిన్ కోసం కొంత స‌మ‌యం ప‌ట్టింది. కాబ‌ట్టి సినిమా మేకింగ్‌లో కాస్తా టైం తీసుకున్నాం. కానీ బ‌య‌ట సినిమాకు ఫైనాన్సియ‌ల్ ప్రాబ్ల‌మ్స్ వ‌చ్చింద‌ని అనుకున్నారంతే. వ‌చ్చిన వార్త‌ల‌న్నీ రూమర్స్‌.

టెన్ష‌న్ ప‌డ‌తాను...
- ప్ర‌తి సినిమా రిలీజ్ ముందు నేను బాగా టెన్ష‌న్ పడుతూనే ఉంటాను. సినిమా ప్ర‌మోష‌న్ విష‌యంలో కేర్ తీసుకోవాల‌ని భావిస్తాను త‌ప్పితే డైరెక్ట‌ర్ ప‌నిలో నేను వేలు పెట్ట‌ను. అయితే సినిమాను సెల‌క్ట్ చేసుకోనే స‌మ‌యంలోనే ఎక్కువ‌గా ఆలోచిస్తాను. ఈ విష‌యం నేను ప‌నిచేసిన నా ద‌ర్శ‌కులెవ‌రినైనా అడ‌గ‌వ‌చ్చు.

తదుప‌రి చిత్రాలు....
- సుధీర్ వ‌ర్మ‌తో సినిమా చేయ‌బోతున్నాను. త‌ర్వాత చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా ఉంటుంది. ప్ర‌స్తుతం చందు త‌న క‌మిట్‌మెంట్‌తో బిజీగా ఉన్నాడు. నేను కూడా ఈలోపు సుధీర్‌వ‌ర్మ సినిమా పూర్తి చేస్తాను. త‌ర్వాత నేను, చందు క‌లిసి కార్తికేయ సీక్వెల్ స్క్రిప్ట్ అంతా రెడీగా ఉంది. ఈ సీక్వెల్ కార్తికేయ కంటే బావుంది.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved