pizza
Nikhil interview (Telugu) about Keshava
అంద‌రినీ ఆక‌ట్టుకునే యాక్ష‌న్ ఎమోష‌నల్ ఎంట‌ర్‌టైన‌ర్ `కేశ‌వ‌` - నిఖిల్‌
You are at idlebrain.com > news today >
Follow Us

18 May 2017
Hyderabad

'స్వామిరారా', 'కార్తికేయ', 'సూర్య వర్సెస్‌ సూర్య', 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' వంటి సూపర్‌ హిట్‌ చిత్రాలతో మెప్పించిన యువ కథానాయకుడు నిఖిల్‌ హీరోగా దేవాన్ష్‌ నామా సమర్పణలో అభిషేక్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై స్వామిరారా, దోచెయ్‌ చిత్రాల డైరెక్టర్‌ సుధీర్‌ వర్మ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'కేశవ'. ఈ సినిమా మే 19న విడుదలవుతుంది. ఈ సందర్భంగా హీరో నిఖిల్‌తో ఇంటర్వ్యూ...

టెన్షన్‌గా ఉంది....
- 'కేశవ' రిలీజ్‌ అంటే మామూలు టెన్షన్‌గా లేదు. ఎందుకంటే వరల్డ్‌లోనే బిగ్గెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌ మూవీగా పేరు సంపాదించుకున్న 'బాహుబలి-2' తర్వాత వస్తోన్న సినిమా ఇది. అయితే మా టీజర్‌, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. అయితే ఎలాంటి రెస్పాన్స్‌ వస్తుందోనని టెన్షన్‌గా ఉంది.

అన్నీ ఎలిమెంట్స్‌ ఉంటాయి...
- గజిని, ఒంటరి చిత్రాలు ఔట్‌ అండ్‌ ఔట్‌ మాస్‌ మసాలా యాక్షన్‌ బేస్డ్‌ ఎంటర్‌టైనర్స్‌. కానీ కేశవ సినిమా విషయానికి వస్తే, మూవీని హిందీలో వచ్చిన బదలాపూర్‌ స్టయిల్లో కాస్తా కల్ట్‌గా తీశారు. అన్నీ ఎలిమెంట్స్‌ ఉంటాయి కానీ రెట్రో స్టయిల్లో మూవీ ఉంటుంది. యాక్షన్‌ కన్నా ఎమోషన్‌ ఎక్కువగా ఉంటుంది. సినిమా స్టార్టింగ్‌ నుండి ఎండింగ్‌ వరకు ఎమోషన్‌ క్యారీ అవుతూనే ఉంటుంది. రివేంజ్‌ డ్రామాలో విలన్స్‌పై హీరో ప్రతీకారం తీర్చుకుంటాడని తెలుసు. అయితే ఈ సినిమాలో హీరోకు గుండె సమస్య ఉంటుంది. ఆ సమస్యను అధిగమించి ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడనేది ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెతిస్తుంది.

సినిమా ఒప్పుకోవడానికి కారణం...
- హీరో ప్రశాంతంగా చంపడమనే మెయిన్‌ కాన్సెప్ట్‌. హీరోకు చాలా కోపం. పగతో రగిలిపోతుంటాడు. ఆ కోపాన్ని బయటపెడితే అతడు చనిపోతాడు. గుండె ఏమో కోపం తెచ్చుకోవాలనుకుంటుంది. కానీ బ్రెయిన్‌ కూల్‌ అని అంటుంది. ఈ పాయింట్‌ కారణంగా సినిమా చేయడానికి ఒప్పుకున్నాను. సినిమాలో చాలా క్యారెక్టర్స్‌ ఉన్నాయి. చాలా ట్విస్టులున్నాయి. సినిమా ట్రైలర్‌లో చూసింది కొంత మాత్రమే. రేపు థియేటర్‌లో సినిమా చూస్తే థ్రిల్‌ ఫీలవుతారు.

ఈ జోనర్‌ మూవీ ఎందుకు చేశానంటే..
- ప్రతి నటుడికి డిఫరెంట్‌ షేడ్స్‌ ఉన్న క్యారెక్టర్‌ చేయాలనే ఉంటుంది. ఇప్పటి వరకు నేను లవర్‌బోయ్‌గానో, కాలేజ్‌ స్టూడెంట్‌గానో కనిపించాను. ఒక్కసారి నాలో ఇలాంటి కోణం కూడా ఉందని చూపించడానికి లక్కీగా నాకు సుధీర్‌ దొరికాడు. తను ఈ కథలో వచ్చినప్పుడు జోనర్‌ నచ్చింది, చేయాలనిపించింది. ఈ జోనర్‌లో సినిమా చేసిన తర్వాత రెండు మూడేళ్ళకు ఇలాంటి జోనర్‌లో మూవీ చేయను. నాకు కానీ, జనాలకు కానీ బోర్‌ కొట్టదు. సుధీర్‌ అన్నతో ఎప్పుడైనా సినిమా చేస్తాను. అలాగని పత్రి కథతో సినిమా చేస్తానని కాదు, ఈ సినిమా కథ నాకు నచ్చింది. యాప్ట్‌ అవుతుందనిపించింది.

Nikhil interview gallery

కార్తికేయ-2' గురించి...
- చందు మొండేటి దర్శకత్వంలో కార్తికేయ-2 ఉంటుంది. కార్తికేయ సినిమా ఎక్కడ ఆగిపోయిందో అక్కడ నుండి స్టార్ట్‌ అవుతుంది. స్వాతితో పాటు మరో హీరోయిన్‌ కూడా ఇందులో నటిస్తుంది. ఈ ఏడాది నవంబర్‌, డిసెంబర్‌లో సినిమా ఉండొచ్చు.

ఏదో ఒకటి ఉంటుంది..
- డీ మానిటైజేషన్‌ టైంలో ఎక్కడికిపోతావు చిన్నవాడా విడుదలై పెద్ద హిట్‌ సాధించింది. ఇప్పుడు బాహుబలి-2 తర్వాత 'కేశవ' రిలీజవుతోంది. ఏదో ఒకటి ఉండేలా అనిపిస్తుంది. కేశవ సినిమా 600 పై థియేటర్స్‌లో విడుదలవుతుంది. యు.ఎ.ఇ, ఆస్ట్రేలియా సహా చాలా చోట్ల సినిమా విడుదలవుతుంది.

ఫస్ట్‌టైం చేస్తున్నాను...
- తొలిసారి రీమేక్‌ చేస్తున్నాను. పాయింట్‌ నచ్చి ఆ మెయిన్‌పాయింట్‌ను మాత్రమే తీసుకుని తెలుగు నెటివిటీకి అనుగుణంగా కథను మార్చేసి చేస్తున్నాం.

ఇప్పుడే ఎంటర్‌ అవుతున్నట్లు ఉంది..
- హ్యాపీడేస్‌ విడుదలై పదేళ్ళు అవుతుంది. ఇప్పుడే ఎంట్రీ ఇచ్చినట్లు ఉంది. అప్పుడే పదేళ్ళు అయ్యిందంటే షాకింగ్‌గా కూడా ఉంది.

తదుపరి చిత్రాలు...
- తదుపరి కాలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా చేస్తాను. తర్వాత కార్తికేయ-2 ఉంటుంది. తర్వాత ఓ మాస్‌ స్టయిల్‌లో మూవీ ఉంటుంది.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved